
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. డిస్మిస్ కానిస్టేబుల్ ప్రకాష్ పెట్టిన అట్రాసిటీ కేసు ఫాల్స్‌గా నిర్థారణ అయ్యింది. ఎస్పీపై నమోదైన ఎఫ్ఐఆర్‌పై అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ సమగ్ర విచారణ చేశారు.
చదవండి: 15 మంది బాయ్‌ఫ్రెండ్స్.. భర్త హత్య కేసులో భార్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..
పోలీసు నియమావళిని ఉల్లంఘించినందునే కానిస్టేబుల్ ప్రకాష్‌ను ఎస్పీ డిస్మిస్ చేశారని ఆయన వెల్లడించారు. 11 క్రిమినల్ కేసులు నమోదైనందునే ప్రకాష్‌ను ఎస్పీ డిస్మిస్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. దురుద్దేశంతో ఎస్పీ ఫకీరప్ఫపై డిస్మిస్ కానిస్టేబుల్ కేసు పెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో అనంతపురం టూటౌన్‌లో నమోదైన ఈ కేసును కొట్టివేశారు.
Comments
Please login to add a commentAdd a comment