Viral: Man Buys Lottery Ticket To Please Angry Wife, Ends Up Winning Rs 16 Crore - Sakshi
Sakshi News home page

అదృష్టం వరించింది..కోపంలోని భార్యను సంతోష పెట్టడానికి లాటరీ కొంటే.. ఏకంగా 16 కోట్ల జాక్‌పాట్‌!

Published Wed, Mar 15 2023 1:29 PM | Last Updated on Wed, Mar 15 2023 2:02 PM

Viral: Man Buys Lottery Ticket To Please Wife Winning Rs 16 Crore - Sakshi

రాత్రికిరాత్రే కోటీశ్వరులు అయిపోతే ఎలా ఉంటుంది? లక్ష్మీ దేవి కరుణించి ఒక్కసారిగా కాసుల వర్షం కురిపిస్తే.. అబ్బా ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా.. మరి అదే నిజమైతే మన ఆనందానికి అవధులుంటాయా?. లాటరీ వ్యక్తి జీవితాన్నే మార్చేస్తే?. సాధారణ వ్యక్తిని ఒక్కసారిగా కోటీశ్వరులను చేస్తే.. ఈ ప్రపంచలంలో మనకంటే అదృష్ట వంతులు ఎవరూ ఉండరని తెగ సంబరపడిపోతుంటాం. తాజాగా ఇలాంటి ఊహించనే ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.  

న్యూ సౌత్‌ వేల్స్‌కు చెందిన జంట గత మూపై ఏళ్లుగా ఒకే నెంబర్‌పై లాటరీ టికెట్‌ కొంటూ వస్తోంది. తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రతిసారీ వారికి నిరాశే ఎదురైతుంది. అయితే ఇటీవల భార్యను సంతోషపెట్టేందుకు అతడు ఆమె పేరు మీద టికెట్‌ కొనుగోలు చేశాడు. లక్ష్మీ దేవి కరుణించడంతో ఒకేసారి రెండు టికెట్లు గెలిచి ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయిపోయారు. ఈ ఘటన మార్చి 13న చోటుచేసుకుంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఆ జంట దాదాపు 16 కోట్ల 48 క్షలు గెలుచుకున్నారు. 

తనకు రెండు లాటరీ టికెట్లు ఎలా వచ్చాయో చెబుతూ సదరు వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు.. ‘గత మూప్పై ఏళ్లుగా లాటరీ టెకెట్‌ కొనుగోలు చేస్తున్నాం. గత వారం నా భర్య నెంబర్‌పై లాటరీ తీసుకోవడం మర్చిపోయారు. నేను చేసిన పనికి తను బాధగా ఫీల్‌ అయ్యింది. కోపంలో ఉన్న ఆమె ముఖం మీద చిరునవ్వు చూసేందుకు ఈ వారం తన పేరు మీదే రెండు లాటరీలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.

సోమవారం ఉదయం నెంబర్‌ పరీక్షించగా మొదటి టికెట్‌పై మిలియన్‌ డాలర్లు(రూ. 8 కోట్లు)గెలుచుకున్నట్లు తెలిసింది. అప్పడే నేను తనకు రెండో టికెట్‌ కూడా తసుకున్నానని చెప్పాలనుకున్నా. వెంటనే రెండో టికెట్‌ కూడా విన్‌ అయినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నాభార్యకు చెబితో ఉనందంతో ఎగిరి గంతేసింది.

కాగా తన చాలా కాలంగా ఒకే నెంబర్‌ కాంబినేషన్‌ టికెట్‌ కొనుగోలు చేస్తోందని.. ఏదో ఒక రోజు గెలుస్తుందని  ఊహించినట్లు చెప్పాడు. అయితే తన నమ్మకం నిజం కావడానికి చాలా కాలమే పట్టిందని.. ఇది ఖచ్చితంగా విలువైనదని ఉద్వేగానికి లోనయ్యారు. ఈ విజయాన్ని తమ కుటుంబ సభ్యులతో పంచుకోనున్నట్లు తెలిపారు. కూతురికి కొత్త ఇల్లు కొనిచ్చి.. తన పిల్లలు, మనవళ్ల భవిష్యత్తు కోసం ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక దేశమంతా చుట్టి రావాలన్న ఆలోచన కూడా ఉందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement