నకిలీబాబాకు దేహశుద్ధి చేసిన బోరంచ గ్రామస్తులు
మనూరు(నారాయణఖేడ్): గ్రామాల్లోని ప్రజల ముఢనమ్మకాలను ఆసరా చేసుకుని అమాయక జనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ బాబాకు స్థానిక బోరంచ గ్రామస్తులు దేహశుద్ధి చేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. గత ఆదివారం బోరంచలో గ్రామంలో ఓ యువకుడు ఫకీరు వేషధారణలో గ్రామంలో పర్యటిస్తూ మీ ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని నిమ్మకాయలు, నీళ్లు చల్లుతూ తిరుగుతూ గ్రామానికి చెందిన రజాక్ ఇంటికి వెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తానని వారిని నమ్మబలికి వారి నుంచి రూ.5 వేలు నగదుతోపాటు ఒక సెల్‌ఫోను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించి గ్రామం చివరికి వచ్చి వేషం మార్చుకుని వెళ్లిపోయాడు.
కాగా మళ్లి బోరంచ గ్రామం పక్కనే ఉన్న దుదగొండ గ్రామంలో సోమవారం ప్రత్యక్షమయ్యాడు. అక్కడ కూడా గ్రామస్తులకు నమ్మబలికే ప్రయత్నం చెయ్యగా ఈ విషయం ముందే తెలుసుకున్న గ్రామస్తులు సదురు వ్యక్తిని బంధించి బోరంచ గ్రామస్తులకు అప్పగించారు. దీంతో వారు నకిలీ బాబాను చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా యువకుడు కర్ణాటకలోని గుల్బర్గకు చెందిన మనోజ్‌గా గుర్తించడం జరిగిందన్నారు. మారు వేషాలువేస్తూ అమాయక జనం ముఢనమ్మకాలను ఆసరా చేసుకుని బురిడి బాబాగా తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా సంబంధిత యువకుడిని మనూరు పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment