Putalapattu
-
ప్రమాద ఘటనలో కుట్ర కోణం.. పోలీసులను ప్లాన్ ప్రకారమే చంపేశారా?
సాక్షి, చిత్తూరు జిల్లా: పూతలపట్టు మండలం పి.కొత్తపేట రైల్వే అండర్ బిడ్జి వద్ద జరిగిన ప్రమాద ఘటనలో కుట్ర కోణం ఉందా?. స్కెచ్ ప్రకారం డ్రగ్స్ నిందితులే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఎస్ఐ అవినాష్, కానిస్టేబుల్ అనిల్, డ్రైవర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. చదవండి: అశ్లీల వీడియో తీసి వెబ్‌సైట్‌కు అమ్మాడు.. సమాజంలో... బెంగళూరు శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన గంజాయి డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు చిత్తూరు జిల్లాకు వచ్చిన పోలీసులను ప్లాన్ ప్రకారం హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కర్ణాటక మంత్రి మునిరత్నం ఆరా తీశారు. చిత్తూరుకు వచ్చిన మంత్రి.. మృతులను తమ రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తీవ్రంగా గాయపడిన ఎస్ఐ దీక్షిత్, కానిస్టేబుల్ శరవణ బసవను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక హోం మంత్రి దృష్టికి ఈ విషయాన్ని మునిరత్నం తీసుకెళ్లారు. -
వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు
సాక్షి, చిత్తూరు : వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు అయిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెనుమురులో వరద నీటిలో గల్లంతు అయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కొండయ్య వాగులో గల్లంతు అయిన ప్రతాప్ అతని కుమార్తె సాయి వీణ ఆచూకీ 11 గంటలు గడుస్తున్నా లభించక పోవడంతో బంధువులు కుటుంబీకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిన్న పెనుమురు మండలం వడ్డేర్ల పల్లి కి చెందిన ప్రతాప్ తన భార్య శ్యామల, కుమార్తె సాయి వీణ మరో ముగ్గురితో కలసి ఓ వివాహ కార్యక్రమానికి కారులో వెళ్లారు. తిరిగి రాత్రి 12 గంటల ప్రాంతంలో వెనుతిరిగారు. అప్పటికే కొండయ్య వాగు విపరీతంగా ప్రవహిస్తోంది. అయినా వాగు దాటే ప్రయత్నం చేసి మధ్యలో చిక్కుకుపోయారు. మొదట సాయి వీణ వరద నీటిలోకి జారుకొంది. దీంతో ప్రతాప్ కుమార్తెను కాపాడే ప్రయత్నం చేస్తూ అతను గల్లంతు అయ్యాడు. కారులోని ప్రతాప్ భార్య శ్యామల, డ్రైవర్ తోపాటు మరొకరు బయటపడ్డారు. గల్లంతు అయిన వారికోసం ఉదయం నుంచి పెద్ద ఎత్తున గాలింపు జరుగుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు దగ్గరుండి గాలింపు చర్యలను పర్య వేక్షిస్తున్నారు. స్వయంగా బోటులో చేరువులోకి వెళ్లి పరిశీలించారు. కాగా ఇప్పుడే సాయి వీణ మృత దేహం లభించింది. ప్రతాప్ కోసం గాలింపు కొనసాగుతోంది. -
చిత్తూరు: పాల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ
-
చిత్తూరు: పాల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ
సాక్షి, చిత్తూరు : జిల్లలోని పూతలపట్టు మండలంలో గురువారం రాత్రి అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో 20మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 100మందికి పైగా కార్మికులు ఉండగా వారిలో 14మంది మహిళా కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. పూతలపట్టు మండలం బండపల్లి హట్సన్ పాల డెయిరీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాలు కోల్డ్ స్టోరేజ్ కోసం అమ్మోనియం వాయువును ఉపయోగిస్తుంటారు. ఆ వాయువు లీక్ కావడంతో 14మంది అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్వాహకులు చిత్తూరు, గుడిపాల ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు. పాల డెయిరీ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.మరోవైపు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా హట్సన్ పాల డెయిరీని పరిశీలించారు. అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ లీక్ సంఘటనపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సీరియర్ అయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. -
పూతలపట్టు వైఎస్సార్ సీపీ అభ్యర్థిపై దాడి
-
పూతలపట్టు వైఎస్సార్ సీపీ అభ్యర్థిపై దాడి
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబుతో పాటు ఆయన కుమారుడిపై గురువారం టీడీపీ శ్రేణులు భౌతిక దాడి చేశాయి. ఐరాల మండలంలోని పొలకల కట్టకిందపల్లిలో రిగ్గింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందటంతో ఆయన అక్కడకు వెళ్లారు. దీంతో టీడీపీ శ్రేణులు...ఎంఎస్ బాబును పోలింగ్ బూత్‌లోకి వెళ్లనీయకుండా అడ్డుకుని.... దాడి చేయడమే కాకుండా ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు దాడిలో గాయపడ్డ బాబును వేరే వాహనంలో చికిత్స నిమిత్తం చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో బాబు వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. సంఘటన స్థలంలో ఉన్న పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించారు. కాగా ఎంఎస్ బాబు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పూతలపట్టు మండలంలోని బందార్లపల్లెలో మొదటగా ఎంఎస్ బాబుపై దాడులకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే అక్కడ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తరువాత ఐరాల మండలంలో కట్టకిందపల్లిలో పథకం ప్రకారం దాడులు చేశారు. -
బంగారుపాళ్యం ప్రచార సభలో వైఎస్ విజయమ్మ
-
వందకోట్ల ఫైన్.. ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుంది?
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో ఇసుక, మట్టి మొదలు.. అన్నింటిలోనూ టీడీపీ నేతలు దోడిపీకి పాల్పడుతున్నారని, ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ చంద్రబాబు సర్కారుపై 100 కోట్ల రూపాయల జరిమానా విధించిందని, ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో విజయమ్మ ప్రసంగించారు. ఈ సందర్భంగా పూతలపట్టు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంఎస్ బాబు, చిత్తూరు ఎంపీ అభ్యర్థి నల్లకొండగారి రెడ్డప్పలను ప్రజలకు పరిచయం చేసి.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. వారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే.. 108 అంబులెన్స్ కూతలు మళ్లీ వినిపిస్తాయని, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాటం చేస్తోంది వైఎస్సార్‌సీపేనని గుర్తు చేశారు. 25 ఎంపీ స్థానాలు గెలిపించండి..ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే చిత్తూరు జిల్లాలోని సహకార చక్కెర ఫ్యాక్టరీలను మూయించారని, లాభాల్లో ఉన్న విజయ డైరీని సైతం మూసివేసి.. తనకు చెందిన హెరిటేజ్ డైరీని లాభాల్లోకి తీసుకెళ్లారని అన్నారు. చంద్రబాబు తన పాలనలో రైతులను ఏమాత్రం పట్టించుకోలేదని, మామిడి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు-కుంకుమ పేరుతో ఎన్నికల సమయంలో చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారు. 2 రూపాయలకు 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీని నెరవేర్చారా? అని విజయమ్మ ప్రశ్నించారు. రాష్ట్రంలో నీళ్లు కంటే మద్యం విచ్చలవిడిగా దొరుకుతోందని, వైసీపీ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జిల్లాలో 80శాతం దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని, అయినా, మిగతా పనులను చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు సమీపంలోని పూతలపట్టు వద్ద ఇన్నోవో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని దగ్గర్లోని....ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం. తీవ్రంగా గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.