పోలీసులా.. మజాకా...! | tamilnadu police filed false case on senior citizen | Sakshi
Sakshi News home page

పోలీసులా.. మజాకా...!

Published Sun, May 21 2017 1:47 PM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

tamilnadu police filed false case on senior citizen

– 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు
– కోర్టు ప్రశ్నలతో పోలీసుల ఉక్కిరి బిక్కిరి
– సమగ్ర విచారణకు ఆదేశం


చెన్నై: పోలీసులు తలచుకుంటే తప్పు చేయని వాడి మీద కూడా కేసుల మోతతో  ఊచలు లెక్కించేలా చేస్తారన్న నానుడికి అద్దంపట్టే రీతిలో ఇటీవల ఓ వృద్ధుడి మీద కేసు నమోదైంది. 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు పెట్టడం కోర్టును సైతం విస్మయంలో పడేసినట్టుంది. కోర్టు ప్రశ్నలతో చెన్నై పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. సమగ్ర విచారణకు ఆదేశిస్తూ, ఆ వృద్ధుడికి నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు అయింది.

ఆర్కేనగర్‌ – మణలి రోడ్డులో  ఉన్న ఎలిల్‌ నగర్‌కు చెందిన వేదక్కన్‌ నాడార్‌ (74)పై గత నెల పోలీసులు ఓ కేసు పెట్టారు. రెండు కేజీల వంద గ్రామాలు గంజాయిని తన ఇంటి బీరువాలో దాచి ఉంచిన అభియోగంపై ఆర్కేనగర్‌ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆగమేఘాలపై కోర్టుకు హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టారు.

కోర్టు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి :  పిటిషనర్‌ తరపున న్యాయవాది ఆర్‌ రాజన్‌ హాజరై వాదన వినిపించారు.  రూ 1000 కోట్ల విలువచేసే 250 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు సాగాయని, సాగుతున్నాయని, ఇందుకు అడ్డుగా ఉన్న వేదక్కన్‌ నాడార్‌ను గురిపెట్టి ఈ తప్పుడు కేసు బనాయించారని  వాదించారు. పోలీసులు కాలయాపణ చేస్తూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం లేదని బెంచ్‌ దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి.

74 వృద్ధుడి మీద ఈ కేసు నమోదు కావడం బట్టి చూస్తే,  తప్పుడు కేసు బనాయించారా..? మరేదైనా కారణాలు ఉన్నాయా..?  ఉంటే, సమగ్ర విచారణకు సాగించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసును ప్రత్యేక అధికారి ద్వారా విచారించేందుకు తగ్గ చర్యలు చేపట్టాలని చెన్నై పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. అలాగే, వేదక్కన్‌ నాడార్‌కు నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement