ఆస్ట్రేలియన్ వుమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ తుది సమరంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హోబర్ట్ వేదికగా సౌత్ ఆస్ట్రేలియా-టాస్మానియా జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన ఫైనల్ మ్యాచ్ అనూహ్య మలుపులు తిరిగి క్రికెట్‌లోని అసలుసిసలు మజాను ప్రేక్షకులకు అందించింది. అసలు ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టాస్మానియా నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.
One of the wildest finishes to a cricket match condensed down to a minute.
— cricket.com.au (@cricketcomau) February 25, 2023
You're welcome #WNCLFinal pic.twitter.com/97hUMPcuxE
ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించి (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో), సౌత్ ఆస్ట్రేలియాకు 243 పరుగుల టార్గెట్‌ను కుదించారు. ఈ క్రమంలో చివరి నిమిషం వరకు సౌత్ ఆస్ట్రేలియా గెలుపు దిశగా సాగింది. చివరి ఓవర్‌కు ముందు సమీకరణలు ఇలా ఉన్నాయి. ఆఖరి ఓవర్‌లో సౌత్ ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 4 పరుగులు చేయాల్సి ఉండింది. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో సౌత్ ఆస్ట్రేలియా జట్టు గెలుపు నల్లేరుపై నడకే అని అంతా అనుకున్నారు. ఇక్కడే మ్యాచ్ అనూహ్య మలుపులు తిరిగింది. సౌత్ ఆస్ట్రేలియా జట్టు చివరి ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. టాస్మానియా బౌలర్ కోయటే ఆఖరి ఓవర్‌లో మ్యాజిక్ చేసింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో పాటు రెండు రనౌట్లు చేసి తన జట్టును వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా నిలబెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment