న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి తెరమీదకొచ్చింది. మాగుంట రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. ఇండోస్పిరిట్‌లో కవిత ప్రతినిధిగా అరుణ్‌పిళ్లై వ్యవహరించారని ఈడీ.. కోర్టుకు తెలిపింది.
కాగా మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. సౌత్ గ్రూపులో కవితతో పాటు శరత్ రెడ్డి, మాగుంట రాఘవ ఉన్నారని తెలిపింది. అనంతరం రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీని కోర్టు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment