k kavitha
-
తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్
-
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టారు. సీబీఐ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జూన్ 3 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
-
సీఎం రేవంత్ కొత్త జీవో..సోనియాకు కవిత లేఖ
-
రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పటం మానుకో..తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్ర వారికి
-
60 రోజుల్లో కాంగ్రెస్ చేసిందేంటి ?: కవిత
-
ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
-
మాస్ స్టెప్పులతో అదరగొట్టిన కేటీఆర్, కవిత
-
గులాబీల జెండాలమ్మ పాటకు ఎమ్మెల్సీ కవిత, ప్రశాంత్ రెడ్డి డ్యాన్స్
-
ఎమ్మెల్సీ కవితకు ఊరట
-
కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా.. ఈడీ ఆఫీసుకు వెళ్తారా?
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ ఈనెల 26వ తేదీ వరకూ వాయిదా పడింది. అయితే, లిక్కర్ స్కాం కేసులో భాగంగా మహిళను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన అనంతరం.. వాయిదా వేసింది. విచారణకు రావాల్సిందే.. ఇక, విచారణ సందర్బంగా తదుపరి విచారణ వరకు ఈడీ సమన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ వాదనలు వినిపించింది. అంతగా కావాలంటే కవితకు 10 రోజులు సమయం ఇస్తామని ఈడీ పేర్కొంది. నేను రాను.. తేల్చుకుందాం! ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం లేదా శనివారం విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కవిత కోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో తాను ఈడీ విచారణను రాలేనని అధికారులకు తెలిపారు. కోర్టులో తాడోపేడో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. తాజాగా కవిత పిటిషన్‌పై విచారణను వాయిదా వేయడంతో ఆమె.. రేపు ఈడీ విచారణకు వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: కవితకు ఈడీ నోటీసులు.. మంత్రి మల్లారెడ్డి రియాక్షన్ ఇదే.. -
హైదరాబాద్ లో తన ఇంట్లోనే ఎమ్మెల్సీ కవిత
-
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ ఈడీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) విచారణకు రావాలని నోటీసులు పంపించింది. వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్బంగా రేపే విచారణను రావాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అయితే, ఈ కేసులో అరుణ్ రామచంద్రపిళ్లై నిన్ననే(బుధవారం) అప్రూవర్‌గా మారారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇవ్వగా దాన్ని ఈడీ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది మార్చి 7న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నుంచి పలు అంశాలు రాబట్టారు. అరుణ్పిళ్లై ఏం చెప్పారు? ఈ విచారణ సమయంలోనే అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. పిళ్లై వాంగ్మూలం ఆధారంగా విచారణకు రావాలంటూ కవితకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఆమెను విచారించారు. ఈ ఏడాది మార్చి 11వ తేదీన ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరయ్యే సమయంలో పిళ్లై తన నిర్ణయం మార్చుకున్నారు. ఈడీ అధికారులు తనపై ఒత్తిడి చేసి కవిత పేరు చెప్పించారంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ కొనసాగుతుండగానే తాజాగా ఆయన మరోసారి అప్రూవర్‌గా మారినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ట్విస్ట్.. ఇదిలా ఉండగా.. తాజాగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. లిక్కర్ స్కాం కేసులో ఇన్ని రోజులు ఎలాంటి విచారణ లేకపోవడంతో ఈ కేసు విషయంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ తాజాగా కవితను ఈడీ విచారణకు పిలవడం హాట్ టాపిక్‌గా మారింది. రానున్న కాలంలో ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ -
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపులు.. ఓఎస్డీపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపులు, దాడులు అరికట్టాలని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చెప్పాలి. ఢిల్లీ కేంద్రంగా రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ బుషన్ ఘటన మరువకముందే మరో బ్రిజ్ బుషన్ ఆగడాల వెలుగులోకి వచ్చాయి. తాజాగా తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి బండారం బట్టబయలైంది. అయితే అధికారులు మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదని.. లైంగిక వేధింపుల అధికారికి మంత్రి అండదండలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా బాలికలపై వేధింపుల ఘటనను ఎమ్మెల్సీ కవిత సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై స్పందిస్తూ.. తక్షణమే సదరు అధికారిపై చర్యలు చేపట్టాలని, విచారణ జరిపి బాధితురాళ్లకు న్యాయం జరిపించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ మంత్రికి ట్యాగ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోము. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. @raokavitha అక్క, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తాం. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి… https://t.co/O2rDflRUWU — V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023 -
క్షమాపణ చెప్పాల్సిందే, లేకుంటే రాష్ట్రంలో తిరగనివ్వం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్:బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న ఉచిత కరెంట్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా అటు రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలపై మండిపడ్డారు. రైతుకు వ్యవసాయం పండగ కావాలంటే నీళ్ళు, రైతు బంధు ఇస్తున్నామని.. వ్యాపార వేత్తలకు కరెంట్ ఇవ్వొదని రేవంత్ రెడ్డి చెప్పడం సమజసం కాదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు ఉచిత కరెంట్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసిఆర్ పాన లో వ్యవసాయం పండగ అయ్యిందని.. 24 గంటల కరెంటు కచ్చితంగా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. గ్రామంలో కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బేశరుతుగా కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తెలంగాణలో తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. కాగా తెలంగాణ రైతాంగానికి మొత్తానికి ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్ మాత్రం విద్యుత్ సంస్థల నుంచి కమీషన్ల కోసమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయంగా వేడిని రాజేశాయి. చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా! -
కవిత ఫోన్లలో ఏముంది?.. ఈడీ ఆఫీసుకు అడ్వకేట్ భరత్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. ఇక, లిక్కర్ స్కాం కేసులో కవిత ఫోన్లకు సంబంధించి కూడా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఫోన్లను ఓపెన్ చేస్తున్నారు. అయితే, ఫోన్లను తెరుస్తున్న క్రమంలో సాక్షిగా కవిత లేదా ఆమె ప్రతినిధిని ఈడీ ఆఫీసుకు రావాలని అధికారులు కోరారు. దీంతో, కవిత అడ్వకేట్ సోమ భరత్ రెండో రోజు కూడా ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. వరుసగా రెండో రోజు భరత్.. ఈడీ ఆఫీసుకు వెళ్లారు. భరత్ సమక్షంలో కవిత ఫోన్ డేటాను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. ఈ నెల 21న జరిగిన విచారణలో 9 ఫోన్లను కవిత ఈడీ అధికారులకు కవర్లో అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో, కవిత ఫోన్లలో ఏముంది? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్‌కు షాక్.. -
ఢిల్లీ బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణపై సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కవిత మరోసారి ఢిల్లీకి బయలుదేరారు. వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈనెల 20వ తేదీన విచారణను రావాలని ఈడీ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కవిత ఢిల్లీకి వెళ్లారు. ఇక, కవిత వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ రావు కూడా ఉన్నారు. అయితే, ఎమ్మెల్సీ కవిత.. రేపు ఈడీ ఎదుట హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈడీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కవిత.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలో కవిత.. న్యాయవాదిని పంపించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టును ఈడీ ఆశ్రయించింది. కవిత పిటిషన్‌పై కేవీయట్ పిటిషన్ వేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ప్రకటించవద్దని ఈడీ.. సుప్రీం కోర్టును కోరింది. ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో భారీ ట్విస్ట్ -
లిక్కర్ స్కాం కేసులో ఊహించని ట్విస్ట్..
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాంలో మరో ఉహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ శనివారం సుప్రీం కోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కోర్టు ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయకుండా ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. కాగా, పిటిషన్ ప్రకారం.. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ప్రకటించవద్దని ఈడీ.. సుప్రీం కోర్టును కోరింది. దీంతో, లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్ చోటుచేసుకున్నట్టు అయ్యింది. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. అయితే, కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈనెల 24వ తేదీన విచారణ చేపట్టనుంది. ఇక, కవితను ఈనెల 20వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఈడీ లేఖ రాసిన సంగతి విధితమే. ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాం కేసు.. కవితకు షాకిచ్చిన ఈడీ -
ఈడీ పరిధి మించి ప్రవర్తిస్తోంది: మంత్రి జగదీశ్ రెడ్డి
సాక్షి,సూర్యాపేట: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ పరిధి మించి ప్రవర్తిస్తోందని, చట్టప్రకారం విచారణ జరగడం లేదని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి' మండిపడ్డారు. గురువారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళను రాత్రి వరకు విచారిస్తామంటే అది ముమ్మాటికీ వేధించడమే, రాజకీయ కక్ష సాధింపు చర్యేనని చెప్పారు. బీజేపీ పార్టీ నాయకుల ఆలోచనలు, స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ పనిచేస్తోందని, విచారణ సంస్థల పేరుతో బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సిగ్గు చేటని దుయ్యబట్టారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా విచారణ పేరుతో కవితను వేధిస్తున్నారన్నారు. కవిత ఎక్కడికి పారిపోవడం లేదని, విచారణకు సహకరిస్తానని చెప్పినా కూడా రాత్రి సమయం వరకు విచారించడం వేధించడమేనని జగదీశ్‌రెడ్డి అన్నారు. మహిళల హక్కులను గౌరవించాల్సింది పోయి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టి దేశాన్ని రక్షిస్తామన్నారు. -
లిక్కర్ స్కాం కేసు: కవితకు మళ్లీ ఈడీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత నేడు(గురువారం) రెండోసారి విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. వెళ్లలేదు. దీంతో, ఈడీ కవితకు మళ్లీ నోటీసులు పంపించింది. తాజాగా నోటీసుల్లో ఈనెల 20వ తేదీన కవిత విచారణకు హాజరు కావాలని పేర్కొంది. దీంతో, ఈడీ నోటీసులపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరగనున్న విషయం తెలిసిందే. మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు రామచంద్ర పిళ్లైను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు.. పిళ్లైకి మూడు రోజుల పాటు కస్టడీని పొడగించింది. అయితే, పిళ్లైని ఎమ్మెల్సీ కవితతోపాటు విచారించాల్సి ఉందని ఈడీ పేర్కొంది. ఈ కేసులో గురువారం కవిత విచారణకు హాజరు కానందున పిళ్లై కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. దీంతో, ఈడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్బంగా లిక్కర్ స్కాం కేసులో కవిత అనుమానునితురాలే అని ఈడీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్ ఇచ్చారు. తాను విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు తెలిపారు. తన న్యాయవాది ద్వారా సమాచారం పంపారు. ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ఈడీకి 6 పేజీల లేఖ రాశారు. 'కోర్టు తీర్పు వచ్చే వరకు కేసులో ఎలాంటి విచారణ సరికాదు. ఈ పరిస్థితుల్లో సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయండి. మహిళను ఈడీ ఆఫీస్‌కి విచారణకు పిలవచ్చా అనే అంశం కూడా కోర్టులో పెండింగ్‌లో ఉంది. చట్ట సభ ప్రతినిధిగా చట్టాలు చేసే నాకు చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి నా ముందు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటాను. నా ప్రతినిధి సోమా భరత్ ద్వారా నా బ్యాంక్ స్టేట్మెంట్ సహా మీరు అడిగిన పత్రాలు పంపుతున్నాను.' అని ఈడీకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘కవితను ఇబ్బంది పెడుతున్నారు..ఈడీ రాత్రి వేళ ప్రశ్నించడమేంటి?’ -
బుచ్చిబాబు, పిళ్లై ఏం చెప్పారు?.. కవిత విచారణపై టెన్షన్!
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత గురువారం మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్లనున్నారు. లిక్కర్ స్కాంలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతో, రెండోసారి కవిత విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఫిబ్రవరి 11న ఈడీ అధికారులు కవితను 9 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. కాగా.. లిక్కర్ స్కాం కేసులో బుచ్చిబాబును బుధవారం ఈడీ ప్రశ్నిస్తోంది. ఈడీ అధికారులు అరుణ్ పిళ్లైతో కలిపి బుచ్చిబాబును ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, సమావేశాలు, ముడుపులతో ఈడీ ఆరా తీస్తోంది. ఇక, కన్ఫ్రాంటేషన్ పద్దతిలో ప్రశ్నించేందుకు పిళ్లై కస్టడీని పొడిగించాలని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇదిలా ఉండగా.. రేపు కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు.. ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన విషయంలో ఈడీ చట్ట విరుద్దంగా వ్యవహరించిందన్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదన్నారు. కొంత మంది వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో తనను ఇరికించినట్టు ఆరోపణలు చేశారు. ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందన్నారు. చందన్ రెడ్డి అనే సాక్షిని కొట్టడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరారు. తనపై ఎలాంటి బలవంతపు(అరెస్ట్ వంటి) చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. -
ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది.. కవిత సంచలన కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత.. లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది. అయితే, కవిత తన పిటిషన్లో కీలక వివరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత.. అధికార పార్టీ ఆదేశాలతో ఈడీ నన్ను వేధిస్తోంది. నా విషయంలో ఈడీ చట్ట విరుద్దంగా వ్యవహరించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్లో నా పేరు ఎక్కడా లేదు. కొంత మంది వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో నన్ను ఇరికించారు. నాకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్లకు విశ్వసనీయత లేదు. ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంది. చందన్ రెడ్డి అనే సాక్షిని కొట్టడమే దీనికి నిదర్శనం. అరుణ్ రామచంద్ర పిళ్లైను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈడీ అధికారులు నా సెల్‌ఫోన్‌ను బలవంతంగా తీసుకున్నారు. చట్ట విరుద్ధంగా నా ఫోన్ సీజ్ చేశారు. నా ఫోన్ సీజ్ చేసిన సమయంలో నా వివరణ తీసుకోలేదు. నా నివాసంలో లేదా వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ జరపాలి అని పేర్కొన్నారు. అలాగే, ఈ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరారు. తనపై ఎలాంటి బలవంతపు(అరెస్ట్ వంటి) చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. -
బీజేపీలో ఏం జరుగుతోంది!.. అర్వింద్‌కు అధిష్టానం నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం కమలదళంలో దుమారం రేపుతోంది. బండి వ్యాఖ్యలను బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇప్పటికే తప్పు బట్టగా తాజాగా ఆర్వింద్ వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనంటూ బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీని యర్ నేత పేరాల శేఖర్‌రావు సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం పార్టీ నేతల్లో మరింత కలకలా నికి కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీలోని కొందరు నేతలు అర్వింద్, శేఖర్‌రావు వ్యాఖ్యలను సమ ర్థిస్తుండగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటివి పార్టీకి నష్టం చేస్తాయని మరికొందరు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా అర్వింద్ ఖండించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. అదే సమయంలో సంజయ్ వ్యవహారశైలి, రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదని, అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అర్వింద్ చేసిన వ్యాఖ్యలను మరికొందరు సమర్థిస్తున్నారు. అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా సంజయ్‌పై శేఖర్‌రావు మరిన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించడంతో పార్టీలో అంతర్గతంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని నేతలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మరోవైపు వివిధ జిల్లాల్లోనూ పార్టీ ముఖ్య నేతల మధ్య పొసగక గ్రూపుల గందరగోళం కూడా పెరిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ నేతల్లో గందరగోళం..! అర్వింద్‌కు అధిష్టానం నోటీసులు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పార్టీ ఎంపీ అర్వింద్ బహిరంగ విమర్శలు చేయడంపై ఇప్పటికే పంచాయితీ ఢిల్లీ అధిష్టానం వద్దకు చేరింది. ఈ వ్యవహారంపై అర్వింద్‌కు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ అధిష్టానం నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. శేఖర్‌రావు ఏమన్నారంటే... రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె.లక్ష్మణ్ వంటి పెద్దలు చేయాల్సిన పనినే అర్వింద్ చేశారని శేఖర్‌రావు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అధ్యక్షుడి పరిణతిలేని అసందర్భ మాటలు, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు బీజేపీలో ప్రస్తుత పరిస్థితి కారణమని దుయ్యబట్టారు. బ్లాక్మెయిల్, అంతర్గత సెటిల్మెంట్లు, కార్యకర్తలకు అవమానం, ఒంటెద్దు పోకడలు, సమన్వయలోపం, వ్యక్తిగత ఆర్థిక స్వార్థం, వాడుకొని వదిలేసే విధానం బీజేపీ సంస్కృతి కాదని శేఖర్‌రావు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇవన్నీ పార్టీలో యథేచ్చగా నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో గ్రానైట్ క్వారీల్లో అక్రమ తవ్వకాలంటూ ప్రచారం చేసి యజమానులతో అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఓ వార్తా చానల్లో ఓ ప్రముఖుడి మైనింగ్ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేసి ఆపై సెటిల్మెంట్లు చేసుకోవడం, ఆ చానల్లో నలుగురు పార్టీ నేతలతో రూ. కోట్లలో పెట్టుబడి పెట్టించి నట్టేట ముంచడం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వైస్‌చైర్మన్ పదవిని ఆర్థిక కారణాలతో కొత్తవారికి కట్టబెట్టడం, హుజురాబాద్‌లో ఈటల గెలుపు అనంతరం ఏర్పడిన వాతావరణాన్ని ఖతం చేయడం వంటి చర్యలకు బండి సంజయ్ పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు. వాటన్నింటినీ ఉదాహరణలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. పార్టీలో వినే సంస్కృతి, చర్చించే పద్ధతి మాయమైనప్పుడు సోషల్ మీడియానే ఆధారమవుతోందని శేఖర్‌రావు తెలిపారు. -
పిళ్లైను మేం బెదిరించలేదు: ఈడీ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మార్చి 15వ తేదీన తమ ముందు హాజరు కావాలని అందులో ఆదేశించింది ఈడీ. కవిత బినామీగా పేర్కొన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి బుచ్చిబాబును విచారించాలని ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలో.. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో సోమవారం ఈడీ ఇవాళ అరుణ్ రామచంద్ర పిళ్లైను హాజరుపర్చి.. కీలక వాదనలు వినిపించింది. తన వాంగ్మూలం ఉపసంహరించుకునేందుకు ఆయన స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. ‘‘చాలా కీలక సమయంలో పిళ్ళై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. పిళ్ళై విచారణకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయి. విచారణ సమయంలో పిళ్లైను ఒత్తిడి చేయలేదు, బెదిరించలేదు. టార్చర్ కూడా చేయలేదు’’ అని కోర్టును తెలిపింది ఈడీ. పిళ్లై 2022, సెప్టెంబరు 18వ తేదీన పూర్తి స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్, థర్డ్ స్టేట్మెంట్లలో కూడా వివరాలు మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఆయనను టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్మెంట్ లలో ఎలా కన్ఫర్మ్ చేస్తారు?. మార్చి తర్వాతే స్టేట్ మెంట్ మార్చుకున్నారు?. ఆయన స్టేట్ మెంట్ ఎందుకు మార్చుకున్నారో అర్థమవుతోంది. ఒక బలమైన వ్యక్తిని మేము సమ్మన్ చేసినప్పుడు పిళ్లై తన స్టేట్మెంట్ మార్చుకున్నారు’’ అని ఈడీ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో.. సాయంత్రం 4 గంటలకు తీర్పును వాయిదా వేసింది కోర్టు. అంతేకాదు.. బుచ్చిబాబుతో కలిపి పిళ్లైని మరోసారి విచారించాలని కోర్టుకు కోరుతూ.. మరో మూడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరుతోంది. ‘‘కస్టడీ మరో మూడు రోజులు పొడిగించండి. ఇతర నిందితులతో కలిపి విచారణ చేయాలి. మరి కొంతమందికి సమన్లు ఇవ్వాల్సి ఉంది. రామచంద్ర పిళ్లై కస్టడీ అవసరం’ అని ఈ సందర్భంగా ఈడీ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ అయిన గోరంట్ల బుచ్చిబాబును ఫిబ్రవరి 8వ తేదీన సీబీఐ అరెస్ట్ చేయగా.. మార్చి 6వ తేదీన బెయిల్ మీద బయటకు వచ్చారు. -
16న మళ్లీ రావాలి.. కవిత ఈడీ విచారణలో ఏం జరిగింది?
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం కవితను విచారించింది. ఈ కేసులో సౌత్ గ్రూప్ పాత్రపై కూడా విచారణ జరిగినట్లు తెలిసింది. ఆరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టు, ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. పీఎంఎల్ఏ50(2) ప్రకారం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ప్రశ్నించింది. సౌత్ గ్రూఫ్ నిధులు, మద్యం కుంభకోణం, వీటితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారితో గతంలో జరిగిన భేటీలు లాంటి అంశాలపై కవితను ఈడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ మధ్యలో సాయంత్రం విరామ సమయం ఇచ్చి.. అనంతరం తిరిగి విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో కవితను దాదాపు 9 గంటలపాటు ఈడీ అధికారులు విచారణ కొనసాగింది. ఈ నెల 16న కవిత మళ్లీ విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. చదవండి: బంపరాఫర్! ఇంటర్‌తో సాఫ్ట్వేర్ జాబ్.. తెలంగాణ ప్రభుత్వ చర్యలు