న్యూఢిల్లీ: పోలీసులే క్రిమనల్స్‌లా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఇద్దరు డిల్లీ పోలీసులు సేల్స్ ట్యాక్స్ ఏజెంట్‌ని శనివారం షహదారాలోని జీటీబీ ఎనక్లేవ్ వద్ద కిడ్నాప్ చేసి తప్పుడు కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడు తన కుటుంబంతో జీటీబీ ఎనక్లేవ్ వద్ద నివశిస్తున్నాడు. అతడు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెట్‌లో సేల్స్ ట్యాక్స్ ఏజేంట్‌గా పనిచేస్తున్నడు. అక్టోబర్ 11న రాత్రి అతను తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా... షహదారాలోని ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక తెల్లటి రంగులోని కారు తన కారుని ఓవర్‌టెక్ చేసుకుని ముందుకు వచ్చి ఆగింది.
ఆ కారులోంచి ముగ్గురు వ్యక్తులు దిగి సదరు ట్యాక్స్ ఏజెంట్‌ని చితకబాది, బలవంతంగా అతని కారులోని వెనుకసీటులో కూర్చొబెట్టారు. బాధితుడితో ఆ వ్యక్తులు తాము క్రైం బ్రాంచ్‌కి చెందిన వ్యక్తులమని చెప్పారు. ఒక వ్యక్తి తుపాకిని గుండెకి గురిపెట్టి బాధితుడి జేబులో ఉన్న రూ. 35 వేలు తీసుకున్నాడు. మరో వ్యక్తి సుమారు రూ. 5 లక్షలు ఇస్తే వదిలేస్తామని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లోపెడతామంటూ బెదిరించారు. ఆ తర్వాత అతనిని షహదారాలోని స్పెషల్ స్టాఫ్ ఆఫీస్‌కి తీసుకువెళ్లారు.
నిందితులు అక్కడ ఒక ఆఫీసర్‌తో మాట్లాడి తదనంతరం అతడిని మళ్లీ కారు వెనుక కూర్చొబెట్టి బాధితుడి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ నిందితులు అతడ వద్ద నుంచి సుమారు రూ. 50 వేలు తీసుకున్నారని, పైగా అతను తన స్నేహితుడి నుంచి దాదాపు రూ. 70 వేలు అప్పుగా తీసుకుని నిందితుడు గౌరవ్ అలియాస్ అన్నా భార్య అకౌంట్‌కి ట్రాన్సఫర్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత తనను విడుదల చేసినట్లు తెలిపాడు.
ఈ మేరకు బాధితుడు పిర్యాదు మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంతేగాదు విచారణలో... ఢిల్లీలోని సీమపురీ పోలీస్‌స్టేషన్‌కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు సందీప్, రాబిన్ తోపాటు మరోవ్యక్తి వహీద్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అలాగే ఈ కేసుకి సంబంధించి మరో ఇద్దరు నిందితులు ఢిల్లీ పోలీసు అమిత్, సీమపురికి చెందిన గౌరవ్ అలియాస్ అన్నా అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఐతే విచారణలో.. కానిస్టేబుల్ అమిత్ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. నిందితుడు వహిద్ కారుని ఉపయోగించి ఈ నేరానికి పాల్పడినట్లు చెప్పారు. గౌరవ్ కూడా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బాధితుడి నుంచి సుమారు రూ.1.5 లక్షలు తీసుకున్నట్లు తేలింది.
(చదవండి: ఇదేం విడ్డూరం...పెంపుడు కుక్కే యజమానులపై ఘోరంగా దాడి...)
Comments
Please login to add a commentAdd a comment