False case
-
తప్పుడు కేసుపై డీజీపీకి పేర్ని నాని ఫిర్యాదు
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమోదు అయిన విషయాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) డీజీపీకి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు చేస్తూ డీజీపీ(AP DGP) హరీష్ కుమార్ గుప్తాకు ఓ లేఖ రాశారు. గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న గుంటూరు మిర్చి రైతులను బుధవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన జగన్, మరికొందరు వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ నల్లపాడు పీఎస్‌లో టీడీపీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ సహా వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది.అయితే ఆ పర్యటనలో పాల్గొనని పేర్ని నాని(Perni Nani)పై కూడా కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు. ఈ పర్యటనలో పాల్గొనకున్నా తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు తనపై ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారాయన. ప్రజాక్షేత్రంలో ఉన్న తనపై ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం.. అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారాయన. ఈ అంశంపై విచారణ జరిపి తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లపై, అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారాయన. ఇదీ చదవండి: సభ పెట్టలేదు.. మైక్ ముట్టలేదు.. ఇదేమీ దుర్మార్గం -
నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఏ తప్పు చేయలేదు: పేర్ని నాని
గుంటూరు, సాక్షి: రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన. అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు. నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్‌ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్‌కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.. .. సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
మేరుగుపై తప్పుడు కేసు.. నిజం ఒప్పుకున్న మహిళ
సాక్షి, విజయవాడ: తనపైన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి మేరుగు నాగార్జున దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.విచారణ సందర్భంగా తనకు, మేరుగు నాగార్జునకి ఎటువంటి సంబంధం లేదంటూ ఆ మహిళ ప్రమాణ పత్రం దాఖలు చేసింది. తనను కొంతమంది భయపెట్టడం వల్లే మేరుగ నాగార్జునపైన తప్పుడు కేసు పెట్టానని పద్మావతి స్పష్టం చేసింది. తనపై ఆయన ఎలాంటి దాడి చేయలేదని ఆమె పేర్కొంది.‘‘తాను ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. కొంతమంది రాజకీయం కోసం నన్ను పావుగా వాడుకున్నారు. కొన్ని ఒత్తిళ్లు, అయోమయానికి గురై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సి వచ్చింది. మూడు రోజుల క్రితమే ఈ విషయాన్ని తాడేపల్లి పోలీసులు కూడా తెలిపానని ప్రమాణపత్రంలో పద్మావతి తెలిపింది. -
అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ మరో కేసు
న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన బీజేపీ అగ్రనాయకులను తప్పుడు కేసులో ఇరికించేందకు కుట్ర పన్నారనే అభియోగాలతో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (ఎన్సీపీ– ఎస్పీ)పై సీబీఐ బుధవారం తాజాగా కేసు నమోదు చేసింది. 2020లో ఈ కుట్ర జరిగిందని తెలిపింది. 2020లో ప్రతిపక్షంలో ఉన్నపుడు దేవేంద్ర ఫడ్నవీస్ అప్పటి స్పీకర్‌కు ఒక పెన్‌డ్రైవ్‌ను అందజేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవీణ్ పండిత్ చవాన్.. అనిల్ దేశ్‌ముఖ్, ఇతరులతో కలిసి బీజేపీ నాయకుడు గిరీష్ మహజన్ (ప్రస్తుతం మంత్రి)ని ఇరికించడానికి ప్రయతి్నంచినట్లుగా పెన్డ్రైవ్లోని వీడియోల్లో ఉన్నట్లు సీబీఐ చెబుతోంది. పండిత్ చవాన్ ప్రముఖ బీజేపీ నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పలు కుట్రలకు తెరతీసినట్లు ఈ వీడియోల్లో స్పష్టం ఉందని ప్రాథమిక విచారణలో గిరీష్ మహజన్‌తో సహా నలుగురు ఎమ్మెల్యేలు.. సీబీఐకి తెలిపారు. ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం. సాక్షులను చిత్రహింసలు పెట్టడం, నగదు చెల్లింపులు, దర్యాప్తు అధికారులకు సూచనలు ఇవ్వడం.. ఇలా పక్కా పథకరచన చేశాడని ఆరోపించారు. డీసీపీ పూరి్ణమ గైక్వాడ్, ఏసీపీ సుష్మా చవాన్లతో కలిసి సాక్షుల వాంగ్మూలను, ఆధారాలను మార్చేశాడని పేర్కొన్నారు. తాజా ఎఫ్ఐఆర్లో సీబీఐ అనిల్ దేశ్ముఖ్తో పాటు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవీణ్ పండిత్ చవాన్, పూర్ణిమ, సుష్మ, న్యాయవాది విజయ్ పాటిల్‌లను నిందితులుగా పేర్కొంది. అవినీతి ఆరోపణలపై అనిల్ దేశ్‌ముఖ్ ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఈడీ కేసు కూడా నమోదైంది. ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్ బెంబేలెత్తిపోయి తనపై నిరాధార కేసును నమోదు చేయించారని అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును చూసి.. కాళ్ల కింద నేల కదులుతోందని గ్రహించి ఫడ్నవీస్ ఇలాంటి కుట్రలకు దిగారని ఆరోపించారు. -
బాబు మెయిన్ టార్గెట్ ఇదే.. షర్మిలకు నా సూటి ప్రశ్న..
-
‘సాక్షి’ రాసింది.. ఏసీబీ కదిలింది!
సాక్షి, హైదరాబాద్: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చర్యలకు ఉపక్రమించారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు. మామూలు పెంచి ‘ఎరియర్స్’ ఇమ్మని... బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్‌కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌తో పాటు మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్ తన పరిధిలో ఉన్న పబ్స్ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు. అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్ పబ్‌ను లక్ష్మణ్ రావు, శివలాల్ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్ కాల్స్ చేయించాడు. హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... పబ్ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్‌రెడ్డికి రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు, అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సదరు పబ్ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్‌లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్‌లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది. ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్ జోలికి రావద్దని ఇన్స్పెక్టర్ నరేందర్‌కు, నరేందర్‌ను వదిలేయని పబ్ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్‌ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్ ఫైల్8 దుమ్ము దులిపించారు. ఓసారి షుగర్ డౌన్... మరోసారి ఛాతి నొప్పి... ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ నరేందర్ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు. సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ వెళ్ళడానికి నరేందర్ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్.. ‘ఇన్స్పెక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు నవీన్‌రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్ రావును అనవసరంగా పబ్ బయటకు పిలిచారు. రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. డిస్మిస్ కానిస్టేబుల్ ప్రకాష్ పెట్టిన అట్రాసిటీ కేసు ఫాల్స్‌గా నిర్థారణ అయ్యింది. ఎస్పీపై నమోదైన ఎఫ్ఐఆర్పై అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ సమగ్ర విచారణ చేశారు. చదవండి: 15 మంది బాయ్‌ఫ్రెండ్స్.. భర్త హత్య కేసులో భార్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. పోలీసు నియమావళిని ఉల్లంఘించినందునే కానిస్టేబుల్ ప్రకాష్‌ను ఎస్పీ డిస్మిస్ చేశారని ఆయన వెల్లడించారు. 11 క్రిమినల్ కేసులు నమోదైనందునే ప్రకాష్‌ను ఎస్పీ డిస్మిస్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. దురుద్దేశంతో ఎస్పీ ఫకీరప్ఫపై డిస్మిస్ కానిస్టేబుల్ కేసు పెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో అనంతపురం టూటౌన్లో నమోదైన ఈ కేసును కొట్టివేశారు. -
ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్‌లా..
న్యూఢిల్లీ: పోలీసులే క్రిమనల్స్‌లా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఇద్దరు డిల్లీ పోలీసులు సేల్స్ ట్యాక్స్ ఏజెంట్‌ని శనివారం షహదారాలోని జీటీబీ ఎనక్లేవ్ వద్ద కిడ్నాప్ చేసి తప్పుడు కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడు తన కుటుంబంతో జీటీబీ ఎనక్లేవ్ వద్ద నివశిస్తున్నాడు. అతడు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెట్‌లో సేల్స్ ట్యాక్స్ ఏజేంట్‌గా పనిచేస్తున్నడు. అక్టోబర్ 11న రాత్రి అతను తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా... షహదారాలోని ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక తెల్లటి రంగులోని కారు తన కారుని ఓవర్‌టెక్ చేసుకుని ముందుకు వచ్చి ఆగింది. ఆ కారులోంచి ముగ్గురు వ్యక్తులు దిగి సదరు ట్యాక్స్ ఏజెంట్‌ని చితకబాది, బలవంతంగా అతని కారులోని వెనుకసీటులో కూర్చొబెట్టారు. బాధితుడితో ఆ వ్యక్తులు తాము క్రైం బ్రాంచ్‌కి చెందిన వ్యక్తులమని చెప్పారు. ఒక వ్యక్తి తుపాకిని గుండెకి గురిపెట్టి బాధితుడి జేబులో ఉన్న రూ. 35 వేలు తీసుకున్నాడు. మరో వ్యక్తి సుమారు రూ. 5 లక్షలు ఇస్తే వదిలేస్తామని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లోపెడతామంటూ బెదిరించారు. ఆ తర్వాత అతనిని షహదారాలోని స్పెషల్ స్టాఫ్ ఆఫీస్‌కి తీసుకువెళ్లారు. నిందితులు అక్కడ ఒక ఆఫీసర్‌తో మాట్లాడి తదనంతరం అతడిని మళ్లీ కారు వెనుక కూర్చొబెట్టి బాధితుడి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ నిందితులు అతడ వద్ద నుంచి సుమారు రూ. 50 వేలు తీసుకున్నారని, పైగా అతను తన స్నేహితుడి నుంచి దాదాపు రూ. 70 వేలు అప్పుగా తీసుకుని నిందితుడు గౌరవ్ అలియాస్ అన్నా భార్య అకౌంట్‌కి ట్రాన్సఫర్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత తనను విడుదల చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు బాధితుడు పిర్యాదు మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంతేగాదు విచారణలో... ఢిల్లీలోని సీమపురీ పోలీస్‌స్టేషన్‌కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు సందీప్, రాబిన్ తోపాటు మరోవ్యక్తి వహీద్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అలాగే ఈ కేసుకి సంబంధించి మరో ఇద్దరు నిందితులు ఢిల్లీ పోలీసు అమిత్, సీమపురికి చెందిన గౌరవ్ అలియాస్ అన్నా అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఐతే విచారణలో.. కానిస్టేబుల్ అమిత్ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. నిందితుడు వహిద్ కారుని ఉపయోగించి ఈ నేరానికి పాల్పడినట్లు చెప్పారు. గౌరవ్ కూడా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఓ సబ్ఇన్స్పెక్టర్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బాధితుడి నుంచి సుమారు రూ.1.5 లక్షలు తీసుకున్నట్లు తేలింది. (చదవండి: ఇదేం విడ్డూరం...పెంపుడు కుక్కే యజమానులపై ఘోరంగా దాడి...) -
పీకలదాక మెక్కారు.. బిల్లు కట్టమంటే తప్పుడు కేసులు
లక్నో: కొన్ని పాత సినిమాల్లో పోలీసులు హోటల్‌కు వెళ్లడం.. బాగా తినడం.. బిల్లు కట్టమంటే.. ‘నా దగ్గరే డబ్బులడుగుతావా.. జైలుకెళ్తావా ఏంటి’ అంటూ బెదిరించే సీన్లు చాలా సార్లు చూశాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. బిల్లు కట్టమని అడిగిన పాపానికి ఓ ధాబా ఓనర్, అతడి కుటుంబ సభ్యుల మీద డ్రగ్స్, మద్యం అక్రమ రవాణ చేస్తున్నారంటూ కేసులు పెట్టారు పోలీసులు. విషయం కాస్త పెద్దది కావడంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేశారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ ఈటా జిల్లాలో బాధితుడు ఓ ధాబా నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 4న మధ్యాహ్నం ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ బాధితుడి ధాబాకు వచ్చి భోజనం చేశారు. 400 రూపాయల బిల్లు అయితే వారు కేవలం 100 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం.. పూర్తి బిల్లు చెల్లించమని కోరితే.. ధాబా సిబ్బందిని తిడుతూ.. మీ అంతు చూస్తాం అని బెదిరించారు. ఈ ఘటన జరిగిన 40 రోజుల తర్వాత పోలీసులు రెండు జీపుల్లో ఆ ధాబా వద్దకు వచ్చి.. అక్కడ పని చేస్తున్న 9 మందిని జైలుకు తీసుకెళ్లారు. వీరంతా మద్యం, గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని.. అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు. అంతేకాక నిందితుల వద్ద నుంచి ఆరు దేశీ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. (ఫోటో కర్టెసీ: ఎన్డీటీవీ) ఈ క్రమంలో సదరు ధాబా ఓనర్ మాట్లాడుతూ.. ‘‘గతంలో బిల్లు కట్టమని అడిగినందుకు అధికారులు మాపై కక్ష్య కట్టారు. కావాలనే మా మీద అక్రమ కేసులు పెట్టారు. తాగి వచ్చి నా సోదరుడు, సిబ్బందిపై దాడి చేశారు. మా దగ్గర తుపాకులు, గంజాయి దొరికిందని ప్రచారం చేస్తున్నారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ఒక్కరిని విడిచిపెట్టారు’’ అని తెలిపారు. ఈ వివాదం కాస్త ముదరడంతో జిల్లా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ని సస్పెండ్ చేశారు. విచారణకు ఆదేశించాము అని తెలిపారు. చదవండి: సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో -
నకిలీ బాబాకు దేహశుద్ధి
మనూరు(నారాయణఖేడ్): గ్రామాల్లోని ప్రజల ముఢనమ్మకాలను ఆసరా చేసుకుని అమాయక జనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ బాబాకు స్థానిక బోరంచ గ్రామస్తులు దేహశుద్ధి చేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. గత ఆదివారం బోరంచలో గ్రామంలో ఓ యువకుడు ఫకీరు వేషధారణలో గ్రామంలో పర్యటిస్తూ మీ ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని నిమ్మకాయలు, నీళ్లు చల్లుతూ తిరుగుతూ గ్రామానికి చెందిన రజాక్ ఇంటికి వెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తానని వారిని నమ్మబలికి వారి నుంచి రూ.5 వేలు నగదుతోపాటు ఒక సెల్‌ఫోను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించి గ్రామం చివరికి వచ్చి వేషం మార్చుకుని వెళ్లిపోయాడు. కాగా మళ్లి బోరంచ గ్రామం పక్కనే ఉన్న దుదగొండ గ్రామంలో సోమవారం ప్రత్యక్షమయ్యాడు. అక్కడ కూడా గ్రామస్తులకు నమ్మబలికే ప్రయత్నం చెయ్యగా ఈ విషయం ముందే తెలుసుకున్న గ్రామస్తులు సదురు వ్యక్తిని బంధించి బోరంచ గ్రామస్తులకు అప్పగించారు. దీంతో వారు నకిలీ బాబాను చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా యువకుడు కర్ణాటకలోని గుల్బర్గకు చెందిన మనోజ్‌గా గుర్తించడం జరిగిందన్నారు. మారు వేషాలువేస్తూ అమాయక జనం ముఢనమ్మకాలను ఆసరా చేసుకుని బురిడి బాబాగా తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా సంబంధిత యువకుడిని మనూరు పోలీసులకు అప్పగించారు. -
పోలీసులా.. మజాకా...!
– 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు – కోర్టు ప్రశ్నలతో పోలీసుల ఉక్కిరి బిక్కిరి – సమగ్ర విచారణకు ఆదేశం చెన్నై: పోలీసులు తలచుకుంటే తప్పు చేయని వాడి మీద కూడా కేసుల మోతతో ఊచలు లెక్కించేలా చేస్తారన్న నానుడికి అద్దంపట్టే రీతిలో ఇటీవల ఓ వృద్ధుడి మీద కేసు నమోదైంది. 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు పెట్టడం కోర్టును సైతం విస్మయంలో పడేసినట్టుంది. కోర్టు ప్రశ్నలతో చెన్నై పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. సమగ్ర విచారణకు ఆదేశిస్తూ, ఆ వృద్ధుడికి నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు అయింది. ఆర్కేనగర్ – మణలి రోడ్డులో ఉన్న ఎలిల్ నగర్‌కు చెందిన వేదక్కన్ నాడార్ (74)పై గత నెల పోలీసులు ఓ కేసు పెట్టారు. రెండు కేజీల వంద గ్రామాలు గంజాయిని తన ఇంటి బీరువాలో దాచి ఉంచిన అభియోగంపై ఆర్కేనగర్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆగమేఘాలపై కోర్టుకు హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టారు. కోర్టు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి : పిటిషనర్ తరపున న్యాయవాది ఆర్ రాజన్ హాజరై వాదన వినిపించారు. రూ 1000 కోట్ల విలువచేసే 250 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు సాగాయని, సాగుతున్నాయని, ఇందుకు అడ్డుగా ఉన్న వేదక్కన్ నాడార్‌ను గురిపెట్టి ఈ తప్పుడు కేసు బనాయించారని వాదించారు. పోలీసులు కాలయాపణ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేయడం లేదని బెంచ్ దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. 74 వృద్ధుడి మీద ఈ కేసు నమోదు కావడం బట్టి చూస్తే, తప్పుడు కేసు బనాయించారా..? మరేదైనా కారణాలు ఉన్నాయా..? ఉంటే, సమగ్ర విచారణకు సాగించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసును ప్రత్యేక అధికారి ద్వారా విచారించేందుకు తగ్గ చర్యలు చేపట్టాలని చెన్నై పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. అలాగే, వేదక్కన్ నాడార్కు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. -
తప్పులేకున్నా తప్పుడు కేసు పెట్టింది
లీగల్ కౌన్సెలింగ్ నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాను. నా పెళ్లయి ఆరునెలలైంది. పెద్దలు కుదిర్చిన వివాహమే మాది. నా భార్య బాగా చదువుకున్న వ్యక్తి. తను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. మొదటినుండి ఆమె నా పట్ల ఆసక్తి చూపించలేదు. కొత్త కదా కొంత టైమ్ పడుతుందిలే అని ఊరుకున్నాను. నేను ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్ వెళ్లేవాడిని. తను కనీసం నవ్వుతూ కూడా రిసీవ్ చేసుకునేది కాదు. మా సంసార జీవితం మొదలవలేదు. నేను మాత్రం తనతో ఎంతో ఫ్రెండ్లీగా వ్యవహరించేవాడిని. అయినా మాటామంతీ లేకపోవడంతో ఐదునెలలు వేచి చూసి మా అత్తామామలకు ఈ విషయం చెప్పాను. వారు నేను చేతగానివాడినంటూ నన్నే నిందించడం ప్రారంభించారు. అంతేకాని కూతుర్ని నా ముందు కూర్చోబెట్టి అడగలేదు. పరిస్థితి ఇలా ఉంటే, ఎక్కడో మారుమూల పల్లెటూళ్లో ఉండే మా అమ్మానాన్నలపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. పోలీసులు వాళ్లకు ఫోన్ చేశారట. వాళ్లిద్దరూ సీనియర్ సిటిజన్స్. పైగా ఆరోగ్యాలు బాగాలేని వాళ్లు. ఇక నాకైతే వాళ్లకంటే ముందుగానే పోలీసుల నుండి ఫోన్లు వచ్చాయి. చాలా కరకుగా మాట్లాడుతున్నారు. అసలు నాతో సంసారమే చేయని అమ్మాయి.. పట్టుమని పదిరోజులు కూడా నాతో గడపని అమ్మాయి మా పైన కేసు వేయడం న్యాయమా? ఏ సంబంధం లేని అమాయకులైన నా తల్లిదండ్రులకు నేను ఏం సమాధానం చెప్పాలి? నేను ఎంతో కుంగిపోతున్నాను. దయచేసి సలహా ఇవ్వండి. - రాజేష్, బెంగళూరు మీ ఆవేదన అర్థమైంది. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యా. పెద్దవయసులో తలిదండ్రులకు మనోవేదన, కోటి ఆశలతో వివాహం చేసుకున్న వారికి దారుణమైన వేధింపులు ఎదురవుతున్నాయి. ఆ అమ్మాయికి మీతో వివాహం ఇష్టం లేకపోయినా, తలిదండ్రుల బలవంతం మీద పెళ్లికి ఒప్పుకొని ఉంటుంది. అందుకే మీతో సంసారం చేయలేదు. దిక్కుతోచని పేరెంట్స్ విషయం వివరించి, సజావుగా సమస్య పరిష్కరించుకోకుండా మీమీద ఇలా కేసు వేయడం న్యాయం కాదు. కనీసం ఆ అమ్మాయి మీతో మనసు విప్పి మాట్లాడితే బాగుండేది. మీరు, మీ పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి. ధైర్యంగా వారికి మీ వాదన వినిపించండి. పేరెంట్స్‌ని, సిస్టర్స్‌ని వేధించవద్దని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. మీరు కూడా వివాహమైనప్పటినుంచి ఆమె ప్రవర్తన ఎలా ఉండేది, మీరు అసలు ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చారో అన్నీ గుర్తుకు తెచ్చుకుని పోలీసులకు వివరించండి. ఒకవేళ వాళ్లు అంటే మీ అత్తమామలు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే ముందుగా మీరు యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నాలు చేయండి లేదా స్టేషన్ బెయిల్ అడగండి. తర్వాత ఎఫ్.ఐ.ఆర్ క్వాష్ చేయమని హైకోర్టును ఆశ్రయించండి. మీ పేరంట్స్‌ను తప్పనిసరిగా పోలీస్ కేసునుండి డిలీట్ చేస్తారు. మంచి అనుభవజ్ఞులెన క్రిమినల్ లాయర్‌ను సంప్రదించండి. ఇక మీ వివాహం ఫలప్రదం (కాంజుమేట్) కాలేదు కనుక నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేయమని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించండి. ఏది ఏమైనా ఉట్టిపుణ్యానికి ఇన్ని బాధలా అనిపిస్తుంది. అది నిజం కూడా! కాని కొన్ని పరిస్థితులలో తప్పవు. మా అమ్మగారు ఇటీవలే కాలం చేశారు. ఆమె పేరు మీద కొంత వ్యవసాయ భూమి, ఒక ఇల్లు ఉన్నాయి. మా నాన్నగారు తన సంపాదనతో అవి కొని అమ్మపేరున రిజిస్టర్ చేయించారు. అమ్మ ఎలాంటి వీలునామా రాయలేదు. నాన్నగారు వృద్ధులైపోయారు. మేం ముగ్గురం సంతానం. ఇద్దరు అన్నదమ్ములం, ఒక చెల్లెలు. అందరికీ వివాహాలు అయ్యాయి. నాన్నగారు నా దగ్గరే ఉంటున్నారు. అమ్మపేరున ఉన్న ఆస్తిని ఎలా పంచుకోవాలి? చెల్లెలికి వాటా ఇవ్వాలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఎన్.శివ కుమార్, మంచిర్యాల ఒక హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె తదనంతరం ఆమె ఆస్తికి మొదట కొడుకులు, కూతుళ్లు, భర్త, ఆమెకంటే ముందే చనిపోయిన కుమారుడు లేదా కుమార్తె సంతానం వారసులవుతారు. మీకు తండ్రి, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు కాబట్టి మీ అందరూ సమాన వాటాదారులవుతారు. నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేవారు. ఒకరోజు రాత్రి విధులు ముగించుకుని కంటోన్మెంట్ ఏరియా నుండి వస్తుండగా ఒక మిలిటరీ ట్రక్ ఢీకొని నా భర్త రెండుకాళ్లూ ఫ్రాక్చర్ అయి ఎడమ కాలు తీసేశారు. మేం నష్టపరిహారం గురించి కేసు వేద్దామంటే ఆ ట్రక్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ బలగాలకు సంబంధించినది కనుక నష్టపరిహారం రాదంటున్నారు. నిజమేనా? వివరించగలరు. - శివమ్మ, సికిందరాబాద్ మీకు తప్పకుండా నష్టపరిహారం వస్తుంది. సాధారణంగా తమ వాహనాలకు నష్టపరిహార బాధ్యత ఉండదని ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వానికి మినహాయింపు ఇవ్వాలని వారి వాదన. తమ సేవకులు చేసిన తప్పిదానికి తాము బాధ్యత వహించమని ప్రభుత్వాల వాదన. కాని ఇది తప్పని సుప్రీంకోర్టు తన తీర్పులలో స్పష్టం చేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వ్యక్తులకు ప్రమాదం వాటిల్లితే ప్రభుత్వం ఆ తప్పుకు బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని కోర్టువారు అనేక కేసులలో తెలియపరిచారు. పుష్పా టాగోర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు వారు ప్రభుత్వానికి నష్టపరిహార మినహాయింపు ఉండదని తీర్మానించారు. ఇక్కడ ట్రక్ ప్రభుత్వానిది. సేవకుడు డ్రైవర్. అంటే ప్రభుత్వంతో నియమించబడిన వ్యక్తి అని అర్థం. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మీకు తప్పకుండా పరిహారం అందుతుంది. మీరు నిపుణులైన లాయర్‌ను సంప్రదించి, కేసు వేయండి. విష్ యు ఆల్ ది బెస్ట్. - ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
'నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు'