రాష్ట్ర విభజన అంశం మరో మలుపు తిరిగింది.
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశం మరో మలుపు తిరిగింది. మళ్లీ అఖిలపక్షం తెరపైకి వచ్చింది. విభజన వివాదాలు పరిష్కరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు చర్చించేందుకు పార్లమెంటులో ప్రతితిధ్యం వహించే పార్టీ సభ్యులతో ఒక కమిటీ వేయాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఈ విషయమై ఈ రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన విషయమై ఎంపిల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత సీమాంధ్రలో ఉద్యమం ఉధృతం కావడంతో సమస్యను పరిష్కరించడం కేంద్రానికి మరింత జఠిలమైపోయింది. ఈ స్థితిలో ఏం చేయాలో అర్ధంకాని స్థితిలో కేంద్రం ఉంది. ఇందుకోసం పార్లమెంటులో ప్రతితిధ్యం వహించే పార్టీ సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్న కొత్త ఆలోచన చేస్తోంది.