సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ దొంగతనం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒక యువతి ఆడిన నాటకాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకొని యువతి చోరీ డ్రామాకు తెరతీసింది. ఉదయం తాను వాష్ రూమ్‌కి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు ఉన్నారని తెలిపిన యువతి.. పట్టుకునే క్రమంలో తనను తోసేసి పారిపోయారంటూ వెల్లడించింది.
స్థానికులు సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు విషయాన్ని బయటపెట్టారు. పథకం ప్రకారమే ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు ఇతర వస్తువులను చిందరవందరగా పడేసింది. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి 25 వేలు పొగొట్టుకుని భయంతో డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: ‘డెత్’లైన్ గేమ్స్!
Comments
Please login to add a commentAdd a comment