ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టారు. సీబీఐ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జూన్ 3 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment