kidnaping
-
చిత్తూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం
-
ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్‌లా..
న్యూఢిల్లీ: పోలీసులే క్రిమనల్స్‌లా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఇద్దరు డిల్లీ పోలీసులు సేల్స్ ట్యాక్స్ ఏజెంట్‌ని శనివారం షహదారాలోని జీటీబీ ఎనక్లేవ్ వద్ద కిడ్నాప్ చేసి తప్పుడు కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడు తన కుటుంబంతో జీటీబీ ఎనక్లేవ్ వద్ద నివశిస్తున్నాడు. అతడు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెట్‌లో సేల్స్ ట్యాక్స్ ఏజేంట్‌గా పనిచేస్తున్నడు. అక్టోబర్ 11న రాత్రి అతను తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా... షహదారాలోని ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక తెల్లటి రంగులోని కారు తన కారుని ఓవర్‌టెక్ చేసుకుని ముందుకు వచ్చి ఆగింది. ఆ కారులోంచి ముగ్గురు వ్యక్తులు దిగి సదరు ట్యాక్స్ ఏజెంట్‌ని చితకబాది, బలవంతంగా అతని కారులోని వెనుకసీటులో కూర్చొబెట్టారు. బాధితుడితో ఆ వ్యక్తులు తాము క్రైం బ్రాంచ్‌కి చెందిన వ్యక్తులమని చెప్పారు. ఒక వ్యక్తి తుపాకిని గుండెకి గురిపెట్టి బాధితుడి జేబులో ఉన్న రూ. 35 వేలు తీసుకున్నాడు. మరో వ్యక్తి సుమారు రూ. 5 లక్షలు ఇస్తే వదిలేస్తామని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లోపెడతామంటూ బెదిరించారు. ఆ తర్వాత అతనిని షహదారాలోని స్పెషల్ స్టాఫ్ ఆఫీస్‌కి తీసుకువెళ్లారు. నిందితులు అక్కడ ఒక ఆఫీసర్‌తో మాట్లాడి తదనంతరం అతడిని మళ్లీ కారు వెనుక కూర్చొబెట్టి బాధితుడి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ నిందితులు అతడ వద్ద నుంచి సుమారు రూ. 50 వేలు తీసుకున్నారని, పైగా అతను తన స్నేహితుడి నుంచి దాదాపు రూ. 70 వేలు అప్పుగా తీసుకుని నిందితుడు గౌరవ్ అలియాస్ అన్నా భార్య అకౌంట్‌కి ట్రాన్సఫర్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత తనను విడుదల చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు బాధితుడు పిర్యాదు మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంతేగాదు విచారణలో... ఢిల్లీలోని సీమపురీ పోలీస్‌స్టేషన్‌కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు సందీప్, రాబిన్ తోపాటు మరోవ్యక్తి వహీద్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అలాగే ఈ కేసుకి సంబంధించి మరో ఇద్దరు నిందితులు ఢిల్లీ పోలీసు అమిత్, సీమపురికి చెందిన గౌరవ్ అలియాస్ అన్నా అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఐతే విచారణలో.. కానిస్టేబుల్ అమిత్ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. నిందితుడు వహిద్ కారుని ఉపయోగించి ఈ నేరానికి పాల్పడినట్లు చెప్పారు. గౌరవ్ కూడా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఓ సబ్ఇన్స్పెక్టర్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బాధితుడి నుంచి సుమారు రూ.1.5 లక్షలు తీసుకున్నట్లు తేలింది. (చదవండి: ఇదేం విడ్డూరం...పెంపుడు కుక్కే యజమానులపై ఘోరంగా దాడి...) -
క్వారంటైన్ సెంటర్ నుంచి కిడ్నాప్‌కు యత్నం
తిరువనంతపురం : క్వారంటైన్ సెంటర్ నుంచి యువకుడి కిడ్నాప్‌కు ప్రయత్నించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం బిన్‌షాద్ అనే యువకుడు కొన్ని రోజులు క్రితం దుబాయ్ నుంచి కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో కూతుపరంబులోని క్వారంటైన్ కేంద్రంలో వైద్యుల సంరక్షణలో ఉన్నాడు. ఇటీవలె క్వారంటైన్ పీరియడ్ పూర్తైన నేపథ్యంలో అక్కడి నుంచి బయలుదేరేందుకు ప్రయత్నించగా ఓ బృందం సభ్యులు వచ్చి అతన్ని బలవంతంగా బయటకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అతని స్నేహితులకు వారికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. (చదవండి : గోల్డ్ స్మగ్లింగ్ కేసు: సీఎంపై ప్రతిపక్షాల దాడి) విషయం తెలుసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వీరికి గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో లింక్ ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిన్‌షాద్ సరైన సమయానికి బంగారాన్ని డెలివరీ చేయనందుకే ఇరు వర్గాల మధ్య గొడవకు కారణమైనట్లు అంచనా వేస్తున్నారు. రెండు గ్రూపులకు చెందిన ఆరుగురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టారు. (చదవండి : గోల్డ్ స్మగ్లింగ్: ఎవరీ స్వప్న సురేశ్? ) -
కి'లేడి'లు గర్భిణిలుగా నటించి ఆపై..
సాక్షి, నెల్లూరు : తల్లి ఒడిలో ఉన్న రెండు నెలలు నిండని చిన్నారిపై కన్ను పడింది. చిన్నారిని ఇవ్వాలని అమ్మమ్మను ప్రాధేయపడ్డారు.. తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. వారిని వెంబడించి.. మాటలు కలిపారు. ఆదమర్చి ఉన్న వేళ చిన్నారిని కిడ్నాప్ చేసి వెంట తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 36 గంటలు శ్రమించి నిందితులను అరెస్ట్ చేశారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఆరుళ్లకు చెందిన గోపీ, కృష్ణవేణి దంపతులు, ముగ్గురు పిల్లలతో కలిసి కూలీ పనులు నిమిత్తం బెంగళూరు వెళ్లేందుకు ఈ నెల ఐదున తణుకులో శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. తణుకు రైల్వేస్టేషన్లో వీరితో మాటలు కలిపిన ఇద్దరు మహిళలు చిన్నారుల్లో ఒకర్ని ఇస్తే డబ్బులిస్తామని ప్రాధేయపడ్డారు. వారు నిరాకరించారు. అయితే చిన్నారిని ఎలాగైనా దక్కించుకోవాలని సదరు మహిళలు సైతం శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. మరో బోగీలో ఎక్కిన మహిళలు విజయవాడలో గోపీ కుటుంబం ఉన్న బోగీలోకి ఎక్కి మాటలు కలిపారు. బంధువులమని నమ్మించేలా ప్రవర్తించారు. చీరను ఉయ్యాలగా వేసి అందులో పడుకోబెట్టారు. కొంతసేపటికి గోపీ, కృష్ణ దంపతులు ఆదమర్చి నిద్రపోయారు. ఈ క్రమంలో మహిళలిద్దరూ చిన్నారిని ఎత్తుకొని ఆడిస్తున్నట్లు నటిస్తూ కావలి రైల్వేస్టేషన్లో రైలు దిగారు. నిద్ర నుంచి తేరుకున్న వారికి ముగ్గురు పిల్లల్లో ఒక చిన్నారి కనిపించలేదు. ఇద్దరు మహిళల జాడ తెలియరాలేదు. వారి కోసం బోగీ అంతా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో నెల్లూరులో దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే డీఎస్పీ వసంతకుమార్ ఆదేశాల మేరకు కావలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సవాల్‌గా తీసుకున్న పోలీసులు చిన్నారి కిడ్నాప్ విషయాన్ని డీఎస్పీ, సీఐలు సవాల్‌గా తీసుకున్నారు. నెల్లూరు, ఒంగోలు రైల్వే సీఐల ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కావలి రైల్వేస్టేషన్ వద్ద ఓ మహిళ చిన్నారిని తీసుకెళ్లడాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించారు. అదే క్రమంలో ప్రత్యక్ష సాక్షి కొంత సమాచారాన్ని అందించడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితులిద్దరూ కావలి బస్టాండ్ నుంచి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో వెళ్లారని సమాచారం అందింది. దీంతో పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్‌ఫోన్ టవర్ డంప్‌లను సేకరించారు. ఎంపిక చేసుకున్న నంబర్ల ఆధారంగా పోలీసులు కూపీ లాగాడంతో నిందితులు కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంత వాసులుగా గర్తించారు. ప్రత్యేక బృందం శనివారం ఉదయం నూజివీడు చేరుకొని కిడ్నాపర్లు బీబీ, నాగూర్‌బీని అరెస్ట్ చేసి చిన్నారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పిల్లల్లేకపోవడంతోనే.. కృష్ణా జిల్లా నూజివీడు స్టేషన్ తోట రామాలయం వీధికి చెందిన షేక్ బీబీ, హుస్సేన్ దంపతులు. వారు ప్రస్తుతం తిరుపతి రైల్వేస్టేషన్ పక్కనున్న కస్తూరిభాయ్ వీధిలో నివాసం ఉంటూ స్థానికంగా కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నారు. బీబీకి మరో నిందితురాలైన నాగూర్‌బీ చెల్లెలు. ఆమె భర్త నుంచి విడిపోయి ఉండటంతో అక్క భర్తనే రెండో వివాహం చేసుకున్నారు. అందరూ కలిసి తిరుపతిలో ఉంటున్నారు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లల్లేకపోవడంతో భర్త, చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలతో వేధించసాగారు. దీంతో అక్కాచెల్లెళ్లు మాస్టర్‌ప్లాన్ వేశారు. ఎలాగైనా పిల్లలను సంపాదించాలని నిర్ణయించుకున్నారు. తెలిసిన వారందరికీ పిల్లలను ఎవరైనా దత్తతకు లేదా అమ్మకానికి ఇచ్చేవారు ఉంటే చెప్పమని కోరారు. భర్తకు అనుమానం రాకుండా ఉండేందుకు గర్భిణిగా నటించసాగారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం కాన్పునకు వెళ్తున్నానని చెప్పి అక్కతో కలిసి నూజీవీడుకు వచ్చారు. గడువు ముంచుకు రావడంతో ఎలాగైనా పిల్లలను దక్కించుకోవాలని నిర్ణయించుకొని సమీపంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో మాటేశారు. ఈ క్రమంలో తణుకు రైల్వేస్టేషన్లో గోపీ, కృష్ణవేణి దంపతులు కనిపించడం.. వారి కుమార్తెను కిడ్నాప్ చేశారని నిందితులు పోలీసులకు తెలిపారు. చిన్నారి అప్పగింత నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు చిన్నారిని తీసుకొని ప్రత్యేక వాహనంలో నెల్లూరు చేరుకున్నారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ కార్యాలయంలో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాధిత కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చిన్నారిని సురక్షితంగా అప్పగించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బందికి అభినందన నిందితులను అరెస్ట్ చేసి చిన్నారిని రక్షించిన నెల్లూరు, ఒంగోలు రైల్వే సీఐలు మంగారావు, రామారావు, కావలి రైల్వే ఎస్సై మాలకొండయ్య, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, శ్యామ్, కానిస్టేబుళ్లు సురేష్‌బాబు, ఆనంద్, సతీష్, ధనుంజయ, రమేష్, పెంచలయ్య, ఐటీ కోర్ సభ్యులు వినోద్, షమీమ్‌ను డీఎస్పీ అభినందించారు. త్వరలో గుంతకల్లు రైల్వే ఎస్పీ చేతుల మీదుగా రివార్డులను అందించనున్నామని ప్రకటించారు. -
ఆరేళ్ళుగా చీకటి గదిలో బంధించిన భర్త
-
వైద్యులకు బెదిరింపు
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరులో మరో కిడ్నాపింగ్ ముఠా వెలుగులోకి వచ్చింది. సునీల్ గ్యాంగ్ అంటూ దుండగులు డాక్టర్ దంపతులకు ఫోన్ చేసి రూ.50 లక్షలు కావాలని..లేదంటే మీ పిల్లల్ని చంపేస్తామంటూ బెదిరించిన సంఘటన ప్రొద్దుటూరు పట్టణంలో సంచలనం రేకెత్తించింది. గాంధీరోడ్డులోని భవ్య ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ సత్యప్రసాద్, డాక్టర్ సంధ్యారాణిలను గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించినట్లు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. మంగళవారం డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, సీఐ మహేశ్వరరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో పలువురు వ్యక్తులు డాక్టర్ సంధ్యారాణి, సత్యప్రసాద్‌కు ఫోన్ చేసి మేము సునీల్ గ్యాంగ్ సభ్యులం..ఇప్పటికే ఎన్నో కిడ్నాప్‌లు చేశాం..ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది..మాకు వెంటనే రూ.50 లక్షలు కావాలి.. లేదంటే మీ పిల్లల్ని చంపేస్తామని హెచ్చరించారు. సాయంత్రం 5 గంట ల్లోపు డబ్బు పంపే ఏర్పాటు చేయండి..పోలీసులకు చెప్పారో ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు..అంటూ బెదిరించారు. దీంతో భయపడిన డాక్టర్లు అంత డబ్బు మా వద్ద లేదని అనగా డబ్బుతోపాటు మీ వద్ద బంగారు కూడా ఉందని మాకు తెలుసులే.. ఎక్కువగా మాట్లాడకుండా 5 గంటల్లోగా డబ్బు పంపించండి..ఎక్కడికి తీసుకొని రావాలో ఫోన్ చేసి చెబుతామన్నారు. ఉన్న బంగారంతా బ్యాంక్‌లో పెట్టి ఆ డబ్బుతోనే ఆస్పత్రి కట్టామని డాక్టర్ దంపతులు వారితో చెప్పారు. అవన్నీ మాకు తెలియవు అని చెప్పి ఫోన్ కట్ చేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మళ్లీ ఫోన్ చేసి డబ్బు రెడీ చేసుకున్నారా అని అడిగారు. అంత డబ్బు మా వద్ద లేదు.. 5 లక్షలు ఇస్తామని చెప్పగా..సరే సరే ఆ డబ్బు తీసుకొని మీరు రావద్దు.. మీ డ్రైవర్ చేతికి ఇచ్చి పంపండి.. సాయంత్రం మేము ఫోన్ చేయగానే డబ్బు పంపించండి అని డ్రైవర్ ఫోన్ నెం బర్ను వారు రాసుకున్నారు. సాయంత్రం 6 గం టల సమయంలో డాక్టర్‌తో పాటు ఆయన డ్రైవర్ కలిసి వెళ్లి అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో వారికి రూ.5 లక్షలు ఇచ్చారు. డాక్టర్ దంపతులు బయపడి ఈ విషయాన్ని ముందుగా ఎవ్వరికీ చెప్పలేదు. తర్వాత వారి సన్నిహితులకు చెప్పగా వారి సూచన మేరకు డాక్టర్లు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. నలుగురు వ్యక్తులు తన వద్ద డబ్బు తీసుకొన్నారని, వారిని చూస్తే కచ్చితంగా గుర్తు పడతానని డాక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నాడు. నేరస్తులు తప్పించుకోలేరు నేరస్తులు ఎప్పటికైనా కటకటాల పాలు కావల్సిం దేనని డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి అన్నారు. సునీల్ గ్యాంగ్ అని వారు చెప్పారని, అయితే సునీల్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడన్నారు. అయినా సునీల్ గ్యాంగ్ నిందితులపై విచారణ చేస్తామన్నారు. డాక్టర్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.