
సాక్షి, చిత్తూరు జిల్లా: పూతలపట్టు మండలం పి.కొత్తపేట రైల్వే అండర్ బిడ్జి వద్ద జరిగిన ప్రమాద ఘటనలో కుట్ర కోణం ఉందా?. స్కెచ్ ప్రకారం డ్రగ్స్ నిందితులే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఎస్‌ఐ అవినాష్, కానిస్టేబుల్ అనిల్, డ్రైవర్ మృతిచెందిన సంగతి తెలిసిందే.
చదవండి: అశ్లీల వీడియో తీసి వెబ్‌సైట్‌కు అమ్మాడు.. సమాజంలో...
బెంగళూరు శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన గంజాయి డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు చిత్తూరు జిల్లాకు వచ్చిన పోలీసులను ప్లాన్ ప్రకారం హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కర్ణాటక మంత్రి మునిరత్నం ఆరా తీశారు. చిత్తూరుకు వచ్చిన మంత్రి.. మృతులను తమ రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తీవ్రంగా గాయపడిన ఎస్ఐ దీక్షిత్, కానిస్టేబుల్ శరవణ బసవను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక హోం మంత్రి దృష్టికి ఈ విషయాన్ని మునిరత్నం తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment