Sales tax
-
ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్‌లా..
న్యూఢిల్లీ: పోలీసులే క్రిమనల్స్‌లా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఇద్దరు డిల్లీ పోలీసులు సేల్స్ ట్యాక్స్ ఏజెంట్‌ని శనివారం షహదారాలోని జీటీబీ ఎనక్లేవ్ వద్ద కిడ్నాప్ చేసి తప్పుడు కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడు తన కుటుంబంతో జీటీబీ ఎనక్లేవ్ వద్ద నివశిస్తున్నాడు. అతడు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెట్‌లో సేల్స్ ట్యాక్స్ ఏజేంట్‌గా పనిచేస్తున్నడు. అక్టోబర్ 11న రాత్రి అతను తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా... షహదారాలోని ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక తెల్లటి రంగులోని కారు తన కారుని ఓవర్‌టెక్ చేసుకుని ముందుకు వచ్చి ఆగింది. ఆ కారులోంచి ముగ్గురు వ్యక్తులు దిగి సదరు ట్యాక్స్ ఏజెంట్‌ని చితకబాది, బలవంతంగా అతని కారులోని వెనుకసీటులో కూర్చొబెట్టారు. బాధితుడితో ఆ వ్యక్తులు తాము క్రైం బ్రాంచ్‌కి చెందిన వ్యక్తులమని చెప్పారు. ఒక వ్యక్తి తుపాకిని గుండెకి గురిపెట్టి బాధితుడి జేబులో ఉన్న రూ. 35 వేలు తీసుకున్నాడు. మరో వ్యక్తి సుమారు రూ. 5 లక్షలు ఇస్తే వదిలేస్తామని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లోపెడతామంటూ బెదిరించారు. ఆ తర్వాత అతనిని షహదారాలోని స్పెషల్ స్టాఫ్ ఆఫీస్‌కి తీసుకువెళ్లారు. నిందితులు అక్కడ ఒక ఆఫీసర్‌తో మాట్లాడి తదనంతరం అతడిని మళ్లీ కారు వెనుక కూర్చొబెట్టి బాధితుడి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ నిందితులు అతడ వద్ద నుంచి సుమారు రూ. 50 వేలు తీసుకున్నారని, పైగా అతను తన స్నేహితుడి నుంచి దాదాపు రూ. 70 వేలు అప్పుగా తీసుకుని నిందితుడు గౌరవ్ అలియాస్ అన్నా భార్య అకౌంట్‌కి ట్రాన్సఫర్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత తనను విడుదల చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు బాధితుడు పిర్యాదు మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంతేగాదు విచారణలో... ఢిల్లీలోని సీమపురీ పోలీస్‌స్టేషన్‌కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు సందీప్, రాబిన్ తోపాటు మరోవ్యక్తి వహీద్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అలాగే ఈ కేసుకి సంబంధించి మరో ఇద్దరు నిందితులు ఢిల్లీ పోలీసు అమిత్, సీమపురికి చెందిన గౌరవ్ అలియాస్ అన్నా అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఐతే విచారణలో.. కానిస్టేబుల్ అమిత్ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. నిందితుడు వహిద్ కారుని ఉపయోగించి ఈ నేరానికి పాల్పడినట్లు చెప్పారు. గౌరవ్ కూడా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఓ సబ్ఇన్స్పెక్టర్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బాధితుడి నుంచి సుమారు రూ.1.5 లక్షలు తీసుకున్నట్లు తేలింది. (చదవండి: ఇదేం విడ్డూరం...పెంపుడు కుక్కే యజమానులపై ఘోరంగా దాడి...) -
ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టు ఆదాయం...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకపు పన్ను రాబడులు ప్రభుత్వ అంచనాలకు తగినట్టుగా వస్తున్నాయి. బడ్జెట్లో అంచనా వేసుకున్న మొత్తం సేల్స్ ట్యాక్స్ లక్ష్యంలో.. తొలి మూడు నెలల్లోనే 22.18 శాతం మేర ఖజానాకు చేరింది. ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో వెల్లడైంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను అమ్మకపు పన్ను కింద రూ.26,500 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కలిపి రూ.5,878.77 కోట్లు సమకూరినట్టు కాగ్ తెలిపింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడుల కింద రూ.1,06,900 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా.. అందులో 19 శాతం అంటే రూ.20,225 కోట్లు తొలి త్రైమాసికంలో సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాíసికంలో 11.66 శాతమే ఆదాయం రావడం గమనార్హం. ఈసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ రాబడులు పెరిగే అవకాశముందని, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటే.. నిధుల కటకట నుంచి గట్టెక్కినట్టేనని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర ఆదాయం కూడా.. ► జీఎస్టీ రాబడులు కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. ఆ ఏడాది జీఎస్టీ అంచనాల్లో మొదటి మూడు నెలల్లో 12.11 శాతమే సమకూరగా.. ఈసారి మొత్తం అంచనా (రూ.35,520 కోట్లు)లో 18.70 శాతం అంటే రూ.6,640.81 కోట్లు వచ్చాయి. ► ఈసారి ఎక్సైజ్ రాబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయని కాగ్ గణాంకాలు చెప్తున్నాయి. గత ఏడాది ఈ సమయానికి 15.82 శాతమే రాగా.. ఈసారి 20.74 శాతం వసూళ్లు జరిగాయి. అంటే ఈసారి మొత్తంగా రూ.17 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకోగా.. తొలి మూడునెలల్లో రూ.3,526 కోట్లు వచ్చాయి. ► ఇక ఈసారి స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.1,668 కోట్లకుపైగా వచ్చింది. ► కేంద్రపన్నుల్లో వాటా, ఇతర పన్నులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ల రూపంలో రూ.6 వేల కోట్ల వరకు సమకూరాయి. ► బడ్జెట్లో అంచనా వేసుకున్న అన్నిరకాల ఆదాయం కలిపి చూస్తే.. తొలి మూడు నెలల్లో పరిస్థితి ఆశాజనకంగానే ఉందని కాగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మొ త్తం ప్రభుత్వ అం చనాల్లో 17 శాతం అంటే.. రూ.37, 533 కోట్లు అందా యని పేర్కొంటున్నాయి. -
మద్యం ధరల పెంపు వెనుక ఓ ఎంపీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న మద్యం ధరల పెంపు నిర్ణయం వెనుక భారీ కుంభకోణం ఉందని మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, అమ్మకాల వరకు మాఫియా గుప్పిట్లో ఉందని, తాజా మద్యం ధరల పెంపు విషయంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ ఢిల్లీ, చెన్నైలలో మకాం వేసి బేరం కుదిర్చారని అన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని మంగళవారం ఆయన రాసిన బహిరంగ లేఖలో కోరారు. వెంటనే పెంచిన మద్యం ధరలను ఉపసంహరించుకోవాలని, లేదంటే న్యాయస్థానాల ద్వారా సీబీఐ విచారణ కోసం పోరాడుతామని లేఖలో రేవంత్ వెల్లడించారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ.. ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా మారిందని ఎద్దేవా చేశారు. -
సిటీలో జోరుగా బిల్లుల్లేని వ్యాపారం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘జీరో’ వ్యాపారం జోరుగా సాగుతోంది. బిల్లులు లేకుండా లక్షల్లో లావాదేవీలు తెల్లకాగితాల పైనే నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. జీఎస్టీ లాంటి పన్ను విధానాలు అమలు చేస్తున్నా..కొందరు వ్యాపారులు అడ్డదారుల్లో బిల్లులు ఇవ్వకుండా జీరో వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ‘ఏ వస్తువు కొనుగోలు చేసినా..బిల్లు తీసుకోవటం తప్పనిసరి. బిల్లు అడగటం వినియోగ దారుడి హక్కు. మేలుకో వినియోగదారుడా మేలుకో’ అంటూ వినియోగదారుల శాఖ...‘సకాలంలో పన్నులు చెల్లించండి.. దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి’ అంటూ వాణిజ్య పన్నుల శాఖ చేస్తున్న ప్రచారం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది. బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, మొజంజాహీ మార్కెట్, ట్రూప్‌బజార్, సికింద్రాబాద్, మలక్‌పేట్ గంజ్, చార్మినార్, పత్తర్ఘాట్తో పాటు నగరం వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల మార్కెట్లలో బిల్లులు ఇవ్వకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నగరంలో కొన్ని షాపింగ్ మాల్స్‌లో సైతం బిల్లులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కొందరు మాత్రం వినియోగదారులు అడిగితే ఇవ్వడం..లేదంటే వదిలేయడం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఈ విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. వారికి మామూళ్లు మడుతున్నందున జీరో వ్యాపారం జోరుగా సాగుతోందిని పలువురు ఆరోపిస్తున్నారు. జీఎస్టీ ఉన్నా... జీఎస్టీ చట్టం అమలులో ఉన్నా జీరో బిజినెస్ మాత్రం ఆగడం లేదు. అమ్మకాల విలువలో కొంత శాతం మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ రికార్డుల్లో కనిపిస్తుంది. ఎంత పెద్ద మొత్తంలో బిల్లు అయినా తెల్ల కాగితంపై రాసిస్తారు. దీనిపై తీసుకున్న వస్తువుల పేర్లు, దుకాణం పేరు, రిజిస్టర్ నెంబర్ కనిపించవు. వినియోగదారులకు బిల్లు ఇస్తే ట్యాక్స్‌తో వస్తువుల ధర పెరుగుతుందని వ్యాపారులు చెబుతారు. దీంతో వినియోగదారులు సైతం ఎక్కువ మొత్తం చెల్లించలేక బిల్లులు ఇవ్వకున్నా నిమ్మకుండిపోతున్నారు. ఈ విషయం వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు కూడా తెలుసు. అయినా చర్యలు తీసుకోవటంలో విఫలమవుతున్నారు. పన్ను వసూళ్లు పెరిగేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడంలేదు. దీంతో అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. అన్ని వస్తువులూ అంతే... చౌక ధరకే వస్తువులు లభించటం బేగంబజార్ ప్రత్యేకత. 1770 నుంచే ఇక్కడ మార్కెట్ కొనసాగు తోంది. వందల సంఖ్యలో ఉన్న దుకాణాల్లో రోజూ రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. దుకాణాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. గృహోపకరణాలు, మేకప్ వస్తువులు, డ్రైఫూట్స్, మసాలాలు, సుగంధ ద్రవ్యాలు, స్టీల్ వస్తువులు, కిరాణా, ట్రాన్స్‌పోర్టు, దీపావళి టపాసులు, ప్లాసిక్ వస్తువులు, ఫర్నిచర్, బంగారం...ఇలా అనేక వ్యాపారాలకు బేగంబజార్ ప్రసిద్ధి. ఇక్కడి నుంచే జిల్లాలకు వస్తువులు సరఫరా అవుతుంటాయి. జిల్లాల్లో రిటైల్, హోల్‌సేల్ దుకాణాలు నిర్వహించే వారు సరుకుల్ని ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటారు. బేగంబజార్‌ను ఆనుకొని ఉన్న ముక్తియార్‌గంజ్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్, మహరాజ్‌గంజ్ తదితర మార్కెట్లలో చిరుధాన్యాలు, పిండి, బియ్యం, నూనె హోల్‌సేల్ వ్యాపారం జరుగు తుంది. దుకాణాలు చూసేందుకు చిన్నగా కనిపిస్తాయి. వీటికి సంబంధించిన గోడౌన్లు ప్రత్యేకంగా ఉంటాయి. కేవలం బిల్లు మాత్రమే దుకాణాల్లో ఇస్తారు. సరుకు మాత్రం గోడౌన్ల నుంచే సరఫరా చేస్తారు. ఇలా నిత్యం పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతున్నా కొంతమంది లెక్కల్లో కనిపించేది మాత్రం స్వల్పమే. ప్రభుత్వ ఆదాయానికి గండి రాష్ట్రవ్యాప్తంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అమ్మకం పన్ను రూపంలో దాదాపు రూ.60 వేల కోట్లు ఆదాయం సమకూరిందని అధికారుల చెబుతున్నారు.. ఇందులో హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే సుమారు 60–65 శాతంగా ఉంటు ంది. నగరంలో పన్నులు చెల్లించని జీరో వ్యాపారం పెరిగిపోవటంతో ఆశించినంత స్థాయిలో ఆదాయం రావటం లేదు. వాణిజ్య పన్నుల శాఖ లెక్కల ప్రకా రం బేగం బజార్ సర్కిల్లో సుమారు 2 వేల వరకు రిజిస్టర్డ్ డీలర్లు ఉన్నారు. ఇందులో రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులున్నారు. వీరిలో కొంతమంది పూర్తిస్థాయి లో అమ్మకాల లెక్కలు చూపటం లేదు. మిగిలిన మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
సేల్స్‌ట్యాక్స్ అక్రమ అధికారులపై సీఐడీ నజర్
⇒ ఏడుగురిపై విచారణ ప్రారంభం ⇒ నిందితుల అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని బ్యాంకులకు లేఖలు సాక్షి, హైదరాబాద్: సేల్స్ ట్యాక్స్‌ను అప్పనంగా సొంత ఖాతాల్లోకి మళ్లించిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై సీఐడీ సోమవారం విచారణ ప్రారంభించింది. 2012–13, 2013–14 సంవత్సరాల్లో బోధన్‌లోని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తమ పరిధిలో ఉన్న రైసుమిల్లుల నుంచి 5 శాతం సేల్స్ ట్యాక్స్ వసూలు చేసి.. సర్కార్ ట్రెజరీలో డిపాజిట్ చేయకుండా రూ. 60 కోట్ల మేర గండి కొట్టినట్టు సీఐడీ ప్రాథమిక విచారణలో బయటపడింది. ఇందులో భాగంగా నలుగురు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, ముగ్గురు ప్రైవేటు వ్యక్తులపై సీఐడీ దృష్టి సారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురి బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని సీఐడీ బ్యాంకులకు లేఖలు రాసింది. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల ప్రాథమిక విచారణలో కొన్ని నకిలీ చలాన్లు బయటపడ్డాయని, అయితే అది ప్రాథమికంగా రూ. 60 కోట్లుగా తేలిందని, స్కాం జరిగిన రెండేళ్లతో పాటు ఆ తర్వాత ఏడాదినీ పరిశీలించాల్సి ఉందని సీఐడీ అధికారులు తెలిపారు. స్కాం విలువ రూ.100 కోట్లు దాటినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
బీబీనగర్‌లో సేల్స్‌టాక్స్ అధికారుల తనిఖీలు
బీబీనగర్: మండల కేంద్రంలోని పూసల గోదాములో శనివారం భువనగిరికి చెందిన సేల్స్‌టాక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను చెల్లించకుండా ఓç ³రిశ్రమ నుంచి అక్రమంగా ముడి సరుకును తీసుకువచ్చి గోదాములో ఉంచి రవాణా చేస్తున్నారని సమాచారం అందింది. దీంతో అధికారులు గోదాముకు చేరుకొని రెండు గంటలకు పైగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లోని రికార్డుల్లో నమోదు చేయకుండా, పన్ను చెల్లించకుండా గోదాముల్లో నిల్వ ఉంచిన అయిల్ తయారీకి ఉపయోగించే 3వేల టన్నుల డీ అయిల్డ్ కిక్ బస్తాలు, 630టన్నుల సన్ప్లై పౌడర్ బస్తాలు, 6లక్షల ఖాళీ గన్నీ బ్యాగులను గుర్తించినట్లు ఏఎస్టీఓ విజయ్‌కుమార్ తెలిపారు. దీంతో స్టాక్ వేసి ఉన్న 3బ్లాక్‌ల గోదాములను సీజ్ చేశామని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అంత వరకు సరుకును తరలించకూడదని సంబంధిత వ్యక్తికి సూచించి గోదాం ఇన్‌చార్జీగా ఉన్న నగేష్‌కు నోటీస్ అందజేశారు. యజమానిపై చర్య తీసుకోవాలి మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలో గల ఆనంద్ సాల్వెక్స్ పరిశ్రమ నుంచి ముడి సరుకును కొనుగోలు చేసి పన్ను చెల్లించకుండా తప్పుడు బిల్లులతో సరుకును తరలించే యత్నం చేస్తున్న సంబంధిత యాజమానిపై చర్యలు తీసుకోవాలని ఆనంద్ సాల్వెక్స్ పరిశ్రమ బాధిత కార్మికులు డిమాండ్ చేశారు. ఆనంద్ సాల్వెక్స్లో పని చేసిన తమకు వేతనాలను చెల్లించకుండా యాజమాన్యం పరిశ్రమను మూసి వేసి ఇతర వ్యక్తులకు ప్రొడక్షన్‌ను విక్రయించిదని, దీంతో వారు పన్ను చెల్లించకుండా స్టాక్‌ను తరలించే యత్నం చేస్తున్నారని అధికారులకు విన్నవించారు. -
బంగారు వర్తకుల నిరవధిక సమ్మె
ముంబై: బంగారం వ్యాపారులు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. 2016 ఆర్థిక బడ్జెట్ లో బంగారు ఆభరణాలపై అమ్మకం పన్ను విధించడానికి వ్యతిరేకంగా మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. బంగారు ఆభరణాలపై నాలుగు సంవత్సరాల తరువాత మళ్లీ అమ్మకపు పన్ను విధించడాన్ని వర్తక సంఘం వ్యతిరేకించింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్టు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగార వినియెగాదారుగా ఉన్న ఇండియాపై దీని ప్రభావం మరింతగా పడనుందని వాదిస్తున్నారు. ఇప్పటికే బంగారం ధరలు బాగా పెరగడంతో గత రెండు మూడు నెలలుగా డిమాండ్ బాగా తగ్గిందన్నారు. కొనుగోళ్లు పడిపోవడంతో నష్టాలను చవి చూస్తున్నామని, ఈ పరిస్థితుల్లో అమ్మకంపన్ను విధించడంతో తమపై మరింత ప్రభావం పడుతుందని వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారతదేశం బులియన్ మరియు జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి కేతన్ ష్రాఫ్ విజ్ఞప్తి చేశారు. కాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2016 లో బంగారం, వజ్రాల ఆభరణాల 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. -
సేల్స్ టాక్స్ అధికారుల తనిఖీలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సేల్స్ టాక్స్ అధికారులు సోమవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న వస్తువులను అధికారులు సీజ్ చేశారు. రామచంద్రాపురం డీటీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు రెండు ఆటోలు, ఒక రిక్షాను పట్టుకున్నారు. వాటిల్లో ఎలాంటి బిల్లులు.. సంబంధిత పత్రాలు లేకుండా సామగ్రి తరలి పోవడాన్ని గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. రూ. లక్ష విలువైన వస్తు సామాగ్రిని సీజ్ చేసి.. వాహనదారులపై కేసులు నమోదు చేశారు. -
సేవల పన్ను 2.15 లక్షల కోట్లు
తొలిసారిగా కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల్ని దాటిన సేవల వసూళ్లు న్యూఢిల్లీ: సేవల పన్ను. 1994లో నాటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ పన్ను... తొలిసారిగా 2014-15లో ఏకంగా కస్టమ్స్, ఎక్సయిజ్ సుంకాలను కూడా దాటేయబోతోంది. దీన్ని బట్టి తెలియట్లేదూ... మన దేశంలో సేవలకున్న ప్రాధాన్యం. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే ఖజానాకు సర్వీస్ ట్యాక్స్ కన్నా ఎక్కువ వసూళ్లనిస్తున్నవిపుడు రెండే..! ఒకటి కార్పొరేట్ ట్యాక్స్. రెండు ఆదాయపు పన్ను. సర్వీస్ ట్యాక్స్ అంటే: ఫైనాన్స్ చట్టం పరిధిలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని సేవలపై వసూలు చేసే పన్ను ఇది. సేవలందించేవారు ప్రభుత్వానికి ఈ మొత్తం చెల్లించి... దాన్ని సేవలందుకున్న వారి దగ్గర వసూలు చేస్తారు. ఇది కూడా ఎక్సయిజు, సేల్స్ ట్యాక్స్ మాదిరిగా పరోక్ష పన్నే. ప్రస్తుతం ఈ పన్ను 12 శాతం. దీనిపై ఎడ్యుకేషన్ సెస్ 2%, ఉన్నత విద్య సెస్ 1% కలిపితే మొత్తం 12.36 శాతమవుతోంది. -
ఆదాయం చాలా బాగుంది..
పన్నుల ఆదాయం నాలుగు నెలల్లో 11,500 కోట్లు రాష్ర్ట పన్నుల ద్వారా ఏడాదికి 35 వేల కోట్లపైనే.. హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో పన్నుల ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం రావడంపై అధికారవర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే విభజన సమయంలో హైదరాబాద్ ఆదాయమే 53 శాతం ఉంటుందని వేసిన అంచనా కంటే తక్కువగా రావడం గమనార్హం. తెలంగాణ అధికారులు ముందునుంచీ చెబుతున్నట్లు 43 నుంచి 46 శాతం మధ్య ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వస్తువుల అమ్మకం పన్ను, వాహనాల పన్ను, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లతోపాటు పన్నేతర ఆదాయంగా మినరల్స్‌లో ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరుతోందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. గడిచిన నాలుగు నెలల్లో 11,500 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు ఆ అధికారి చెప్పారు. వస్తు అమ్మకం పన్నులో సెప్టెంబర్ చివర్లో ఆదాయం బాగా వచ్చిందని సమాచారం. ఈ నెలలో ఒక్క అమ్మకం పన్ను రూపంలో రూ.2,400 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆ వర్గాలు చెప్పాయి. ప్రధాన ఆదాయ వనరులతో పాటు, రాష్ర్ట పన్నులూ ఏడాదికి రూ.35 వేల కోట్లకు పైగా వస్తుందని అంచనా వేయగా.. గడిచిన నాలుగు నెలల కాలంలో ప్రతినెలా ఆదాయం మూడువేల కోట్ల రూపాయల వరకు వస్తున్నట్లు తెలిపాయి. అయితే కొత్త ప్రభుత్వంపై ప్రజల ఆకాంక్షలు అధికంగా ఉన్న నేపథ్యంలో పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ వనరులను పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం నియమించిన ఆదాయ సమీకరణ టాస్క్‌ఫోర్స్ కమిటీ పలు సిఫారసులతో నివేదిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. -
ఆగని దందా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా, ఉన్నతాధికారుల కనుసన్నలలో మెలుగుతూ, మాట తప్పకుండా మామూళ్లు ఇచ్చేవారికే చెక్‌పోస్టులలో ప్రాధాన్యం దక్కుతుందన్న చర్చ కూడా ఉంది. రవాణా శాఖ డీటీసీ, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, సీటీ ఓ కార్యాలయాలలో కీలక స్థానాలలో కొనసాగుతున్న కొందరు అధికారులు ఏడాదికోసారి చెక్‌పోస్టు డ్యూటీల ను ఖరారు చేస్తూ పెద్ద మొత్తంలో వాటాలు, నజరానాలు పొందుతున్నారని ఆ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో అయితే డిప్యూటీ కమిషనర్‌తోపాటు సీటీఓలను ప్రసన్నం చేసుకుంటేనే సాలూర, మద్నూరు చెక్‌పోస్టులలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ)ల నియామకం జరుగుతుందంటున్నారు. రోజువారీ వసూళ్లు రూ.లక్షల్లోనే సాలూర, సలాబత్పూర్, పొందుర్తి చెక్పోస్ట్టులలో వసూళ్ల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. తరచూ జరుగుతున్న ఏసీబీ దాడులలో బయట పడుతున్న అక్రమ వసూళ్ల బాగోతాలే ఇందుకు సాక్ష్యాలు. ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని మరీ అధికారులు లక్షలు గడిస్తున్నారు. ఉన్న తాధికారులు పట్టించుకోకపోవడం, స్థానిక పరి స్థితులు వారికి కలిసి వస్తున్నాయి. ఆడపాదడపా ఏసీబీ అధికారులు దాడులు చేసినా అక్రమ వసూళ్ల పర్వాన్ని నియంత్రించలేకపోతున్నారు. మహారాష్ట్రకు సరిహద్దున, బోధన్ మండల కేంద్రానికి పది కిలో మీటర్ల దూరంలో సాలూర వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. రవాణా, వాణిజ్య పన్నుల, పౌర సరఫరాల, ఎక్సైజ్ శాఖలతో పాటు వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు కూడా ఉంది. ఈ ఉమ్మడి తనిఖీ కేంద్రానికి వాణిజ్య పన్నుల శాఖకు చెందిన డీసీటీఓ స్థాయి అధికారి ఏఓ (అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్)గా వ్యవహరిస్తారు. సాలూరతోపాటు మద్నూరు చెక్‌పోస్టు, పొందుర్తి ఆర్టీఏ చెక్‌పాయింట్ ద్వారా పెద్ద సంఖ్యలో వాహనాలు రకరకాల సరుకులతో వెళ్తుంటాయి. ఆ వాహనాల నుంచి ప్రతి చెక్‌పోస్టులో ఎంట్రీల పేరిట వసూలుకు తోడు రకరకాల కారణాలతో రోజూ సుమారుగా రూ.75 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే అధికారుల ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. లారీకో రేటు చెక్‌పోస్టులలో లారీకో రేటు ఖరారు చేసి వసూలు చేయడం ‘మామూలు’గా మారింది. సరుకుల అక్రమ రావాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ఈ తనిఖీ కేంద్రాలలో, నిబంధనలకు అనుగుణంగా సరుకులు రవాణా చేసినా చేతులు తడపనిదే లారీలు కదలనివ్వని పరిస్థితి నెలకొందని కొందరు వ్యాపారులే వాపోతున్నారు. రోజూ ఈ చెక్‌పోస్టుల ద్వారా పెద్ద సంఖ్యలో లారీలు వెళ్తున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అమ్మకపు పన్ను (వ్యాట్), రవాణా అనుమతి పత్రాలు (వేబిల్లు) చూపి ంచినా, అడి గినంత సమర్పించుకున్నాకే లారీలు కదులనిస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. అన్నిరకాల కాగితాలు ఉన్నా, మామూళ్ల తతంగం పూర్తయితేనే ముద్ర వేయడం ఆనవాయితీగా మార్చారు. ఇంత జరుగుతున్నా చెక్‌పోస్టుల డ్యూటీల కోసం పోటీపడుతున్న అధికారులు, వారిని ప్రోత్సహిస్తున్న ఉన్నతాధికారులపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
డీజిల్‌పై ఒకే పన్ను విధానం!
రాష్ట్రాలతో సంప్రదింపులకు సిద్ధమైన కేంద్రం న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లోనూ డీజిల్ ధర ఒకే స్థాయిలో ఉండేలా చూసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. డీజిల్‌పై ఒకే పన్ను విధానం అమలు చేసే యత్నాల్లో భాగంగా రాష్ర్ట ప్రభుత్వాలతో సంప్రదింపులకు సిద్ధమైంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పన్నులను అధికంగా విధిస్తుండటం వల్ల ఆయా ప్రాంతాల్లో డీజిల్ రేటు అధికంగా ఉంటోంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 57.84గా ఉంటే.. మహారాష్ర్టలోని ముంబైలో మాత్రం ఇది రూ. 66.01గా ఉంది. స్థానికంగా విధిస్తున్న పన్నుల(సేల్స్‌ట్యాక్స్ లేదా వ్యాట్‌తో పాటు ఆక్ట్రాయ్, ఎంట్రీ టాక్స్ వంటి ఇతర పన్నులు)తో కలిపి ఒక్కో రాష్ర్టంలో ఒక్కో రేటు ఉంటోంది. ఇలాంటి విధానానికి స్వస్తి పలికి దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా డీజిల్‌పై స్థానికంగా అధిక పన్నులు వసూలు చేస్తున్న 12 రాష్ట్రాలను ప్రత్యేక భేటీకి ఆహ్వానిస్తూ కేంద్రం లేఖ రాసింది. ఈ నెలాఖరున 6 రాష్ట్రాలతో(అస్సాం, బీహార్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్, కేరళ), వచ్చే నెల 5, 6 తేదీల్లో మరో 6 రాష్ట్రాలతో(మహారాష్ర్ట, ఎంపీ, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, యూపీ) చర్చలు జరపాలని నిర్ణయిం చింది. వినియోగదారులకు అనుకూల విధానాలను పాటించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిపింది. -
జూన్ 1 వరకు ఉమ్మడి రాష్ట్రంలోనే రిటర్నులు
విశాఖపట్నం: అమ్మకపు పన్ను (సేల్స్ ట్యాక్స్) రిటర్నుల దాఖలు జూన్ 1 వరకు ఉమ్మడి రాష్ట్రం ప్రాతిపదికగానే జరగనున్నట్టు విశ్రాంత అదనపు ముఖ్య కార్యదర్శి, వాణిజ్య పన్నులకు సంబంధించి రాష్ట్రాల పునర్విభజన కమిటీ సలహాదారు అశుతోష్ మిశ్రా స్పష్టం చేశారు. నగరంలోని ఓ హోటల్లో బుధవారం చాంబర్ ఆఫ్ కామర్స్, ఫ్యాప్సీ, డీలర్లతో సమావేశం జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖలో వ్యాపారస్తులకు ఉత్పన్నమయ్యే సమస్యలపై అవగాహన కల్పించారు. ఇప్పటికే అమల్లో ఉన్న అడ్వాన్స్ రూలింగ్స్ ఉభయ రాష్ట్రాల్లోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆన్లైన్ దరఖాస్తుకు నెలాఖరు గడువు సమావేశంలో తొలుత కొత్త టిన్ నంబర్లు తీసుకునే ందుకు విధివిధానాలు, డీలర్ల హెల్ప్ డెస్క్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు నింపడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీలర్లకు అవగాహన కల్పించారు. హా ఆంధ్రప్రదేశ్/తెలంగాణా/రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ కొత్త టిన్ నంబర్ పొందవచ్చన్నారు. తమ చిరునామా, బ్యాంకు ఖాతా, పాన్ నంబర్ తదితర వివరాల్ని కూడా మార్చుకునే అవకాశం కల్పించారు. ఇందుకు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువిచ్చారు. 1. ప్రస్తుతం 11 అంకెల టిన్ నంబర్లో రాష్ట్రాన్ని సూచించే రెండంకెలు 28 కాగా, కొత్త రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 37, తెలంగాణాకు 36 నెంబర్‌ను కేటాయించారు. 2.ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న డీలర్లకు మే 8 నాటికి టిన్ నెంబర్ జనరేట్ చేస్తారు. 3. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా జూన్ 2 తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు(ఆర్సీ) వారు పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా పంపించనున్నారు. 4.ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా జూన్ 1 వరకు ఉమ్మడి రాష్ట్రంలోను, జూన్ 2 నుంచి కొత్త రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. హా కొత్త సి-ఫారాలు కూడా జూన్ 2 తర్వాతే అందిస్తారు. ఇప్పటికే తీసుకున్న పాత ఫారాలుంటే.. వాటిపై కొత్త టిన్ నెంబర్‌ను రబ్బరు స్టాంపు ద్వారా ముద్రించి వినియోగించుకోవచ్చన్నారు. -
‘వాణిజ్యం’పై సమైక్య సమ్మెట!
అయినా లక్ష్యంలో 82.53 శాతం వసూళ్లు అదనపు ఆదాయ వసూలులో ముందంజ అమ్మకపు పన్ను వసూళ్లు రూ.1294.12 కోట్లు విశాఖ డివిజన్ డీసీ టి.శివశంకరరావు సాక్షి, విశాఖపట్నం : ‘సమైక్యాంధ్ర ఉద్యమంతో వ్యాపారాలు మందగించాయి. కస్టమ్స్ సుంకం పెంపు, నిబంధనలు కఠినతరం కావడంతో బులియన్ రాబడి తగ్గుముఖం పట్టింది. ఈ విభాగంలో ఒక్క ఎంఎంటీఎస్ డీలర్ ద్వారానే రూ.31 కోట్లు తక్కువగా అమ్మకపు పన్ను వసూలు జరిగింది. వరుస సమ్మెలతో పారిశ్రామిక రంగం డీలాపడింది. అయినా 2012-13 ఆర్థిక సంవత్సరం అమ్మకపు పన్ను వసూలు (రూ.1254.16 కోట్లు) కంటే ఇటీవల ముగిసిన ఆర్ధికేడాదిలో 3.19 శాతం (రూ.39.96 కోట్లు) వృద్ధితో రూ.1294.12 కోట్లు వసూలు సాధించినట్టు’ విశాఖపట్నం డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ టి.శివశంకరరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి డివిజన్ సాధించిన అమ్మకపు పన్ను, వసూళ్ల ప్రగతిని వివరించారు. ప్రధాన డివిజన్లలో ముందంజ : గత ఏడాది వ్యాట్ రూ.1254.16 కోట్లు వసూలవగా, ఈసారి రూ.1294.12 కోట్లు వసూలైంది. గతేడాది పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో ఉండటంతో అమ్మకపు పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1568.06 కోట్లలో 82.53 శాతం మాత్రమే సాధించగలిగినట్టు పేర్కొన్నారు. పన్నేతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంతో కలిపితే రూ.1351.47 కోట్లు వసూలైనట్టు తెలిపారు. డివిజన్లో 58 శాతంగా ఉన్న ఎల్టీయూ సర్కిల్ ఈ సారి కేవలం 0.15 శాతం మాత్రమే ప్రగతి నమోదు చేసుకుందన్నారు. రూ.130 కోట్లు వరకు ఈ ఒక్క విభాగంలోనే గతంలోకంటే గతేడాదికంటే పన్ను వసూళ్లు తగ్గడంతో ఆ ప్రభావం డివిజన్‌పై స్పష్టంగా కనిపించిందన్నారు. పనిచేసే సిబ్బందిని ప్రోత్సహించడం, తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం, ఆడిట్లపై అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆశించిన స్థాయిలో వ సూళ్లు సాధించగలిగినట్టు తెలిపారు. భారీ క్షీణత వీటిలోనే.. కొన్ని ప్రధాన సంస్థలు 2012-13 కంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో భారీ క్షీణత నమోదు చేసుకున్నాయి. ఎంఎంటీసీ 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.205.32 కోట్లు అమ్మకపు పన్ను చెల్లించింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఇది రూ.117.42 కోట్లుకు తగ్గింది. ఈసారి ఇందులో కూడా రూ.31 కోట్లు తక్కువగా ఈ సంస్థ పన్ను చెల్లించింది. ఆర్థిక సమస్యలతో పీఎస్ఎల్ లిమిటెడ్ సంస్థ గతంలో కంటే రూ.13 కోట్లు తక్కువగా చెల్లించింది. ఎన్టీపీసీ ఆర్డర్స్ లేక బొగ్గు దిగుమతులు క్షీణించి కోస్టల్ ఎనర్జీ సంస్థ కూడా 29 కోట్లు తక్కువగా పన్ను చెల్లించింది.