నూకలవాడలో హైడ్రామా!
Published Mon, Apr 7 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM
బలిజిపేట రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని నూకలవాడ పోలింగ్ కేంద్రంలో హై డ్రామా నెలకొంది. ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చినా.. పోలింగ్ సిబ్బంది వైఎస్సార్ సీపీ ఏజెంట్లను కేంద్రంలోకి అనుమతించలేదు.దీంతో పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పలగర ప్రాదేశికంలో ఉన్న నూకలవాడలో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని వైఎస్సార్ సీపీ నాయకులు ముందుగానే అధికారులకు విన్నవించారు. దీనిపై స్పందించిన అధికారులు కేంద్రంలో సిసి కెమేరాలు, వీడియోలు అమర్చి, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ గ్రామంలో 38, 39 పీఎస్‌లు ఉన్నాయి. 1488 మంది ఓటర్లు ఉం డగా 1229 ఓట్లు పోలయ్యాయి. అయితే ఏజెంట్లు, జనరల్ ఏజెంట్ నియామకంలో పార్టీ అభ్యర్థులు మొదటే పలగర ప్రాదేశికం నుంచి ఏజెంట్లను తీసుకువచ్చేందుకు అధికారుల అనుమతి కోరారు. అందుకు అధికారులు కూడా అంగీ కరించడంతో పార్టీ నాయకులు పలగర నుంచి ఏజెంట్లను నియమించారు.
అయితే పోలింగ్ సమయంలో పలగర గ్రామానికి చెందిన ఏజెంట్లు పనికిరారని ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ..పోలింగ్ సిబ్బంది వారిని రెండు కేంద్రాల నుంచి బయ టకు పంపించివేశారు. దీంతో ఏజెంట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు పోలింగ్ సిబ్బంది తిరిగి ఏజెంట్లను కేంద్రాల్లోకి అనుమతించారు. మళ్లీ కొంత సమయం తరువాత వారిని బయటకు పంపించివేశారు. దీనిపై కేంద్రాలను పరిశీలించడానికి వచ్చిన ఉన్నతాధికారులను ఏజెంట్లు ప్రశ్నించగా.. వారు ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయూరు. కాగా ఈ విషయమై వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీకాంత్, సత్యనారాయణరాజు,ఎస్. సత్యంనాయుడు మాట్లాడుతూ వైఎస్సా ర్ సీపీ ఏజెంట్లు, జనరల్ ఏజెంట్‌ను పోలింగ్ సిబ్బంది బయటకు పంపిం చి, రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు. దీనిపై ఆర్‌ఓ వేణుగో పాలనాయుడును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా మైక్రో అబ్జర్వర్ల సమాచారం మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement