⇒ ఏడుగురిపై విచారణ ప్రారంభం
⇒ నిందితుల అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని బ్యాంకులకు లేఖలు
సాక్షి, హైదరాబాద్: సేల్స్ ట్యాక్స్‌ను అప్పనంగా సొంత ఖాతాల్లోకి మళ్లించిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై సీఐడీ సోమవారం విచారణ ప్రారంభించింది. 2012–13, 2013–14 సంవత్సరాల్లో బోధన్‌లోని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తమ పరిధిలో ఉన్న రైసుమిల్లుల నుంచి 5 శాతం సేల్స్ ట్యాక్స్ వసూలు చేసి.. సర్కార్ ట్రెజరీలో డిపాజిట్ చేయకుండా రూ. 60 కోట్ల మేర గండి కొట్టినట్టు సీఐడీ ప్రాథమిక విచారణలో బయటపడింది.
ఇందులో భాగంగా నలుగురు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, ముగ్గురు ప్రైవేటు వ్యక్తులపై సీఐడీ దృష్టి సారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురి బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని సీఐడీ బ్యాంకులకు లేఖలు రాసింది. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల ప్రాథమిక విచారణలో కొన్ని నకిలీ చలాన్లు బయటపడ్డాయని, అయితే అది ప్రాథమికంగా రూ. 60 కోట్లుగా తేలిందని, స్కాం జరిగిన రెండేళ్లతో పాటు ఆ తర్వాత ఏడాదినీ పరిశీలించాల్సి ఉందని సీఐడీ అధికారులు తెలిపారు. స్కాం విలువ రూ.100 కోట్లు దాటినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
సేల్స్‌ట్యాక్స్ అక్రమ అధికారులపై సీఐడీ నజర్
Published Tue, Feb 14 2017 3:30 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM
Advertisement
Advertisement