Nizamabad MP
-
రేవంత్ కంటే కేసీఆరే మంచోడు: ఎంపీ అర్వింద్
సాక్షి, మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆదివారం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆరే మంచోడని అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కోరుట్లలో అర్వింద్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించి దూసుకుపోతున్నారు. ఇంట్రస్టింగ్ కామెంట్లతో పాటు తిట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే అర్వింద్ రేవంత్ కంటే కేసీఆర్ మంచోడని అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ పోరు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగగ్రెస్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే రేవంత్ కంటే కేసీఆర్ బెటరని అర్వింద్ అన్నట్లు తెలుస్తోంది. -
నన్ను ఆపడానికి మీరెవరు?
-
తమాషా చేస్తున్నారా.. నన్ను ఆపడానికి మీరెవరు?
సాక్షి, బంజారాహిల్స్: ‘నన్ను ఆపడానికి మీరెవరంటూ’ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాను భైంసాకు వెళ్తున్నట్లు సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన బంజారాహిల్స్ పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరవింద్‌ను అడ్డుకునేందుకు ఇంటి వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే ఆయన వెళ్లిపోయినట్లు తెలియడంతో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఆర్. కళింగరావు, ఎస్ఐలు బాలరాజు, కె.ఉదయ్‌తో పాటు పోలీసులు పెట్రోకార్లలో ఆయనను వెంబడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్‌హయత్ హోటల్ ముందు నుంచి వెళ్తున్న ధర్మపురి అరవింద్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోకార్లు రోడ్డుకు అడ్డంగా నిలిపి అడ్డుకున్నారు. దీంతో కారులో నుంచి దిగిన అరవింద్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఆపడానికి మీరెవరంటూ పోలీసులను నిలదీయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాను నిజామాబాద్ వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు. హిందువులను నాశనం చేయాలనుకున్నారా.. తమాషా చేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో సహకరించాలని ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. నిజామాబాద్ వెళ్తుంటే వద్దని చెప్పేందుకు ఆర్డర్ ఏదంటూ నిలదీశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసే అధికారం తమకు ఉందని పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చదవండి: నల్లధనం తేలేదు.. నల్ల కుబేరులను దేశం దాటించారు 15 నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ -
సీఎం ఎవరని అడిగితే ఎడమకాలి చెప్పు అని చెప్పాలి..
సాక్క్షి, మెట్పల్లి: కేసీఆర్ సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. అక్కడ ‘మన సీఎం ఎవరని అడిగితే.. ఇప్పటి నుంచి ఎడమ కాలి చెప్పు’ అని చెప్పాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్‌కు ఇద్దరు పెళ్లాలని.. ఒకరు టీఆర్ఎస్ అయితే, మరొకరు కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. -
కేరళ సీఎంతో ఎంపీ కవిత భేటీ
తిరువనంతపురం: పసుపునకు కనీస మద్దతు ధర కల్పించడం, పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ కవిత కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కోరారు. పసుపు రైతుల సంక్షేమం కోసం పసుపు బోర్డును జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని, పసుపు మద్దతు ధరను కేంద్రం నిర్ణయించేలా ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. తిరువనంతపురంలోని సీఎం కార్యాలయంలో ఊమెన్ చాందీని కవితతో పాటు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, విద్యాసాగర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కలసి ఓ లేఖ అందజేశారు. 'పసుపు రైతులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం వలన కష్టాలు పడుతున్నారు. మద్దతు ధర లేకపోవడం వల్ల దళారీలు లాభపడుతున్నారు. పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. పసుపును ప్రధానంగా ఆహారంలో, మందుల్లో, సౌందర్య సాధనాల్లో, హెయిర్ డై, వస్త్ర పరిశ్రమల్లో వాడుతున్నారు. విదేశాలకు అధికంగా ఎగుమతి అవుతున్న ఈ పంటకు మన దేశంలో కనీస మద్దతు ధర లేదు. పసుపు ప్రస్తుతం స్పైస్ బోర్డులో భాగంగా ఉంది. ఇది పసుపుతో పాటు దాదాపు ఇతర 54 పంటలను పర్యవేక్షిస్తోంది. అలా కాకుండా ఇప్పటికే ఉన్న పొగాకు, కాఫీ బోర్డుల వలే ఒక ప్రత్యేక బోర్డు పసుపు పంటకు ఉండడం అవసరం' అని లేఖలో పేర్కొన్నారు. 2014-15 సంవత్సరంలో కేరళ ప్రభుత్వం పసుపు రైతులకు హెక్టారుకు 12,500 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించడంతో ఎర్నాకులం, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కొల్లాం జిల్లాల పసుపు రైతులకు మేలు జరిగిందని కవిత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. బోర్డు ఏర్పాటు వల్ల కేరళకు చెందిన అల్లెప్పీ రకం పసుపు ఎగుమతులు పెరుగుతాయని కవిత చెప్పారు. కేరళ సీఎం ఊమెన్ చాందీ స్పందిస్తూ.. పసుపు పంటకు మద్దతు ధరను సాధించడం కోసం కేంద్రం పై సమష్టిగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోరుతూ తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. కవిత గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లను కలసి పసుపు బోర్డు ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా సమావేశమయ్యారు. -
ఘటనపై తక్షణమే విచారణకు అదేశించాలి
-
24న హైదరాబాద్‌కు కవిత
రాయికల్: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 24న నిర్వహించనున్న పార్టీ తొలి ప్లీనరీ సమావేశానికి హాజరు కానున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి అమెరికాలోని న్యూ జెర్సీ యూనివర్సిటీలో సెమినార్, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ ఆవిర్భావం వంటి పలు కార్యక్రమాల్లో కవిత బిజీ బిజీగా గడిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న తర్వాత జరుగుతున్న పార్టీ తొలి ప్లీనరీకి ఆమె హాజరుకానున్నారు. -
ఎంపీ కవితకు అస్వస్థత
రాయికల్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యూరు. సోమవారం కరీంనగర్ జిల్లా రారుుకల్‌లో చిన్న జీయర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ప్రజలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కళ్లు తిరగడంతో కవిత సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయి వాంతి చేసుకున్నారు. 15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకొని యధావిధిగా సభాప్రాంగణానికి వచ్చి వేదికపై కూర్చున్నారు. ప్రయాణం వల్లనే కవిత అస్వస్థతకు గురైనట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. -
అప్పుడు తెలంగాణకు అన్యాయం
- సీఎం కేసీఆర్ చొరవతో ఈసారి ప్రాధాన్యం - పెద్దపల్లి-నిజామాబాద్ రూట్‌కు భారీ నిధులు - కొత్త లైన్లకు ఆమోదం తెలిపితే బాగుండేది - బడ్జెట్‌పై ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందన సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘‘ఉమ్మడి రాష్ర్టంలో అనేక ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం జరుగుతూ వచ్చింది.తెలంగాణ సాధన అనంతరం తొలి రైల్వే బడ్టెట్ ఇది. సహచర ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి చొరవతో ఈసారి జరిగిన కేటాయింపులలో తెలంగాణ వాటా దక్కిందని భావిస్తున్నా. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ లై నుకు రూ.141 కోట్లు ఇవ్వ డం సంతోషకరం’’ అని పేర్కొన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. ‘‘గత బడ్జెట్లో రూ.35 కోట్లే కేటాయించడంతో పోలిస్తే ఇది హర్షించదగ్గదే. ఐతే ప్రజలు అ డుగుతున్నటువంటి మనోహరాబాద్-నిజామాబాద్ డబుల్ లైన్ పనులు, కొత్తలైన్లకు ఆమోదం తెలిపి కేటాయింపులు చేస్తే బాగుండేది. తె లంగాణకు ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాకు అవసరమైన ప్రాజెక్టుల కోసం నా ప్రయత్నం ఇక ముందు కూడా కొనసాగుతూ ఉంటుంది. తెలంగాణకు 14 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కూడా కేటాయించడం హర్షించదగ్గ విషయం. మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని కాపలా లేని గేట్ల విషయంలో చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి తీసుకోబోతున్న చర్యలు బాగానే ఉన్నాయి. స్టేషన్లలో సౌకర్యాలు, టాయిలెట్ల నిర్వహణ మెరుగుపర్చడం మంచి పరిణామం కాగా, రైల్వేలలో రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టాలనడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రైల్వేలు ఉమ్మడి జాబితాలోని అంశం కాదు. అది కేంద్రం పరిధిలోని అంశం. నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం కేంద్రం మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి ఈ ప్రతిపాదన సమంజసం కాదు. దేశానికి రైల్వేలు రక్తనాడుల వంటివి. దేశాభివృద్ధికి, వివిధ ప్రాంతాల సంతులిత అభివృద్ధిలో రైల్వేల పాత్ర కీలకం కాబట్టి ఆ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలి. ఇది బడ్జెట్లో కేటాయింపులు మాత్రమేనని, అసవరమైతే ప్రత్యేక పరిస్థితులలో, సప్లిమెంటరి బడ్జెట్లో మరిన్ని కేటాయింపులకు అవకాశం ఉం దని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. అందుకోసం కూడా ఎంపీగా మన ప్రయత్నాలు కొనసాగుతాయి’’ అని వివరించారు. -
మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు : కవిత
న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్లో గతంలో కంటే తెలంగాణకు ఈసారి అధికంగా నిధులు వచ్చాయని నిజామాబాద్ ఎంపీ కె. కవిత వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై కవిత న్యూఢిల్లీలో స్పందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనేది రైల్వే బడ్జెట్ ద్వారా వెల్లడయిందని ఆమె తెలిపారు. పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్‌కు రూ. 140 కోట్లు కేటాయించినందుకు మోదీ ప్రభుత్వానికి ఈ సందర్బంగా కవిత కృతజ్ఞతలు చెప్పారు. -
గ్రీన్ రన్‌ను ప్రారంభించిన ఎంపీ కవిత
-
‘రైల్వే బడ్జెట్లో నిజామాబాద్‌కు అన్యాయం’
నిజామాబాద్: రైల్యే బడ్టెట్‌లో జిల్లాకు అన్యాయం జరిగిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం ఆమె నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైను కేవలం ఇంకా 28 కి.మీటర్లు మాత్రమే ఉందని, ఇది సాధించుకోవడంలో విఫలమయ్యామన్నారు. ఈ పనులు పూర్తి కావాలంటే మరో రూ. 250 కోట్లు అవసరమన్నారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల విషయంలో కేంద్రం ఇంకా ఆలోచిస్తోందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొందరు అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ఐఏఎస్ అధికారుల పరిస్థితి త్వరలో తేలిపోతుందన్నారు. -
సభలో ఆ ఇద్దరు కృష్ణులు !
సోమవారం నుంచి మా వారిని అనుమతించండి: ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీపై టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. అనంతర పరిణామాలతో గురువారం పదిమంది టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కావడంతో శుక్రవారం ఆ పార్టీ నేతలు అటు జిల్లాల్లో, ఇటు నగరంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిం చారు. అయితే, ఆ పార్టీకి చెందిన ఇద్దరు కృష్ణులు (నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తు న్న ఎమ్మెల్యేలు) మాత్రం అసెంబ్లీకి వచ్చారు. అందులో ఒకరు చర్చలో పాల్గొని ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేశారు. గురువారం సభకు అంతరాయం కలిగించిన టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి విదితమే. దీంతో ఆ పార్టీనేతలు శుక్రవారం సాయంత్రం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు నేతలు జిల్లాల్లో ఆందోళనల్లో పాల్గొన్నారు. కానీ ఆ పార్టీకి చెందిన ఆర్.కృష్ణయ్య (ఎల్బీ నగర్), మాధవరం కృష్ణారావు(కూకట్పల్లి) శుక్రవారం సభకు హాజరయ్యారు. రెండురోజులకే సస్పెన్షన్ పరిమితం చేయాలి కొద్దిసేపటి తర్వాత కృష్ణారావు వెళ్లిపోయినా ఆర్.కృష్ణయ్య చివరిదాకా ఉన్నారు. బడ్జెట్‌పై వివరణ ఇచ్చేందుకు ఆర్థికమంత్రి ఉపక్రమిస్తుం డగా, తాను మాట్లాడతానని కృష్ణయ్య కోరారు. ‘బడ్జెట్‌పై మీరైనా మాట్లాడేందుకు సిద్ధపడడం సంతోషం.. అయితే క్లారిఫికేషన్స్ సమయంలో మాట్లాడండి’ అని స్పీకర్ సూచించడంతో ఆయన చివరి వరకు సభలోనే ఉన్నారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ, తమ సహచరుల సస్పెన్షన్‌ను రెండు రోజులకే పరిమితం చేయాలని అభ్యర్థించారు. సోమవారం నుంచి వారందరినీ సభకు అనుమతించాలని ఆయన స్పీకర్ కు విజ్ఞప్తిచేశారు. అనంతరం బీసీల సంక్షేమంపై సుదీర్ఘంగా ప్రసంగించి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. కాగా, సాయంత్రం ‘దేశం’ సభ్యులు, తమ సస్పెన్షన్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సమయంలో వారితో కలసి ఆయన కూడా రాజ్‌భవన్‌కు వెళ్లడం గమనార్హం. -
టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఘన స్వాగతం
హైదరాబాద్ : నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. కాగా నవంబర్ రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు లండన్ లోని కింగ్స్ కాలేజీలో నిర్వహించిన సెమినార్‌కు కవిత హాజరయ్యారు. పదవ తేదీ వరకు లండన్‌లో ఉన్న ఆమె అనంతరం స్కాట్లాండ్లో పర్యటించారు. -
'పవన్ కళ్యాణ్‌కి ఇప్పటికే దిమ్మ తిరిగింది'
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ కె. కవిత అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో కవిత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి... ఎన్ని రూపాయిలు ఇచ్చి బీజేపీ టిక్కెట్ కొనుకున్నాడో వెల్లడించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. అదికాక జగ్గారెడ్డి తరఫున కిషన్ రెడ్డి మాట్లాడటం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. మాపై విమర్శలు చేస్తే సహించేది లేదని బీజేపీ, టీడీపీలను కవిత హెచ్చరించారు. టీడీపీ, బీజేపీల గెలువడం అనైతికమైనదని ఆమె అభివర్ణించారు. ఇప్పటికే ఆ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కాదు.... తెలంగాణ ప్రభుత్వ విధానాలే మెదక్ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో గవర్నర్ గిరికి వ్యతిరేకంగా పోరాడిన ఘనత తమదేనని కవిత వెల్లడించారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు దిమ్మదిరిగే ఫలితాలు ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు కవిత సమాధానం చెబుతూ... తెలంగాణలో ఆయన ప్రచారం చేసిన వచ్చిన సీట్లు ఎన్నో ఆయా పార్టీలకే తెలియాలి. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఆయనకు ఇప్పటికే దిమ్మదిరిగిందని కవిత తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా టీడీపీని పట్టంచుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. -
ఎంపీ కవిత లేకుండానే వివరాలు నమోదు
నిజామాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరాలు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. కవిత అత్తవారి ఊరు నవీపేట మండలం పొతంగల్‌లోని అత్తామామలు ఆమె వివరాలు నమోదు చేయించారు. ఎంపీ స్థానికంగా లేకపోయినప్పటికీ ఆమె వివరాలు కూడా నమోదు చేయించారని సమాచారం. విలేకరులు ఈ విషయాన్ని కలెక్టర్ రొనాల్డ్ రాస్ దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవితపై కేసు నమోదు
హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కుమార్తె, నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలు కవితపై మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాశ్మీర్, తెలంగాణలను బలవంతంగా భారత్‌లో విలీనం చేశారని, కాశ్మీర్‌లోని కొన్ని భాగాలు భారత భూభాగంలోనివి కావని కవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ కరుణాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన 7వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు కవితపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఐపీసీ 124 (ఏ), 153 (ఏ), 505, సీఆర్పీసీ156 (3) సెక్షన్ల కింద కవితపై పోలీసులు కేసు నమోదు చేశారు.