
హైడ్రామాకు తెర
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మావోయిస్టు దారగోని శ్రీనివాస్ అలియాస్ విక్రమ్ లొంగుబాటు హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. విక్రమ్ లొంగిపోయినట్లు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. అయితే లొంగుబాటు సందర్భంగా విక్రమ్ వెల్లడించిన విషయాలు, పోలీసులకు చెబుతున్న వాటికి పొంతన కుదరడం లేదు. మూడు రోజుల క్రితమే లొంగిపోయినట్లు విక్రమ్ చెబుతున్నా పోలీసులు మాత్రం బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు తమ వద్దకు వచ్చాడని చెబుతున్నారు.
గతనెల 19న ప్రకాశం జిల్లా మురారికురువ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ము గ్గురు మావోయిస్టులు మృతిచెంది నట్లు పోలీసులు ప్రకటించారు. అయి తే ఈ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న విక్రమ్‌ను మాజీ మావోయిస్టుగా పోలీసులు పేర్కొంటున్నారు. జానా బాబూరావు, అతని అనుచరు లు పార్టీతో సంబంధం లేకుండా ఆ యుధాలతో సంచరించినా వారికి మా వోయిస్టులతో సంబంధాలు తెగినందున మాజీలుగా భావిస్తున్నామని ఎస్పీ ప్రకటించడం గమనార్హం. ఎన్‌కౌంటర్ ఘటన జరిగిన నాటి నుంచే విక్రమ్ పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం జరిగినా అధికారులు తోసిపుచ్చుతూ వచ్చారు. కాగా, మూడురోజుల క్రితమే పోలీసుల ఎదుట విక్రమ్ లొంగిపోయినా నాటకీయ పరిణామా ల మధ్య బుధవారం మీడియాకు చూ పారు.
మావోయిస్టులు తనను కోవర్టుగా భావిస్తున్నందునే లొంగిపోయేం దుకు విక్రమ్ నిర్ణయించుకున్నాడని పోలీసులు పేర్కొంటున్నారు. మరోవైపు విక్రమ్ వద్ద 12 బోర్ తపంచాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించగా తనపై అక్రమంగా మరోకేసు నమోదు చేశారని మీడియా ఎదు ట నిందితుడు గోడు వెల్లబోసుకున్నా డు. లొంగిపోతే ఎలాంటి కేసులు ఉం డవనే పోలీసుల హామీతో వచ్చిన తన పై మళ్లీ కేసులు నమోదు చేయడంపై విక్రమ్ మీడియా సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
ఇదీ విక్రమ్ నేపథ్యం
అమ్రాబాద్ మండలం బీకే తిర్మలాపూర్‌కు చెందిన దారగోని శ్రీనివాస్ అలి యాస్ విక్రమ్ 2004లో మావోయిస్టు కార్యకలాపాలకు ఆకర్షితుడై అప్పటి జిల్లా కమిటీ కార్యదర్శి సాంబశివుడు, జిల్లా కమిటీ సభ్యుడు రమాకాంత్ ప్రభావంతో పార్టీలో చేరాడు. ఆమనగల్లు ఎంపీపీ ఆర్.పంతునాయక్ హత్యకేసులో నిందితుడిగా ఉన్న విక్రమ్‌ను 2008 జనవరి 4న వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఏకే 47 ఆయుధాన్ని స్వాధీనపర్చుకున్నారు. ఈ ఆయుధాన్ని మహబూబ్‌నగర్‌లోని ఎనిమి దో అదనపు కోర్టులో డిపాజిట్ చేశారు. ఏడో అదనపు కోర్టులో విచారణకు హాజరవుతున్న క్రమంలో 2013 జూన్ 19న కోర్టు ఆవరణ నుంచి ఏకే 47 ఆయుధంతో విక్రమ్ పరారయ్యాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నంబయ్య, శ్రీనివాస్‌ను పోలీ సులు అరెస్టు చేయగా, అతడు మా త్రం అజ్ఞాతంలోకి వెళ్లాడు. నల్లమల అటవీ ప్రాంతంలో తన సహచరులు జానా బాబూరావు, నాగమణి అలియాస్ భారతి, కల్పనతో కలిసి జట్టుగా ఏర్పడి గుంటూరు, ప్రకాశం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో కార్యకలాపాలు కొనసాగించేవారు.
ఈ క్రమంలో గతనెల 19న సరుకులు తెచ్చేందుకు విక్రమ్ సమీప గ్రామానికి వెళ్లిన సమయంలో జానా బాబూరావు బృందానికి, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బాబూరావుతో పాటు మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణిం చారు. ఎన్‌కౌంటర్ వార్తను తెలుసుకున్న విక్రమ్ బంధువుల సహకారంతో ఆత్మకూరు సీఐ కిషన్, కానిస్టేబుల్ వెంకటేశ్ బృందం ఎదుట లొంగిపోయాడు. విక్రమ్ వద్ద నుంచి తపంచాను స్వాధీనం చేసుకున్నారు.