
‘అజ్ఞాతం’పై ఆరా!
జిల్లా నుంచి ఏడుగురు మావోయిస్టుల
ప్రభావిత ప్రాంతాల్లో పోస్టర్ల పంపిణీ
విక్రమ్ కోసం నల్లమలలో గాలింపు
ప్రకాశం జిల్లా కురువ ఎన్‌కౌంటర్‌తో జిల్లాకు చెందిన అజ్ఞాత మావోయిస్టుల పాత్ర మరోమారు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం జిల్లాకు చెందిన ఏడుగురు మావోయిస్టు పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు పోలీసు యంత్రాంగం గుర్తించింది. మావోయిస్టులు లొంగిపోయేలా వారి కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు పోస్టర్లు ముద్రించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పంపిణీచేస్తోంది.
మహబూబ్‌నగర్: యర్రగొం డపాలెం నల్లమల అటవీ ప్రాంతంలో ఈనె ల 19న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తె లిసిందే. మృతుల్లో ఒకరు అమ్రాబాద్ మం డలం మాధవానిపల్లెకు చెందిన నాగమణి. బీకే తిర్మలాపూర్‌కు చెందిన విక్రమ్ ఎన్‌కౌం టర్ నుంచి త ప్పించుకున్నట్లు పోలీసువరా ్గలు చెబుతున్నాయి. ఒకే ఘటనలో జిల్లాకు చెందిన ఇద్దరు మావోయిస్టుల పేర్లు తెరపైకి రావడంతో అజ్ఞాతంలో కొనసాగుతున్న మి గతా వారిపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లాకు చెందిన అజ్ఞాత మావోయిస్టుల జా బితాలో ఉన్న పాన్‌గల్ మండలం గోప్లాపూర్‌కు చెందిన గొల్ల రాములు ఒడిశా లో జరి గిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. తాజాగా మాధవానిపల్లికి చెందిన నాగమణి కూడా ఎ న్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయింది. వీరి ని మినహాయిస్తే జిల్లా నుంచి మరో ఏడుగు రు అజ్ఞాతంలో ఉన్నట్లు పో లీసులు గుర్తించి జాబితా సిద్ధంచేశారు. మావోయిస్టు ప్రభావి త ప్రాంతాల్లో అజ్ఞాత మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టర్లను విస్తృతంగా పంపిణీ చేసేందుకు పోలీసు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
జిల్లా మావోయిస్టులు వీరే..
ఆమనగల్లు మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి నిరంజన్ 1996 నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ఏఓబీలో రాష్ట్ర యాక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం.గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన పోతుల కల్పన, పెద్దకొత్తపల్లి దేవునితిర్మలాపూర్‌కు నార్ల శ్రీవిద్య సెంట్రల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. శ్రీవిద్య సోదరుడు రవివర్మను గతంలో పోలీసులు అరెస్టు చేశారు.
కల్వకుర్తి మండలం ఎల్లికల్‌కు చెందిన బొడ్డుపల్లి పద్మ, అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్‌కు చెందిన బొంత పార్వతమ్మ ఏఓబీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. జననాట్య మండలిలో క్రియాశీలంగా పనిచేసిన విశ్వనాథ్ కూడా ఏఓబీ కమిటీలో పనిచేస్తున్నట్లు సమాచారం.గద్వాల పట్టణానికి చెందిన సక్కుబాయి మావోయిస్టు అగ్రనేత లక్ష్మణరావు అలియాస్ గణపతి భార్యగా పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ముమ్మరంగా తనిఖీలు
యర్రగొండపాలెం ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న దారగోని శ్రీనివాస్ అలియాస్ విక్రమ్ కోసం నల్లమల అటవీప్రాంతంలో ముమ్మరంగా గాలింపు జరుపుతున్నట్లు ఎస్పీ డి.నాగేంద్రకుమార్ వెల్లడించారు. ‘స్పెషల్ పార్టీ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపుప్రక్రియలో పాల్గొంటున్నారు. నల్లమలకు సరిహద్దుగా ఉన్న గ్రామాలు, పట్టణాల్లో వైద్యులు, ఆస్పత్రులు, మెడికల్ షాపు నిర్వాహకులను అప్రమత్తం చేశాం. విక్రమ్ బంధువులను కూడా విచారించాం.’ అని జిల్లా ఎస్పీ వెల్లడించారు.