All Party Committee
-
ఆర్ఎఫ్సీఎల్ అధికారులతో అఖిలపక్ష కమిటీ భేటీ
ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవినీతితోపాటు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ముంజ హరీశ్ కుటుంబ పరిస్థితిపై అఖిలపక్ష కమిటీ గురువారం యాజమాన్యంతో చర్చించింది. దళారుల చేతిలో మోసపోయి ఇటీవల ఆత్మ హత్య చేసుకున్న హరీశ్ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పించాలని, మోసపోయిన కార్మికులకు తిరిగి ఉపాధి కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే చందర్, అఖిలపక్ష కమిటీ సభ్యులు ఆర్ఎఫ్సీఎల్ అధికారులను కోరా రు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆర్ఎఫ్సీఎల్ అధికారులు హరీశ్ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధి చూపేందుకు అంగీకరించారు. -
సర్కార్ దిగిరాకపోతే సకల జనుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్టీసీ సంఘాల తో చర్చలు జరిపి ప్రభుత్వం విలీన చర్యలు చేపట్టకపోతే సమ్మె ఉధృతం చేయనున్నట్టు ఆర్టీసీ జేఏసీ, రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల అఖిల పక్ష సమావేశం ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు టీపీసీసీ, టీజేఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ (రెండు గ్రూపులు), టీటీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీ, జనసేన, శివసేన, ఎమ్మార్పీఎస్, బీసీ సంక్షే మ సంఘం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ, వివిధ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అలాగే భవిష్యత్ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని తమ సహకారాన్ని అందిస్తామని వెల్లడించాయి. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాకపోతే మరో సకల జనుల సమ్మెకు సిద్ధం కావాలని అఖిల పక్ష నేతలు నిర్ణయించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్ నిర్వ హించాలని నిర్ణయించినా, గురువారం మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మరోసారి భేటీ అయ్యి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. సమ్మెలో భాగంగా గురువారం డిపోల ఎదుట నిరసనలు, ఎమ్మార్వోలకు వినతిపత్రాల సమర్పణ, త్వరలోనే గవర్నర్‌కు మెమోరాండం అందజేయనున్నారు. అందరూ పాల్గొనాలి: కోదండరాం ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెగా ఉన్నది కాస్తా సకల జనుల సమ్మెగా మారాల్సి ఉందని, ఇందులో ప్రధాన రాజకీయ పార్టీలు, కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పాల్గొనాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. సమ్మె కొనసాగిస్తాం: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ సమ్మె కొనసాగించి తీరుతామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి స్పష్టం చేశారు. కాడిని మధ్యలో దించే ప్రసక్తేలేదని, తమ సంఘం ఏ పార్టీకి అనుబంధం కాదని చెప్పారు. ఆర్టీసీలో 48 వేల ఉద్యోగాలు తీసేసే హక్కు సీఎంకు లేదని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని, దీనిపై పోరాటానికి న్యాయ పరమైన సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు తెలిపారు. కేసీఆర్ బెదిరింపులకు భయ పడేది లేదని, ఆర్టీసీకి సంబంధించి ఎలాంటి పోరాటానికి అయినా మద్దతునిచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి చెప్పారు. కార్మికులెవరూ అధైర్యపడొద్దని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ చెప్పారు. ముందే మద్దతిచ్చాం: చాడ సెల్ప్ డిస్మిస్ అనేది అత్యంత ఘోరమైన పదమని, ఇట్లా పిచ్చోడు కూడా మాట్లాడడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. సమ్మె మొదలుకాక ముందే టీఆర్ఎస్కు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ మద్దతునిచ్చిందని, ఆర్టీసీ ప్రైవేటీకరణను సహించేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కోసం పోరాడాలి.. ఆర్టీసీ నిర్వీర్యం చేసి ప్రైవేటుకు కట్టబెట్టే కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్ అహంకారానికి అడ్డుకట్ట వేసేందుకు పోరాటం కొనసాగించాలని చెప్పారు. ఆర్టీసీ ఓడితే, తెలంగాణ ఓడిపోయినట్టేనని అందువల్ల అన్ని వర్గాలు కలసి ఈ సంస్థ పరిరక్షణకు పోరాడాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పిలుపునిచ్చారు. సీఎం ప్రతిష్టకు పోకుండా సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 48 వేల మందిని ఒక్క కలం పోటుతో డిస్మిస్ చేస్తామంటే, చరిత్రలో నియంతలకు పట్టిన గతే సీఎంకు పడుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ భేటీలో విమలక్క (టీయూఎఫ్), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ), జిట్టా బాలకృష్ణారెడ్డి (యువ తెలంగాణ పార్టీ), రాజిరెడ్డి, థామస్‌రెడ్డి (ఆర్టీసీ జేఏసీ), చిక్కుడు ప్రభాకర్ (తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక), సాధినేని వెంకటేశ్వరరావు, పోటురంగారావు (న్యూడెమోక్రసీ రెండు వర్గాలు), భుజంగరావు, సదానందం, విజయ్‌మోహన్, దత్తాత్రేయ (ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు)ఇతర సంఘాల వారు పాల్గొన్నారు. సమ్మెపై ఉత్కంఠ: నేడు విచారించనున్న హైకోర్టు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను విరమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ కొనసాగించనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్‌సింగ్ దాఖ లు చేసిన పిల్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారణ కొనసాగించనుంది. వ్యాజ్యం దాఖలు వెనుక ప్రజాహితమే లేదని, కార్మిక సంఘాల ప్రయోజనం దాగి ఉందని చెప్పి ప్రభు త్వం తన వైఖరిని వెల్లడించిందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. సమ్మె చట్ట విరుద్ధమని, వెంటనే సమ్మె విరమించేలా హైకో ర్టు 2015లో వెలువరించిన మధ్యంతర ఉత్తర్వుల మాదిరిగానే ఇప్పుడు కూడా ఇవ్వాలని పిటిషనర్ కోరుతున్నారు. గురువారం నాటి విచారణలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వ వివరణ ఇవ్వనుంది. -
29న జిల్లా బంద్
కడప వైఎస్ఆర్ సర్కిల్ :రాష్ట్ర విభజన చట్టంలో తెలిపిన విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కోరుతూ ఈ నెల 29న అఖిల పక్షం తలపెట్టిన జిల్లా బంద్‌ను జయప్రదం చేయాలని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని తెలిపారు. గత ఎన్నికల సమయంలో దోస్తీగా ఉన్న బీజేపీ, టీడీపీలు రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చుతామని సృష్టంగా చెప్పి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం తగదన్నారు. నాలు గేళ్లు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోకుండా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలను మభ్య పెట్టేందుకు దొంగపోరాటాలు చేయడం సరికాదన్నారు. టీడీపీ నాయకులు ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేస్తూ అధికారులను సైతం తమ పార్టీ కార్యకలాపాలకు వాడుకోవడం దారుణమన్నారు. టీడీపీ చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పాలక ప్రభుత్వాలు కమిటీల పేరుతో కాలయాపన చేసి నేడు పరిశ్రమ ఏర్పాటుకు ïఫీజు బిలీటీ లేదని చెప్పడం సరికాదన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు కావాల్సిన ముడిసరుకు, విద్యుత్, రవాణా, నీటి సౌకర్యం వంటివి మెండుగా ఉన్నా.. టీడీపీకి జిల్లాలో ఓట్లు, సీట్లు రాలేదనే అక్కసుతోనే జిల్లా అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు. విభజన హామీల కోసం కేంద్రంతో పోరాడకుండా నాలుగు సంవత్సరాలు అసమర్దపు పాలన చేసి రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురి చేశారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధనే లక్ష్యంగా ఈ నెల 28న తలపెట్టిన రహదారుల దిగ్బంధనం, 29న తలపెట్టిన ఉక్కు బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, విద్యా, వ్యాపార సంస్దలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన నాయకులు పాల్గొన్నారు. -
మండలాన్ని విడగొట్టొద్దు
హత్నూర: ప్రజలకు ఇష్టం లేకుండా హత్నూర మండలాన్ని విడగొట్టొదని జెడ్పీటీసీ పల్లెజయశ్రీ అన్నారు. బుధవారం మండలంలోని దౌల్తాబాద్‌లో అఖిలపక్షం నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హత్నూర మండలాన్ని ఒక్కటిగా ఉంచి సంగారెడ్డి జిల్లాలో కలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డికి చేరువలో ఉన్న హత్నూర ప్రజలు మండలాన్ని రెండుగా చీల్చేందుకు ఇష్టపడటం లేదన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మండలాన్ని, డివిజన్ సైతం సంగారెడ్డిలో కొనసాగించేలా ప్రకటించడం హర్షణీయమన్నారు. అఖిలపక్షం నాయకులు దామోదర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, హకీం, కొన్యాల వెంకటేశం మాట్లాడుతూ హత్నూర మండలాన్ని విడదీయొద్దని, ఒకవేళ ప్రభుత్వమే విడదీయాలనుకుంటస్త్ర దౌల్తాబాద్‌ను మండల కేంద్రం చేయాలన్నారు. ప్రజలు రెండు మండలాలను కోరుకోవడం లేదన్నారు. రెండు మండలాలను విభజించి రాజకీయ నాయకుల మధ్య చిచ్చుపెట్టి హత్నూర మండలాన్ని మెదక్ జిల్లాలో కలిపేందుకు కొందరు స్వార్థపరులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సమావేశంలో అఖిలపక్షం నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, శివశంకర్‌రావు, సర్పంచులు శ్రీకాంత్, గౌరీశంకర్, దామోదర్‌రెడ్డి, లక్ష్మిక్రిష్ణ, ఉపసర్పంచ్ శివరాజ్, రమేష్, బక్కరవితోపాటు మండలంలోని అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. మంత్రి హరీశ్‌రావును కలిసిన అఖిలపక్షం నాయకులు హత్నూర మండలాన్ని రెండు ముక్కలు చేయకుండా ఒకటిగా ఉంచుతూ సంంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలని అఖిలపక్షం నాయకులు సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డిను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం హత్నూర మండలాన్ని సంగారెడ్డిలో కొనసాగిస్తున్నట్లు ప్రకటించినందుకు మంత్రి హరీశ్‌రావుకు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు. -
కాంగ్రెస్ కొత్త కమిటీ ఎత్తుగడ!
* కీలక బిల్లుల ఆమోదం కోసం వ్యూహం * ‘ఆల్ పార్టీ కమిటీ’ వేస్తామని సీమాంధ్ర ఎంపీల వద్ద ప్రతిపాదన * పార్లమెంటు సమావేశాలకు సహకరించాలన్న కమల్‌నాథ్ * జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న పలువురు సభ్యులు * అవసరం లేదన్న కాంగ్రెస్.. ఆందోళన విరమణకు నో అన్న ఎంపీలు * నేడు స్పీకర్ సమక్షంలో అఖిలపక్ష పార్లమెంటరీ నేతల సమావేశం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకించే పేరుతో సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు కార్యక్రమాలను స్తంభింపచేస్తుండటంతో.. కీలకమైన ఆహార భద్రత, భూసేకరణ బిల్లులను పార్లమెంటులో ఆమోదించటానికి కాంగ్రెస్ ‘ఆల్ పార్టీ కమిటీ’ అనే కొత్త ఎత్తుగడను ముందుకు తీసుకువచ్చింది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ బిల్లులకు ఆమోదం పొందలేకపోతున్న యూపీఏ సర్కారు.. గురువారం సభలో ఆందోళన చేస్తున్న సీమాంధ్ర సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సభ్యుల సస్పెన్షన్‌ను ప్రతిపాదిస్తూ అధికారపక్షం లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పారీలన్నీ వ్యతిరేకించటంతో తీవ్ర గందరగోళం తలెత్తింది. దీంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కొత్త వ్యూహంతో మరో కొత్త కమిటీ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. సీమాంధ్ర సభ్యులు పార్లమెంటులో ఆందోళనను విరమించి సభ సజావుగా సాగటానికి సహకరించాలని.. వారి ఆందోళనలను పరిశీలించటానికి జాతీయ పార్టీల సభ్యులతో ఆల్ పార్టీ కమిటీని ఏర్పాటు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ప్రతిపాదించారు. విభజన నిర్ణయం తీసుకున్నది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని.. కేంద్రం ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆందోళన విరమించి.. తమ అభ్యంతరాలను ఆల్ పార్టీ కమిటీకి వివరించాలని సూచించారు. ఈ కమిటీ పేరుతో పార్లమెంటు సజావుగా సాగేలా చేసుకుని.. ఆహార భద్రత తదితర బిల్లులకు ఆమోదం పొందవచ్చనేది కాంగ్రెస్ ఎత్తుగడగా తెలుస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల ఎదుట విడివిడిగా కమిటీ ప్రతిపాదన చేయగా.. తొలుత వారి నుంచి మిశ్రమ స్పందన లభించినట్లు సమాచారం. కొందరు ఆల్ పార్టీ కమిటీ బదులుగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించగా.. అలాంటి కమిటీ అవసరం లేదని కమల్‌నాథ్ పేర్కొన్నట్లు చెప్తున్నారు. ఈ విషయంలో సీమాంధ్ర ఎంపీలతో సీపీఐ తదితర పార్టీల నేతలు గురుదాస్‌దాస్‌గుప్తా వంటి వారు కూడా దౌత్యం నెరపినట్లు తెలిసింది. దీనిపై ఆలోచించి చెప్తామన్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తర్వాత కేవీపీ నివాసంలో సమావేశమై మళ్లీ కమిటీలకు ఒప్పుకుని ఆందోళన విరమిస్తే ప్రజల దృష్టిలో మరింత చులకన అవుతామని భావించి.. ఆందోళన కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపధ్యంలో లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్.. పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం ఉదయం పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. -
మరో మలుపు తిరిగిన విభజన అంశం
-
మరో మలుపు తిరిగిన విభజన అంశం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశం మరో మలుపు తిరిగింది. మళ్లీ అఖిలపక్షం తెరపైకి వచ్చింది. విభజన వివాదాలు పరిష్కరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు చర్చించేందుకు పార్లమెంటులో ప్రతితిధ్యం వహించే పార్టీ సభ్యులతో ఒక కమిటీ వేయాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఈ విషయమై ఈ రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన విషయమై ఎంపిల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత సీమాంధ్రలో ఉద్యమం ఉధృతం కావడంతో సమస్యను పరిష్కరించడం కేంద్రానికి మరింత జఠిలమైపోయింది. ఈ స్థితిలో ఏం చేయాలో అర్ధంకాని స్థితిలో కేంద్రం ఉంది. ఇందుకోసం పార్లమెంటులో ప్రతితిధ్యం వహించే పార్టీ సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్న కొత్త ఆలోచన చేస్తోంది.