విజయవాడ స్వర్ణబార్ మరణాల వెనుక సైనేడ్ ఉందని రుజువయింది. విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణుకు చెందిన ఈ బార్‌లో మద్యం తాగి గత ఏడాది డిసెంబర్‌లో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. 30 మద్యం శాంపిళ్లకుగాను 20 శాంపిళ్లలో సైనేడ్ కలిసిందని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. మద్యంలో కల్తీలేదని, నీటిలో ఎవరో సైనేడ్ కలిపారని తెలిపింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా మరేదన్నా ఉందా అనేది తేలాల్సి ఉంది.