ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అడిలైడ్ నగరంలోని ఎల్డర్ పార్క్ లో ఉన్న ఆడిలైడ్ ఫెస్టివల్ సెంటర్లో ఈ వేడుకల్ని జరిపారు. సౌత్ ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్‌లో తొలిసారి నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 500 మంది పాల్గొన్నారు. వీరిలో పలువురు ఆస్ట్రేలియన్లు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ వేడుకల్లో పాల్గొన్న ఆస్ట్రేలియాలోని స్థానిక ప్రజలు తెలంగాణ సంప్రదాయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకుని మరీ ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఎల్డర్ పార్క్‌లో ఈ వేడుకల్ని నిర్వహించిన తర్వాత టోరెన్స్ నదిలో వీడ్కోలు పలికారు. ఈ వేడుకల్లో టోరెన్స్ ఎంపీ వొర్టీ, సాంస్కృతిక శాఖా మంత్రి జోబెట్టిసన్ హాజరయ్యారు. ఎల్డర్ పార్కులో ఈ వేడుకల్ని తెలంగాణ సంప్రదాయబద్ధంగా నిర్వహించి టోరెన్స్ నదిలో సాగనంపారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా టోరెన్స్ ఎంపీ డానా వొర్ట్లీ, సాంస్కృతిక శాఖ మంత్రి జో బెట్టిసన్ హాజరయ్యారు.
అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షురాలు హరితారెడ్డి బతుకమ్మ వేడుకల ప్రాముఖ్యతను వివరించారు. వైస్ ప్రెసిడెంట్ మమతా దేవా, ట్రెజరర్ ప్రత్యూష, సెక్రటరీ నిక్కిల్ మరియు కమిటీ సభ్యులు సౌజన్య, సృజనా రెడ్డి, అనిల్, ప్రశాంత్ రెడ్డి, చరిత్ రెడ్డిలు ఈ బతుకమ్మ సంబరాల్ని సక్సెస్‌గా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారు.
శివగర్జన టీమ్‌లోని వాలంటీర్లైన స్టీఫెన్ వాట్స్, శ్రీనివాస్ వడ్లకొండ, సంజయ్ మెంగర్, తదితర వాలంటీర్లు ఈ వేడుక విజయవంతంగా జరగడానికి కృషి చేశారు. ఈ బతుకమ్మ సంబరాల్లో చాలా మంది భారతీయులు కూడా పాల్గొని సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment