
మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు : కవిత
న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్లో గతంలో కంటే తెలంగాణకు ఈసారి అధికంగా నిధులు వచ్చాయని నిజామాబాద్ ఎంపీ కె. కవిత వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్పై కవిత న్యూఢిల్లీలో స్పందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనేది రైల్వే బడ్జెట్ ద్వారా వెల్లడయిందని ఆమె తెలిపారు. పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్కు రూ. 140 కోట్లు కేటాయించినందుకు మోదీ ప్రభుత్వానికి ఈ సందర్బంగా కవిత కృతజ్ఞతలు చెప్పారు.