తిరువనంతపురం : క్వారంటైన్ సెంటర్ నుంచి యువకుడి కిడ్నాప్‌కు ప్రయత్నించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం బిన్‌షాద్ అనే యువకుడు కొన్ని రోజులు క్రితం దుబాయ్ నుంచి కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో కూతుపరంబులోని క్వారంటైన్ కేంద్రంలో వైద్యుల సంరక్షణలో ఉన్నాడు. ఇటీవలె క్వారంటైన్ పీరియడ్ పూర్తైన నేపథ్యంలో అక్కడి నుంచి బయలుదేరేందుకు ప్రయత్నించగా ఓ బృందం సభ్యులు వచ్చి అతన్ని బలవంతంగా బయటకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అతని స్నేహితులకు వారికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. (చదవండి : గోల్డ్ స్మగ్లింగ్ కేసు: సీఎంపై ప్రతిపక్షాల దాడి)
విషయం తెలుసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వీరికి గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో లింక్ ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిన్‌షాద్ సరైన సమయానికి బంగారాన్ని డెలివరీ చేయనందుకే ఇరు వర్గాల మధ్య గొడవకు కారణమైనట్లు అంచనా వేస్తున్నారు. రెండు గ్రూపులకు చెందిన ఆరుగురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టారు. (చదవండి : గోల్డ్ స్మగ్లింగ్: ఎవరీ స్వప్న సురేశ్? )
Comments
Please login to add a commentAdd a comment