
ఎంపీ కవిత లేకుండానే వివరాలు నమోదు
నిజామాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరాలు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. కవిత అత్తవారి ఊరు నవీపేట మండలం పొతంగల్‌లోని అత్తామామలు ఆమె వివరాలు నమోదు చేయించారు. ఎంపీ స్థానికంగా లేకపోయినప్పటికీ ఆమె వివరాలు కూడా నమోదు చేయించారని సమాచారం. విలేకరులు ఈ విషయాన్ని కలెక్టర్ రొనాల్డ్ రాస్ దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.