
సమావేశంలో మాట్లాడుతున్న అఖిలపక్షం నాయకులు
హత్నూర: ప్రజలకు ఇష్టం లేకుండా హత్నూర మండలాన్ని విడగొట్టొదని జెడ్పీటీసీ పల్లెజయశ్రీ అన్నారు. బుధవారం మండలంలోని దౌల్తాబాద్‌లో అఖిలపక్షం నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హత్నూర మండలాన్ని ఒక్కటిగా ఉంచి సంగారెడ్డి జిల్లాలో కలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సంగారెడ్డికి చేరువలో ఉన్న హత్నూర ప్రజలు మండలాన్ని రెండుగా చీల్చేందుకు ఇష్టపడటం లేదన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మండలాన్ని, డివిజన్ సైతం సంగారెడ్డిలో కొనసాగించేలా ప్రకటించడం హర్షణీయమన్నారు. అఖిలపక్షం నాయకులు దామోదర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, హకీం, కొన్యాల వెంకటేశం మాట్లాడుతూ హత్నూర మండలాన్ని విడదీయొద్దని, ఒకవేళ ప్రభుత్వమే విడదీయాలనుకుంటస్త్ర దౌల్తాబాద్‌ను మండల కేంద్రం చేయాలన్నారు.
ప్రజలు రెండు మండలాలను కోరుకోవడం లేదన్నారు. రెండు మండలాలను విభజించి రాజకీయ నాయకుల మధ్య చిచ్చుపెట్టి హత్నూర మండలాన్ని మెదక్ జిల్లాలో కలిపేందుకు కొందరు స్వార్థపరులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సమావేశంలో అఖిలపక్షం నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, శివశంకర్‌రావు, సర్పంచులు శ్రీకాంత్, గౌరీశంకర్, దామోదర్‌రెడ్డి, లక్ష్మిక్రిష్ణ, ఉపసర్పంచ్ శివరాజ్, రమేష్, బక్కరవితోపాటు మండలంలోని అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్‌రావును కలిసిన అఖిలపక్షం నాయకులు
హత్నూర మండలాన్ని రెండు ముక్కలు చేయకుండా ఒకటిగా ఉంచుతూ సంంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలని అఖిలపక్షం నాయకులు సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డిను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం హత్నూర మండలాన్ని సంగారెడ్డిలో కొనసాగిస్తున్నట్లు ప్రకటించినందుకు మంత్రి హరీశ్‌రావుకు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు.