సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకుడు చిరంజీవి హత్య కుట్రను విశాఖ పోలీసులు ఛేదించారు. ఈ హత్య కుట్రలో టీడీపీ ఎంపీటీసీ అమ్మినాయుడు ప్రధాన నిందితుడిగా తేలింది. తనకి రాజకీయంగా అడ్డు వస్తున్నాడనే కక్షతో చిరంజీవి హత్యకు అమ్మినాయుడు కుట్ర పన్నినట్లు బయటపడింది. ఇందులో భాగంగా విశాఖకు చెందిన రౌడీషీటర్ కన్నబాబుకు సుపారీ ఇచ్చారు. పోలీసుల దర్యాప్తులో కన్నబాబు గ్యాంగ్ పై గతంలో అనేక కేసులున్న వైనం బయటపడింది.
రాజకీయ ప్రత్యర్ధిని అంతమొందించాలనే కుట్రతో టీడీపీ నేత అమ్మినాయుడు సుపారీ గ్యాంగ్ తో 50 లక్షలకి డీల్ కుదుర్చుకున్నారని.. అడ్వాన్స్ గా 4 లక్షలు చెల్లించారని విశాఖ సీపీ ఆర్‌కే మీనా తెలిపారు. సుపారీ గ్యాంగ్ లో ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి మూడు కత్తులు, ఆరు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రెండు సార్లు రెక్కీ నిర్వహించడంతో పాటు చిరంజీవి హత్యకు ప్రయత్నించి విఫలమయ్యారని.. ఇదే సమయంలో మాకు వచ్చిన సమాచారం మేరకు సుపారీ గ్యాంగ్ లో ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. ప్రధాన నిందితుడు అమ్మి నాయుడుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉందని సీపీ ఆర్‌కే మీనా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment