
సిడ్నీ: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ (మహిళల డివిజన్) మ్యాచ్‌లో అనూహ్య రికార్డు నమోదైంది. న్యూసౌత్‌వేల్స్‌తో జరిగిన ‘నేషనల్ ఇండిజినస్ క్రికెట్ చాంపియన్‌షిప్’ పోరులో సౌత్ ఆస్ట్రేలియా జట్టు 10 పరుగులకే కుప్పకూలింది! ఇందులో ఓపెనర్ మాన్సెల్ (33 బంతుల్లో 4) మాత్రమే పరుగులు చేయగలిగింది. మిగతా పది మంది ‘సున్నా’కే పరిమితమయ్యారు. ఎక్స్‌ట్రాలుగా వచ్చిన 6 పరుగులే జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్ కావడం విశేషం. ప్రత్యర్థి బౌలర్లు ‘వైడ్’ల ద్వారా ఈ అదనపు పరుగులు ఇచ్చారు. టీమ్ ఇన్నింగ్స్ 10.2 ఓవర్ల వరకు సాగగలిగింది. న్యూ సౌత్‌వేల్స్ బౌలర్ రాక్సెన్ వాన్ వీన్ 2 ఓవర్లలో 1 పరుగిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం న్యూసౌత్‌వేల్స్ 2.5 ఓవర్లలో 2 వికెట్లకు 11 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment