న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సీబీఐ కేసులో తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మే24 వాయిదా వేసింది.
కాగా ఇప్పటికే లిక్కర్ పాలసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై మే 10న ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్ల విచారణను మే 24న చేపట్టనుంది. ప్రస్తుతం లిక్కర్ పాలసీ ఈడీ సీబీఐ కేసుల్లో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.
లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను మే 6న ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక మద్యం పాలసీకి సంబంధించి ఈడీ కేసులో మార్చి 15న, సీబీఐ కేసులో ఏప్రిల్11న కవిత అరెస్ట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment