సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు సీఐబీ కోర్టు కస్టడీ విధించింది. 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి సీబీఐ స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది. విచారణ సమయంలో కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలవడానికి అనుమతి ఇచ్చింది.
ఈ కేసులో మరో నిందితుడు చందన్‌ను ఈడీ అధికారులు కొట్టారంటూ శరత్ తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. బలవంతంగా చందన్ స్టేట్‌మెంట్ తీసుకున్నారన్నారు. ఈడీ అధికారులు కొట్టిన దెబ్బలకు చందన్ చెవి దెబ్బతిందని శరత్ తరపు లాయర్ అన్నారు. బలవంతంగా తీసుకున్న స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు చందన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈడీ సోదాల్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదని శరత్ తరఫు న్యాయవాది అన్నారు.
చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment