గోడకు చెవులుంటాయ్..! | dam wall which transmits sound | Sakshi
Sakshi News home page

గోడకు చెవులుంటాయ్..!

Published Sun, Feb 23 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

గోడకు చెవులుంటాయ్..!

గోడకు చెవులుంటాయ్..!

ఈ సామెత ఈ డ్యామ్ రిటెయినింగ్ వాల్‌కు అతికి నట్టు సరిపోతుంది. ఇది దక్షి ణ ఆస్ట్రేలియాలో 1899లో నిర్మించిన బరోస్సా రిజర్వాయర్. దీని గోడను ఇంద్రధనస్సు ఆకారంలో నిర్మించడంతో ఇంజనీరింగ్ అద్భుతంగా పేరు తెచ్చుకోవడంతోపాటు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఈ రిజర్వాయర్‌కు ఉన్న మరో ప్రత్యేక లక్షణం.. దీన్ని అరుదైన నిర్మాణాల జాబితాలో నిలబెట్టింది. ఈ డ్యామ్ గోడకు ఓ చివరన ఉన్నవాళ్లు మాట్లాడే మాటలన్నీ మరో చివరన ఉన్నవాళ్లకు వినపడతాయి. గోడ పొడవు 140 మీటర్లు ఉన్నప్పటికీ, అటువైపు చిన్నగా మాట్లాడిన మాటలను కూడా ఇటువైపు చాలా స్పష్టంగా వినొచ్చు. దీని నిర్మాణ సమయంలోనే ఈ వింతను గుర్తించారు. పనులు చేస్తున్న సమయంలో కొంతమంది కార్మికులు తమ బాస్ గురించి  చెడుగా మాట్లాడుకున్నారు. గోడకు ఈ చివర ఉన్న బాస్‌కు వారి మాటలన్నీ స్పష్టంగా వినిపించాయ్. సీన్ కట్ చేస్తే, ఆ కార్మికుల ఉద్యోగాలు ఊడిపోయాయ్.. అరుదైన లక్షణంతో ఈ గోడ చరిత్రలో నిలిచిపోయింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement