
ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవినీతితోపాటు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ముంజ హరీశ్ కుటుంబ పరిస్థితిపై అఖిలపక్ష కమిటీ గురువారం యాజమాన్యంతో చర్చించింది. దళారుల చేతిలో మోసపోయి ఇటీవల ఆత్మ హత్య చేసుకున్న హరీశ్ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పించాలని, మోసపోయిన కార్మికులకు తిరిగి ఉపాధి కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే చందర్, అఖిలపక్ష కమిటీ సభ్యులు ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులను కోరా రు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులు హరీశ్ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధి చూపేందుకు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment