south australia
-
అడిలైడ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అడిలైడ్ నగరంలోని ఎల్డర్ పార్క్ లో ఉన్న ఆడిలైడ్ ఫెస్టివల్ సెంటర్లో ఈ వేడుకల్ని జరిపారు. సౌత్ ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్‌లో తొలిసారి నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 500 మంది పాల్గొన్నారు. వీరిలో పలువురు ఆస్ట్రేలియన్లు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ వేడుకల్లో పాల్గొన్న ఆస్ట్రేలియాలోని స్థానిక ప్రజలు తెలంగాణ సంప్రదాయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకుని మరీ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎల్డర్ పార్క్‌లో ఈ వేడుకల్ని నిర్వహించిన తర్వాత టోరెన్స్ నదిలో వీడ్కోలు పలికారు. ఈ వేడుకల్లో టోరెన్స్ ఎంపీ వొర్టీ, సాంస్కృతిక శాఖా మంత్రి జోబెట్టిసన్ హాజరయ్యారు. ఎల్డర్ పార్కులో ఈ వేడుకల్ని తెలంగాణ సంప్రదాయబద్ధంగా నిర్వహించి టోరెన్స్ నదిలో సాగనంపారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా టోరెన్స్ ఎంపీ డానా వొర్ట్లీ, సాంస్కృతిక శాఖ మంత్రి జో బెట్టిసన్ హాజరయ్యారు. అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షురాలు హరితారెడ్డి బతుకమ్మ వేడుకల ప్రాముఖ్యతను వివరించారు. వైస్ ప్రెసిడెంట్ మమతా దేవా, ట్రెజరర్ ప్రత్యూష, సెక్రటరీ నిక్కిల్ మరియు కమిటీ సభ్యులు సౌజన్య, సృజనా రెడ్డి, అనిల్, ప్రశాంత్ రెడ్డి, చరిత్ రెడ్డిలు ఈ బతుకమ్మ సంబరాల్ని సక్సెస్‌గా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారు. శివగర్జన టీమ్‌లోని వాలంటీర్లైన స్టీఫెన్ వాట్స్, శ్రీనివాస్ వడ్లకొండ, సంజయ్ మెంగర్, తదితర వాలంటీర్లు ఈ వేడుక విజయవంతంగా జరగడానికి కృషి చేశారు. ఈ బతుకమ్మ సంబరాల్లో చాలా మంది భారతీయులు కూడా పాల్గొని సందడి చేశారు. -
రంధ్రాలున్నాయ్ జాగ్రత్త!
సాధారణంగా ఏ ఊరెళ్లినా.. కుక్కలు ఉన్నాయ్ జాగ్రత్త అనో..దొంగలున్నారు జాగ్రత్త అనో బోర్డులు చూస్తుంటాం.కానీ దక్షిణ ఆస్ట్రేలియాలోని కూబర్ పెడీ పట్టణానికి వెళ్తే.. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త అనే బోర్డులు దర్శనమిస్తాయ్. ఇంతకీ అక్కడ రంధ్రాలు ఎందుకు ఉన్నాయ్? లోపల ఏం జరుగుతోంది? ఆ పట్టణ కథాకమామీషు ఏమిటి తెలుసుకోవాలని ఉందా? అయితే చలో కూబర్ పెడీ.. మైనింగ్ నుంచి మొదలై.. కూబర్ పెడీ.. దక్షిణ ఆ్రస్టేలియాలోని ఓ మైనింగ్ క్షేత్రం. ఒపాల్ (రత్నం వంటి విలువైన రాయి) గనులకు నిలయంగా పేరొందిన ఈ ప్రదేశం అడిలైడ్‌కు వాయువ్యంగా 590 మైళ్ల దూరంలో స్టువర్ట్ హైవేపై ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఒపాల్స్లో ఎక్కువ భాగం ఈ గ్రేట్ విక్టోరియా ఎడారి అంచున ఉన్న స్టువర్ట్ శ్రేణిలోని మైనింగ్ సైట్ నుంచే వస్తుంది. అసలు ఇక్కడ ఒపాల్ను కనుక్కోవడం కూడా చాలా విచిత్రంగా జరిగింది. 1915లో విల్లీ హచిసన్ అనే బాలుడు తన తండ్రి జేమ్స్‌తో కలిసి గోల్ఫ్ ప్రాక్టీసింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు. గోల్ఫ్ ఆడే క్రమంలో ఓ చోట ఒపాల్ను చూశాడు. అంతే.. అప్పటివరకు నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం క్రమంగా పెద్ద పట్టణంగా మారిపోయింది. 1920లో ఈ ప్రాంతానికి కూబర్ పెడీ అని పేరు పెట్టారు. 1960లో దీనిని పట్టణంగా గుర్తించారు. అప్పటి నుంచి ఇది బాగా అభివృద్ధి చెందింది. స్థానికులు అక్కడే ఉంటూ మైనింగ్ చేసేవారు. వేడి నుంచి తప్పించు కోవడానికి.. ఎడారి ప్రాంతం కావడంతో అక్కడ వేసవికాలం ఉండే నాలుగు నెలల కాలం భగభగా మండిపోయేది. ఆ నాలుగు నెలలు ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి అక్కడివారంతా మైనింగ్ గనుల్లో ఉండేవారు. అనంతరం ఆ భూగర్భంలోనే తాము ఉండటానికి వీలుగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్లంటే ఏదో సాదాసీదా నిర్మాణాలనుకుంటే పొరపడినట్టే. కోటలను తలపించేలా విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నారు. అంతేకాదు.. హోటళ్లు, స్టోర్లు, లైబ్రరీలు, షాపింగ్ సెంటర్లు, క్రీడా ప్రదేశాలు, ఈత కొలనులు, విశాలమైన స్నానపు గదులు, చర్చిలు.. ఇలా ఒకటేమిటి? భూమిపై పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వసతులన్నీ అక్కడ ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం, నీటి వసతి, డ్రైవ్ ఇన్ మూవీ థియేటర్, గడ్డి లేని గోల్ఫ్ కోర్సు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సూర్యకాంతి మినహా సమస్తమూ భూమిపై ఉన్నట్టే ఉంటుంది. కూబర్ పెడీని పై నుంచి చూస్తే.. బోలెడు రంధ్రాలు కనిపిస్తాయి. వీధులన్నీ దుమ్ముతో ఉంటాయ్. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త.. అనే హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ ఆ రంధ్రాల లోపల ఓ భూగర్భ స్వర్గం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అక్కడ భూమిపై 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే.. లోపల 23 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక లోపల కరెంటు అవసరాలను సొంతంగానే తీర్చుకుంటున్నారు. 70 శాతం కరెంటును గాలి, సౌరశక్తి ద్వారా సమకూర్చుకుంటున్నారు. ఈ భూగర్భ పట్టణ జనాభా దాదాపు 2500 మంది. నాలుగు మీటర్ల లోతులో.. కూబర్ పెడీలో భూగర్భ భవనాలు తప్పనిసరిగా నాలుగు మీటర్లు (13 అడుగులు) లోతులో ఉండాలి. పైకప్పులు కూలిపోకుండా చూసుకునేందుకే ఈ నాలుగు మీటర్ల నిబంధన విధించారు. ఈ రాతి కింద ఎల్లప్పుడూ 23 డిగ్రీల ఉష్ణోగ్రతతో తేమగా ఉంటుంది. అక్కడ నేలపై వేసవిలో విపరీతమైన వేడి.. శీతాకాలంలో భరించలేని చలి ఉంటుంది. ఒక్కోసారి రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కానీ భూగర్భ గృహాలు కచి్చతమైన గది ఉష్ణోగ్రత వద్ద సంవత్సరం పొడవునా ఉంటాయి. పైగా ఇందులో ఇళ్లు చాలా సరసమైన ధరకే లభిస్తాయండోయ్. మూడు పడక గదుల ఇల్లు దాదాపు 26వేల అమెరికా డాలర్లకు వచ్చేస్తుంది. మన రూపాయల్లో చెప్పాలంటే... దాదాపు రూ.21.62 లక్షలు. అదే సమీపంలోని అడిలైడ్‌లో సగటు ఇంటి ధర 4.57 లక్షల అమెరికా డాలర్లు(దాదాపు రూ.3.80 కోట్లు). చూశారా ఎంత వ్యత్యాసం ఉందో? – సాక్షి సెంట్రల్ డెస్క్ ప్రయోజనాలివీ.. భూగర్భ పట్టణంలో నివసించడం వల్ల భూకంపాల నుంచి కొంత వరకు రక్షణ లభిస్తుంది. ఈగలు, దోమల, ఇతరత్రా కీటకాల బెడద ఉండదని స్థానిక నివాసి రైట్ వెల్లడించారు.అవి చీకటి, చలిలోకి రావడానికి ఇష్టపడవని వివరించారు. మనం కూడా ప్రస్తుతం అటు వేడితోనూ.. ఇటు దోమలతోనూ చాలా ఇబ్బందులు పడుతున్నాం.. ఇలాంటి భూగర్భ ఇళ్లేవో ఇక్కడ కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందేమో కదా? -
6 బంతుల్లో 4 పరుగులు.. చేతిలో 5 వికెట్లు.. అయినా ఓటమి
ఆస్ట్రేలియన్ వుమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ తుది సమరంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హోబర్ట్ వేదికగా సౌత్ ఆస్ట్రేలియా-టాస్మానియా జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన ఫైనల్ మ్యాచ్ అనూహ్య మలుపులు తిరిగి క్రికెట్లోని అసలుసిసలు మజాను ప్రేక్షకులకు అందించింది. అసలు ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టాస్మానియా నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. One of the wildest finishes to a cricket match condensed down to a minute. You're welcome #WNCLFinal pic.twitter.com/97hUMPcuxE — cricket.com.au (@cricketcomau) February 25, 2023 ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించి (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో), సౌత్ ఆస్ట్రేలియాకు 243 పరుగుల టార్గెట్‌ను కుదించారు. ఈ క్రమంలో చివరి నిమిషం వరకు సౌత్ ఆస్ట్రేలియా గెలుపు దిశగా సాగింది. చివరి ఓవర్‌కు ముందు సమీకరణలు ఇలా ఉన్నాయి. ఆఖరి ఓవర్లో సౌత్ ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 4 పరుగులు చేయాల్సి ఉండింది. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సౌత్ ఆస్ట్రేలియా జట్టు గెలుపు నల్లేరుపై నడకే అని అంతా అనుకున్నారు. ఇక్కడే మ్యాచ్ అనూహ్య మలుపులు తిరిగింది. సౌత్ ఆస్ట్రేలియా జట్టు చివరి ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. టాస్మానియా బౌలర్ కోయటే ఆఖరి ఓవర్లో మ్యాజిక్ చేసింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో పాటు రెండు రనౌట్లు చేసి తన జట్టును వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా నిలబెట్టింది. -
అసలే కోపంలో ఉన్నాడు.. క్రీజులో హెల్మెట్ అడ్డుగా
Weatherald Scolded for Bizarre Helmet-Kicking Video: షఫీల్డ్ షీల్డ్ క్రికెట్ టోర్నీలో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్ సమయంలో సౌత్ ఆస్ట్రేలియా ఆటగాడు వెదర్లాండ్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌కు ముందు బ్రేక్ సమయంలో క్వీన్స్‌ల్యాండ్ ఫీల్డర్ మ్యాట్ రెన్షా.. క్రీజులో బ్యాటర్స్ గార్డ్ తీసుకునే చోట హెల్మెట్ పెట్టేసి వెళ్లాడు. ఓవర్ ప్రారంభం కావడంతో వెదర్లాండ్ స్ట్రైకింగ్‌కు వెళ్లాడు. కాగా అప్పటికే వెదర్లాండ్ ఏదో విషయంలో కోపంతో ఉన్నాడు. చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్ అయ్యి బతికిపోయావు.. లేదంటే అంతలో క్రీజులోకి చేరుకున్న వెదర్లాండ్స్.. అక్కడ హెల్మెట్ ఉండడం చూసి చిర్రెత్తిపోయినట్టున్నాడు. దీంతో హెల్మెట్‌ను ఫుట్బాల్లా భావించి పెనాల్టీ కిక్ ఇవ్వడంతో అది ఎగిరి దూరంగా పడిపోయింది. వెదర్లాండ్ చర్య అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఇది చూసిన క్వీన్స్లాండ్ కెప్టెన్ ఉస్మాన్ ఖవాజా జేక్ వెదర్లాండ్స్ దగ్గరకు వచ్చి వాదనకు దిగాడు. ఒక హెల్మెట్‌ను అలా తన్నడం ఏంటని.. కాస్త హుందాగా ప్రవర్తించాలని కోరాడు. అయితే వెదర్లాండ్స్ ఖవాజాను ఏదో అనబోయి.. వెనక్కి తగ్గాడు. ఇదంతా చూసిన అంపైర్ వెదర్లాండ్స్ను పిలిచి ఇలా చేయడం కరెక్టు కాదని హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో Bizarre things on a cricket field: Matt Renshaw (QLD) carried the helmet from one end to other and kept it right on the batting crease on batters guard. Jake Weatherald (SA) with a penalty kick to that helmet. @beastieboy07 @cric_blog #SheffieldShield pic.twitter.com/fXNarJZUE8 — Nash (@NashvSant) November 25, 2021 -
పాపం.. చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయింది
సిడ్నీ: షెఫీల్డ్ షీల్డ్ 2020-21 సిరీస్‌లో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కచ్చితంగా మ్యాచ్ గెలుస్తామని భావించిన జట్టు ఎవరు ఊహించని విధంగా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సౌత్ ఆస్ట్రేలియా విధించిన 332 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో మూడోరోజు ఆటగ ముగిసే సమయానికి వెస్ట్రన్ ఆస్ట్రేలియా 88 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఆట చివరిరోజైన నాలుగో రోజు మూడు సెషన్ల పాటు ఓపికగా ఆడినా వెస్ట్రన్ ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అలా ఆట ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా 143 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. సౌత్ ఆస్ట్రేలియాకు విజయానికి ఒక వికెట్ అవసరం.. క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు. దీంతో సర్కిల్లోనే దాదాపు 9 మంది ఉన్నారు. ఏకంగా స్లిప్‌లో 6గురు ఫీల్డర్లు ఉన్నారు. 4వ ఓవర్ల పాటు ఓపికగా ఆడిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ 5 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ను చాడ్ సేయర్స్ వేశాడు. క్రీజులో లియామ్ ఓ కోనర్, లియామ్ గుత్రేయి ఉన్నారు. ఆఖరి బంతిని కోనర్ ఫ్లిక్ చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచి స్లిప్‌లో పడింది. అప్పటికే ఆరుగురు ఫీల్డర్లు ఉండడంతో క్యాచ్ అని భావించారు. అయితే అనూహ్యంగా ఫీల్డర్ చేతిని తప్పించుకొని బంతి కింద పడింది. అలా మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో విజయం చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోయిందనుకుంటూ సౌత్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌత్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్: 510/8 డిక్లెర్డ్ రెండో ఇన్నింగ్స్: 230/9 డిక్లెర్డ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్: 409/5 డిక్లెర్డ్ రెండో ఇన్నింగ్స్: 148/9 చదవండి: 169 నాటౌట్.. అయినా గెలిపించలేకపోయాడు రెండు రన్స్‌తో డబుల్ సెంచరీ మిస్.. కేకేఆర్‌లో జోష్ One ball remaining. One wicket needed. No.11 on strike Gotta love #SheffieldShield cricket 😊 pic.twitter.com/8HgC2xYPf4 — cricket.com.au (@cricketcomau) February 28, 2021 -
కామెరాన్.. సూపర్మ్యాన్లా పట్టేశాడు..!
మెల్బోర్న్: మార్ష్ వన్డే కప్‌లో విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా పరుగు తేడాతో గెలిచింది. అత్యంత ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేయగా, విక్టోరియా ఐదు వికెట్ల నష్టానికి 321 పరుగులే చేసి ఓటమి పాలైంది. విక్టోరియా కెప్టెన్ అరోన్ ఫించ్ 119 పరుగులు చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. మూడో వికెట్‌కు హ్యాండ్స్కాంబ్తో కలిసి 147 పరుగులు చేయడంతో విక్టోరియా గెలుస్తుందనే అనుకున్నారంతా. అయితే హ్యాండ్ స్కాంబ్(87) ఔటే విక్టోరియా కొంపముచ్చింది. విక్టోరియా ఇన్నింగ్స్‌లో భాగంగా 28 ఓవర్‌ను కేన్ రిచర్డ్సన్ వేశాడు. ఆ ఓవర్ ఐదో బంతిని హ్యాండ్ స్కాంబ్ మిడ్ ఆఫ్- ఎక్స్ ట్రా కవర్ మీదుగా షాట్ ఆడగా, ఆ ఫీల్డింగ్ పొజిషన్లోనే కాస్త దూరంగా ఉన్న కామెరాన్ వాలెంటే అద్భుతమైన ఫీల్డింగ్‌తో అదరొగొట్టాడు. ఆ సమయంలో బంతి పైకి లేవగా పరుగెత్తుకుంటూ వెళ్లి గాల్గోనే డైవ్ కొట్టి మరీ ఒక్క చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దాంతో హ్యాండ్ స్కాంబ్ షాకయ్యాడు. అసాధ్యం అనుకున్న క్యాచ్‌ను కామెరాన్ సూపర్మ్యాన్లా ఎగిరి పట్టడంతో హ్యాండ్ స్కాంబ్ భారంగా పెవిలియన్ చేరుకున్నాడు. ఇది మ్యాచ్‌కు కీలక మలుపు. ఫలితంగా చివర వరకూ పోరాటం చేసిన విక్టోరియా పరుగు తేడాతో ఓడి పోవడంతో ఈ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. -
ఏటీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
అడిలైడ్ : అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్(ఏటిఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. సౌత్ ఆస్ట్రేలియా అడిలైడ్ పట్టణంలోని ఎల్డర్స్ పార్క్‌లో అక్టోబర్ 5న(శనివారం) ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా, మహిళలు పెద్ద ఎత్తున హాజరై రంగు రంగుల బతుకమ్మలను పేర్చి తమ ఆట పాటలతో అలరించారు. -
అదృష్టం అడ్డం తిరిగితే..
-
దురదృష్టమంటే నీదే నాయనా?
ఏ ఆటలోనైనా అదృష్టమనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. ముఖ్యంగా క్రికెట్లో అంపైర్ల తప్పిదాలు, క్యాచ్ వదిలేయడం, రనౌట్ మిస్ చేయడం ఇలాంటివి బ్యాట్స్‌మెన్ పాలిట ఒక్కోసారి వరాలుగా మారుతాయి. అలా ఆటగాళ్లు ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకొని భారీ స్కోర్లు సాధిస్తారు. అయితే కొన్ని సార్లు దురదృష్టం వెంటాడి బ్యాట్స్‌మన్ ఔటవ్వడం కూడా చూస్తుంటాం. ప్రస్తుతం అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందన్న సామెత విక్టోరియా బ్యాట్స్‌మన్ విల్ పుకౌస్సీకి వర్తిస్తుంది. మరో 18 పరుగులు చేస్తే సెంచరీ సాధిస్తాడునుకున్న తరుణంలో విల్ దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. ఆసీస్‌లో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా- విక్టోరియా జట్లు తలపడుతున్నాయి. ఈ తరుణంలో సౌత్ ఆస్ట్రేలియా పార్ట్ టైమ్ స్పిన్నర్ హెడ్ వేసిన బంతిని షార్ట్ లెగ్‌లో ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా బౌన్స్ అవడంతో అక్కడ ఫీల్డింగ్ చేస్తున ఫీల్డర్ కాలికి తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నిరాశగా విల్ క్రీజు వదిలి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్ చేస్తోంది. ‘దురదృష్టమంటే నీదే నాయనా?’ అంటూ దీనిపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (వాట్ ఏ క్యాచ్.. ఇది టీమ్ వర్క్ అంటే!) -
10 మంది సున్నా... 10 ఆలౌట్!
సిడ్నీ: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ (మహిళల డివిజన్) మ్యాచ్‌లో అనూహ్య రికార్డు నమోదైంది. న్యూసౌత్‌వేల్స్‌తో జరిగిన ‘నేషనల్ ఇండిజినస్ క్రికెట్ చాంపియన్‌షిప్’ పోరులో సౌత్ ఆస్ట్రేలియా జట్టు 10 పరుగులకే కుప్పకూలింది! ఇందులో ఓపెనర్ మాన్సెల్ (33 బంతుల్లో 4) మాత్రమే పరుగులు చేయగలిగింది. మిగతా పది మంది ‘సున్నా’కే పరిమితమయ్యారు. ఎక్స్ట్రాలుగా వచ్చిన 6 పరుగులే జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్ కావడం విశేషం. ప్రత్యర్థి బౌలర్లు ‘వైడ్’ల ద్వారా ఈ అదనపు పరుగులు ఇచ్చారు. టీమ్ ఇన్నింగ్స్ 10.2 ఓవర్ల వరకు సాగగలిగింది. న్యూ సౌత్‌వేల్స్ బౌలర్ రాక్సెన్ వాన్ వీన్ 2 ఓవర్లలో 1 పరుగిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం న్యూసౌత్‌వేల్స్ 2.5 ఓవర్లలో 2 వికెట్లకు 11 పరుగులు చేసి విజయాన్నందుకుంది. -
102 ఏళ్ల బామ్మ సాహసం.. దేనికోసం అంటే..!
ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకి చూస్తే కళ్లు తిరగటం సహజం. మనలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఎపుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. అయితే ఇరిన్ ఒషక్ అనే బామ్మ మాత్రం ఇందుకు మినహాయింపు.102 ఏళ్ల వయసులో ఏకంగా 14 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి.. ఈ ఫీట్ చేసిన అత్యంత పెద్ద వయస్కురాలిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. దక్షిణ ఆస్ట్రేలియాలోని లాంగ్‌హార్న్ క్రీక్ ఇందుకు వేదిక అయింది. శిక్షకురాలితో కలిసి బామ్మ గాల్లో విహరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బామ్మ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసించడంతో పాటు.. ఇలా చేయడానికి గల కారణాన్ని తెలుసుకుని ఆమె పెద్ద మనసుకు సలాం అంటున్నారు. అసలు విషయమేమిటంటే... దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన న్యూరాన్ మోటార్ డిసీజ్ అసోసియేషన్ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం విరాళాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా తన వంతు సాయం చేసేందుకు ఒషక్ ముందుకు వచ్చారు. స్కైడైవింగ్ చేయడం ద్వారా సమకూరే ఆదాయాన్ని చారిటీ కోసం వినియోగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన స్కైడైవింగ్ ఈవెంట్లో పాల్గొని విజయవంతంగా స్టంట్ పూర్తి చేశారు. అయితే ఇలాంటి స్టంట్ చేయడం బామ్మకు ఇదే మొదటిసారి కాదు. 2016లో స్కైడైవింగ్ చేసి... తద్వారా వచ్చిన సొమ్మును కూడా విరాళంగా ఇచ్చేశారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనుకునే గుణం ఉంటే చాలు అందుకు వయసు, వయోభారం అడ్డంకి కానేకాదు అనే విషయాన్ని బామ్మ నిరూపించారు అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
వంద మెగావాట్ల పందెం.. ఓకే..
దక్షిణ ఆస్ట్రేలియాలో గతేడాది భారీ సుడిగాలులు వీచాయి. వాటి దెబ్బకు విద్యుత్ స్తంభాలు సైతం కుప్పకూలిపోయాయి! దీంతో ఆ ప్రాంతమంతా కరెంట్ లేకుండా పోయింది. వర్షాలకు, గాలులకు స్తంభాలు కూలిపోయి, తీగలు తెగిపడి కరెంటు పోవడం కొత్తేమీ కాకపోవచ్చు.. ఇలాంటివి సాధారణమే కావచ్చు.. కానీ ఏడాది తర్వాత అక్కడ ఓ అద్భుతం జరిగింది. వంద రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ బ్యాటరీ సిద్ధమైంది. ఇంకెప్పుడూ కరెంటు కట్ అయ్యే పరిస్థితే తలెత్తకుండా..! భూతాపోన్నతి కావచ్చు.. వాతావరణ మార్పులు కావచ్చు.. కారణమేదైనా ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. కాని సోలార్ ప్యానెల్స్‌తో పగలు విద్యుత్ ఉత్పత్తి చేసినా అవసరం మాత్రం చీకటి పడగానే ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకుందామా అంటే మెగావాట్లకు మెగావాట్లు నిల్వ చేసుకునే బ్యాటరీలు దాదాపుగా లేవు. ఇందుకు తగ్గ టెక్నాలజీలూ అభివృద్ధి కాలేదు. ఈ నేపథ్యంలో దక్షిణ ఆస్ట్రేలియాలో పరీక్షలకు సిద్ధమవుతున్న వంద మెగావాట్ల సామర్థ్యమున్న బ్యాటరీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. విద్యుత్ కార్ల కంపెనీ ‘టెస్లా’ఓనర్ ఇలాన్ మస్క్.. అడిలైడ్ సమీపంలోని జేమ్స్టౌన్ వద్ద ఈ మెగా బ్యాటరీని సిద్ధం చేశారు! ట్వీటర్ వేదికగా మొదలైన పోటీ దక్షిణ ఆస్ట్రేలియాలో కరెంటు కష్టాలు ఏర్పడిన సమయంలో మొదలైన ఓ ట్వీటర్ యుద్ధం.. చివరకు వంద మెగావాట్ల బ్యాటరీ ఆవిష్కరణకు దారి తీసింది. గతేడాది సెప్టెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో భారీగా లోడ్‌షెడ్డింగ్, కరెంటు కోతలు విధించారు. ఈ నేపథ్యంలో మార్చిలో టెస్లా వైస్ ప్రెసిడెంట్ లైడన్ రీవ్.. ‘మా కంపెనీ బ్యాటరీలతో కరెంట్ కోతలకు ఫుల్స్టాప్ పెట్టవచ్చు. ఇందుకు పెద్దగా సమయం కూడా పట్టదు. వంద రోజుల్లో వంద మెగావాట్ల విద్యుత్ నిల్వ చేసే బ్యాటరీని ఏర్పాటు చేస్తాం’అని ట్వీట్ చేశారు. దీనికి ఆట్లాసియాన్ కంపెనీ ఓనర్ మైక్ కానన్ బ్రూక్స్ స్పందిస్తూ..‘నిజంగానే అంటున్నారా? అయితే నిధులు సేకరించే పని నాకు వదిలిపెట్టండి (ప్రభుత్వంతో మాట్లాడటం కూడా) మీరు వంద రోజుల్లో వంద మెగావాట్ల బ్యాటరీ ఏర్పాటు చేసి చూపించండి’అని సవాలు విసిరారు. దీంతో రంగంలోకి దిగిన టెస్లా కంపెనీ ఓనర్ ఇలాన్ మస్క్.. ‘సరే. వంద రోజుల్లో మేం బ్యాటరీని ఏర్పాటు చేయలేక పోతే.. దాన్ని ఉచితంగా ఇచ్చేస్తా’అని ప్రకటిం చారు! ఈ మేరకు వంద మెగావాట్ల బ్యాటరీ తయారీకి 5 కోట్ల డాలర్లు (రూ.322 కోట్లు) వరకు ఖర్చవుతుందని అప్పట్లో మస్క్ అంచనా వేశారు. దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వా నికి తన ప్రతిపాదనను వివరించి.. వారితో సెప్టెంబర్ 29న ఒప్పందం కుదుర్చుకుని మస్క్ పని మొదలుపెట్టారు. లెక్క ప్రకారం డిసెంబర్ 1కల్లా బ్యాటరీ అందుబాటులోకి రావాల్సి ఉండగా వారం రోజుల మందుగానే ప్రభుత్వానికి అప్పగించేశారు. ‘ఇక మీరు పరీక్షించుకుని వాడుకోవడమే మిగిలింది’ అని చెప్పేశారు. పోటీలో నెగ్గి రూ.322 కోట్లు మిగుల్చుకున్నారు! మూడు రెట్లు పెద్దది.. టెస్లా అభివృద్ధి చేసిన వంద మెగావాట్ల బ్యాటరీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతిపెద్ద బ్యాటరీ. ఇదే కంపెనీ కాలిఫోర్నియా ప్రాంతంలో ఇప్పటికే 80 మెగావాట్ల సామర్థ్యమున్న బ్యాటరీ ప్యాక్‌ను ఏర్పాటు చేసింది. వంద మెగావాట్ల బ్యాటరీ ఒకసారి పనిచేయడం మొదలుపెడితే దాదాపు 30 వేల ఇళ్లకు రోజుకు 8 గంటలపాటు విద్యుత్ అందించవచ్చు. బ్యాటరీని వచ్చే వారంలో దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ వెదరిల్ ప్రారంభించనున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బ్లాక్‌బస్టర్ బ్యాటరీ...
వాట్లు.. కిలోవాట్లు కాదు.. ఏకంగా వంద మెగావాట్లు! ఆస్ట్రేలియాలో విద్యుత్‌ను నిల్వ చేసుకునేందుకు సిద్ధమవుతున్న ఓ భారీ బ్యాటరీ సామర్థ్యం ఇది. ఇంత భారీ సైజు బ్యాటరీ తయారవడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో ఈ భారీ బ్యాటరీ సిద్ధమవుతోంది. దక్షిణ ఆస్ట్రేలియాలో కరెంటు కోతల నివారణకు తగిన మార్గాలు చూపాల్సిందిగా స్థానిక ప్రభుత్వం కొన్ని నెలల క్రితం కంపెనీలకు ఆహ్వానం పలికింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 91 కంపెనీలు పోటీపడ్డాయి. అయితే అవకాశమిస్తే కేవలం వంద రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తి చేసి కరెంటు కోతల్లేకుండా చేస్తానని లేదంటే అందరికీ ఉచితంగా కరెంటు పంచిపెడతానని ట్వీట్టర్ వేదికగా మస్క్ సవాలు విసిరారు. తాజాగా ఈ కాంట్రాక్ట్ మస్క్‌కే దక్కడంతో వంద మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీని తయారు చేస్తానని హామీనిచ్చారు. గాలిమరల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఈ బ్యాటరీలో నిల్వ చేసి కోతల సమయంలో అందరికీ సరఫరా చేస్తానని మస్క్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తయ్యే వంద మెగావాట్ల బ్యాటరీతో దాదాపు 30 వేల ఇళ్లకు విద్యుత్ అందుతుంది. -
చూడగానే ముద్దొచ్చేస్తుందోచ్..!
ఆస్ట్రేలియా: కంగారులకు పెట్టింది పేరు ఆస్ట్రేలియా. భూమిపై ఉన్న జంతువుల్లో ఇవే ప్రత్యేకమైనవి. వీటి ఆకృతిగానీ, జీవన శైలిగాని చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దక్షిణ ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉండే ఈ కంగారుల్లో కొన్ని రకాల కంగారులు ఇప్పుడు చూడముచ్చటగొలుపుతున్నాయి. ఇప్పటి వరకు గొంచెం గోధుమ రంగులో ఉండే కంగారులను మాత్రమే మనం చూడగా తాజాగా తెల్లటి ఆల్బినో కంగారులు కంటపడుతున్నాయి. వాటిని చూడగానే అమాంతం దగ్గరకు వెళ్లి హత్తుకొని ప్రేమగా ముద్దుపెట్టాలన్నంత అందంగా కనిపిస్తున్నాయి. రోస్ మేరీ ఫామాన్ అనే మహిళ తన భర్తతో కలిసి దక్షిణ ఆస్ట్రేలియాలోని ముర్రే నదిగుండా కారు ప్రయాణంలో సాగిపోతుండగా అనూహ్యంగా ఓ తెల్లటి కంగారు కంచెపై నుంచి తలబయటకు పెట్టి చూస్తూ దర్శనమిచ్చింది. అది చూసి అబ్బురపడిన ఆమె ఒక్కసారిగా తన కారును ఆపేసి చేతిలోని కెమెరాతో క్లిక్ మనిపించింది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టగా క్షణాల్లోనే పదివేల లైక్‌లు రాగా.. పన్నెండు వేలమంది షేర్ చేసుకున్నారు. 'సాధరణంగా నేను ప్రతిరోజు వందల కంగారులను చూస్తాను. కానీ, ఇంత వరకు ఈ అడవిలో ఆల్బినో కంగారును మాత్రం చూడలేదు. తొలిసారి చూసి ఆశ్చర్యపోయా. నేను ఫొటో తీస్తుండగానే మమ్ములను దాటేసుకుంటూ అది వెళ్లిపోయింది' అని రోస్ మేరి ఫామాన్ చెప్పింది. -
విద్యా రంగంలో భారత్, దక్షిణ ఆస్ట్రేలియా భాగస్వామ్యం
న్యూఢిల్లీ: భారత్, దక్షిణ ఆస్ట్రేలియా పరస్పర సహాకారంతో విద్య రంగంలో కలసి పనిచేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. దక్షిణ ఆస్ట్రేలియా మంత్రి జే వెదరిల్ శుక్రవారం స్మృతి ఇరానీతో సమావేశమయ్యారు. ఉన్నత విద్య, వృత్తి శిక్షణ, వైమానిక, రక్షణ, పునరుత్పాదక శక్తి, నీటి నిర్వహణ, ఖనిజ వనరులు తదితర రంగాల్లో భారత్‌తో కలసి పనిచేసేందుకు దక్షిణ ఆస్ట్రేలియా ఆసక్తి చూపినట్టు స్మృతి చెప్పారు. దేశంలోని పలు ప్రఖ్యాత విద్యా రంగ సంస్థలు, ఆస్ట్రేలియా సంస్థలతో కలసి పనిచేస్తాయని తెలిపారు. -
గోడకు చెవులుంటాయ్..!
ఈ సామెత ఈ డ్యామ్ రిటెయినింగ్ వాల్‌కు అతికి నట్టు సరిపోతుంది. ఇది దక్షి ణ ఆస్ట్రేలియాలో 1899లో నిర్మించిన బరోస్సా రిజర్వాయర్. దీని గోడను ఇంద్రధనస్సు ఆకారంలో నిర్మించడంతో ఇంజనీరింగ్ అద్భుతంగా పేరు తెచ్చుకోవడంతోపాటు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఈ రిజర్వాయర్‌కు ఉన్న మరో ప్రత్యేక లక్షణం.. దీన్ని అరుదైన నిర్మాణాల జాబితాలో నిలబెట్టింది. ఈ డ్యామ్ గోడకు ఓ చివరన ఉన్నవాళ్లు మాట్లాడే మాటలన్నీ మరో చివరన ఉన్నవాళ్లకు వినపడతాయి. గోడ పొడవు 140 మీటర్లు ఉన్నప్పటికీ, అటువైపు చిన్నగా మాట్లాడిన మాటలను కూడా ఇటువైపు చాలా స్పష్టంగా వినొచ్చు. దీని నిర్మాణ సమయంలోనే ఈ వింతను గుర్తించారు. పనులు చేస్తున్న సమయంలో కొంతమంది కార్మికులు తమ బాస్ గురించి చెడుగా మాట్లాడుకున్నారు. గోడకు ఈ చివర ఉన్న బాస్‌కు వారి మాటలన్నీ స్పష్టంగా వినిపించాయ్. సీన్ కట్ చేస్తే, ఆ కార్మికుల ఉద్యోగాలు ఊడిపోయాయ్.. అరుదైన లక్షణంతో ఈ గోడ చరిత్రలో నిలిచిపోయింది.