జిమ్‌ ట్రైనర్ రాహుల్‌ హత్య కేసులో ట్విస్ట్‌ | Shocking Twist Revealed In Rajendra Nagar Gym Trainer Rahul Singh Murder In Gym Cellar - Sakshi
Sakshi News home page

Gym Trainer Rahul Murder Case: రాజేంద్రనగర్‌ జిమ్‌ ట్రైనర్ రాహుల్‌ హత్య కేసులో ట్విస్ట్‌

Published Thu, Aug 31 2023 12:30 PM | Last Updated on Thu, Aug 31 2023 12:59 PM

Twist In Rajendra Nagar Gym Trainer Rahul Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్ జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాహుల్ హత్యకు, ప్రేమ వ్యవహారానికి సంబంధం లేదని,  ఆ రోజు వీడియో కాల్ మాట్లాడింది ఎంగేజ్‌మెంట్‌ అయిన అమ్మాయితో అని పోలీసులు తేల్చారు. రాహుల్‌ను హత్య చేసిన నలుగురు హంతకులను రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

వ్యక్తిగత కారణాల వల్లే హత్య చేసినట్లు సమాచారం. చిన్నపాటి గొడవే కారణంగానే రాహుల్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. రాహుల్‌ను హత మార్చాలని రెక్కీ నిర్వహించిన దుండగులు.. అదును చూసి రాహుల్‌ను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. 

రాహుల్ బలం అంచనా వేసి పెప్పర్ స్ప్రే వాడారు. వర్కట్‌ ముగించుకొని లిఫ్ట్‌లో కిందకు రాగానే కంట్లో పెప్పర్ స్ప్రేను ఓ యువకుడు కొట్టగా, మరో ముగ్గురు రాహుల్‌పై కత్తులతో దాడి చేశారు. రాహుల్‌ తేరుకునే లోపు విచక్షణారహితంగా పొడిచి చంపారు.
చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement