high drama
-
దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ విఫలం
సియోల్: అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) అరెస్టు విఫలమైంది. కోర్టు నుంచి అంగీకారపత్రంతో శుక్రవారం తెల్లవారుఝామునే కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(CIO) అధికారులు సియోల్‌లోని అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అయితే అక్కడ వాళ్లకు చాలా సమయం అడ్డగింత ఎదురైంది. దీంతో చేసేది లేక అధ్యక్ష నివాసం నుంచి అధికారులు వెనుదిరిగారు. ఎమర్జెన్సీ మార్షల్ లా(Martial Law)ను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో యూన్ సుక్ యోల్‌పై అరెస్టు వారెంటు జారీ అయింది. అయితే విచారణాధికారులు యూన్ నివాసంలోకి వెళ్లకుండా సైన్య బృందంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఒకానొక టైంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐవో చీఫ్ ఓహ్ డోంగ్ వున్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అన్నివైపులా ప్రతిఘటన ఎదురుకావడంతో సుమారు ఆరు గంటలపాటు హైడ్రామా నడిచింది. చివరకు.. సీఐవో అధికారులు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది .ఇక.. మార్షల్ లా ప్రకటించిన కేసులో.. అధ్యక్ష భవనంలో సోదాలకు విచారణ అధికారులు ప్రయత్నించినప్పుడు కూడా ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. అయినప్పటికీ అధికారులు పోలీసుల సాయంతో బలవంతంగా లోపలికి వెళ్లి తనిఖీలు జరిపారు. మరోవైపు ఈ కేసులో మూడుసార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరుకాకపోవడంతో అధికారులు అరెస్ట్ వారెంట్ కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అంగీకరించింది. అదే జరిగితే దక్షిణ కొరియా చరిత్రలో అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా నిలుస్తారు.అరెస్ట్ జరిగితే.. కోర్టు 6వ తేదీ వరకూ గడువిచ్చిందని, ఆలోపే యూన్‌ను అరెస్టు చేస్తామని సీఐవో మరోమారు స్పష్టం చేశారాయన. యూన్ గనుక అరెస్ట్ అయితే.. ఆయన్ని గవాచియాన్‌లోని సీఐవో కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. మార్షల్ లా విధింపు కేసులో అక్కడ ఆయన్ని విచారణ జరపనున్నారు. అరెస్ట్ వారెంట్ నేపథ్యంతో.. 48 గంటలపాటు ఆయన్ని అదుపులో ఉంచుకునే అధికారం సీఐవోకు ఉంటుంది. అయితే అటుపై కస్టడీ కోసం కోర్టును అభ్యర్థించాల్సి ఉంటుంది.విఫలయత్నాలే..దక్షిణ కొరియాలో ఇలాంటి పరిణామాలు కొత్తేం కాదు. 2000, 2004 సంవత్సరాల్లో చట్ట సభ్యులను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. అయితే.. రెండు సందర్భాల్లోనూ అరెస్ట్ వారెంట్ గడువు ముగిసేదాకా(ఏడురోజులపాటు) వాళ్ల పార్టీ సభ్యులు, మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అది సాధ్యపడలేదు. హైటెన్షన్సెంట్రల్ సియోల్‌లో ఎటు చూసిన భారీగా బలగాలు కనిపిస్తున్నాయి. యూన్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన అనుచరులు భారీగా అధ్యక్ష భవనం వద్దకు చేరి మోహరించారు. గురువారం యూన్ వ్యతిరేకులకు, మద్దతుదారులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భద్రతా బలగాలు కొందరిని అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు.. యూన్ మద్దతుదారులు అమెరికా జెండాలతో నినాదాలు చేస్తూ కనిపించడం కొసమెరుపు. యూన్ అరెస్ట్ నేపథ్యంలో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2,700 మంది పోలీసులు మోహరింపజేసినట్లు సమాచారం.మార్షల్ లాతో చిక్కుల్లో..ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. యూన్ ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో యూన్ తన అధ్యక్ష అధికారాలు, విధులకు తాత్కాలికంగా దూరమయ్యారు. యూన్‌ను పదవి నుంచి తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని కోర్టు 180 రోజుల్లోగా తేల్చనుంది.మరోవైపు యూన్ మద్దతుదారులు సియోల్‌లోని ఆయన నివాసం ఎదుట భారీగా మోహరించారు. వారిని ఉద్దేశిస్తూ యూన్ మాట్లాడారు. తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి దేశాన్ని ప్రమాదంలో పడేసేందుకు పనిచేస్తున్న శక్తులపై చివరివరకు పోరాడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు యూన్‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన తరఫు న్యాయబృందం హెచ్చరించింది. ఇంకోవైపు.. దక్షిణ కొరియాను మరో ఉత్తర కొరియాగా మార్చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్టును అడ్డుకుని తీరతామంటూ నివాసం ఎదుట భారీగా మోహరించారు. అభిశంసన ఇలా.. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష అధికారాలను, విధులను ప్రధానమంత్రి హన్ డక్ సూకీకి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపుతుంది. యూన్‌ను తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని ఈ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. మరోవైపు యూన్ స్వచ్ఛందంగా దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు. చదవండి👉🏻: కరోనా ప్యాటర్న్‌లోనే.. చైనా నుంచి మరో వైరస్ -
బడాబాబులే ఆమె టార్గెట్..
-
వెరిఫికేషన్ కి వచ్చి తాళాలు లేవని ఎన్నికల అధికారుల హై డ్రామా
-
ఔటర్ రింగ్ రోడ్డుపై హైడ్రామా
-
విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామా
-
HYD: యువతి హైడ్రామా.. రాజేంద్రనగర్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ దొంగతనం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒక యువతి ఆడిన నాటకాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకొని యువతి చోరీ డ్రామాకు తెరతీసింది. ఉదయం తాను వాష్ రూమ్‌కి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు ఉన్నారని తెలిపిన యువతి.. పట్టుకునే క్రమంలో తనను తోసేసి పారిపోయారంటూ వెల్లడించింది. స్థానికులు సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు విషయాన్ని బయటపెట్టారు. పథకం ప్రకారమే ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు ఇతర వస్తువులను చిందరవందరగా పడేసింది. ఆన్లైన్లో గేమ్స్ ఆడి 25 వేలు పొగొట్టుకుని భయంతో డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదీ చదవండి: ‘డెత్’లైన్ గేమ్స్! -
టీడీపీ హైడ్రామా
శ్రీకాకుళం: కాలువను ఆక్రమించారు.. ఆక్రమణ తొలగింపును అడ్డుకోవాలనుకున్నారు.. ఫిర్యాదు చేశారన్న కోపంతో ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు తమకు అలవాటైన రీతిలో నీచ రాజకీయాలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి చినబడాంలో హైడ్రామా సృష్టించి హడావుడి చేశారు. స్థానిక చోటా నాయకులకు తోడుగా నియోజకవర్గ నేతలు కూడా ఈ రాజకీయ డ్రామాలో పాలు పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 7వ వార్డు చినబడాంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు సాగునీటి కాలువను ఆక్రమించారు. ఖరీఫ్ పనులు ఊపందుకోవడం, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఈ ఆక్రమణలపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆక్రమణలను తొలగించడానికి అధికారులు కూడా సిద్ధమైనట్టు సమాచారం. అయితే దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి చూశారు. అధికారులకు ఫిర్యాదు చేశారనే కారణంతో నలుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. బాధితులు కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించారు. ఆక్రమిత స్థలం వద్ద రాత్రిపూట కుర్చీలు వేసుకుని మరీ కూర్చున్నారు. అధికారులు వస్తే అడ్డుకుందామని, ఈ గొడవను రాజకీయంగా వాడుకుందామని అనుకున్నారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, గౌతు శిరీష ఆక్రమిత స్థలం వద్దకు వచ్చి ఆక్రమణదారుడికి మద్దతు పలకడం గమనార్హం. -
6 బంతుల్లో 4 పరుగులు.. చేతిలో 5 వికెట్లు.. అయినా ఓటమి
ఆస్ట్రేలియన్ వుమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ తుది సమరంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హోబర్ట్ వేదికగా సౌత్ ఆస్ట్రేలియా-టాస్మానియా జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన ఫైనల్ మ్యాచ్ అనూహ్య మలుపులు తిరిగి క్రికెట్లోని అసలుసిసలు మజాను ప్రేక్షకులకు అందించింది. అసలు ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టాస్మానియా నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. One of the wildest finishes to a cricket match condensed down to a minute. You're welcome #WNCLFinal pic.twitter.com/97hUMPcuxE — cricket.com.au (@cricketcomau) February 25, 2023 ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించి (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో), సౌత్ ఆస్ట్రేలియాకు 243 పరుగుల టార్గెట్‌ను కుదించారు. ఈ క్రమంలో చివరి నిమిషం వరకు సౌత్ ఆస్ట్రేలియా గెలుపు దిశగా సాగింది. చివరి ఓవర్‌కు ముందు సమీకరణలు ఇలా ఉన్నాయి. ఆఖరి ఓవర్లో సౌత్ ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 4 పరుగులు చేయాల్సి ఉండింది. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సౌత్ ఆస్ట్రేలియా జట్టు గెలుపు నల్లేరుపై నడకే అని అంతా అనుకున్నారు. ఇక్కడే మ్యాచ్ అనూహ్య మలుపులు తిరిగింది. సౌత్ ఆస్ట్రేలియా జట్టు చివరి ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. టాస్మానియా బౌలర్ కోయటే ఆఖరి ఓవర్లో మ్యాజిక్ చేసింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో పాటు రెండు రనౌట్లు చేసి తన జట్టును వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా నిలబెట్టింది. -
కాకినాడ జిల్లా అనపర్తిలో చంద్రబాబు హైడ్రామా
-
చంద్రబాబు హైడ్రామా.. రెచ్చగొట్టే ప్రసంగాలతో.. విద్వేషాలు రగిల్చేలా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజలను రెచ్చగొట్టేలా.. స్థానికంగా విద్వేషాలు రగిల్చేలా.. స్థానిక ప్రజాప్రతినిధులను చులకన చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగింది. ప్రతి చోటా హైడ్రామా సృష్టించి టీడీపీ కేడర్ గందరగోళం చేయడానికి ప్రయత్నించింది. పర్యావసానంగా కొయ్యలగూడెం మండలంలో చంద్రబాబుకు తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. గో బ్యాక్ బాబు అంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, స్థానికులు ప్లకార్డులు చూపారు. మొత్తం మీద ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన నిరసనలు, స్వల్ప ఉద్రిక్తతలు, ధర్నాల నడుమ ముగిసింది. రెచ్చగొట్టే ప్రసంగాలతో.. కొయ్యలగూడెంలో చంద్రబాబు బీసీ సదస్సులో మాట్లాడి రోడ్‌షో ప్రారంభించి ప్రతి చోటా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. అధినేతే అలా మాట్లాడుతుండటంతో టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయారు. కొయ్యలగూడెంలో చంద్రబాబుకు గో బ్యాక్ అంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలియజేయడంతో రెచ్చిపోయిన టీడీపీ కేడర్ వారిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు మూర్తిరాజు తలకు గాయమైంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో టీడీపీ రోడ్‌షో కొనసాగింది. అక్కడ నుంచి పోలవరం చేరుకున్న చంద్రబాబు నానా హడావుడి చేశారు. నా మానసపుత్రిక అయిన ప్రాజెక్టును చూడటానికి నన్నే అనుమతించరా అంటూ మహిళా డీఎస్పీపై మండిపడ్డారు. ప్రాజెక్టులో పనులు జరుగుతున్న క్రమంలో సందర్శించడానికి పోలీసు అనుమతి తప్పనిసరని, ముందుగా అనుమతి తీసుకోవాలని, పైగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా అనుమతించడం లేదని చంద్రబాబుకు డీఎస్పీ చెప్పినా హడావుడి చేసి పెద్ద పెద్ద కేకలు వేసి టీడీపీ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో 15 నిమిషాలు తర్వాత అక్కడ నుంచి లేచి వెళ్లి సభలో మాట్లాడి కొవ్వూరుకు చంద్రబాబు పయనమయ్యారు. ప్రతి చోటా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని తీవ్రస్థాయిలో దూషించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు లక్ష్యంగా విమర్శలు ఆయన చేశారు. చదవండి: చంద్రబాబుకు చాదస్తం మరీ ఎక్కువైంది -
అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. కాగా, అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్ టాప్‌పై హైడ్రామా చోటుచేసుకుంది. మొదట ఆసుపత్రిలో ఐటీ అధికారి రత్నాకర్ ల్యాప్‌టాప్ వదిలివెళ్లారు. రత్నాకర్‌ను బోయిన్పల్లి పీఎస్‌కు మంత్రి మల్లా రెడ్డి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఉండిపోయిన ల్యాప్‌టాప్‌ను మల్లా రెడ్డి అనుచరులు పీఎస్‌కు తీసుకుని వచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్‌ను కేంద్ర బలగాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ల్యాప్‌టాప్‌ను లోపలికి తీసుకెళ్లేందుకు మల్లారెడ్డి అనుచరులు ప్రయత్నించారు. బోయినపల్లికి చెందిన కానిస్టేబుల్.. ల్యాప్‌టాప్‌ను లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్‌ను అడ్డుకున్న కేంద్ర బలగాలు.. ల్యాప్‌టాప్‌ను బయటే పెట్టించాయి. బోయినపల్లి పీఎస్ గేటు ముందే ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు వదిలి వెళ్లారు. మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్‌ను కేంద్ర బలగాలు ఖాళీ చేశాయి. కేంద్ర బలగాలు వెళ్లిన తర్వాత ల్యాప్‌టాప్‌ను బోయినపల్లి పీఎస్ లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం బోయినపల్లి పీఎస్‌లోనే ల్యాప్‌టాప్ ఉంది. చదవండి: మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? -
యనమలకుదురు వంతెన విషయంలో టీడీపీ డ్రామాలు
-
కుప్పంలో టీడీపీ మరో డ్రామా
-
అనంతపురం జిల్లాలో ప్రేమ..పెళ్లి హైడ్రామా
-
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ డ్రామాలు
-
కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా
-
ఉదయం దీక్ష.. మధ్యాహ్నం ఫైట్!
సాక్షి, అమరావతి/ఉయ్యూరు (పెనమలూరు)/గుడివాడ/ఉంగుటూరు (గన్నవరం): ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీ నేతలు మంగళవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఎంపీ సీఎం రమేష్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ రాజు, విష్ణువర్దన్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డు మీదకు తీసుకొచ్చిందని సోము వీర్రాజు ఆరోపించారు. కాగా, దీక్షను మధ్యాహ్నానికి విరమించి, బీజేపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామంటూ సోము నేతృత్వంలో పార్టీ నేతలు గుడివాడకు బయలుదేరి వెళ్లారు. నందమూరు అడ్డరోడ్డు వద్ద హైడ్రామా గుడివాడలో సంక్రాంతి సంబరాలను టీడీపీ వివాదాస్పదంగా మార్చింది. దీనికి వంతపాడుతూ గుడివాడ పర్యటనకు బయలుదేరిన బీజేపీ నాయకులను నందమూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డి, సీఎం రమేష్ సహా 35 మంది బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ శ్రేణులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగి, ఘర్షణకు దిగారు. వీర్రాజుతో పాటు 18 మందిని ఉంగుటూరు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. వీర్రాజు మాట్లాడుతూ.. తాము చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకున్నా అరెస్టు చేయడం దారుణమన్నారు. ఎందుకు అడ్డుకున్నారు? బీజేపీ ఎంపీ జీవీఎల్ సాక్షి, న్యూఢిల్లీ: సంక్రాంతి కార్యక్రమాల ముగింపు వేడుకలకు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం గుడివాడ వెళ్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసలు బీజేపీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారని, అరెస్ట్ చేసి బయటకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పోలీసుల ప్రవర్తన చూస్తే ఎంత అరాచకంగా వ్యవహరించారో తెలిసిపోతుందన్నారు. ముగ్గుల పోటీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలంటే వైఎస్సార్సీపీ నేతలకు చేదా అని అడిగారు. -
వనమా రాఘవేందర్ అరెస్టుపై హైడ్రామా!
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్రావు అరెస్టుపై హైడ్రామా కొనసాగుతోంది. కొత్తగూడెం పోలీసులు గురువా రం మధ్యాహ్నం రాఘవేందర్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యేనే తన కుమారుడిని పోలీసులకు అప్పగించారని, విచారణ నిమిత్తం రాఘవేందర్‌ను పోలీసులు కొత్తగూడెం తీసుకెళ్లారనే ప్రచారం సాగింది. కానీ రాత్రి వరకు జిల్లా పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మీడి యాతో మాట్లాడిన పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్.. రాఘవేందర్ కోసం తెలంగాణ, ఏపీలో ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఆయన గత నేరచరిత్రనూ వెలికితీసి పాత కేసులకు సంబంధించి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా రౌడీషీట్ తెరుస్తామని వెల్లడించారు. ఒకవేళ రాఘవేందర్ బెయిల్ పిటిషన్ దాఖలుచేసినా గట్టిగా కౌంటర్ దాఖలు చేస్తామని ఏఎస్పీ చెప్పారు. కాగా, వీలైనంత త్వర లో అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేసులో కీలకంగా కారు ఇదిలాఉంటే.. రామకృష్ణకు చెందిన కారు (ఏపీ 28 బీ2889) ఈ కేసును కీలక మలుపు తిప్పింది. భార్య, ఇద్దరు పిల్లలతో సహా తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న రామకృష్ణ.. తన కారులోనే ఆత్మహత్యకు కారణాలపై సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. అనంతరం ఫోన్‌ను అదే కారులో పెట్టారు. ఇటు సూసైడ్ నోట్ కూడా పోలీసులకు రామకృష్ణ కారు నుంచే లభ్యమైంది. ఫోన్, సూసైడ్ నోట్ తన తల్లి, సోదరికి చిక్కుతుందనుకున్నారో లేక మంటల్లో కాలి సాక్ష్యాలు పోలీసులకు దొరకవనుకున్నారో తెలియదు గానీ.. ఫోన్, సూసైడ్ నోట్‌ను కారులోనే ఉంచి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
గుంటూరు జీజీహెచ్ వద్ద టీడీపీ హైడ్రామా
-
మాజీ మంత్రి ‘కాలవ’ హైడ్రామా
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): అనుమతుల్లేకుండా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలంటూ ఉద్దేహాళ్ నుంచి బొమ్మనహాళ్‌కు పాదయాత్ర చేపట్టారు. ఇందుకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి, అనుచరులతో కలిసి పాదయాత్రగా ఉప్పరహాళ్ క్రాస్ వద్దకు చేరుకున్న కాలవను కళ్యాణ దుర్గం ఇన్చార్జ్ డీఎస్పీ ఆంథోనప్ప, సీఐ రాజా, ఎస్ఐలు రమణారెడ్డి, రామకృష్ణారెడ్డి కలిసి మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాదయాత్ర చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. విషయం ఏదైనా నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేయాలని సూచించారు. దీనిపై హైడ్రామాకు కాలవ తెరలేపారు. ఇష్టం వచ్చిన రీతిలో పాదయాత్రలు, నిరసనలు, ధర్నాలు చేపడతామని, తమను ఎవరూ అడ్డుకోలేరంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో చివరకు అరెస్ట్ చేసి, కణేకల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా, పాదయాత్రకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తమనుంచి ఎలాంటి అనుమ తులు తీసుకోలేదని డీఎస్పీ ఆంథోనప్ప తేల్చిచెప్పారు. శనివారం సాయంత్రం బొమ్మనహాళ్ ఎస్ఐ రమణారెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో వినతిపత్రాలు అందజేశారని, బొమ్మనహాళ్ మండలంలో ఇందుకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తూ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాసులును అరెస్ట్ చేసి, సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ నిబంధనల సవరణ -
‘కత్తులు దూసి.. కరచాలనంతో కలిసి’
జైపూర్ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో సంప్రదింపుల అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరిన తిరుగుబాటు నేత సచిన్ పైలట్ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ను గురువారం ఆయన నివాసంలో కలిశారు. పైలట్ తిరుగుబాటుతో రాజస్తాన్‌లో నెల రోజులు పైగా రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అశోక్ గహ్లోత్ నివాసంలో ఏర్పాటైన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి సచిన్ పైలట్ హాజరయ్యారు. పైలట్‌ను సాదరంగా ఆహ్వానించిన గహ్లోత్ చిరునవ్వులు చిందిస్తూ యువనేతతో కరచాలనం చేశారు. ఈ భేటీలో ఇరువురు నేతలు పక్కపక్కనే కూర్చున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో గహ్లోత్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ వెల్లడించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పైలట్ సహా ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాధ్రాలతో సంప్రదింపుల అనంతరం పైలట్ సొంతగూటికి తిరిగివచ్చేందుకు అంగీకరించిన సంగతి తెలసిందే. పైలట్ పార్టీ ముందుంచిన ప్రధాన డిమాండ్లనూ నెరవేర్చుతామని హైకమాండ్ ఆయనకు హామీ ఇచ్చింది. రెబెల్ నేతలు తిరిగి పార్టీలోకి రావడంతో వారిని మన్నించి ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరారు. మరోవైపు రాజస్తాన్‌లో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ను కాంగ్రెస్ అధిష్టానం రాజస్తాన్‌కు పంపింది. 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో మెజారిటీకి 101 మంది సభ్యులు అవసరం కాగా, కాంగ్రెస్ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని ఆ పార్టీకి 125 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక విపక్ష బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నారు. చదవండి : రాజస్తాన్: కుటుంబ పెద్దపై అలకబూనాం అంతే! #WATCH Jaipur: Congress leader Sachin Pilot meets CM Ashok Gehlot at his residence. Congress Legislature Party meeting to take place here, ahead of the special session of the #Rajasthan Assembly tomorrow. pic.twitter.com/0pIZ1vr2dM — ANI (@ANI) August 13, 2020 -
రాజస్తాన్ హైడ్రామా : కేబినెట్ భేటీ షురూ
జైపూర్ : రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్ సర్కార్‌పై ఆ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో నెలకొన్న రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ నుంచి తాజా ప్రతిపాదనను గవర్నర్ కల్రాజ్ మిశ్రా కోరడంతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. గవర్నర్ పంపిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్‌కు మంత్రిమండలి మరోసారి విజ్ఞప్తి చేస్తుందని గహ్లోత్ శిబిరం పేర్కొంది. కాగా అసెంబ్లీని సమావేశపరచాలని అంతకుముందు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను తోసిపుచ్చుతూ గవర్నర్ పంపిన నోట్లో పలు అంశాలను ప్రస్తావించారు. ఆ నోట్లో ‘21 రోజుల నోటీస్ వ్యవధికి ప్రభుత్వం అంగీకరిస్తే శాసనసభను సమావేశపర్చవచ్చు. లేదా, సమావేశం ఎజెండా బలనిరూపణే అయితే, ఆ నోటీస్ కాల వ్యవధిని తగ్గించవచ్చు. ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే.. ఆ మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల’ని పేర్కొన్నారు. అయితే రాజస్తాన్ అసెంబ్లీలో బీజేపీ తన పరిస్థితి మెరుగుపర్చుకునేందుకు అసెంబ్లీ సమావేశాలకు ముందు 21 రోజుల నోటీసు ఇవ్వాలన్న నిబంధనను తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది ప్రలోభాలకు ఆస్కారం ఇచ్చినట్టేనని, కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ పేర్కొన్నారు. కాగా బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు గుణపాఠం చెబుతామని విలీనాన్ని సవాల్ చేస్తూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన ఆ పార్టీ అధినేత్రి మాయావతి హెచ్చరించారు. ఇక కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఓ బీజేపీ ఎమ్మెల్యే రాజస్తాన్ హైకోర్టులో మంగళవారం తాజా పిటిషన్ దాఖలు చేశారు. చదవండి : మళ్లీ మార్చి పంపండి! -
రాజస్తాన్ హైడ్రామా : స్పీకర్ పిటిషన్ వెనక్కి..
జైపూర్ : రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్ సర్కార్‌పై సచిన్ పైలట్ తిరుగుబాటుతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడలేదు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా అసంతృప్త ఎమ్మెల్యేలకు జారీచేసిన అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ సోమవారం ఉపసంహరించుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో పాటు ఆయనకు మద్దతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప్రక్రియను వాయిదా వేయాలని ఈనెల 21న రాజస్ధాన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ స్పీకర్ సీపీ జోషీ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ హైకోర్టు ఈనెల 24న యథాతథ స్ధితి కొనసాగించాలని ఆదేశిస్తూ జారీ చేసిన సమగ్ర ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు లేవనెత్తిన న్యాయపరమైన అంశాలన్నింటినీ ప్రస్తావించినందున ఈ పిటిషన్‌ను ఉపసంహరించేందుకు అనుమతించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ను స్పీకర్ సీపీ జోషీ కోరారు. జోషీ తరపు న్యాయవాది కపిల్ సిబల్ వినతి మేరకు పిటిషన్ ఉపసంహరణకు అనుమతించేందుకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారి సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు బెంచ్ అంగీకరించింది. మరోవైపు రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలను జూలై 31 నుంచి ప్రారంభించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కేబినెట్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు పంపిన ప్రతిపాదనను గవర్నర్ తోసిపుచ్చారు. కేంద్రం ఒత్తిడికారణంగానే గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చే నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. అర్థం లేని కారణాలు చూపుతూ అసెంబ్లీని సమావేశపర్చడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభి షేక్ సింఘ్వీ విమర్శించారు. మరోవైపు... ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని తప్పుబడుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ హైకోర్టు నేడు విచారించనుంది. ఈ క్రమంలో బీఎస్పీ సైతం ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చదవండి : ప్రధాని ఎదుట ధర్నా చేస్తాం -
జగ్గయ్యపేటలో అర్ధరాత్రి హైడ్రామా
-
గవర్నర్ గో బ్యాక్.. సభలో తీవ్ర గందరగోళం
తిరువనంతపురం: అత్యంత హైడ్రామా నడుమ కేరళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉయదం ప్రారంభమయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నిరసనకు దిగడం.. యాంటీ సీఏఏ పోస్టర్లు పట్టుకొని.. ‘గవర్నర్.. గో బ్యాక్’ నినాదాలు చేయడంతో సభ దద్దరిల్లిపోయింది. దీంతో మార్షల్స్ రంగప్రవేశం చేసి.. నిరసనకు దిగిన ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. మార్షల్స్ భద్రత మధ్య అసెంబ్లీలోకి ప్రవేశించిన గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.. తనను ఉద్దేశించి నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలకు చేతులు జోడించి ‘కృతజ్ఞతలు’ తెలిపారు. ఆయనకు ఇరువైపుల సీఎం పినరయి విజయన్, స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్ ఉన్నారు. మార్షల్ భద్రత నడుమ గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రసంగం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ గేటు వద్దకు చేరుకొని వారు ధర్నాకు దిగారు. సీఎం చదవమన్నారని.. చదువుతున్నా! తన ప్రసంగంలో భాగంగా సీఏఏ వ్యతిరేక తీర్మానంలోని కొంతభాగాన్ని గవర్నర్ చదివి వినిపించారు. అయితే, ఇది తన అభిప్రాయం కాదని, కేవలం ప్రభుత్వ అభిప్రాయం మాత్రమేనని, ప్రభుత్వ అభిప్రాయంతో ఏకీభవించనప్పటికీ.. సీఎం కోరిక మేరకు, ఆయన దీనిని నేను చదవాలని కోరుతున్నందుకే చదివి వినిపించానని గవర్నర్ ఖాన్ వివరించారు. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో సీఎం విజయన్‌కు, గవర్నర్ ఖాన్‌కు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. విజయన్ సర్కారు తీరును గవర్నర్ బాహాటంగానే తప్పుబడుతున్నారు.