Comprehensive household survey
-
TG: 150 కోట్ల ఖర్చుతో పూర్తైన సమగ్ర కుటుంబ సర్వే
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పూర్తైంది. మొత్తం కోటి 13 లక్షల ఇండ్లను సర్వే చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.సర్వే కోసం 90వేల మంది సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. పూర్తైన సర్వే ఆధారంగా.. ఈ నెలాఖరులోపు ఓ సమగ్ర నివేదికను సర్కార్ తయారు చేయనున్నట్లు సమాచారం. -
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీసీ డెడికేషన్ కమిషన్ చీఫ్ వెంకటేశ్వర్లు
-
సంక్షేమ పథకాల విస్తృతికే సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతపర్చేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టినట్టు రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం అన్ని రకాల అంశాలతో ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వ హిస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 17వ తేదీనాటికి రాష్ట్రవ్యాప్తంగా 58.3% ఇళ్లను సర్వే చేశామని, నెలాఖరులోగా నూరుశాతం సర్వే పూర్తి చేస్తామన్నారు.ఇప్పటికే సర్వే చేసిన ఇళ్లకు సంబంధించి వివరాలను కంప్యూ టరీకరిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ప్రజల స్థితి గతులు తెలుసుకొని ప్రస్తుతం అమలు చేస్తున్న పథ కాలను విస్తృతం చేయడంతోపాటు కొత్త పథకాల అమలు కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగ పడుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా సర్వే ప్రక్రియను నిర్వ హిస్తోందన్నారు. తాజాగా చేప డుతున్న సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.మంచి ఉద్దేశంతో చేపడుతున్న సర్వేను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, అధికారులకు వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పథకాల్లో కోతపడుతుందని, పలు రకాల బెనిఫిట్స్ ఆగిపోతాయంటూ ప్రతిపక్ష పార్టీలు దుర్మార్గంగా మాట్లాడుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసిందని, కానీ ఆ సర్వేకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదన్నారు. ప్రజల ఆస్తులు తెలుసుకొని వాటిని కొల్లగొట్టేందుకు అప్పటి సర్వేను బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టే సర్వే దేశానికే ఆదర్శంగా నిలిపేలా ఉంటుందని చెప్పారు. -
మీకెందుకు చెప్పాలి?
‘‘మా ఆస్తుల వివరాలు, వార్షికాదాయం లెక్కలు ఎందుకు? స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతా వివరాలతో ఏం చేస్తారు? ధరణి పాస్‌బుక్ నంబర్ ఎందుకు చెప్పాలి? మేం ఎక్కడ రుణం తీసుకుంటే, ఎందుకోసం తీసుకుంటే ప్రభుత్వానికి ఎందుకు? వీటితో మాకొచ్చే ప్రయోజనం ఏంటి? రైతుబంధు రానప్పుడు భూముల వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఇల్లు ఎన్ని గజాల్లో ఉంటే ఏం చేస్తారు?.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో, ఏ వివరాలు చెబితే ఏ పథకాలకు కోతపెడతారో, రేషన్‌కార్డు ఏమైనా రద్దు చేస్తారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వివరాలు, ఉద్యోగం, వ్యాపారం వంటి వివరాలు చెప్పడానికి ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలనలో వెల్లడైన అంశాలివీ..సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాల సేకరణ గందరగోళంగా మారింది. పేర్లు, కులం, వృత్తి వంటి కొన్ని సాధారణ వివరాలను వెల్లడిస్తున్న జనం.. ఆర్థికపర అంశాలను వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. ప్రజల నుంచి సరైన సమాధానాలు రాకపోవడం, కొన్ని అంశాల్లో సందేహాలు వ్యక్తం చేస్తూ ఎదురు ప్రశ్నలు వేస్తుండటం, వారికి సర్దిచెప్పాల్సి రావడంతో సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. మరోవైపు పేద వర్గాల నుంచి మాత్రం సర్వేకు మంచి స్పందన కనిపిస్తోంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియలో భాగంగా... ఈ నెల 6వ తేదీ నుంచి ఇళ్లను గుర్తించి స్టిక్కర్లు వేసిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఎన్యూమరేటర్లు ఆ ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను సేకరించి, సర్వే ఫారాల్లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కాలమ్ నంబర్ 19 నుంచి తిప్పలు! రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు (56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు) ఉన్నాయి. సర్వే బుక్లెట్ రెండు భాగాలుగా ఉంది. మొదటి విభాగం (పార్ట్–1)లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలను వెల్లడించేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నా.. కాలమ్ నంబర్ 19 నుంచి వస్తున్న పలు ప్రశ్నలు ఆందోళన రేపుతున్నాయి. ప్రధానంగా వ్యాపారం వార్షిక టర్నోవర్, వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతా సమాచారం, భూములు, ధరణి పాసు పుస్తకం వివరాలు, భూమి కొనుగోలు కోసం వనరులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు చాలా మంది విముఖత చూపుతున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలను అడిగినప్పుడు.. ఆ వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నలు ఎన్యూమరేటర్లకు ఎదురవుతున్నాయి. ‘ఆర్థిక స్థితిగతుల’పై ఆందోళన సర్వే ప్రశ్నావళి రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు అడిగినప్పుడు ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. వాటికి సరైన సమాధానం రావడం లేదని ఎన్యూమరేటర్లు చెప్తు న్నారు. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, వాహనాలు, రేషన్‌కార్డు, నివాస గృహానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. బ్యాంకు రుణాలు, అప్పులు, ఆస్తులకు సంబంధించిన ప్ర శ్నలు అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయని వివరిస్తున్నారు. ‘మేం రుణాలు చెల్లించకుంటే ప్రభు త్వం చెల్లిస్తుందా? ఆస్తుల వివరాలు మేమెందుకు చెప్పాలి? మా కున్న అప్పులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఆదాయం వి వరాలు చెబితే పథకాలు వస్తాయా? ఉన్నవాటికి కోతపెడతారా?’ అని ప్రజలు నిలదీస్తున్నారని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు. శనివారమూ కొనసాగిన స్టిక్కరింగ్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ నెల 6వ తేదీనే ప్రారంభమైంది. 6, 7, 8వ తేదీల్లో ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లను పరిశీలించి యజమానులు, అద్దెదారుల వివరాలను తెలుసుకుని, స్టిక్కర్లు అంటించాలని, 9వ తేదీ నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు చేపట్టాలని నిర్ణయించారు. కానీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా స్టిక్కరింగ్ ప్రక్రియే కొనసాగింది. ఇళ్లకు తాళం ఉండటం, యజమానులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఇళ్ల విజిటింగ్, స్టిక్కరింగ్ ప్రక్రియలో జాప్యం జరిగినట్లు ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తయిందని.. ఆదివారం నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు కొనసాగుతుందని ప్రణాళిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల సేకరణలో తిప్పలు సర్వేలో ఒక్కో ఇంటికి సంబంధించి 75 ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం, 43 ప్రశ్నలకు బుక్లెట్ చూసుకుని కోడింగ్ వేయడం వేయడం ఎన్యూమరేటర్లకు తలకు మించిన భారమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 150 నుంచి 175 వరకు ఇళ్లను ఎన్యూమరేషన్ బ్లాక్‌గా విభజించి ఒక్కో ఎన్యూమరేటర్‌కు అప్పగించారు. రోజుకు 10 ఇళ్లలో సర్వే చేయాలని ఆదేశించారు. కానీ చాలా ప్రాంతాల్లో తొలిరోజు ఐదు, ఆరు ఇళ్ల సర్వేనే పూర్తయింది. కుటుంబాలు ఎక్కువగా ఉన్న ఇళ్లలో అయితే గంటకుపైనే సమయం పడుతోందని.. మధ్యాహ్నం నుంచి కాకుండా రోజంతా చేస్తేనే సర్వే పూర్తవుతుందని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. వివరాలు సేకరిస్తూ ఫామ్ నింపడం కష్టంగా ఉండటంతో కుటుంబ సభ్యులను సహాయకులుగా తీసుకెళుతున్నట్టు చెప్తున్నారు. ఇళ్లకు తాళాలతో ఇబ్బంది పంటల కోతల సమయం కావడంతో ఎన్యూమరేటర్లు ఎప్పుడు వస్తారో తెలియక రైతులు, కూలీలు పనులకు వెళ్తున్నారు. దీనితో సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు తాళాలు వేసిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో ఇళ్లలో ఎవరో ఒకరు ఉంటుండటంతో సర్వే ముందుకుసాగుతోంది. తాళాలు వేసిన ఇళ్లను గుర్తుంచుకుని మళ్లీ రావడం ఇబ్బందేనని ఎన్యూమరేటర్లు చెప్తున్నారు.జిల్లాల వారీగా ‘సర్వే’ తీరును పరిశీలిస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8,53,950 ఇళ్లు ఉండగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో శనివారం రాత్రి వరకు స్టిక్కరింగ్ పూర్తి కాలేదు. వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లడంతో చాలా ఇళ్లకు తాళం వేసి ఉంది. కొందరు ఇళ్ల యజమానులు వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. భద్రాద్రి జిల్లాలో సర్వే ఫామ్‌లు ఆలస్యంగా చేరాయి. ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే ఆ వివరాలు చెప్పలేదు. గొత్తికోయలకు ఆధార్‌కార్డులు, ఓటరు కార్డులు ఉన్నా కులం సర్టిఫికెట్లు లేక సర్వేలో ఏం రాయాలో స్పష్టత లేకుండా పోయింది. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది ఆదాయ వివరాలను సరిగ్గా చెప్పలేదు. ధరణి సమాచారం అడిగిన ఎన్యుమరేటర్లకు ‘మీకెందుకు?’అనే ప్రశ్న ఎదురైంది. రోజువారీ కూలీలు మొదటిరోజు పనులు వదులుకుని ఇంటి వద్దే ఉన్నా ఎన్యుమరేటర్లు రాక విసుగుపడటం కనిపించింది. ఇంటి నిర్మాణం, విస్తీర్ణంపై సమాధానాలు రాలేదు. ఐటీ రిటర్నులు, వడ్డీ వ్యాపారులు, కులాంతర వివాహాల సమాచారం రాబట్టలేకపోతున్నారు. ⇒ కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో శనివారం కూడా స్టిక్కరింగే కొనసాగింది. పలుచోట్ల కొందరు ఇంటికి స్టిక్కర్లు వేయవద్దంటూ నిరాకరించారు. ⇒ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్రాల కొరతతో సర్వే ఆలస్యంగా మొదలైంది. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు పది గృహాలను అప్పగించగా.. సమయం సరిపోక 5, 6 ఇళ్లే సర్వే చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో శనివారం రాత్రి వరకు కూడా స్టిక్కరింగ్ కొనసాగింది. రెండో శనివారం కావడంతో ఆరీ్పలు, ఉపాధ్యాయులు సర్వేకు హాజరుకాలేదు. బోధన్ నియోజకవర్గంలో సర్వే స్టిక్కర్లు వేయలేదని స్థానికులు చెప్పారు. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11,17,467 ఇళ్లు ఉండగా.. 8,231 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు, ఆస్తుల వివరాలను చెప్పడం లేదు. ఆధార్ నంబర్, పాస్‌బుక్ వివరాలు ఇచ్చేందుకు కూడా వెనకాడుతున్నారు. పట్టణాల్లో దాదాపు అన్ని వివరాలు చెబుతున్నా ఉద్యోగం, ఆస్తి వివరాలు దాటవేస్తున్నారు. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8.5 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు ఆస్తులు, భూములు, ఓపెన్ ప్లాట్ల వివరాలు చెప్పడం లేదు. ఇంట్లో ఉద్యోగం చేసే వారి వివరాలు చెప్పడం లేదు. ఉమ్మడి కుటుంబాల్లోని వారు వేర్వేరుగా వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు. ధరణి పాస్ బుక్ నంబర్, ఆధార్ కార్డులు వెతకడం, పట్టాపాస్ బుక్‌లు బ్యాంకుల్లో ఉండటంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. బెల్లంపల్లిలో చాలాచోట్ల వార్డు కౌన్సిలర్లు, నాయకులు అందరినీ ఒకేచోటకు పిలిపించి.. వివరాలు నమోదు చేయించారు. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 9,67,871 కుటుంబాలు ఉన్నాయి. రుణాలు, భూములు, ఆస్తి వివరాలు చెప్పడానికి చాలామంది ముందుకురాలేదు. బీసీ–ఈ, సీ సర్టిఫికెట్లు తీసుకున్న వారు చెప్పడానికి వెనుకంజ వేశారు. కొందరు మహిళా టీచర్లు తమ భర్త, పిల్లలను సహాయకులుగా తెచ్చుకున్నారు.రైతు భరోసా లేదు.. నేనెందుకు చెప్పాలి?వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిరి్నబావి ప్రాంతంలో నరిగె ఐలయ్య ఇంటికి సర్వే కోసం ఎన్యూమరేటర్ వెళ్లారు. కొన్నింటికి సమాధానాలు చెప్పిన ఐలయ్య.. వ్యక్తిగత ఆస్తుల విషయంలో సరిగా స్పందించలేదు. రైతు భరోసా రానప్పుడు భూమి వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నించారు. పింఛన్ ఎప్పుడు ఇస్తారని ఆరా తీశారు. ఎన్యూమరేటర్ సర్దిచెప్పడంతో చివరకు భూమి వివరాలు చెప్పినా.. ఈ కుటుంబం వద్దే రెండు గంటలు గడిచిపోయింది.అరగంట నుంచి గంట వరకు పడుతోంది.. మాకు రోజుకు 20 కుటుంబాల చొప్పున సర్వే చేయాలంటూ బుక్లెట్లు ఇచ్చారు. ప్రశ్నలు అడగడం, వాటి కోడ్ కోసం బుక్లెట్ చూడటం ఇబ్బందిగా ఉంది. డైరెక్ట్‌గా ఫామ్‌లోనే నమోదు చేసేలా ఉంటే బాగుండేది. సర్వేపై ప్రజలకు అవగాహన లేక సమాధానాలు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఒక కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే అరగంట నుంచి గంట వరకు సమయం పడుతోంది. – ఎన్.పారిజాత, ఎన్యుమరేటర్, నకిరేకల్, నల్లగొండ జిల్లావివరాలు చెప్పేందుకు వెనకాడుతున్నారు ఇంటి యజమానిని ప్రశ్నలన్నీ అడిగి పూర్తి చేయడానికి చా లా సమయం పడుతోంది. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. అవగాహన లేకపోవడంతో ఆస్తులకు సంబంధించిన వివరాలు చెప్పడానికి వెనుకాడుతున్నారు. కొన్ని ఇళ్ల వద్ద గంట దాకా సమయం పడుతోంది. సర్వే కోసం మరికొంత సమయం ఇవ్వాలి. – వేలిశెట్టి నరసింహారావు, ఎన్యుమరేటర్, వైరా, ఖమ్మం జిల్లా -
కుటుంబాలే గల్లంతు..
ఆన్లైన్లో కనిపించని పేర్లు * పట్టణంలో నమోదు కానివి.. * 263 కుటుంబాలు * పట్టణం పేర్లు పల్లెల్లోకి.. హుస్నాబాద్ : సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు గల్లంతయ్యూయి. హుస్నాబాద్ పట్టణంలోని రెండువందల కుటుంబాలకు సంబంధించిన సమాచారం ఆన్లైన్లో కనిపించకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించగా.. పట్టణంలో 6,943 కుటుంబాలు ఉన్నట్లు తేలింది. ఈ వివరాలను అధికారులు తిమ్మాపూర్ మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్లైన్లో న మోదు చేయించారు. అయితే సర్వేలో వివరాలను సమర్పించిన 263 కుటుంబాల సమాచారం ఆన్లైన్లో కనిపించడంలేదు. పట్టణంలోని పలువార్డులకు సంబంధించిన ఈ సమాచారం లేకపోవడంతో పింఛన్లు, ఆహారభద్రత కార్డులకోసం దరఖాస్తులు చేసుకున్న వారు వీటిని పొందలేని పరిస్థితి నెలకొంది. ఎవరిది తప్పు.. సమగ్రసర్వేలో అధికారులు సైతం నిర్లక్ష్యంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. అన్నింటికి సమగ్రసర్వే ఆధారమని ప్రభుత్వం ఓవైపు ప్రకటించినప్పటికీ స్థానిక అధికార యంత్రాంగం ఈ విషయంపై శ్రద ్ధ కనబర్చకపోవడంతో సమాచారం గల్లంతైనట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని 263 కుటుంబాల సమాచారాన్ని హుస్నాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లోని కుటుంబాలుగా నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పట్టణమని సర్వేపత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ గ్రామాల్లో ఎందుకు నమోదుచేశారనే దానిపై స్పష్టత కరువైంది. రూరల్‌లో 49 కుటుంబాల సమాచారం ఉన్నప్పటికీ మిగతా సమాచారం ఎక్కడికి వెళ్లందన్నది ఇప్పటికీ అంతుచిక్కడంలేదు. దీనిపై అర్హుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తిరిగి నమోదుకోసం ప్రయత్నాలు.. సమగ్రసర్వేలో గల్లంతైన కుటుంబాలను తిరిగి నమోదుచేసే ప్రక్రియను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ శాఖకు ఈ బాధ్యతలు అప్పగించనట్లు సమాచారం. ప్రత్యేక సాఫ్ట్వేర్ వస్తేనే నమోదుచేసేందుకు వీలుకల్గుతుంది. త్వరలోనే దీన్ని అందించి కుటుంబాల వివరాలను నమోదుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
'అవమానాలు పడ్డ చోటే.. లక్ష కోట్ల బడ్జెట్'
బడ్జెట్‌పై అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాసగౌడ్ లక్ష కోట్లకు పైగా బడ్జెట్‌ను పెట్టుకోవడం, ఏ అసెంబ్లీలో అవమానపడ్డారో అక్కడే కేటాయించుకోవడం పట్ల ప్రజలు గర్వపడుతున్నారు. ఉద్యమ నేతగా 14 ఏళ్లు పాటుపడిన సంపూర్ణ అవగాహనతో సీఎంగా కేసీఆర్ 43 అంశాలపై కేబినెట్ నిర్ణయాలు చేశారు. మన వూరు-మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే వంటి ఉపయోగపడే చర్యలు తీసుకున్నారు. 90 శాతం కులవృత్తులు చెరువులపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నందున చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు సీఎం చర్య తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తదితర వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచే చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ప్రీమియం లేకుండా హెల్త్‌కార్డులు, పీఆర్సీ ఉద్యోగులంతా సంతోషపడేలా ఉంటుంది. అయితే తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌పై, కేంద్ర ప్రభుత్వంపై పోట్లాడి సాధించుకునేందుకు పార్టీలకతీతంగా కలసి రావాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలి. రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ ఎందుకు రావడం లేదని పార్టీలకతీతంగా ప్రశ్నించాలి. రూ. వంద కోట్ల విలువైన విద్యుత్‌ను రాకుండా అటువైపు వారు అడ్డుకుంటున్నారు. తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించేలా కొందరు మాట్లాడుతున్నారు. కేవలం విద్యుత్‌కే కాకుండా నీళ్లు, బొగ్గు వంటి వాటిలో తెలంగాణకు కూడా తగిన వాటా రావాలి. -
అర్హులందరికీ ఆసరా
మెదక్: వయసు మళ్లిన నిరుపేద వృద్ధులు...వితంతువులు, వికలాంగులకు భారీ మొత్తంలో పింఛన్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అర్హులెవరికీ అన్యాయం జరగవద్దని, అనర్హులకు పింఛన్ పథకాన్ని కట్టబెట్టొద్దని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ, అధికారులు తమ ఇష్టారీతిగా సర్వే చేయడంతో పింఛన్ పథకం పల్లెల్లో చిచ్చు రేపుతోంది. పాపన్నపేట మండలంలో గతంలో 7,700 పింఛన్‌దారులు ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం సూచన మేరకు 11 వేల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 4,303 మందిని అధికారులు అర్హులుగా గుర్తించి కంప్యూటర్లో అప్లోడ్ చేశారు. ఇందులోనూ ఎన్ఐసీ వారు అందించిన జాబితా ఆధారంగా 4,296 మంది లబ్ధిదారులను ఖరారు చేశారు. దరఖాస్తుల పరిశీలనలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు లేని కొన్ని వందల దరఖాస్తులు పక్కన బెట్టారు. దీంతో చాలామంది అర్హులైన వారు పేర్లు కూడా పింఛన్ల ఎంపికకు నోచుకోలేదు. శనివారం ఉదయం 3,200 మంది లబ్ధిదారుల పేర్లతో మండలంలోనిఅర్హుల జాబితా విడుదలైంది. దీంతో పింఛన్లు నోచుకోని వందలాది మంది బాధితులు మండల పరిషత్ కార్యాలయం, గ్రామ పంచాయతీల వద్ద ఆందోళనకు దిగారు. పింఛన్లు రాకుంటే తామెట్ల బతకాలని అధికారులను నిలదీశారు. చావు దగ్గరకు వచ్చిన తనకు పింఛన్ రాలేదని పాపన్నపేటకు చెందిన చిల్వర దుర్గమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. కాలులేక పోవడంతో మంచంపైనే ఉన్నానని దోమకొండ కిష్టారెడ్డి అనే వికలాంగుడు కన్నీరు పెట్టారు. తప్పుల తడకగా అర్హుల జాబితా అధికారులు విడుదల చేసిన అర్హుల జాబితాలోనూ అనేక తప్పులు దొర్లాయి. 23 ఏళ్ల వయస్సు కలిగి, భర్త జీవించి ఉన్న మహిళలను అధికారులు వితంతువు పింఛన్‌కు అర్హురాలిగా గుర్తించారు. అలాగే ఆర్థికంగా ఉన్నవారిని కూడా అర్హుల జాబితాలో చేర్చారు. జాబితాలో లబ్ధిదారుల తండ్రి పేర్లే లేవు. ఆ కాలంలో కేవలం ‘ఎన్’ అనే అక్షరం ఉంది. మరికొన్ని చోట్ల లబ్ధిదారుల పేరు ఉండాల్సిన చోట వారి ఇంటి పేరు ఉంది. అధికారుల నిర్లక్ష్యానికి ఈ జాబితా అద్దం పడుతోంది. సాయంత్రానికి పెరిగిన అర్హులు శనివారం సాయంత్రానికి నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వే వారు విడుదల చేసిన జాబితాలో మరో 1,096 మంది పేర్లు వచ్చాయని పాపన్నపేట ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే రామాయంపేట మండలంలో గతంలో 7 వేల పింఛన్లు ఉండగా, ఈసారి 5,560 మందిని మాత్రమే అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇక చిన్నశంకరంపేట మండలంలో గతంలో 4,450 పింఛన్లు ఉండగా, ఈసారి 4,590 మందిని, మెదక్ మండలంలో 8,255 పింఛన్లు ఉండగా, ఈసారి 6,533 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే అర్హులైన వారందరికీ పింఛన్లు వస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పాపన్నపేట ఎంపీపీ పవిత్ర, ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు. కాగా తమ గ్రామాల్లో చాలా మంది అర్హులకు పింఛన్లు రాలేదని కొడుపాక ఎంపీటీసీ కిష్టమ్మ భూమయ్య, నాగ్సాన్పల్లి సర్పంచ్ ఇందిరలు ఆరోపించారు. -
నిరుపేదలు నష్టపోవద్దు
ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల మంజూరులో జాగ్రత్తలు తీసుకోండి అధికారులకు ‘సెర్ప్’ సీఈవో ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రతా కార్డులు, పింఛన్లను అందించడంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మురళి క్షేత్రస్థాయి అధికారులను అదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్ కార్యక్రమాల అమలుపై వివిధ జిల్లాల డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ల(పీడీ)తో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. సెర్ప్ రూపొందించిన నిరుపేద కుటుంబాల జాబితా లో అర్హులైన వారి పేర్లు లేనట్లైతే కొత్తగా వారి వివరాలను పొందుపరచాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో తమ వివరాలను ఇవ్వలేకపోయిన కుటుంబాల నుంచి కూడా డేటాను సేకరించాలని సూచించారు. ఆహారభద్రత, పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వలసల సంగతేంటి? దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పలు జిల్లాల ప్రాజెక్టు డెరైక్టర్లు ఉన్నతాధికారులకు వివరించారు. తమ జిల్లాల నుంచి వలస వెళ్లిన కుటుంబాల వారు సమగ్ర కుటుంబ సర్వే, కార్డుల దరఖాస్తుల ప్రక్రియ సందర్భంగా జిల్లాకు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకొని వెళ్లారని, ప్రస్తుతం పరిశీలనకు వారు అందుబాటులో లేనందున ఏం చేయాలో పాలుపోవడం లేదని ప్రాజెక్టు డెరైక్టర్లు పేర్కొన్నారు. దీనిపై సీఈవో మురళి స్పందిస్తూ.. వలస వెళ్లిన కుటుంబాలు తాత్కాలికంగా వెళ్లినట్లయితే.. వారిని పరిశీలన నిమిత్తం వెనక్కి పిలిపించాలని సూచించారు. శాశ్వతంగా వలస వెళ్లిన కుటుంబాల గురించి పట్టించుకోనక్కర్లేదన్నారు. ‘సదరం’ వైకల్య ధ్రువపత్రాలు లేవని పీడీలు తెలుపగా, ధ్రువపత్రాలు లేకున్నా పరిశీలన కొనసాగించాలని సీఈవో సూచించారు. పింఛన్ల మంజూరు నాటికి సదరం సర్టిఫికెట్లు సమర్పిస్తామని ఆయా దరఖాస్తుదారుల నుంచి హామీ పత్రాలు తీసుకోవాలని పీడీలను సీఈవో ఆదేశించారు. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన డేటాఎంట్రీని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఈవో తెలిపారు. పింఛన్ టెన్షన్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచుతుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులతో అధికారులు సతమతమవుతున్నారు. సమయం తక్కువగా ఉండడం, సరిపడా సిబ్బంది లేకపోవడం, అర్హుల ఎంపికలో తేడా వస్తే సదరు అధికారులనే బాధ్యులుగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో మండల స్థాయి అధికారులు టెన్షన్‌కు లోనవుతున్నారు. -
మహారాష్ట్ర టు తెలంగాణ
మళ్లీ వలస జీవుల పల్లెబాట రద్దీగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రాయికల్ (కరీంనగర్): తెలంగాణ ప్రజలకు సర్వేల ఫీవర్ పట్టుకుంది. ఏ క్షణంలో ఏ పథకానికి సర్వే జరుగుతుందోనని ఇటు అధికారులు, అటు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. రెండు నెలల క్రితం సమగ్ర కుటుంబ సర్వే కోసం స్వగ్రామాలకు వచ్చి వెళ్లిన వలస జీవులు.. ప్రస్తుతం సంక్షేమ పథకాల దరఖాస్తుల కోసం మళ్లీ పల్లెబాట పడుతున్నారు. ఆహార భద్రత కార్డులు, సామాజిక పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సర్కారు ఆదేశాలు జారీచేసింది. దీంతో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లినవారు గ్రామాలకు తిరిగివస్తున్నారు. ఇప్పుడు అందుబాటులో లేకుంటే సంక్షేమ పథకాలను కోల్పోతామనే భయంతో దరఖాస్తులు చేసుకుంటున్నారు. శుక్రవారం నుంచి ఇంటింటి విచారణ మొదలవడంతో.. దరఖాస్తుదారుల్లో ఎవరైనా ఒకరు తప్పనిసరిగా ఉండి సంబంధిత అధికారికి సహకరించాలని ఆదేశాలు జారీ కావడంతో విచారణ పూర్తయ్యేంత వరకు గ్రామాల్లోనే ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్రలో 10 లక్షల మంది.. తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలకు చెందిన నిరుపేదలు ఎక్కువగా మహారాష్ట్రలో ఉపాధి పొందుతున్నారు. ముంబయి, భీవండి, పూణే, గుజరాత్‌లోని సూర త్ తదితర ప్రాంతాల్లో కుటుంబాలతోపాటు నివసిస్తున్నారు. సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబంలోని ఒక సభ్యుడైనా స్వగ్రామంలో అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని ఆదేశాలు రావడంతో వీరంతా మళ్లీ పల్లెబాట పట్టారు. రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవే టు ఏజెన్సీలు అధిక మొత్తంలో ప్రయాణ చార్జీలు వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో ముంబ యి నుంచి కరీంనగర్‌కు బస్చార్జి రూ.వెయ్యి ఉండగా, ప్రస్తుతం రూ.రెండు వేల దాకా గుంజుతున్నారు. రాకపోకలకు ప్రయాణ చార్జీలు, ఇతర ఖర్చులు కలుపుకొంటే ఒక్కో కుటుంబానికి రూ.ఐదు వేల దాకా అవుతోందని చెబుతున్నారు. నాలుగు రాళ్లు వెనకేసుకుందామంటే.. అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని నిరుపేదలు తలలు పట్టుకుంటున్నారు. విచారణ అధికారులు గ్రామాలకు ఎప్పుడు వస్తారో.. ఏం అడుగుతారో.. వాళ్ల కోసం ఎన్నిరోజులు చూడాలో.. స్పష్టత లేకపోవడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. జీతం బస్‌చార్జీలకే సరి ఉపాధి నిమిత్తం మా కుటుంబ సభ్యులంతా ముంబయిలో ఉంటున్నాం. ఇటీవలే సమగ్ర సర్వే కోసం ముంబయి నుంచి స్వగ్రామానికి వచ్చాం. రెండు నెలలు గడువకముందే మళ్లీ రావడంతో మా జీతం డబ్బులంతా బస్‌చార్జీలకే సరిపోతున్నాయి. - గాజంగి రవీందర్, రాయికల్ చార్జీల్లో దోపిడీ సాధారణ రోజుల్లో ముంబయి నుంచి కరీంనగర్‌కు రావాలంటే రూ.వెయ్యి బస్చార్జి. కానీ ఈ సర్వేలను గమనించి ప్రైవేటు బస్సుల వారు రూ.1500 నుంచి రూ.2 వేలు వసూలు చేస్తుండ్రు. రాకపోకలు, ఇతర ఖర్చులకు కనీసం రూ.5వేలు ఖర్చవుతున్నాయి. - మహేశ్, రాయికల్ ట -
సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక : కలెక్టర్ రోస్
కామారెడ్డి : సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా పెన్షన్, ఆహార భద్రతా కార్డుల అర్హులను గుర్తించి సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మండల అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శు లు అనర్హులకు ప్రభుత్వ పథకాలు చేరకుండా తమ పరి శీలనలో ధ్రువీకరించాలని సూచించారు. ఫామ్ 1 (బీ), ట్రాన్స్పోర్ట్, ఆదాయపు పన్ను చెల్లింపుల ఆధారంగా అనర్హులను పక్కాగా గుర్తించాలన్నారు. ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని ప్రత్యేకంగా గుర్తిం చాలన్నారు. ప్రభుత్వపథకాలకు వేర్వేరుగా గుర్తింపు కార్డులుంటాయని తెలిపారు.అంత్యోదయ అన్నయోజన కింద హెచ్ఐవీ, లెప్రసీ, దారిద్య్రంలో ఉన్న మహిళలు, వితంతువులు, భూమిలేని శ్రమజీవులు, రిక్షా నడుపుకునేవారు, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు అర్హులన్నారు. వికలాంగులు సదరన్ క్యాంపు ద్వారా పొంది న సర్టిఫికేట్, తహశీల్దార్, ఎంపీడీవో ధ్రువీకరణ తరువాత పెన్షన్ లభిస్తుందన్నారు. ఐకేపీ ద్వారా అల్ట్రాపవర్ సర్వే ప్రతీ మండలంలో నిర్వహించారని, స్వాతం త్య్ర సమరయోధులు, సంచార గృహాల సమాచారాన్ని తప్పకుండా సేకరించాలన్నారు. పరిశీలన సమయంలో దరఖాస్తులు స్వీకరించవచ్చు అనంతం ఆర్డీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డివిజన్ లో సర్వేద్వారా భిక్కనూరులో 16,186, దోమకొండలో 17,186, గాంధారిలో 15,320, కామారెడ్డిలో 27 వేలు, లింగంపేటలో 12,817, మాచారెడ్డిలో 15,066, నాగిరెడ్డిపేటలో 9452, సదాశివనగర్‌లో 16,617, తాడ్వాయిలో 13,625, ఎల్లారెడ్డిలో 12,824 దరఖాస్తులు వివిధ ప్రభుత్వ పథకాలకు అందాయని తెలిపారు. వెరిఫికేషన్ సమయంలోనూ దరఖాస్తులను స్వీకరించవచ్చన్నారు. వీఆర్వోలు పహణీ ప్రకారం రైతుల భూమిని చూపించాలని, రెండున్నర ఎకరాల మాగా ణి, ఐదు ఎకరాల మెట్టభూమి, రైస్‌మిల్, షాప్స్ ఇతర ప్రాపర్టీ ఉన్నచో అనర్హుల జాబితాలో చేర్చాలన్నారు. డివిజన్ ప్రత్యేకాధికారి, ఐకేపీ పీడీ వెంకటేశం మాట్లాడుతూ.. ఆయా మండలాల్లో ఏర్పాటయిన బృందాలు వెరిఫికేషన్ ప్రక్రియను నిరంతరాయంగా పరిశీలించాలన్నారు. ఎండీవో, ఎమ్మార్వోలు, డిప్యూటీ ఎమ్మార్వో లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు సభ్యులుగా బృందాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాలోజీనాయక్, ప్రతేయకాధికారులు, ఎమ్మార్వోలు, వీర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
సర్వే చేయించుకున్నచోటే దరఖాస్తు
కార్డులు, పింఛన్ల దరఖాస్తులపై స్పష్టం చేస్తున్న అధికారులు కార్డులు వచ్చాకే బదిలీకి అవకాశం అన్నింటికి ఆధార్‌తో లింక్ హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే చేయించుకున్న ప్రాంతంలోనే ప్రజలు ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అవసరమైతే కార్డులు వచ్చాక బదిలీచేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లి తమ పేర్లు, తమ కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేయించుకున్నారని... అయితే సర్వే వివరాలు ఒకచోట, ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల కోసం మరోచోట దరఖాస్తు చేసుకుంటే పరిశీలన కష్టమవుతుందని అధికారవర్గాలు వివరించాయి. తెలంగాణలో ఇప్పటి వరకు ఆహారభద్రతా కార్డుల కోసం 65.65 లక్షలు, పింఛన్ల కోసం 31.20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, ప్రభుత్వం అమలుచేసే అన్ని పథకాలకు ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తున్నారు. ఆధార్ లేకుండా లబ్ధిదారులకు నిధులు అందించడానికి వీలుండదని చెబుతున్నారు. రానున్న కాలంలో రైతులకు ఎరువులు, రుణాల మంజూరు, విత్తనాల పంపిణీ, భూసార పరీక్షలకు సైతం ఆధార్‌కార్డులను అనుసంధానం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వీటి దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించిన సంగతి విదితమే. -
మళ్లీ సొంతూళ్లకు దరఖాస్తుదారులు
ఆహారభద్రత కార్డులకు ఎస్కేఎస్ లింకు పింఛను దారులకూ తప్పని తిప్పలు హైదరాబాద్: అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలను అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం లబ్ధిదారులకు ప్రయాసలు తెచ్చిపెడుతోంది. మొన్నటికి మొన్న సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)లో తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వివిధప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లిన పేదవర్గాలవారు, మళ్లీ ఇంకోమారు ఆహార భద్రతా కార్డుల కోసం మళ్లీ ఊళ్లకు పయనమయ్యారు. కూలీనాలీ చేసుకొనేందుకు పట్టణాలకు, ఇతర జిల్లాలకు తాత్కాలికంగా వలస వెళ్లిన పేద కుటుంబాల వారు తాము ఇంటి వద్ద లేకుంటే కార్డులు, పింఛన్లు రావేమోనని ఆందోళనతో ఊరిబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న ఆహార భద్రతా కార్డులకు, పింఛన్ల మంజూరుకు ఎస్కేఎస్లో పేర్కొన్న వివరాలే ఆధారమని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. గడువు చాలదనే హడావిడి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు ఆహారభద్రత కార్డులు, పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15 వరకే తొలుత గడువు విధించారు. అయితే పరిశీలన సమయంలోనూ దరఖాస్తులు ఇవ్వవచ్చని పేర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి 5 లక్షల కుటుంబాలకు ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నాయి. వీరిలో సుమారు 10లక్షల కుటుంబాల వారు వివిధ పనుల కోసం నిమిత్తం వలస వెళ్లి ఉండొచ్చని అంచనా. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 31లక్షలమంది పింఛనర్లలో కూడా ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు కూడా తమ కుటుంబ సభ్యులతో పాటు వలస వెళ్లి ఉంటారని సమాచారం. వలస వెళ్లిన పేదకుటుంబాల వారికి ఈ సమాచారం చేరడానికే ఎంతో సమయం పడుతుందని, సమాచారం తెలిసిన వారికి కూడా తక్షణం కుటుంబ సమేతంగా సొంతూళ్లకు చేరుకోవడం ఇబ్బంది కరమేనని కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. పరిశీలనవరకు గ్రామంలోనే.. ఆహార భద్రతా కార్డులకు పేదలు దరఖాస్తులు సమర్పించినా, ఆ దరఖాస్తులోని వివరాలను తనిఖీ చేసేందుకు వెరిఫికేషన్ అధికారులు వచ్చే వరకు వీరంతా గ్రామంలోనే ఉండాల్సి ఉంది. కొన్ని రోజులపాటు రోజువారీ కూలీ నష్టపోవాల్సిందే. ఇంత జరిగినా ఆహారభద్రతా కార్డులు వారికి ఉపయోగపడతాయా అంటే.. అదీలేదు. ఇక్కడ తీసుకున్న కార్డులకు పనుల కోసం వెళ్లిన చోట రేషన్ ఇవ్వరు. సమగ్ర సర్వేలో వివరాల నమోదుతో ఆహారభద్రతా కార్డులకు లింకు పెట్టడంతో పేద కుటుంబాల వారంతా అవస్థలు పడి సొంతూళ్లకు రావాల్సి వస్తోంది. దరఖాస్తుల పరిశీలనకు ఈ నెలాఖరు వరకు గడువు ఉండడంతో నవంబర్ 1న పింఛన్ల పంపిణీ డౌటేనని పలువురు వాపోతున్నారు. పింఛన్ల పంపిణీకి 10రోజుల ముందుగా లబ్ధిదారుల జాబితా వస్తేనే నిధులు మంజూరవుతాయి. కార్డు కావాలంటే రావాల్సిందే: మురళి, సెర్ప్ సీఈవో అర్హులైన పేదకుటుంబాలకు మాత్రమే ఆహారభద్రత కార్డులు, పింఛన్లు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. వీటికోసం ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నాం. తమకు కార్డు కావాలంటే తప్పని సరిగా దరఖాస్తులు చేసుకోవాల్సిందే. వలస వెళ్లిన పేదలకు అక్కడే ఆహార భద్రతా కార్డులను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. సర్వేలో రిజిస్ట్రేషన్ నంబరు ఆధారంగా వారి వివరాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశిలిస్తాం. అర్హులను ఎంపిక చేసే కార్యక్రమం పెద్దఎత్తున జరుగుతున్నందున అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీ కొద్దిరోజులు ఆలస్యం కావచ్చు. -
'సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు'
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. నవంబర్ నెల నుంచి లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రేషన్ కార్డులు, పౌరసరఫరా, ఫించన్లపై సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వాలా, 30 కేజీలకు పెంచాలా అనే దానిపై కూడా చర్చించినట్టు తెలిపారు. దీనిపై ఈ నెలాఖరుకల్లా సీఎంకు నివేదిక అందజేస్తామని ఈటెల చెప్పారు. -
‘సర్వే’ రోజు అదృశ్యం.. అస్థిపంజరంగా ప్రత్యక్షం
వీడిన వీఆర్వో అదృశ్యం మిస్టరీ హత్యేనంటూ ఆందోళన ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపల్లి వీఆర్వో కె.రాజేశ్వర్ అదృశ్యం మిస్టరీ వీడింది. నాగాపూర్ అటవీ ప్రాం తంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం అస్థికలు లభ్యం అయ్యా యి. సీఐ జీవన్‌రెడ్డి కథనం ప్రకారం.. గత నెల 19న సమగ్ర కుటుంబ సర్వే విధులకు వెళ్లిన రా జేశ్వర్ తిరిగి రాలేదు. ఈ మేరకు గత నెల 22న కుటుంబసభ్యులకు పెంబి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సోమవారం నాగాపూర్ అటవీ ప్రాంతంలో స్థానికులకు అస్థికలు కనిపించడం తో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో దుస్తులు, సెల్‌ఫోన్, గుర్తింపు కా ర్డు ఆధారంగా మృతుడు రాజేశ్వర్‌గా గుర్తిం చా రు. దుస్తులు, అస్థికలు, కపాలం వేర్వేరుగా కొద్ది దూరంలో పడి ఉండడం.. పక్కనే చెట్టుకు ధోవ తి కట్టి ఉండడంతో రాజేశ్వర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేశ్వర్‌ది హత్యేన ని ఆరోపిస్తూ దళిత సంఘాలు మృతుడి కుటుం బసభ్యులు, అస్థికలతో రాస్తారోకో చేశారు. -
ఇంతకీ మన జనం ఎంత..?!
‘గ్రేటర్’లో మరో సర్వే! కోటి దాటామా.. లేదా తొలి సమగ్ర సర్వేతో స్పష్టత రాని పరిస్థితి కంప్యూటరీకరణ పూర్తయ్యాక వివరాల్లో వ్యత్యాసం అప్పుడు నమోదు కానివారి సంఖ్యా అధికమే హైదరాబాద్ జనాభా ఎంతన్నది శేషప్రశ్నే ప్రభుత్వ నిర్ణయంతోనే గందరగోళానికి తెర హైదరాబాద్: జీహెచ్ఎంసీలో మిగిలిపోయిన కుటుంబాల కోసం మరోమారు సమగ్ర కుటుంబసర్వే జరుగనుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గ్రేటర్ జనాభా కోటి దాటిందని ఓవైపు భావిస్తుండగా, సమగ్రకుటుంబసర్వే వివరాలు కంప్యూటరీకరణ పూర్తయ్యాక వెల్లడైన వివరాల ప్రకారం కోటికి చేరువలో కూడా లేకపోవడమే సందేహాలకు తావిస్తోంది. మరోవైపు ఇప్పటికీ సర్వేరోజు ఎన్యూమరేటర్లు తమ ఇళ్ల వద్దకు రాలేదని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. మరో లెక్కింపు అవసరమేమో... గ్రేటర్లో కొత్త పథకాలు ప్రారంభించాలన్నా.. ఆశించిన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా సర్వే వివరాలే కీలకం . ఈ నేపథ్యంలో నగరంలోని కుటుంబాలు ఎన్ని, జనాభా సంఖ్య ఎంత అనేది కచ్చితంగా తెలుసుకునేందుకు మరోమారు సర్వే అవసరమనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. గతనెల 19న సర్వే ముగిశాక సైతం నగరంలో మిగిలిపోయిన కుటుంబాల వారి కోసం మరోమారు సర్వే చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.ఆ ప్రకారమైనా మిగిలిపోయిన వారి కోసం మరోమారు సర్వే జరుపుతామని జీహెచ్ఎంసీ కమిషనర్ సైతం అంటున్నారు. దాంతో అంతా కొత్త సర్వే తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. లెక్క తేల్చాల్సిందే... మిగిలిపోయిన వారిలో కొందరు మాత్రమే జీహెచ్ఎంసీ సర్కిల్కార్యాలయాలకు స్వయంగా వెళ్లి తమ వివరాలు అందజేశారు. ఈ కారణంగా మిగిలిపోయిన కుటుంబాలు అంతగా ఉండకపోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు మాత్రం తమ వివరాలు నమోదు కాలేదని చెబుతున్నారు. వీరి వివరాలు నమోదైతేనే గ్రేటర్ వాస్తవ జనాభా ఎంతో తెలిసే వీలుంది. సర్వే జరిగిన రోజున స్వగ్రామాలకు వెళ్లినందున , మళ్లీ చేపడితే తిరిగి వారంతా ఇక్కడ కూడా తమ వివరాలు నమోదుచేసుకోగలరనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వాస్తవానికి గ్రామాల్లో నమోదు చేసుకున్న వారు కూడా హైదరాబాదులోనే నిత్యజీవనం సాగిస్తున్నారు. దీని వల్ల కూడా జనాభాలో వ్యత్యాసానికి అవకాశం ఏర్పడింది. రెండు చోట్ల పేర్లు నమోదు చేయించుకుంటే.. సంక్షేమ పథకాలు, రాయితీలు వంటి వాటి లబ్ధి విషయంలో తేడా వచ్చే అవకాశం ఉందని కొందరు అధికారులు అంటున్నారు. ఈ కారణం చూపి వాస్తవ జనాభా లెక్కలు తేల్చక పోతే అసలుకే మోసం వచ్చే అవకాశమూ ఉందని మరి కొందరి వాదన. డబుల్ ఎంట్రీలకు ఏదో రకంగా చెక్ చెప్పొచ్చనీ అసలు గ్రేటర్లో ఉండే వారెందరన్నది తేల్చడం ముఖ్యమని అధికులు అభిప్రాయ పడుతున్నారు. వివరాలు నమోదు కాని వారికోసం మరో సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వమూ సుముఖంగా ఉన్న కారణంగా వెంటనే సర్వే చేపట్టి నిగ్గు తేల్చాలని నగరవాసులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సంక్లిష్టతకు ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని స్పష్టీకరించాల్సిన అవసరం ఉంది. -
అంతుచిక్కని గ్రేటర్ జనాభా
-
అంతుచిక్కని గ్రేటర్ జనాభా
1.20 కోట్లని సీఎం కేసీఆర్ ప్రకటన 85 లక్షలకు మించదంటున్న సవుగ్ర సర్వే కుటుంబాల లెక్కలోనూ అయోవుయుం జీహెచ్ఎంసీ సర్వేలోనూ కానరాని స్పష్టత హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి పూర్తి చేసినప్పటికీ గ్రేటర్ నగర జనాభాపై స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ జనాభా దాదాపు 1.20 కోట్లు ఉంటుం దనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. సర్వే వివరాలను అంచనా వేస్తే గ్రేటర్ జనాభా 85 లక్షలకు కూడా చేరడంలేదు. ఈ నేపథ్యంలో అసలు గ్రేటర్ జనాభా ఎంత? అనేది ఆసక్తికరంగా మా రింది. సర్వే కంప్యూటరీకరణ పూర్తయిందని అధికారులు చెబుతున్నప్పటికీ, నిజంగా పూర్తయిం దా.. లేక ఇంకా జరుగుతోందా ? అనే అనుమానాలు సైతం వెలువడుతున్నాయి. జీహెచ్ఎంసీ చేపట్టబోయే పలు కార్యక్రమాలకు, ఆస్తిపన్ను వసూళ్లకు, ఇతరత్రా కార్యక్రమాలకు సైతం వీటి నే ప్రామాణికంగా తీసుకోనున్నారు. సర్వే వివరాలు పజిల్‌గానే మిగలడంతో అధికారులు ఈ చిక్కుముళ్లను విప్పాల్సి ఉంది. సమగ్ర సర్వేకు ముందు జీహెచ్ఎంసీలో నిర్వహించిన ప్రీవిజిట్ సర్వేకు, ఆగస్టు 19న నిర్వహించిన సర్వేకు, సర్వే పూర్తయ్యాక జరిగిన కంప్యూటరీకరణ వివరాలకు వ్యత్యాసాలున్నాయి. ప్రీ విజిట్ సర్వేకు ముందు 17 లక్షల కుటుంబాలు ఉండవచ్చని అంచనా వేశారు. అరుుతే ప్రీవిజిట్ సర్వేలో 19 లక్షల కుటుంబాలు ఉన్నాయనే అంచనాకు వ చ్చారు. ఆగస్టు 19 తరువాత 20,11,293 కుటుం బాల సర్వే పూర్తయిందని, 1,49,308 కుటుంబా ల సర్వే జరగలేదని చెప్పారు. ఈ లెక్కన గ్రేటర్ లో 21,60,601 కుటుంబాలు ఉంటాయని భా వించారు. కంప్యూటరీకరణ పూర్తయిందని తెలి పే సమయానికి 20,40,000 కుటుంబాలున్నట్లు గుర్తించారు. ఈ లెక్కన గ్రేటర్ జనాభా దాదాపు 80 లక్షలకుపైగా ఉండవచ్చని ఒక అంచనా. గ్రేటర్లో ఒక్కో ఇంటికి సగటున 3.5 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. దీని ప్రకా రం జనాభా ఇంకా తగ్గుతుంది. కానీ గ్రేటర్‌లోని విద్యుత్ కనెక్షన్లున్న కుటుంబాలు, ఆధార్ కార్డు లు కలిగిన వారు, రేషన్కార్డులున్న కుటుంబాలను పరిగణనలోకి తీసుకుంటే జనాభా ఇంతకంటే ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం సర్వేలో నమోదు కాని కుటుంబాలవా.. ఇందుకు మరేదైనా కారణం ఉందా? అన్నది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. ఒక వేళ సర్వేలో నమోదు కానివైతే వారంతా స్వగ్రామాలకు వె ళ్లినందున నమోదు కాలేదా.. లేక వారి ఇళ్లలో సర్వే జరగలేదా? అన్నది సైతం స్పష్టం కావాలి. సర్వే జరగని కుటుంబాలు అధికసంఖ్యలో ఉన్నట్లయితే వారందరి వివరాల కోసం తిరిగి సర్వే జరిగితే కానీ పూర్తి స్పష్టత రాదు. ఈ అంశాలపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. అంతా గందరగోళం.. 2011 సెన్సస్ మేరకు.. 2001-2011 నాటికి గ్రేటర్‌లోని హైదరాబాద్ జిల్లా జనాభా పెరుగుదల 2.97 శాతంగా నమోదైంది. జిల్లా పరిధిలో ఓయూ, కంటోన్మెంట్ ప్రాంతాలను కలిపి లెక్కిస్తే అది 4.7 శాతంగా ఉంది. 1991-2001 మధ్య పెరుగుదల రేటు 21.74 శాతంగా ఉండగా, మలి దశాబ్దానికి దారుణంగా తగ్గిపోవడం అప్పట్లోనే ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తింది. 2011 జనగణనలో హైదరాబాద్ జిల్లా జనాభా కేవలం 39.43 లక్షలుగా నమోదైంది. 2011 జనా భా లెక్కల ప్రకారం గ్రేట ర్లో 15.24 లక్షల కు టుంబాలుండగా, తాజా గా కంప్యూటరీకరణ పూర్తయిన కుటుంబాలు దాదాపు 20.40 లక్షలున్నట్లు గుర్తించారు. -
తెలంగాణ జనాభా 3.61 కోట్లు!
-
తెలంగాణ జనాభా 3.61 కోట్లు!
* సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడి కుటుంబాల సంఖ్య 1,05,82,000 జిరాక్స్ ఫార్మాట్లపై మరో నాలుగు లక్షల కుటుంబాల వివరాలు వీటిని పక్కన పెట్టిన అధికారులు.. విచారణ తరువాత చేర్చే అవకాశం వారిని కూడా కలిపితే.. 3.73 కోట్లకు జనాభా మరో ఆరు లక్షల ఇళ్లకు తాళాలున్నట్లు సర్వేలో నమోదు హైదరాబాద్‌లో సర్వే జరగని కుటుంబాలు లక్షన్నర పైనే! 76 శాతం మందికి మాత్రమే ఆధార్‌కార్డుతో అనుసంధానం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జనాభా 3.61 కోట్లుగా తేలింది. మొత్తం కుటుంబాల సంఖ్య కోటీ 5 లక్షల 82 వేలుగా వెల్లడైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సమగ్ర ఇంటింటి సర్వే’లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యా యి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు మాత్రమే అందించేందుకు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘సమగ్ర కుటుంబ సర్వే’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో సేకరించే సమాచారం ఆధారంగా ఒక స్పష్టమైన డాటాబేస్ ప్రభుత్వ శాఖలకు అందుబాటులోకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కుటుంబాలను సర్వే చేసి, సర్వే పత్రాలను జిల్లాల్లోనూ, హైదరాబాద్‌లోనూ యుద్ధ ప్రతిపాదికన కంప్యూటర్లలో నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఇందుకోసం దాదాపు 23 వేల కంప్యూటర్లను వినియోగించగా.. కంప్యూటరీకరణ పూర్తికావడానికి 20 రోజులు పట్టింది. ఈ సమాచారంలో నుంచి అవసరమైన వివరాలను తీసుకోవడానికి వీలుగా ఒక సాఫ్ట్‌వేర్‌ను కూడా తయారు చేశా రు. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య 1.05 కోట్ల కు పైగా ఉండడంతో.. జనాభా నాలుగు కోట్లు దాటుతుందని తొలుత అంచనా వేసినా... జనాభా 3.61 కోట్లుగా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇంకా తేలాల్సి ఉంది! సర్వే వివరాలను నమోదు చేసిన తరువాత దాదాపు ఆరు లక్షల ఇళ్లకు తాళాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఆరు లక్షల ఇళ్లల్లోని కుటుంబ సభ్యులు వలస వెళ్లారా? లేక సర్వే కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లారా? ఇతర రాష్ట్రాల్లో ఉన్నారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సర్వే కోసం కోటీ ఇరవై లక్షల వరకు పత్రాలను సిద్ధం చేసినా... పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల కుటుంబాల వివరాలను జిరాక్స్ కాపీలపై నమోదు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అన్న అంశంపై అధికార యంత్రాంగం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు సమాచారం. ఈ నాలుగు లక్షల కుటుంబాల వివరాలను కూడా కలుపుకొంటే.. జనాభా 3.73 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. కాగా 2011 జనాభా లెక్కల్లో తేలినట్లుగానే.. ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం ఉన్నట్లు అధికారవర్గాలు వివరించాయి. 2.74 కోట్ల మందికి ఆధార్.. తెలంగాణ జనాభా 3.61 కోట్లు కాగా.. అందులో ఆధార్‌కార్డు ఉన్న వారి సంఖ్య 2.74 కోట్లుగా తేలింది. దాదాపు మరో 90 లక్షల మందికి ఆధార్‌కార్డు లేదు. వీరందరికీ ఆధార్‌కార్డులు ఎలా ఇస్తారన్న విషయంలోనూ ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. సర్వే సమయంలో మాత్రం ఆధార్‌కార్డు లేని వారికోసం మండల కేంద్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తామని.. వాటిద్వారా ఆధార్‌కార్డు అందగానే ఆ నంబర్‌ను సర్వే వివరాలకు అనుసంధానం చేస్తామని అధికారులు చెప్పారు. రాజధానిలో పూర్తికాని సర్వే.. రాజధాని హైదరాబాద్‌లో దాదాపు లక్షన్నర కుటుంబాల సర్వే ఇప్పటికీ పూర్తికాలేదు. సర్వే చేయని కుటుంబాలపై ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటారని అప్పట్లో అధికారులు చెప్పినా.. ఆ తరువాత దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. -
గేటర్‌లో 20.36 లక్షల కుటుంబాలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ ఎంసీలో సమగ్ర కుటుంబ సర్వే కంప్యూటరీకరణ పూర్తయింది. గ్రేటర్ పరిధిలో ఎన్ఐసీ అంచనాల ప్రకారం దాదాపు 20.36 లక్షల కుటుంబాలున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆగస్టు 19న సర్వే జరగ్గా, ఆ తర్వాత మరో రెండు మూడు రోజుల వరకు కూడా ప్రజలు తమ వివరాలు అందించారు. 22 లక్షలకుపైగా కుటుంబాలున్నట్లు అప్పట్లో అంచనా వేశారు. కొన్ని కుటుంబాల వివరాలు డబుల్ ఎంట్రీ కావడం తదితర కారణలతో కంప్యూటరీకరణ పూర్తయ్యేసరికి కుటుంబాల సంఖ్య తగ్గింది. కాగా, తమ వివరాలు నమోదు కాలేదని ఎదురు చూస్తున్న కుటుంబాలు సైతం నగరంలో ఇంకా భారీ సంఖ్యలో ఉన్నాయి. మరోమారు సర్వే జరిపితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బతుక మ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు బతుకమ్మ పండుగకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్‌సాగర్ నీటి వరకు నడచుకుంటూ వెళ్లేందుకు వీలుగా మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. -
93 లక్షల కుటుంబాల డేటా నమోదు పూర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వేలో భాగంగా సేకరించిన 93 లక్షల కుటుంబాల సమాచారాన్ని కంప్యూటరీకరణ చేసే ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో త్వరలో కంప్యూటరీకరణ పూర్తవుతుందని అధి కారులు వివరించారు. 1.05 కోట్ల కుటుంబాల్లో ఇప్పటివరకు 93 లక్షల కుటుం బాల డేటాను కంప్యూటరీకరించినట్లు పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 21 లక్షల కుటుంబాలను సర్వే చేయగా 8 లక్షల కుటుంబాల డేటా కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయిందని, మిగిలింది పూర్తి చేసేందుకు ఇతర జిల్లాలకూ సర్వే పత్రాలను పంపిస్తున్నట్లు వివరించారు. సమగ్ర సర్వే కంప్యూటరీకరణ పూర్తయినట్లు కలెక్టర్లు సర్టిఫికేషన్ చేసి పంపించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. -
సమగ్ర సర్వేలో నమోదైన కుటుంబాలు 9.85లక్షలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సుమారు పక్షం రోజుల పాటు సాగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ పూర్తి కావడంతో సమాచారం వెలుగు చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. సర్వేలో సేకరించిన సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ విశ్లేషిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8,69,451 కుటుంబాలుండగా, ప్రస్తుత సర్వేలో 9,85,557 కుటుంబాలున్నట్లు తేలింది. మరోవైపు జిల్లా జనాభా 40,53,028 కాగా, సమగ్ర సర్వేలో 42,14,865 మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు. జిల్లాలో అత్యధికంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, రూరల్ మండలంలో 63,758 కుటుంబాలుండగా, పెద్ద మందడి మండలంలో అత్యల్పంగా 8,866 కుటుంబాలున్నట్లు సర్వేలో తేలింది. పౌర సరఫరాల శాఖ వివిధ కేటగిరీల కింద 11,73,988 రేషన్ కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం వీటిలో అదనంగా ఉన్న కార్డులను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. సమగ్ర సర్వే లెక్కల ప్రకారం జిల్లాలో కుటుంబాల సంఖ్యను మించి రేషన్ కార్డులున్నట్లు మరో మారు తేటతెల్లమైంది. సమగ్ర సర్వే సందర్భంగా వివరాల నమోదు సందర్భంగా ఎన్యూమరేటర్లు కొన్నిచోట్ల ఖాళీలను వదలడంతో సమాచారాన్ని పోల్చి చూడడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం. కులాల వారీగా సమాచారం, ఫోన్లు, బ్యాంకు అకౌంట్లున్న వారు, వికలాంగుల వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మరుగుదొడ్లు, మంచినీరు, విద్యుత్ సౌకర్యమున్న కుటుంబాల సంఖ్య భవిష్యత్ ప్రణాళికల్లో కీలకమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూమి కలిగి ఉన్న కుటుంబాలు, సొంత వాహనాలు, పశు సంపద తదితర వివరాలు ఇతర జిల్లాల్లో కంప్యూటరీకరణ పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం వుంది. రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించిన సర్వే వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత సమగ్ర సర్వే సమాచారాన్ని అధికారికంగా వెల్లడించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. -
లెక్కతేలింది..
జిల్లా జనాభా 36,18,637 ఆధార్ కార్డులు లేనివారు 6,90,684 మొత్తం కుటుంబాలు 11,28,118 సమగ్ర సర్వేలో వెల్లడి హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ పూర్తయింది. జిల్లా లో మొత్తం కుటుంబా లు, జనాభా లెక్కలపై స్పష్టత వచ్చింది. సర్వే వివరాల ఆధారంగా ప్రస్తుతం జిల్లాలో మొత్తం 36,18,637 జనాభా ఉన్నట్లు తేలింది. వీరిలో మహిళలు 17,72,835, పురుషులు 17,74, 852, మిగిలిన వారిలో ఇతరులు ఉన్నారు. జిల్లాలో మొత్తం కుటుం బాలు 11,28,118 ఉన్నారుు. 29,27,953 మంది (80 శాతం) ఆధార్‌కార్డులు కలిగి ఉన్నట్లు వివరాలు నమోదు చేసుకున్నారు. మిగతా 6,90,684 మందికి ఆధార్ కార్డులు లేవు. పెరిగిన కుటుంబాలు 2,42,118 జిల్లాలో 2011 జనాభా గ ణనతో పోలిస్తే ప్రస్తుతం 2,42,118 కుటుంబాలు పెరిగాయి. 2011లో చేపట్టిన జనాభా గణనలో మొత్తం 8.86 లక్షల కుటుంబాలు, 35.12 లక్షల జనాభా ఉంది. ప్రస్తుత సర్వేలో 11,28,118 కుటుంబాలు, 36,18,637 జనాభా ఉన్నట్లు వెల్లడైంది. అంటే 2011 కన్నా 1,06,637 లక్షల జనాభా పెరిగింది. తాడ్వాయిలో తక్కువ కుటుంబాలు.. ప్రస్తుత లెక్కల ప్రకారం తాడ్వాయి మండలం 7,116 కుటుంబాలతో జిల్లాలో చివరి స్థానంలో ఉంది. మహబూబాబాద్ మండలం 35,839 కుటుంబాలతో ప్రథమ స్థానంలో ఉంది. జిల్లాలో డేటా ఎంట్రీ కార్యక్రమం సోమవారం సాయంత్రం పూర్తయినట్లు జిల్లా సమాచార అధికారి (డీఐఓ) విజయ్‌కుమార్ తెలిపారు. -
గాడినపడని పాలన!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్కారు పాలన ప్రారంభమై వంద రోజులు గడిచినా.. జిల్లాలో పాలన ఇంకా గాడిన పడలేదు. అధికారులు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం, కొందరు బదిలీపై ఇక్కడికి రావడం, మరికొందరు బదిలీ అవుతుందన్న ఉద్ధేశంతో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టని కారణంగా జిల్లాలో పాలన సవ్యంగా సాగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన ప్రణాళిక చేపట్టి ప్రజల అవసరాలు గుర్తించే పనిచేపట్టింది. ఆ తర్వాత సమగ్ర కుటుంబసర్వే పేరుతో కుటుం బాలు, జనాభా, ప్రజల స్థితిగతులను అంచనా వేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. సర్వే వివరాలు కంప్యూటరీకరించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. దీంతోపాటు రైతులకు రుణమాఫీని వర్తింపజేసేందుకు అర్హుల జాబితా తయారీపై అధికారులు దృష్టిపెట్టారు. ప్రభుత్వ పరంగా ఆయా కార్యక్రమాల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టడంతో ప్రజాపాలనకు కొంత ఆటంకం ఏర్పడింది. కొందరు అధికారులు తాము బదిలీ కావడం ఖాయమన్న ఆలోచనలో శాఖలపై సరైన దృష్టి పెట్టడం లేదు. వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడంతో కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ై ఫెళ్ల క్లియరెన్స్ కూడా సరిగా కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్పీ, జేసీతో సహా.. ఉన్నతాధికారులు సైతం బదిలీల కోసం వేచి చేస్తుండడంతో కిందిస్థాయి అధికారులు కూడా శాఖలపై శ్రద్ధ పెట్టడం లేదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ మధ్యే జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జీడీ ప్రియదర్శిని కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆర్డీఓలు, డీఎస్పీ స్థాయిల్లో కూడా అధికారుల బదిలీలు జరిగాయి. అంతే కాకుండా తహశీల్దారు, ఎస్ఐ స్థాయి అధికారులు కూడా జిల్లాలో చాలాచోట్ల బదిలీ అయ్యారు. దీంతో కొత్తగా వచ్చిన అధికారులు పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది. కీలక శాఖల్లో ఖాళీలు కొత్తసర్కారు ఏర్పడిన తర్వాత ముఖ్య శాఖల్లోని కీలక పోస్టులకు అధికారులు వస్తారని అందరూ ఆశించినా ఖాళీలు భర్తీ కాలేదు. జిల్లా పరిషత్ సీఈఓ పోస్టు ఖాళీగా ఉంది. ఈ స్థానంలో ఇన్చార్జ్ సీఈఓగా డీపీఓ రవీందర్ కొనసాగుతున్నారు. లాండ్ సర్వే విభాగానికి చెందిన ఏడీ, పోలీస్ శాఖకు సంబంధించి ఓఎస్డీ, పౌరసంబంధాల శాఖలో డిప్యూటీ డెరైక్టర్, డీపీఆర్ఓ పోస్టులు ఖాళీలుండడంతో ఇన్‌చార్జ్‌లతో కొనసాగిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి పనుల విషయం మరుగున పడిపోతోంది. అసలు పనులు చేయడానికి ఏమాత్రం మనసు పెట్టలేకపోతున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. విద్యాసంవత్సరం మొదలై మూడు నెలలు గడుస్తున్నా రెగ్యులర్ ఎంఈఓలను నియమించడంపై దృష్టిపెట్టలేదు. -
కలదో...లేదో!
మళ్లీ సర్వే కోసం ఎదురుచూపు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు కుటుంబాల సంఖ్యపై కనిపించని స్పష్టత రీ ఎంట్రీపై తలలు పట్టుకుంటున్న అధికారులు సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర కుటుంబ సర్వే మళ్లీ ఉంటుందా? లేదా అని గ్రేటర్‌లోని వివిధ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఓవైపు మళ్లీ సర్వే జరిగే తేదీని ప్రకటించకపోవడం...మరోవైపు కంప్యూటరీకరణ ప్రక్రియ మొదలవడం సందేహాలకు తావిస్తోంది. గతనెల 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను మిగిలిన జిల్లాలతో పాటే గ్రేటర్‌లోనూ ఒక్కరోజులోనే పూర్తి చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. తమ వివరాలు సర్వేలో నమోదు కాలేదంటూ ఇంకా ఎదురు చూస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాలు ఎంతలేదన్నా కనీసం లక్షకు తగ్గకుండా ఉంటాయని అంచనా. 2011 జనగణనలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నప్పటికీ 625 చ.కి.మీ. విస్తీర్ణం.. 20 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్న నగరంలో సర్వేకు ఒక్క రోజుసరిపోలేదు. 19న సర్వే జరిగినప్పటికీ..నేటి వరకు ఇంకా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. 19న ఎన్యూమరేటర్లు రాలేదని ఫిర్యాదులు చేసిన వారందరి ఇళ్లకు మరుసటి రోజు పంపించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. అయినప్పటికీ ఇంకా తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ అనేకమంది రోజూ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సర్వేలో నమోదు కాని వారందరికీ అవకాశం కల్పిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. రెండు వారాలు గడిచిపోయినా నేటికీ సర్వే తేదీ ప్రకటించకపోవడంతో నమోదు కాని కుటుంబాల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సర్వే పూర్తయిన ఇళ్ల కంప్యూటరీకరణ పనులు ప్రారంభం కావడంతో సర్వే ఉంటుందో, లేదోనని సందేహిస్తున్నారు. అంచనాలకు అందని కుటుంబాలు గ్రేటర్ జనాభాపై అధికారుల అంచనాలు మళ్లీ తప్పాయి. గతనెల 20 వరకు జరిగిన సర్వే వివరాల ప్రకారం దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు ఉండవచ్చునని అంచనా వేశారు. కానీ 2.40 లక్షల కుటుంబాల వారు తమంతట తామే అధికారులకు వివరాలు అందజేశారు. పూర్తి కాలేదంటూ... తమ ఇళ్లకు అధికారులెవరూ రాలేదని, తమ ప్రాంతాల్లో సర్వే జరగలేదని బస్తీలు, కాలనీల నుంచి నేటికీ ఫిర్యాదులు అందుతూనే ఉన్నా యి. కర్మన్‌ఘాట్ డివిజన్లోని మాధవనగర్, శివగంగ కాలనీ, డైమండ్ కాలనీ, నందనవనం భూపేష్ గుప్తా నగర్ కాలనీ, మన్సూరాబాద్ డివిజన్లోని మల్లికార్జున నగర్, శ్రీరామా హిల్స్, శ్రీరాంనగర్, వీకర్‌సెక్షన్ కాలనీ, మధురానగర్, అమ్మదయకాలనీ, సాయి సప్తగిరి కాలనీ, రాక్‌టౌన్, సాయినగర్, బాలాజినగర్ వాసులు సర్వే కోసం ఎదురు చూస్తున్నారు. కొత్తపేట డివిజన్లోని వెంకటరమణ కాలనీ, మమతానగర్, బీకేరెడి ్డకాలనీలలో కేపీహెచ్‌బీ కాలనీ, వివేకానందన గర్కాలనీ, మోతీనగర్ ప్రాంతాలలో సర్వే పూర్తి కాలేదని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. సంఖ్యపై స్పష్టత కరవు: గ్రేటర్లో నిజంగా ఎన్ని కుటుంబాలున్నాయి.. జనాభా ఎంత అనే అంశాలపై నేటికీ స్పష్టత లేకుండా పోయింది. మిగిలిపోయిన కుటుం బాలన్నింటి సర్వే జరిగితే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉండగా సర్వేలో పేరు నమోదు కోసం గతనెల 19న జిల్లాలకు వెళ్లిన వారు సైతం జరగబోయే సర్వేలో తమ పేరు నమోదు చేయించుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీన్ని అధిగమించేదెలాగో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కంప్యూటరీకరణలో జాప్యం సర్వే పూర్తయిన వివరాల కంప్యూటరీకరణ పనులు నగరంలో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సర్వే చేయాల్సిన కుటుంబాలు 20 లక్షలకు పైగా ఉండటంతో టెండర్ల మేరకు అధిక మొత్తంలో కంప్యూటర్లు, ఆపరేటర్లు కలిగి ఉన్న సంస్థలకు పనులు అప్పగించడంలో జాప్యం జరిగింది. కంప్యూటరీకరణ పూర్తి కాకముందే మళ్లీ సర్వే నిర్వహించాల్సి ఉంది. ఆ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారోనని పలువురు ఎదురు చూస్తున్నారు. గత నెల 20 వరకు అందిన సమాచారం మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 20,11,293 కుటుంబాల సర్వే పూర్తయింది. సర్వే పరిధిలోకి రాని కుటుంబాలు మరో 1,49,308 ఉండవచ్చునని అధికారులు అంచనా వేశారు. కానీ గత నెల 27 వరకు మరో 2,40,826 కుటుంబాలు సర్వేలో చోటు పొందాయి. మళ్లీ సర్వే కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు కనీసం లక్షకు తగ్గకుండా ఉండవచ్చునని అంచనా. -
నమోదు..నిదానం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సేకరించిన వివరాలను కంప్యూటర్లో నమోదు చేసే ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. సర్వే సందర్భంగా వరంగల్ నగరంలో వివరాల సేకరణలో విఫలమైన అధికార యంత్రాంగం... వీటి నమోదు విషయంలోనూ అదే దారిలో నడుస్తోంది. జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో సర్వే వివరాల నమోదు గడువులోపు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సర్వే వివరాల నమోదుకు అవసరమైన వసతులను కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. వివరాల నమోదు కోసం నియమించాల్సిన కంప్యూటర్ ఆపరేటర్లకు ఇచ్చే మొత్తం జిల్లాలో మరీ తక్కువగా ఉండడంతో ఈ పనుల కు ఎక్కువ మందిముందుకు రాలే దు. అవసరమైన కంప్యూటర్లు సమకూర్చే విషయంలో ఇదే జరిగింది. దీంతో సర్వేవివరాల నమోదు ఎప్పటివరకు పూర్తవుతుందో ఉన్నతాధికారులే చెప్పలేని పరిస్థితి ఉంది. సర్వే సైతం అసంపూర్తిగానే... రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. జిల్లాలో 11.40 లక్షల కుటుంబాల వివరాలను సేకరించారు. వరంగల్ నగర పరిధిలో సుమారు 2.55 లక్ష ల కుటుంబాల వివరాలను తీసుకున్నారు. 19న పలు కారణాలతో వివిధ ప్రాంతాల్లో సర్వే నిర్వహించలేకపోవడంతో మరొకరోజు ఈ ప్రక్రియ నిర్వహించారు. అరుునా అధికారులు పూర్తిస్థాయిలో సేకరిం చలేదు. ఇలా సమగ్ర సర్వే జిల్లాలో అసంపూర్తిగానే ముగిసింది. గడువు పెంచినా... సంక్షేమ, అభివృద్ధి పథకాల అమ లు, కొత్త ప్రాజెక్ట్‌లు, ప్రణాళికల రూ పకల్పనకు సమగ్ర సర్వే వివరాలే ప్రమాణికంగా ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. వీలైనంత త్వర గా సర్వే వివరాలను నమోదు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆగస్టు 22 నుంచి సర్వే వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయడం మొదలైంది. సర్కారు నిర్దేశించిన ప్రకారం సెప్టెం బర్ 3లోపు ఈ ప్రక్రియ పూర్తి కావా ల్సి ఉంది. గడువు దాటినా పూర్తికాలేదు. ఇప్పటివరకు 8.30 లక్షల కుటుంబాల వివరాలనే కంప్యూటర్ లో నమోదు చేశారు. ఫలితంగా సర్వే వివరాల నమోదులో రాష్ట్రంలో నే జిల్లా చివరి స్థానంలో నిలిచింది. దీంతో వివరాల నమోదు గడువును ప్రభుత్వం ఈనెల 7 వరకు పొడిగిం చింది. అరుునా మన జిల్లాలో అప్పటివరకు ఈప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. నగరంలోనే అతి తక్కువగా... జిల్లావ్యాప్తంగా 19 కేంద్రాల్లోని 2వేల కంప్యూటర్లలో రెండు విడతల సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవేకాకుండా కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్‌హాలు, ఎన్ఐసీ, ప్రగతిభవన్, అటవీశాఖ ఉత్తర డివి జన్ కార్యాలయంలో మరో 100 కంప్యూటర్లలో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలల్లో నగరానికి సంబంధించి 2.50 లక్షల కుటుంబాల వివరాల నమోదు ప్రక్రియ జరగుతోంది. ఇప్పటికి కేవలం 62వేల కుటుంబాల వివరాలే నమోదయ్యాయి. జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ ఎక్కువగా ఉండే నగరంలోనే ఈ పరిస్థితి ఉండడం విమర్శలకు తావిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఏటూరునాగారం, తాడ్వాయి, గీసుకొండ, మంగపేట, హసన్‌పర్తి, మొగుళ్లపల్లి, వెంకటాపూర్, వర్ధన్నపేట, భూపాపలపల్లి, రాయపర్తి మండలాల్లో నమోదు ప్రక్రియ ముగిసింది. గడువు లోపు పూర్తిచేస్తాం... సర్వే వివరాలను కంప్యూటర్లో నమోదు చేసే ఆపరేటర్లకు ఉదయం పూట అయితే ఒక కుటుంబానికి రూ.5.. రాత్రి సమయాల్లో రూ.7 చెల్లిస్తున్నట్లు అధికారులు తెలి పారు. మన జిల్లాలోనే ఇంత తక్కువ చెల్లిస్తున్నారు. దీంతో వివరాలు నమోదు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా నమోదు ఎంతకీ పూర్తి కావడంలేదు. సర్వే వివరాల నమోదును పర్యవేక్షిస్తున్న జిల్లా సమాచార అధికారి(డీఐ) విజయ్‌కుమార్ మాత్రం ఈనెల 7నాటికి ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. -
సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ
అదనంగా ఆపరేటర్ల నియామకం - ఇప్పటివరకు 38.79శాతం కంప్యూట రీకరణ - గ్రామీణ మండలాల్లో నత్తనడక.. పట్టణ ప్రాంతాల్లో చకచకా సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణలో జిల్లా యంత్రాంగం వేగాన్ని పెంచింది. సేకరించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు అదనంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను రంగంలోకి దించింది. సమగ్ర సర్వేను కంప్యూటరీకరించేందుకు జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంట్లో రెండు వేల కంప్యూటర్లను సమకూర్చిన యంత్రాంగం.. సర్వే సమాచారాన్ని నమోదు చేయడానికి అదేస్థాయిలో ఆపరేటర్లను నియమించింది. తొలి రెండు రోజులు కేవలం 900 మంది మాత్రమే హాజరుకావడం, కంప్యూటరీకరణ ఆలస్యమవుతుండడాన్ని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే డీటీపీ ఆపరేటర్లను అందరినీ ఈ విధులకు వినియోగించుకున్నప్పటికీ, నిర్ణీత వ్యవధిలో సమాచార నిక్షిప్తం కష్టసాధ్యమని భావించింది. ఈ క్రమంలో ప్రైవేటు ఆపరేటర్లను భారీగా వినియోగించింది. ఒక్కో కుటుంబం సమాచారాన్ని ఎంట్రీ చేసేందుకు ఐదు రూపాయలు ఇచ్చింది. అయినప్పటికీ కావాల్సినంతమంది ఆపరేటర్లు దొరకకపోవడంతో దీన్ని రూ.8, ఆ తర్వాత పది రూపాయలకు పెంచింది. దీంతో ఆపరేటర్లు ఇబ్బడిముబ్బడిగా సమకూరారు. ఈ నేపథ్యంలోనే డేటా ఎంట్రీ పనులు వేగాన్ని అందుకున్నాయి. గత నెల 19వ తేదీన జిల్లావ్యాప్తంగా(జీహెచ్ఎంసీ పరిధి మినహా) 8.41 లక్షల కుటుంబాల సర్వే వివరాలు నమోదు చేయగా, దీంట్లో ఇప్పటివరకు 3.40లక్షల కుటుంబాల సమాచారం కంప్యూటరీకరణకు నోచుకుంది. ఈ నెల 10వ తేదీ నాటికీ సర్వే సమాచారాన్ని కంప్యూటర్లలో పొందుపరచాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో వడివడిగా.... పట్టణ ప్రాంతాల్లో కంప్యూటరీకరణ వడివడి గా సాగుతున్నా.. గ్రామీణ మండలాల్లో మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో డేటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. అతి తక్కువ శాతం కుల్కచర్ల మండలంలో ఆదివారం వరకు 9.53% మాత్రమే సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. అలాగే బషీరాబాద్ 10.49%, గండేడ్ 10.88%, తాండూరు నగర పంచాయతీలో 11%, పెద్దేముల్లో 11.18%, వికారాబాద్ 11.89%, యాలాల 15.62%, మర్పల్లిలో 16 శాతం మాత్రమే డేటా ఎంట్రీ పూర్తయింది. నగర శివార్లలో మేడ్చల్, హయత్‌నగర్ మండలాల్లో ఇప్పటికే కంప్యూటరీకరణ ప్రక్రియ ముగిసింది. సరూర్‌నగర్ 92.49%, ఇబ్రహీంపట్నం 78.1%, శామీర్‌పేట 72.7%, మంచాల 72.25 శాతం పూర్తికాగా, మిగిలిన మండలాల్లో సగం కుటుంబాల సమాచారాన్ని ఇప్పటివరకు కంప్యూటరీకరించారు. -
కంప్యూటరీకరణకు కాసులేవీ..?
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కంప్యూటరీకరణపై అధికారుల్లో అస్పష్టత నెలకొంది. 15 రోజుల్లో వివరాలన్నీ కంప్యూటర్లో నిక్షిప్తం చేయాలని ఆదేశించి న ప్రభుత్వం.. అందుకు చెల్లించే సొమ్ముపై మా త్రం స్పష్టత ఇవ్వకపోవడం గందరగోళానికి కారణమవుతోంది. పైకం చెల్లింపుపై స్పష్టత ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలనే బృహత్తర లక్ష్యంతో తెలంగాణ సర్కారు ఈ నెల 19 సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఒకే రోజు సర్వేలో జిల్లాలో 8,40,971 కుటుంబాల వివరాలు సేకరించారు. 866 గ్రామపంచాయతీల్లో 6,83,556 కుటుంబాలు, ఏడు మున్సిపాలిటీల ప రిధిలోని 213 వార్డుల్లో గల 1,57,415 కుటుంబాల వివరాలు సర్వే ఫారాల్లో నమోదయ్యాయి. సర్వే శాతం 106.50గా నమోదైంది. నేడు లేదా రేపు ఈ సర్వే కంప్యూటరీకరణ పూర్తిస్థాయిలో ప్రారంభమ య్యే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,030 కంప్యూటర్లు ఈ వివరాలను నిక్షిప్తం చేసేందుకు ఉ పయోగిస్తున్నారు. ఇందుకు కార్యాలయాలు, భవనాలూ ఎంపికచేశారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. రొక్కం ఏదీ..? సర్వే వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, జిల్లా స్థాయి పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ జగన్మోహన్ ఇప్పటికే స్పష్టం చేశా రు. ఒక్కో ఆపరేటర్ రోజూ 80-100 వరకు సర్వే ఫారాలు వివరాలు నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో కుటుంబం ఆధారంగా చెల్లిస్తారా లేదా రోజు వారి గౌరవ వేతనం ప్రకారం ఇస్తారా అనే విషయంపై మార్గదర్శకలేమీ రాలేదు. దీనిపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏం చెప్పాలో తెలియక.. ప్రభుత్వం నుంచి స్పష్టత లేక అధికారుల్లో గందరగోళం నెలకొంది. ‘ప్రస్తుతానికి కంప్యూటరీకరణ ప్రారంభించండి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆ మేరకు మీకు చెల్లిస్తాం’ అని అధికారులు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు భరోసా ఇస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ విషయంలో స్పష్టత వస్తే బాగుంటుందని అధికారులు, ఆపరేటర్లు భావిస్తున్నారు. -
‘సర్వే’త్రా ఫిర్యాదుల వెల్లువ
ఘట్కేసర్ టౌన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో జరగలేదని తెలుస్తోంది. సర్వేరోజు రాత్రి 9 గంటలకు వరకు కూడా తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదని ప్రజలు క్లస్టర్ అధికారుల ముందు నిరసనలు తెలిపారు. సర్వే సజావుగా సాగిందనుకున్న అధికారులు ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో తప్పు ఎక్కడ జరిగిందనే విషయమై పరిశీలిస్తున్నారు. మండలంలో 72,961 ఇళ్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి నంబర్లు కేటాయించి ఎన్యూమరేటర్లకు అప్పగించారు. 68,593 కుటుంబాల సర్వే పూర్తితో 104.31 శాతం నమోదు అయిందని, 4,368 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. నివేదికలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మరోలా కనిపిస్తోంది. సర్వే రోజు రాత్రి వేలాది మంది తమ ఇళ్లకు నంబర్లు వేయలేదని తమ వివరాలను కూడా సర్వేలో నమోదు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. నమోదు కాని ఇళ్లు తేలిందిలా..! ఇంటింటి సర్వే 104.31 శాతం పూర్తయిందని అధికారులు ప్రకటిస్తున్నా ఇంకా మిగిలిన ఇళ్లు ఎక్కడివన్న అనుమానం తలెత్తుతోంది. ఇంటి నంబర్లను కేటాయించే సమయంలో ఇంట్లో ఉన్న అన్ని కుటుంబాలకు విడిగా నంబర్లు ఇవ్వకపోవడం, అద్దెకున్న వారి వివరాలను ఇంటి యజమానులు తెలపకపోవడం, ఎన్యూమరేటర్ల దగ్గర నమోదు పత్రాలు లేకపోవడంతోనే గందరగోళం జరిగినట్లు తెలుస్తోంది. పంచాయతీ సిబ్బంది నంబర్లు కేటాయించే సమయంలో ఇంటికి ఒక నంబర్‌ను ఇవ్వగా సర్వే రోజు మాత్రం అదే ఇంట్లో పెళ్లి అయిన ప్రతి జంట విడిగా నమోదు చేయించుకున్నారు. దీంతో ఇళ్ల సంఖ్య పెరగడమే కాకుండా ఎన్యూమరేటర్ల దగ్గర ఉన్న నమోదు పత్రాలు కూడా అయిపోయాయి. ఎన్యూమరేటర్లు తిరుగు ముఖం పట్టడంతో చాలా ఇళ్లు మిగిలిపోవడానికి కారణమైనట్లు భావిస్తున్నారు. అదే రోజు రాత్రి నమోదు కాని ఇళ్లు సుమారు 2 వేల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోసారి సర్వే చేపట్టి అందరినీ పరిగణలోకి తీసుకుని కుటుంబ వివరాలను నమోదుచేయాలని ప్రజలు కోరుతున్నారు. పంచాయతీల్లో ఫిర్యాదు చేయండి... సర్వేలో పేర్లు నమోదు కాని వారు తమతమ పంచాయతీ కారాలయాల్లో ఫిర్యాదు చేయాలని తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఒక్క బోడుప్పల్ పంచాయతీ పరిధిలోనే సుమారు 800లకు పైగా ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా సుమారు 4వేల కుటుంబాలు సర్వే కాకుండా మిగిలిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. -
మహారాష్ట్రలో తెలంగాణ సర్వే..!
సాక్షి ముంబైః మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని 14 గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామాలవాసులకు ఎన్నో ఏళ్లుగా ఇరు రాష్ట్రాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ గ్రామాల సరిహద్దులపై మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగింది. దీనిపై 1997లో సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించింది. ఈ మేరకు జీవితి తాలుకాలోని పరమడోలి, తాండా, ముకాదమగూడా, కోడా, లెండిజాలా, మహారాజగూడ, శంకర్‌లోధి, అంతాపూర్, ఇందిరానగర్, పద్మావతి, యెసాపూర్, పలస్‌గూడ, భోలాపటార్, లెండిగూడ మొదలగు గ్రామాలు మహారాష్ట్రకు చెందుతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడి గ్రామాల ప్రజలు అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంక్షేమ పథకాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి గ్రామాల్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తారురోడ్లు వేశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన తారు రోడ్లు కానరాకుండాపోగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన తారు రోడ్డు మాత్రం ఇప్పటికీ వినియోగంలో ఉంది. దీంతోపాటు విద్యుత్ సరఫరా, నీటి సరఫరా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేస్తోంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాల ప్రజలను నిర్లక్ష్యం చేయడంతో కొత్తగా అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేందుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా ఈ నెల 19న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఈ గ్రామాల్లో కూడా నిర్వహించింది. దీనిపై మహారాష్ట్ర అధికారికంగా స్పందించలేదు. -
సర్వే సంపూర్ణం
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ జిల్లాలో విజయవంతమైంది. ఒకేరోజు నిర్వహించిన సర్వేలో జిల్లా యంత్రాంగం అంచనా వేసిన దానికంటే 51 వేల కుటుంబాలు ఎక్కువగా నమోదయ్యాయి. సర్వేకు ముందు గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటి సర్వే నంబర్ల ఆధారంగా 7,89,613 కుటుంబాలుగా నిర్దారించగా, జిల్లాలో మంగళవారం నిర్వహించిన సర్వే ద్వారా 8,40,971 కుటుంబాల వివరాలు సేకరించారు. సర్వే ద్వారా జిల్లాలో 866 గ్రామ పంచాయతీల్లో 6,83,556 కుటుంబాలు ఉన్నట్లుగా లెక్కతేలింది. ఏడు మున్సిపాలిటీల పరిధిలో 213 వార్డులకుగాను 1,57,415 కుటుంబాల వివరాలు నమోదయ్యాయి. సర్వేలో నిర్మల్ డివిజన్లో అత్యధికంగా కుటుంబాల వివరాలు నమోదు కాగా, ఉట్నూర్‌లో అత్యల్పంగా నమోదయ్యాయి. దీంతో జిల్లాలో సర్వే శాతం 106.50గా నమోదైంది. సర్వే వివరాలను ఆయా తహశీల్దార్ల, ఆర్డీవో కార్యాలయాల్లో సీల్ వేసి భద్రపర్చారు. రెండు రోజుల్లో వివరాలను కంప్యూటరీకరించనున్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ల కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సర్వే వివరాల నమోదుకు ప్రభుత్వం పదిహేను రోజుల గడువు విధించింది. సర్వే వివరాలిలా.. ఆదిలాబాద్ డివిజన్లో 1,62,069 కుటుంబాలు, నిర్మల్‌లో 2,27,946, ఉట్నూర్‌లో 83,290, ఆసిఫాబాద్ డివిజన్లో 1,28,386, మంచిర్యాలలో 1,57,415 కుటుంబాలు ఉన్నట్లుగా లెక్క తేలింది. కాగా, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 33,528 కుటుంబాలు, నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో 43,781, కాగజ్‌నగర్‌లో 17,971, మందమర్రిలో 16,022, మంచిర్యాలలో 29,569, బెల్లంపల్లిలో 16,544 కుటుంబాల వివరాలు సర్వేలో నమోదయ్యాయి. సర్వే వివరాల నిక్షిప్తానికి 1,030 కంప్యూటర్లు సమగ్ర సర్వే వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 1,030 కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బాసర ట్రీపుల్ ఐటీలో 400 కంప్యూటర్లు, ఖానాపూర్‌లో 12, భైంసా మున్సిపాలిటీలో 20, నిర్మల్ ఎంపీడీవో కార్యాలయంలో 16, మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో 35, ఐటీఐలో 20, మందమర్రి ఐటీఐలో 20, ఎంపీడీవో కార్యాలయంలో 30, ఐటీడీఏలో 20, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 10, సీపీవోలో 8, ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 20, సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 20, కలెక్టరేట్లోని మీసేవ కేంద్రంలో 20, వివిధ మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవో కార్యాలయాల్లో 4 నుంచి 10 కంప్యూటర్ల చొప్పున ఏర్పాటు చేయగా, కొన్ని మండలాల్లో రెండు కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. సర్వేలో సేకరించిన క్వాలిటీ డాటాను కంప్యూటర్లో నమోదు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని గురువారం మండలాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ జగన్మోహన్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణ సమగ్ర కుటుంబ సర్వే వివరాలు కంప్యూటర్లో నమోదు చేసే ప్రక్రియను జిల్లా స్థాయిలో పర్యవేక్షించనున్నారు. ఇందుకు డీఆర్వో ప్రసాదరావు, సీపీవో షేక్మీరా, ఎన్ఐసీ డీఐవో రాకేష్‌ను నియమించారు. రోజు కంప్యూటర్లో నమోదు చేసిన వివరాలు కలెక్టరేట్‌కు పంపాల్సి ఉంటుంది. సర్వే వివరాలను కంప్యూటర్లో నమోదు చేసేటప్పుడు సదరు గ్రామ ప్రణాళిక అధికారి డాటా ఎంట్రీ ఆపరేటర్ వద్ద ఉండాల్సి ఉంటుంది. రోజుకు 80 నుంచి 100 వరకు సర్వే ఫారమ్‌ల వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 72 లోకేషన్లలో ఈ సర్వే వివరాలను కంప్యూటర్లో నమోదు చేయనున్నారు. ప్రతి లోకేషన్‌కు ముగ్గురు ఇన్చార్జీలను నియమించాలని ఆర్డీవోలను కలెక్టర్ ఇటీవలే ఆదేశించారు. -
నేటినుంచి సర్వే వివరాల కంప్యూటరీకరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా నమోదు చేసిన వివరాలను శుక్రవారం నుంచి కంప్యూటరీకరిస్తామని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. ఇందుకు ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కళాశాలల్లో డాటా ఎంట్రీ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గురువారం ఆర్డీఓలు, మండల తహసీల్దార్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డాటా ఎంట్రీ కేంద్రాల్లో విద్యుత్తు సమస్య ఉంటే ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు ఈ బాధ్యతలు తీసుకోవాలని, పదిరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. అనంతరం రుణమాఫీపై సమీక్షిస్తూ ఈనెల 23లోగా శాఖలవారీగా లబ్ధిదారుల వివరాలు ఖరారు చేయాలన్నారు. 26 నుంచి మండలస్థాయి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి 27,28 తేదీల్లో గ్రామపంచాయతీల్లో రుణమాఫీ లబ్ధిదారుల వివరాలు ప్రదర్శించాలన్నారు. అభ్యంతరాలుంటే వాటిని సరిచేసి 28న తుదిజాబితాను రూపొందించి 30న నిర్వహించే జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆమోదించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూపంపిణీలో భాగంగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన లబ్ధిదారులకు వారంలోగా భూములను చూపించాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించిన వారందరికీ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ ఎంవీరెడ్డి, డీఆర్వో సూర్యారావు, జేడీఏ విజయ్‌కుమార్, జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర సర్వేకు ఫారాల కొరత
పరిగి: సమగ్ర కుటుంబ సర్వేకు ఫారాల కొరత ఏర్పడింది. వారం పదిహేను రోజులుగా కసరత్తు చేస్తున్నా సర్వే రోజున గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ప్రధానంగా సర్వే ఫారాల కొరతతో ఎన్యూమరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వే కోసం ముందుగా ఇళ్లకు నంబర్లు సక్రమంగా వేయకపోవటంతో ఈ వివాదం తలెత్తింది. ప్రధానంగా ఈ సమస్య అన్ని గ్రామాల్లోనూ కనిపించినప్పటికీ పరిగి పట్టణంతో పాటు పరిగి అనుబంధ గ్రామమైన మల్లెమోనిగూడలో గ్రామస్తులు ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. మల్లెమోనిగూడలో ఏకంగా రోడ్లపైకి వచ్చి అధికారుల తీరుపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఒక ఇంట్లో ఐదారు కుటుంబాలు ఉండగా సరైన సమాచారం తీసుకోకుండా ఒక నంబర్ మాత్రమే వేశారు. అదే జాబితాను ఎన్యూమరేటర్లకు అందజేశారు. లిస్టులో లేని ఇళ్లను సర్వే చేసేందుకు నిరాకరించటంతో ఆగ్రహించిన ప్రజలు ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శంషుద్దీన్ తదితరులు మల్లెమోనిగూడను సందర్శించి పరిస్థితి సమీక్షించారు. అనంతరం స్పందించిన అధికారులు అదనంగా ఫారాలు పంపించి అందరి ఇళ్లు సర్వే చేసేలా చూస్తామని హామీ ఇవ్వటంతో గ్రామస్తులు శాంతించారు. ఇదే సమయంలో అదనంగా 1500 సర్వే ఫారాలు జిరాక్స్ తీయించి పరిగితో పాటు కొరత ఉన్న మండల పరిధిలోని గ్రామాలకు పంపించారు. -
నిర్మానుష్యం
ఖమ్మం: సమగ్ర కుటుంబ సర్వేతో జిల్లాలోని పలు పట్టణాల రహదారులు నిర్మానుష్యంగా మారాయి. సర్వేలో పాల్గొనేందుకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో కర్ఫ్యూను తలపించేలా జిల్లా అంతటా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. రాజకీయ పక్షాలు, ఇతర సంఘాల బంద్‌కు పిలుపు నిచ్చిన సందర్భాల్లో కూడా కొన్నిచోట్ల బంద్ పాటిస్తే మరికొన్ని చోట్ల రద్దీగా ఉండేది. కానీ మంగళవారం మాత్రం సకల జనులు సర్వేలో నిమగ్నం కావడంతో పిలుపు లేకుండానే బంద్‌ను తలపించింది. బస్సులు, ఆటోలు, ట్రాలీలు.. ఇలా ఏ ఒక్క వాహనం కూడా రోడ్డెక్కలేదు. ప్రజలు కూడా ఇల్లు వదిలి బయటకు రాలేదు. దీంతో నిత్యం జనసందోహంతో కిటకిటలాడే ప్రధాన వీధులు, వాణిజ్యచ వ్యాపార కూడళ్లు బోసిబోయాయి. ముమ్మర ప్రచారం... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే విజయవం అయ్యేందుకు గత కొంతకాలంగా ముమ్మర ప్రచారం చేసింది. రెండు రోజుల ముందే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. లక్షలాది కుంటుంబాలను సర్వే చేసేందుకు వేలాది మంది ఎన్యూమనేటర్లు అవసరం కావడంతో ప్రభుత్వ సిబ్బందితో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా డ్యూటీలు వేశారు. ఇక సొంత గ్రామాల్లో సర్వేలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. చాలా కాలం తర్వాత అందరూ కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. తెరుచుకోని వ్యాపార, వాణిజ్య కేంద్రాలు.. ప్రజలందరు సర్వే పనుల్లో నిమగ్నమై ఉండటంతో సకలం బంద్ అయింది. వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు దుకాణాలు మూసి వేసి సిబ్బందిని సర్వేలో పాల్గొనేందుకు పంపించారు. దీనికి తోడు వ్యాపారవేత్తలు, ఉద్యోగులు కూడా సర్వేకోసం తమ తమ ప్రాంతాలకు వెళ్లారు. దీంతో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లెందు, మధిర, మణుగూరు, పాల్వంచ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. బస్టాండ్లు వెలవెల బోయాయి. దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు, బ్యాంకులు తెరుచుకోలేదు. నిత్యం జనసంద్రంగా ఉండే ఖమ్మం నగరంలోని గాంధీచౌక్, మయూరిసెంటర్, తెలంగాణ తల్లి విగ్రహం ప్రాంతం, జడ్పీసెంటర్, ఇతర ప్రధాన కూడళ్లలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. -
ఎంపీ కవిత లేకుండానే వివరాలు నమోదు
నిజామాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరాలు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. కవిత అత్తవారి ఊరు నవీపేట మండలం పొతంగల్‌లోని అత్తామామలు ఆమె వివరాలు నమోదు చేయించారు. ఎంపీ స్థానికంగా లేకపోయినప్పటికీ ఆమె వివరాలు కూడా నమోదు చేయించారని సమాచారం. విలేకరులు ఈ విషయాన్ని కలెక్టర్ రొనాల్డ్ రాస్ దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
సర్వే కోసం శిథిల గృహంలో..
పరిగి: సమగ్ర కుటుంబ సర్వే అనగానే ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వారంతా సొంతూళ్లకు చేరుకున్నారు. స్వగ్రామంలో సొంత ఇల్లున్నా ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని వెళ్లినవారు కొందరైతే.. ఉన్న ఇళ్లు శిథిలమై తిరిగి కట్టుకోలేని దీన స్థితిలో పట్టణాలకు వలస వెళ్లినవారు మరికొందరు ఉన్నారు. సర్వే పుణ్యమా అని ఊరికి వచ్చిన ఓ కుటుంబం శిథిలమైన ఇళ్లలోనే కూర్చుండి కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్నారు. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం మాదారానికి చెందిన ఎం.డి.యూసుఫ్, యూనూస్, ఖాసీం సోదరులు. వీరంతా ఉమ్మడి కుటుంబంగా కలిసుండేవారు. ఏళ్ల క్రి తం నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరి పైకప్పు పూర్తిగా కూలిపోయింది. దీంతో అన్నదమ్ములంతా ఎవరికి వారు వేరే గ్రామాలకు వెళ్లిపోయారు. మంగళవారం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. కూలిపోయి మిగిలిన నాలుగు గోడల మధ్యే సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్నారు. ప్రభుత్వంఇల్లు మంజూరు చేయాలని కోరారు. -
బోసిపోయిన రహదారులు
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో మంగళవారం రాజధాని నగరమైన హైదరాబాద్‌లోని రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. రాత్రింబవళ్లు జనసంచారంతో, వాహనాల రాకపోకలతో హడావిడిగా ఉండే హైదరాబాద్ మహానగరం నిర్మానుష్యమైంది. విశాలమైన రహదారులు, వాటికి ఇరువైపులా బహుళ అంతస్తుల భవనాలు తప్ప జనం జాడ లేదు. బహుశా ఏ బంద్, కర్ఫ్యూ రోజుల్లోనూ ఇలాంటి నిర్మానుష్య వాతావరణం చోటుచేసుకొని ఉండకపోవచ్చు. అన్ని రకాల జనజీవన కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్టీసీ బస్సులు, ఆటోరిక్షాలు పూర్తిగా స్తంభించాయి. ఎంఎంటీఎస్ రైళ్లు నడిచినప్పటికీ ప్రయాణికులు లేక వెలవెలబోయా యి. ప్రతి రోజు 3850 బస్సులతో, సుమారు 32 లక్షల మంది ప్రయాణికులతో కిటకిటలాడే సిటీబస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆబిడ్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, దిల్సుఖ్నగర్, నారాయణగూడ, కోఠి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, నాం పల్లి ప్రాంతాల రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కనిపించే వందలాది మంది ట్రాఫిక్ సిబ్బందిలో పదిశాతం మంది కూడా కనిపించలేదు. ప్రయాణికులతో రద్దీగా కనిపిం చే మహాత్మాగాంధీ, సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్స్టేషన్లు నిర్మానుష్యంగా కనిపిం చాయి. దేవాలయాల్లో తగ్గిన భక్తుల తాకిడి సర్వే ప్రభావం నగరంలోని ప్రముఖ దేవాలయాపై కూడా పడింది. శంక ర్మఠ్, బిర్లా మందిర్, సంఘీ టెంపుల్, చిక్కడపల్లిలోని ఆయా దేవాలయాలు, అష్టలక్ష్మి దేవాలయం, భాగ్యలక్ష్మీ టెంపుల్, ఇస్కాన్ దేవాలయంతోపా టు పలు ప్రాంతాల్లోని రామాలయాలు, హనుమాన్ మందిరాల్లో భక్తుల తాకిడి బాగా తగ్గింది. మార్కెట్లు సైతం..: నగరంలోని రైతు బజార్సెంటర్లు, పండ్ల మార్కెట్, పూల మార్కెట్, మహబూబ్మెన్షన్, మిరాలంమండి తదితర మార్కెట్లు, పరిసర రహదారులన్ని ప్రతిరోజు కొనుగోలుదారులు, పాదచారుల రద్దీతో ఉంటాయి. సర్వే పుణ్యమా కొత్తపేట, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, అల్వాల్, మలక్‌పేట, ఎన్టీఆర్నగర్, చార్మినార్, బేగంబజార్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, ఫలక్‌నూమా, వనస్థలిపురం, సరూర్‌నగర్, రామకష్ణాపురం మార్కెట్ ప్రాంతాలు బోసిపోయాయి. దీంతో ట్రాఫిక్ కనీస స్థాయిలో కూడా లేదు. సచివాలయం వెలవెల.. సర్వే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం మంగళవారం బోసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడం... ఉద్యోగులు సర్వే విధుల్లో ఉండడంతో అన్ని బ్లాకులు వెలవెలబోయాయి. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో సా ధారణంగా ఎంతోకొంత సందడి కన్పించేది. మంగళవారం పూర్తిగా వెలవెలబోయింది. కేవ లం భద్రతా సిబ్బంది... కొందరు పోలీసులు మాత్రమే కనిపించారు. మంత్రులు, వారి అనుచరులు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులతో సందడిగా ఉండే ‘డి’ బ్లాక్ నిర్మానుష్యంగా కనిపించింది. ఆ బ్లాక్‌లోని అంతర్గత కారిడార్లకు పట్టపగలే తాళాలు వేశారు. ఇదిలా ఉండగా, పక్కనే ఉన్న ఏపీ సచివాలయంలో కొంత సందడి నెలకొంది. ఆ రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో సాయంత్రం వేళ కొందరు అధికారులు వచ్చారు. -
సర్వం.. సర్వేనే
గ్రేటర్లో ఆసక్తి చూపిన రాజకీయ, సినీ ప్రముఖులు సమగ్ర వివరాలు అందజేసిన గవర్నర్ నరసింహన్ వివరాలిచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి బాబు ఇంటికి స్టిక్కర్లు అంటించకుండా అడ్డుకున్న సిబ్బంది నిరాకరించిన పవన్ కళ్యాణ్, విజయశాంతి హైదరాబాద్: మహానగరంలో మహాసన్నివేశం ఆవిష్కృతమైంది. అపూర్వ ఘట్టం నమోదైంది. సర్వే మినహా సకలం బంద్. ఇంటింటా అదే సందడి. గల్లీగల్లీలో అదే కోలాహలం. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గ్రేటర్ హైదరాబాద్‌లో సక్సెస్ అయింది. విశేష స్పందన లభించింది. వివరాలు చెబుతూ కుటుంబసభ్యులు.. సర్వేఫారాలు నింపుతూ ఎన్యూమరేటర్లు కనిపించారు. పేద, ధనిక తేడాలేకుండా అందరూ సర్వేపట్ల ఆసక్తి కనబర్చారు. గవర్నర్ నరసింహన్, ఆయా పార్టీల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు సర్వేలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయం బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో ఎన్యుమరేటర్‌కు తన కుటుంబానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని పలువురు ప్రముఖులు ఆసక్తి చూపగా, కొంతమంది సెలబ్రిటీలు ముఖం చాటేశారు. లోటస్‌పాండ్‌లో నివాసం ఉంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి షేక్‌పేట తహసీల్దార్, బంజారాహిల్స్ నోడల్ అధికారి చంద్రకళ నేతృత్వంలో ఎన్యూమరేటర్ల బృందానికి సాయంత్రం 6:30 గంటలకు వివరాలను అందజేశారు. అడిగి అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉదయం నుంచి తాను అసెంబ్లీలో ఉండటం వల్ల రాలేకపోయానని జగన్ తెలిపారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, నటుడు తనికెళ్ల భరణి, జూనియర్ ఎన్టీఆర్, అల్టు అర్జున్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావు, రవాణా శాఖామంత్రి మహేందర్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ ఎంకే.మీనా, నవీన్ మిట్టల్, మాజీ ఎంపీ రేణుకా చౌదరి తదితరులు సర్వేకు సహకరించి, కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్నారు. హీరో పవన్ కళ్యాణ్, మాజీ ఎంపీ విజయశాంతి వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు వివరాలు అందజేశారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన కుటుంబ వివరాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నా సేకరించడానికి ఎన్యూమరేటర్లు రాలేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబానికి సబంధించిన వివరాలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అందుబాటులో ఉంచగా ఎన్యూమరేటర్ మానయ్య వాటిని అక్కడి నుంచి సేకరించారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ ఇంటికి కూడా స్టిక్కర్ అంటించేందుకు ఒప్పుకోలేదు. గ్రేటర్లో 80 శాతం గ్రేటర్ నగరంలో 2011 జనాభా లెక్కల మేరకు 15.24 లక్షల కుటుంబాలుండగా, రాత్రి 8 గంటల వరకు 15.50 లక్షల కుటుంబాల సర్వే పూర్తయినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. మరో నాలుగైదు లక్షల కుటుంబాలు మిగిలి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన గ్రేటర్లో దాదాపు 80 శాతం సర్వే జరిగిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సరైన వివరాలు బుధవారం మాత్రమే తెలిసే వీలుందన్నారు. సర్వే బాగుంది: లింగ్డో శంకర్పల్లి: కుటుంబ సమగ్ర సర్వేలో భారత ఎన్నికల మాజీ కమిషన్ జేఎం లింగ్డో వివరాలు నమోదు చేయించుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని పొద్దుటూర్ ప్రగతి రిసార్ట్‌లో నివాసం ఉంటున్న లింగ్డో ఇంటికి వెళ్లారు. ఎన్యూమరేటర్లు అడిగిన వివరాలను ఆయన అందజేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే బాగుందని, ఈ సర్వేతో ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించి అన్ని విషయాలూ తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎన్యూమరేటర్‌గా జీహెచ్ఎంసీ కమిషనర్ సమగ్ర కుటుంబ సర్వేలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్వయంగా పాల్గొని కాసేపు ఎన్యుమరేటర్ పాత్ర కూడా పోషించారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, సర్కిల్-7 పరిధిలో నగర మేయర్ మాజిద్ హుస్సేన్ నివాసానికి సర్వే సిబ్బందితో పాటు కమిషనర్ కూడా వెళ్లి సర్వే నిమిత్తం కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. మరోవైపు రాజేంద్రనగర్‌లోని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సర్కిల్-9 పరిధిలో డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ నివాసాలకు ఉన్నతాధికారులు వెళ్లి వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. హర్షణీయం: జస్టిస్ చంద్రకుమార్ ప్రజల సమగ్ర సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మంగళవారం రాత్రి ఎల్బీనగర్ హస్తినాపురంలోని ఆయన నివాసానికి వచ్చిన ఎన్యూమరేటర్‌కు కుటుంబ సమాచారం అందజేశారు. చంద్రకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని పదిలంగా ఉంచి దుర్వినియోగ పరచడానికి అవకాశం కల్పించకుండా ఉండాలి. సర్వేతో పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే హర్షనీయమని ఆయన పేర్కొన్నారు. -
తెలంగాణవ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర సర్వే
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. 3,69,729మంది ఎన్యూమరేటర్లు ....కోటి కుటుంబాల సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించనున్నారు. ప్రభుత్వ పథకాలు అందాలంటే సమాచారం ఇవ్వాలని,అయితే డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సర్వే సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ వాతావారణం కనిపిస్తోంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. కాగా తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులపై సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. అన్ని సంక్షేమ పథకాలకు, భవిష్యత్ ప్రణాళికలకు ఈ సర్వే సమాచారమే ప్రామాణికమని ప్రభుత్వం చెబుతోంది. దీంతో సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రజలు సొంత ఊళ్ల బాట పట్టారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సర్వే కోసం ఊరికి వస్తున్నారు. వరంగల్ నగరం, ఇతర పట్టణాల్లో స్థిరపడిన వారు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. -
నేడే సర్వే
సమగ్ర కుటుంబ సర్వేకు అంతా రెడీ జిల్లాలో 10.69 లక్షల కుటుంబాలు విధుల్లో 42,840 మంది ఉద్యోగులు స్వగ్రామాలకు చేరుకున్న ప్రజలు కిక్కిరిసిన బస్సులు, రైళ్లు పల్లెల్లో పండుగ వాతావరణం సాక్షిప్రతినిధి, వరంగల్ : సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులపై సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. అన్ని సంక్షేమ పథకాలకు, భవిష్యత్ ప్రణాళికలకు ఈ సర్వే సమాచారమే ప్రామాణికమని ప్రభుత్వం చెబుతోంది. దీంతో సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రజలు సొంత ఊళ్ల బాట పట్టారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సర్వే కోసం ఊరికి వస్తున్నారు. వరంగల్ నగరం, ఇతర పట్టణాల్లో స్థిరపడిన వారు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజే ఉండడంతో అందరూ ఒకేసారి సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రైవేటు వాహనాలు దొరకడం లేదు. సర్వే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. కార్మిక శాఖ సైతం ప్రత్యేకంగా సెలవు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం నుంచే అన్ని పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు సెలవును ప్రకటించేశాయి. అన్ని వర్గాల ప్రజలు ఒకేసారి ఊళ్లకు చేరుతుండడంతో గ్రామాల్లో పండగ వాతావరణ నెలకొంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి కొన్నేళ్లుగా ఊళ్లకు రాని వారు సైతం ఇప్పుడు సొంత ప్రాంతాలకు వచ్చారు. ఇతర దేశాల్లో స్థిరపడిన వారు సైతం సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చారు. సర్వే నిర్వహణ ఇలా.. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 8,86,279 కుటుంబాలు ఉన్నాయి. సమగ్ర సర్వే నేపథ్యంలో వివరాలు తీసుకోవాల్సిన కుటుంబాల సంఖ్యను తేల్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రస్తుతం ఉన్న కుటుంబాల సంఖ్యను గుర్తించింది. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన జనాభా లెక్కల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్న కొందరు ఇప్పుడు వేర్వేరుగా నమోదు చేసుకుంటున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాలో 10,69,506 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కుటుంబాల వివరాల సేకరణకు ప్రభుత్వ, కాంట్రాక్టు, ప్రైవేటు ఉద్యోగులు కలిపి 42,840 మందిని నియమించారు. ఒక్కో ఉద్యోగి సగటున 30 కుటుంబాల వివరాలను సేకరిస్తారు. మొదట ఒక ఉద్యోగికి 25 కుటుంబాలే అని నిర్ణయించారు. కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వివరాలు సేకరించే ఉద్యోగికి కుటుంబాలను పెంచారు. ఎన్నికల నిర్వహణ తరహాలోనే.. సర్వేలో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందిని గ్రామాలకు తరలించేందుకు 1500 వాహనాలను వినియోగిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సర్వేపై టోల్‌ఫ్రీ నంబర్ల ఏర్పాటు సమగ్ర కుటుంబ సర్వేపై సందేహాలు, ఫిర్యాదులు ఉన్న వారి కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్లును ఏర్పాటు చేసింది. కలెక్టరేట్ కార్యాలయంలో 18004252747 నంబరుతో టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశారు. అలాగే సందేహాలు ఉన్న వారు నేరుగా కలెక్టర్ జి.కిషన్ వినియోగించే 9000114547కు మెస్సేజ్ చేయవచ్చు. వరంగల్ నగర పరిధిలోని వారి కోసం నగరపాలక సంస్థ ప్రత్యేకంగా 18004251980 టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. ప్రభుత్వం రూపొందించిన వివరాల సేకరణ పత్రంలోని అంశాలను ప్రజలు ఎన్యూమరేటర్(ఉద్యోగులకు)కు వివరించాల్సి ఉంటుంది. వివరాలు సేకరించే వారు... తమ ఇళ్లకు రాకున్నా, అనవసరమైన విషయాలును అడిగినా వీటికి ఫిర్యాదు చేయవచ్చు. -
సర్వే జనా సుఖినోభవంతు!
ఉదయం 7.00 గంటల నుంచి ప్రారంభం ఫిర్యాదులకు కాల్‌సెంటర్ 040-21 11 11 11 జిరాక్స్‌లు ఇవ్వనవసరం లేదు సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరుగనున్న మహాక్రతువుకు రెండు రోజుల ముందు నుంచే ప్రీ విజిట్లు నిర్వహించిన ఎన్యూమరేటర్లు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను గుర్తించారు. ఇంటింటికీ కరపత్రాలు.. అవి అందినట్లుగా స్టిక్కర్లు అతికించారు. తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ వివిధ ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందుతుండడంతో జీహెచ్ఎంసీ కాల్సెంటర్లోని ఫోన్ లైన్లను 30 నుంచి 50కి పెంచారు. ఆదివారం 13.40 లక్షల ఇళ్లను సందర్శించిన సిబ్బంది .. 2.06 లక్షల ఇళ్లు కొత్తగా వచ్చినట్లు గుర్తించారు. సాక్షి, సిటీబ్యూరో:సర్వేకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్ చెప్పారు. రెండు రోజుల పాటు సాగిన క్షేత్ర స్థాయి పర్యటనలలో కొన్ని ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని, అవసరానికి సరిపడా సామగ్రిని సిద్ధం చేశామన్నారు. అదనపు సిబ్బందిని నియమించుకునేందుకు ఎన్యూమరేటర్లకు వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఏ ప్రాంతాల్లోనైనా సర్వే జరుగని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేలో సహకరించేందుకు సహాయ ఎన్యూమరేటర్లుగా విద్యార్థులతోపాటు వివిధ వర్గాల వారిని నియమించుకున్నప్పటికీ..ఎన్యూమరేటరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో సోమవారం ప్రీ విజిట్లకు వెళ్లిన ఎన్యూమరేటర్లు సర్వేను సైతం పూర్తి చేశారు. సర్వేలో భాగంగా వివరాలు అందజేయడమే తప్ప.. జిరాక్స్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్ నుంచి సర్వే ఫారాలను 25వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారని కమిషనర్ చెప్పారు. ప్రీ విజిట్లలో దృష్టికొచ్చిన అంశాలు.. అందుకనుగుణంగా తీసుకుంటున్న చర్యలు..ఏర్పాట్లు తదితర అంశాలను కమిషనర్ సోమేశ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. పెరిగిన గృహాలు 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్లో దాదాపు 13 లక్షల ఇళ్లుండగా.. ఇటీవలి సర్వేలో 16.96 లక్షల ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. మరో మూడు లక్షల ఇళ్లు అదనంగా వచ్చినా ఇబ్బందులు లేకుండా సర్వే పూర్తి చేయాలనే ఉద్దేశంతో సిబ్బంది నియామకాలతోపాటు కరపత్రాలు.. స్టిక్కర్లు పంపిణీ చేశారు. ఆదివారం ప్రీ విజిట్‌లో 13.40 లక్షల ఇళ్ల సర్వే జరగ్గా, అందులో 2.06 లక్షల ఇళ్లు కొత్తగా వచ్చినట్లు గుర్తించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 21 లక్షల ఇళ్లకు సరిపడా మెటీరియల్‌ను అందజేశామని కమిషనర్ తెలిపారు. ఇంకా సరఫరా చేస్తున్నామన్నారు. 21,636 ఇళ్లకు తాళాలు ఇంటింటి సర్వేను పురస్కరించుకొని సొంత గ్రామాలకు వెళ్లిన వారూ తక్కువేమీలేరు. ఆదివారం నాటి సర్వేలో 21,636 ఇళ్లకు తాళాలు ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఒక్క ఇల్లూ తప్పిపోకూడదనే.. గ్రేటర్ నగర విస్తీర్ణం ఎక్కువగా ఉండటం.. జనసాంద్రత భారీగా ఉండటంతో ఏ ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా సర్వే నిర్వహించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కమిషనర్ చెప్పారు. మనుషులు చెట్లు కింద ఉన్నా, రోడ్డు పక్కన పొయ్యి ఉన్నా... వారి వివరాలు నమోదు చేయాల్సిందేనన్నారు. ఇది మనుషులకు సంబంధించిన సర్వే తప్ప ఆస్తులకు సంబంధించినది కాదన్నారు. సంచార జాతుల వారి వివరాలూ నమోదు చేస్తామన్నారు. జిరాక్స్‌లతో పని లేదు ఎన్యూమరేటర్లు సర్వేకు వచ్చినప్పుడు గందరగోళానికి గురి కాకుండా ఉండేందుకు, ఆధార్ కార్డు..ఆస్తిపన్ను నెంబరు(పీటీఐఎన్), బ్యాంక్ అకౌంట్, గ్యాస్ కనెక్షన్ వంటి వాటి నెంబర్లలో పొరపాట్లకు తావులేకుండా చూసేందుకే జిరాక్స్ కాపీలు అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్నాం తప్ప వాటిని సర్వేయర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. కేవలం ఎన్యూమరేటర్ల ధ్రువీకరణ కోసమే జిరాక్స్‌లు ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఈ సూచన చేశామన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలనడం వెనుక కూడా మరో కారణం లేదన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు ప్రజల ఇష్టం .. బ్యాంకు ఖాతా నెంబరు తెలపాలా.. వద్దా అనేది ప్రజల నిర్ణయమేనని, బలవంతం లేదని కమిషనర్ చెప్పారు. ఇచ్చినా తగు భద్రత ఉంటుందని, భయపడాల్సిన పనిలేదని భ రోసా ఇచ్చారు. ఎన్యూమరేటర్‌కు 40 ఇళ్లు.. ఒక్కో ఎన్యూమరేటర్‌కు సర్వే చేయాల్సిన ఇళ్లు 40కి మించకుండా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. అత్యవసర పనుల మీద వెళ్లినవారు.. విదేశాల్లో ఉంటున్న వారికి సంబంధించి ఏవైనా ఆధారాలు చూపితే చాలునన్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్... సమగ్ర కుటుంబ సర్వేలోని వివరాల డేటాబేస్ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి, 15 రోజుల్లో కంప్యూటరీకరిస్తామన్నారు. ఈ జాబితా ఆధారంగానే భవిష్యత్‌లో ఏ పథకానికి ఏ వివరాలు అవసరమవుతాయో వాటిని వినియోగిస్తామన్నారు. బదిలీలైనప్పుడు, ఇల్లు మారినప్పుడు సవరించేందుకు వీలుగా డేటాబేస్‌లో మార్పులూ చేర్పులకు వీలుంటుందని కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. సర్వే కేవలం బీపీఎల్ కుటుంబాలకు సంబంధించినది మాత్రమే కాదని, ఏపీఎల్ కుటుంబాలకూ పనికివచ్చేదన్నారు. సర్వేలో పాల్గొనకుంటే భవిష్యత్‌లో కొన్ని ప్రయోజనాలు కోల్పోయే అవకాశాలుంటాయన్నారు. ఆర్థిక పరిస్థితి, స్థానికతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, సర్వేలో ఈ వివరాలు లేవని చెప్పారు. డేటా దుర్వినియోగం జరిగేందుకు ఆస్కారం లేదని, అత్యంత భద్రంగా ఉంటుందన్నారు. సర్వేలో హిజ్రాల వివరాల నమోదుకూ ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఫిర్యాదుల పరంపర... ఆదివారం సాయంత్రం నుంచీ తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌కు రోజుకు సగటున 300 ఫిర్యాదులు అందేవి. ఆదివారం ఈసంఖ్య 5,616కు చేరింది. సోమవారం రాత్రి 8.40 గంటల వరకు 4776 ఫిర్యాదులు అందాయి. ఫోన్లు నిరంతరం బిజీగా ఉండటంతో చాలామందికి అసలు లైన్లే కలవలేదు. ఈ పరిస్థితిని గుర్తించి కాల్సెంటర్లోని 30 లైన్లకు తోడు అదనంగా మరో 20 లైన్లు పెంచారు. ప్రస్తుతం 50 లైన్లు పని చేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని..స్థానిక డిప్యూటీ కమిషనర్‌కు సైతం ఫిర్యాదు చేయవచ్చునన్నారు. వెబ్సైట్ కంటే ఫోన్‌కాల్స్ ద్వారా త్వరితంగా చర్యలకు వీలవుతుంది. సర్వే పరిశీలనకోసం నోడల్ ఆఫీసర్లు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తారు. తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాని విషయాన్ని నోడల్ ఆఫీసర్లకు సైతం తెలియజేయవచ్చు. అంతిమ నిర్ణయం ప్రజలదే.. సర్వేలో భాగంగా కుటుంబ వివరాలు.. ఇతరత్రా సమాచారం తెలియజేయవచ్చా? లేదా అనేది అంతిమంగా ప్రజల నిర్ణయమేనని, ఏదీ కచ్చితం కాదన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టబోయే వివిధ పథకాలకు.. ఇతరత్రా అవసరాలకు సర్వే ద్వారా నమోదైన డేటా ఉండటం అవసరమన్నారు. ఉదాహరణకు భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకున్నా.. ఆన్లైన్లో వివరాలు ఉన్నాయోమో చూస్తారని, లేని పక్షంలో ఇబ్బంది ఎదురు కావచ్చన్నారు. కుటుంబానికి సంబంధించిన మొత్తం సమాచారం ఇస్తే మంచిదన్నారు. సర్వే సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా పోలీసు సహకారాన్ని కోరుతున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ, 7500 మంది పోలీసులే ఎన్యూమరేటర్లుగా ఉన్నారని తెలిపారు. చాలా ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు రాలేదని, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో.. మేయర్ వార్డులో సైతం చాలామంది ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదనగా.. అన్ని ప్రాంతాలకూ వస్తారని, రాని పక్షంలో కాల్‌సెంటర్, వెబ్సైట్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని, తగు ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. సర్వే జరగకుండా మిగిలిపోయే ఇళ్లుంటే... పరిస్థితేమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి వాటి విషయంపై ఆలోచిస్తామన్నారు. తాళాలు ఉన్న వాటితో పాటు మిగిలిపోయిన ఇళ్ల విషయాలపైనా ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
సర్వేకు.. సకలం సిద్ధం
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేపై సందిగ్ధత తొల గింది. ఎన్నికల కమిషన్ పచ్చజెండా ఊపటంతో మంగళవారం జిల్లావ్యాప్తంగా ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావ్వికుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వలస జీవుల రాకతో బస్సులు సోమవారం కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం తమ స్వస్థలాలకు చేరుకున్నారు. మరోవైపు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రజలు తమ సొంత ఊళ్లకు చేరుకోవటంతో పల్లెలు కొత్త కళను సంతరించుకున్నాయి. జిల్లా ప్రత్యేక అధికారి బి. వెంకటేశం అధికారులతో సమావేశమై సర్వే విజయవంతం చేయాలని సూచించారు. సదాశివపేట, జహీరాబాద్‌లో పర్యటించి సర్వే ఏర్పాట్లను పరిశీలించారు. ఇన్చార్జి కలెక్టర్ శరత్ మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడి గ్రామాలు, పట్టణాల్లో పకడ్బందీగా సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వేలో భాగంగా కుటుంబ సభ్యులు అందజేసే ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలే తప్ప జిరాక్సు ప్రతులు తీసుకోవద్దని ఉద్యోగులకు స్పష్టం చేశారు. జిల్లాలోని 1066 పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల్లో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 8,00,028 గృహాల్లో సర్వే జరపనున్నారు. 32,952 మంది సిబ్బంది సర్వే విధులు నిర్వహించనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో సర్వే కోసం ప్రతి 30 ఇళ్లకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించారు. నియోజకవర్గం, మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులకు సర్వే పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎన్యుమరేటర్లకు 9.60 లక్షల సర్వే ఫారాలను, 9.6 లక్షల స్టిక్కర్లను పంపిణీ చేశారు. అలాగే సర్వే నిర్వహణలో పాల్గొనే సిబ్బంది కోసం 1,340 రూట్లలో ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు. సర్వే వివరాలను కంప్యూటరీకరించేందుకు 110 కేంద్రాలను ఏర్పాటు చేసి 899 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను సిద్ధం చేశారు. ఇవి ఉంటే సర్వే సులువు ఇంటింటి సర్వేకు ప్రజలు ముందస్తుగా సన్నద్ధమవుతే సర్వే సులువుగా పూర్తవుతుంది. తమ ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు తమ కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిగా తెలియజేయాలి. సర్వేకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ పుస్తకం, విద్యుత్ బిల్లు, పింఛన్ కార్డులు, బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా పుస్తకాలు, అంగవైకల్యం ఉంటే పీహెచ్సీ సర్టిఫికెట్లు, భూములు ఉంటే పట్టాదారు పాసుప్తుకాలు సిద్ధంగా ఉంచుకోవాలి. సర్వే విజయవంతం చేయండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేను విజయవంతం చేయాలి. సర్వే ద్వారానే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు వీలవుతుంది. ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చే ఎన్యుమరేటర్లకు కుటుంబ వివరాలను పూర్తిగా తెలియజేయాలి. -బి.వెంకటేశం, ప్రత్యేక అధికారి ఎలాంటి అనుమానాలు వద్దు జిల్లా ప్రజలు అపోహలు వీడి సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం అయ్యేందుకు సహకరించాలి. ఎన్యుమరేటర్లు కేవలం ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలి. జిరాక్స్ ప్రతులుతీసుకోవద్దు. ప్రతి మూడు గంటలకు ఒకమారు కలెక్టరేట్‌కు సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేక అధికారులు అందజేయాలి. -శరత్, ఇన్చార్జి కలెక్టర్ -
ఎవరి హక్కులు హరించం
సాక్షి, మహబూబ్‌నగర్: ‘రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్రకుటుంబ సర్వే, సమాచారం తెలుసుకోవడానికే తప్ప..ఎవరి హక్కులను హరించేందుకు కాదు. సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందజేసేందుకు, ఇంకా ఎవరెవరికి అందాలో తెలుసుకోవడానికే గాని మరే దురుద్ధేశాలు లేవు. సర్వే ఉద్ధేశాన్ని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లాం. ప్రతిరోజూ మీడియాలో ప్రచారం జరిగేలా చర్యలు తీసుకున్నాం. అలాగే ప్రజాప్రతినిధులకు పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించాం. గ్రామాల్లో ఇప్పటికీ టాం టాంలు వేయిస్తున్నాం. ’ అని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని స్పష్టంచేశారు. ఈనెల 19న చేపట్టే సర్వేకు సంబంధించిన పూర్తివివరాలు ఆదివారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. సమగ్ర సర్వేకు ఏయే ఏర్పాట్లు చేశారు? ఈనెల 19 సర్వేకు సంబంధించిన పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేశాం. ఇంటింటికీ నెంబర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. నెంబర్లను కూడా క్రాస్‌చెక్ చేసుకుంటున్నాం. ఎన్యుమరేటర్లకు శిక్షణ పూర్తయి.. కిట్స్ కూడా సిద్ధంచేశాం. ప్రభుత్వం నుంచి బుక్లెట్స్ రావాల్సి ఉంది. అవి ఆదివారం రాత్రికి వస్తున్నాయి. రాగానే జిల్లా బుక్‌లెట్‌ను జతచేసి మండలానికి పంపుతాం. మొదట అచ్చంపేట, కొల్లాపూర్, గద్వాల తదితర ప్రాంతాలకు పంపుతాం. ఆ తరువాత గ్రామాలు, మునిసిపాలిటీలకు అందజేస్తాం. ఎన్యుమరేటర్ల విధులు ఎలా ఉంటాయి? ప్రభుత్వ సిబ్బందిని, అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఎన్యుమరేటర్లుగా నియమించాం. ఇంకా తక్కువ కావడంతో ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులను నియమించాం. ఎన్యుమరేటర్ల అందరినీ కూడా వారు విధులు నిర్వహించే దగ్గర్లోనే సర్వే డ్యూటీ కేటాయించాం. ఇప్పటికే వారందరూ తహశీల్దార్‌కు టచ్‌లో ఉంటారు. గ్రామాల్లో సర్పంచ్‌లు భోజనం సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఎంతమంది విధుల్లో ఉంటారు? ఒక ఎన్యుమరేటర్ 25 కుటుంబాల సమాచారాన్ని సేకరించేవిధంగా విధులు కేటాయించాం. 40వేల మంది ఎన్యుమరేటర్లు సమాచార సేకరణలో పాల్గొంటారు. మండలస్థాయిలో ఎమ్మారో, డివిజన్ స్థాయి ఆర్డీఓ పర్యవేక్షిస్తారు. భాష తెలియని వారిని ఎన్యుమరేటర్లుగా ఎంపికచేశారనే విమర్శలున్నాయి కదా? నారాయణపేట, మక్తల్ ప్రాంతాల్లో కన్నడ భాష ఎన్యుమరేటర్లు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. వారికి భాష పట్ల ఇబ్బంది కలగకుండా ఉండేందు కోసం వారికి సహాయకులను ఏర్పాటుచేశాం. సమాచారం ఎలా నమోదుచేసుకోవాలి? సర్వేలో భాగస్వాములైన వారికి ఇప్పటికే ధ్రువీకరణపత్రాలు జారీచేశాం. వాటిని చూపితే చాలు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా సర్వేలో ఉండి, ఇంట్లో ఎవరూ లేకపోతే పక్కింటి వారికి సమాచారమిస్తే చాలు..నమోదుచేసుకుంటాం. సర్వే పట్ల ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి కదా! భయపడాల్సిన అవసరం ఏముంది. ఇది ఒకింత మన మంచి కోసమే. దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదు. ఇది కేవలం తెలంగాణలో ఎవరు ఎలా ఉన్నారు? వారి ఆర్థిక స్థితిగతులేంటి? వారి జీవనం తెలుసుకోవడం తప్పితే ఇందులో ఎలాంటి దురుద్ధేశం లేదు. సమాచారం ఇవ్వడమనేది బలవంతమేమీ లేదు. ఎవరి హక్కులను హరించడం కోసం కాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి అవసరమవుతాయనేది తెలుసుకోవడం కోసమే ఈ సర్వే. వలస వెళ్లినవారి పరిస్థితి ఏమిటి? కలెక్టర్ : జిల్లా నుంచి ఉపాధి వివిధ ప్రాంతాలకు వలసవెళ్లినట్లు మాకు సమాచారం ఉంది. గుంపుల మేస్త్రీలను గట్టి ఆదేశాలిచ్చాం. మేం చెప్పగానే చాలా మంది సానుకూలంగా స్పందించారు. పెడచెవరిన పెట్టిన వారిని కఠినంగా వ్యవహరించాం. వారిని తీసుకురాకపోతేలెసైన్స్లు రద్దుచేస్తామని చెప్పడంతో.. చాలామంది కూలీలను తీసుకొచ్చారు. -
సర్వే పండగ
సంక్రాంతి సకినాల పండగ.. ఉగాది బూరెల పండగ... సద్దుల బతుకమ్మ, దసరా ధూం..ధాం... ఈ పండగ వేళల్లో కొడుకులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లతో ఇళ్లంతా కోలాహలమే. క్యాలెండర్లో లేని, అనుకోని పండగలా మంగళవారం సర్వే పండగ వస్తోంది. సర్వేకోసం ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంతూళ్లకు వస్తుండడంతో జిల్లాలో ప్రతీ ఇంటా పండగ వాతావరణం అలుముకుంది. పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే దేశంలోనే ఓ వినూత్న సందర్భంగా మిగిలిపోనుంది. మంగళవారం జరగనున్న సర్వే కోసం సుదూర ప్రాంతాల్లో నివాసముంటున్న వారందరూ ఆదివారం రాత్రి నుంచే జిల్లాకు చేరుకుంటున్నారు.మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించడంతో తమ పిల్లలను వెంటేసుకుని కుటుంబాలు సొంతింటికి బయలుదేరాయి. జిల్లాకు చెందిన సుమారు 25 వేల మంది హైదరాబాద్‌లో నివసిస్తుండగా.. చెన్నై, బెంగళూర్, పుణె, ముంబయి నగరాల్లో వందలాది మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరూ కూడా సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు ఇళ్లలోకి చేరుకుంటున్నారు. ప్రధాన మైన పండగలకు మాత్రమే వచ్చే కొడుకులు, కోడళ్లు.. మనవళ్లు, మనవరాళ్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సమగ్ర సర్వే కోసం రావడంతో మంగళవారం ప్రతీ ఇంటా పెద్ద ఎత్తున విందులు చేసుకునే అవకాశాలున్నాయి. బొగ్గుబాయి.. దుబయి జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగరీత్యా సింగరేణి గనుల్లో బొగ్గుబాయి కార్మికులుగా పనిచేస్తున్నారు. ‘ఉపాధి’ కోసం దుబయి లాంటి విదేశాలకు వలస వెళ్లిన వారు సైతం సమగ్ర కుటుంబ సర్వే కోసం వస్తున్నారు. సర్వే ద్వారా తమ జీవితాల్లో అంతో.. ఇంతో... వెలుగు నిండుతుందన్న ఆశతో వారు సర్వేకు హాజరయ్యేందుకు బయలుదేరారు. సింగరేణి గనుల్లో పనిచేస్తూ నాలుగైదేళ్లలోపే ఉద్యోగ విరమణ పొందే వారంతా ముందుగానే తమ సొంత గ్రామస్తుడిగా గుర్తింపు పొందేందుకు సర్వే పట్ల ఆసక్తి చూపుతున్నారు. వీరు తమ ఇళ్లలోకి చేరుకుంటున్నారు. ఇలా... పెద్ద సంఖ్యలో గ్రామాలకు చేరుకుంటున్న వారితో పల్లెలన్నీ కళకళలాడనున్నాయి. పొద్దంతా ఎన్యూమరేటర్ల కోసం ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ రోజు తమ తమ ఇళ్లలో పండగ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని కోసం తమ కొడుకులు, కోడళ్లు వస్తున్నారని, అందరూ కలిసి పండుగ చేసుకునేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. -
‘ఆధార్’ బేజార్
దుబ్బాక: కార్డుల్లేక ప్రజలు బేజారవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ఆధార్ కార్డును లింకు చేయడంతో దుబ్బాక నియోజక వర్గంలో నేటికి 20 శాతం మంది ప్రజలకు ఆధార్ కార్డులు లేకపోవడం గమనార్హం. ఒక్కొక్కరు నాలుగైదు సార్లు ఫోటోలు దిగినా వారికి ఆధార్ కార్డు లభించలేదు. ఏదో ఒక్క కారణంతో ఫోటోలు దిగిన లబ్ధిదారుడు తిరస్కరణకు గురవుతున్నారు. కొందరికేమో ఫింగర్ ప్రింట్ సరిగా లేదని, మరి కొందరికి పోస్టల్ డీలేతో ఆధార్ కార్డులు ప్రజలుకు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం పెట్టిన పుణ్య కాలం దగ్గర పడుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. నియోజక వర్గ కేంద్రమైన దుబ్బాకతోపాటు మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, చేగుంట మండల కేంద్రాల్లో ఉన్న ‘మీ సేవా’ కేంద్రాల వద్ద రాత్రింభవళ్లు క్యూ లైన్లలో పడిగాపులు గాస్తున్నారు. చంటి పిల్లల తల్లిదండ్రులు, వయస్సు మీద పడ్డ వృద్ధులు క్యూ లైన్లో నిలబడలేక నానా అవస్థలు పడుతున్నారు. క్యూ లైన్లో నిలబడలేక చాలా మంది నీరసంతో కూలబడిపోతున్నారు. ఆధార్ కార్డు లేకుంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అనర్హులమవుతామన్న భయం ప్రజల్లో బాగా నెలకొంది. దీంతో మీ సేవా కేంద్రాలకు వచ్చే ఆధార్ లబ్ధిదారుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు 24 గంటల పాటు పని చేయాల్సి వస్తోంది. దుబ్బాక మీ సేవా కేంద్రానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మీ సేవా కేంద్రం మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు పని చేస్తూనే ఉంది. కార్డు దారులు కూడా రాత్రింభవళ్లు క్యూలైన్లో కూర్చుండడం విశేషం. అప్పుడప్పుడు సర్వర్ సరిగా సహకరించదు. ఆన్లైన్ సర్వీస్ అందుకోవడం లేదు. దీనికి తోడు అప్రకటిత విద్యుత్ కోతలు, ప్రజల నుంచి నిర్వాహకులపై ఒత్తిడి పెరుగుతోంది. చేసేదేమి లేక నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మండల కేంద్రంతోపాటు మండల పరిధిలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలన్నింటికీ ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ పనులు అప్పజెప్పితే పని భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డుల్లేని ప్రజలకు కూడా కొంత వెసులుబాటు కలుగుతోంది. ఆధార్ కార్డుల నమోదు చేసే మీ సేవా కేంద్రాల సంఖ్యను ప్రజల రద్దికనుగుణంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మెదక్ లోక్‌సభ పరిధిలో సమగ్ర సర్వే వద్దు
ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలతో తేల్చి చెప్పిన భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక నిర్వహణకు షెడ్యూల్ విడుదలైనందున ఆ నియోజకవర్గంలో సమగ్ర కుటుంబ సర్వే చేయవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ‘ఎన్నికల కోడ్’ అమలులోకి వచ్చినందున అక్కడ సర్వే చేయడానికి వీలులేదు. ఆ స్థానాన్ని మినహాయించుకుని మిగతాప్రాంతాల్లో నిర్వహించుకోవచ్చు’ అని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు దీంతో తొలి అవాంతరం ఎదురైంది. ఈ నెల 19న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల వద్దకు అధికారులు వెళ్లి సర్వే చేయాల్సి ఉండటం తెలిసిందే. -
ఇంకు పడుద్ది!
పక్కాగా సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఎత్తుగడ డూప్లికేషన్‌కు కళ్లెం వేసేందుకు ఆలోచన పలుచోట్ల నమోదుకాకుండా వేళ్లకు సిరా తహసీల్దార్లకు ఎస్ఎంఎస్ సందేశాలు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘సమగ్ర కుటుం బ సర్వే’ను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఒకే వ్యక్తి పలు కుటుంబాల్లో నమోదుకాకుండా నియంత్రించడానికి వేలుపై సిరా గుర్తు పెట్టాలని నిర్ణయించింది. సాధారణంగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు మాత్రమే చూపుడు వేలుపై సిరా చుక్క పెడతారు. తాజాగా రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇంటింటి సర్వేలో అవకతవకలు జరగకుండా అరికట్టవచ్చని భావిస్తోంది. జిల్లావ్యాప్తంగా 8 లక్షల కుటుంబాలుండగా, వీటిలో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ కుటుంబాల్లో చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డవారే. 19వ తేదీ ఒకేరోజు జరిగే సర్వేలో వీరిలో చాలామంది అటు ఇటు పేర్లను నమోదు చేసుకునే అవకాశముందని సందేహించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. డూప్లికేషన్‌కు అడ్డుకట్ట వేసేందుకు సమాచారం సేకరించిన పౌరుల వేళ్లకు ఇంకు గుర్తును నమోదు చేయాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సంక్షిప్త సందేశాల (ఎస్ఎంఎస్) ద్వారా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది. కలెక్టరేట్ నుంచి తక్షణమే సిరా సీసాలను తీసుకెళ్లాలని సూచించింది. కాగా ఈ సర్వేను మరుసటి రోజుకు కూడా పొడిగించే అవకాశం లేకపోలేదని తాజా సంకేతాలను బట్టి తెలుస్తోంది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లిన వారి పేర్లను నమోదు చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
స్వచ్ఛంద’ సర్వేకు గ్రీన్‌సిగ్నల్
-
సర్వే స్వచ్ఛందం
* వివరాల వెల్లడి తప్పనిసరి కాదు: టీ సర్కారు * సంక్షేమ పథకాలు పొందాలంటే.. వివరాలు ఇవ్వాలి * భవిష్యత్తులో రేషన్‌కార్డులు, పింఛన్ల వంటివాటికి దీన్ని ప్రామాణికంగా తీసుకుంటాం * దీని ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక * స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వండి, ఇష్టం లేకపోతే వివరాలు ఇవ్వకపోయినా ఫరవాలేదు.. * బ్యాంకు అకౌంట్ నంబర్ తప్పనిసరి కాదు * ఇంట్లో కుటుంబమంతా ఉండాలన్న నియమం లేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 19న నిర్వహిస్తున్న ‘సమగ్ర కుటుంబ సర్వే’లో అన్ని వివరాలు వెల్లడించడం తప్పనిసరేమీ కాదని తెలంగాణ సర్కారు వెల్లడించింది. అయితే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో ప్రయోజనం పొందాలంటే ‘సర్వే’లో ఎన్యూమరేటర్లు అడిగే సమాచారాన్ని ఇవ్వాలని ప్రజలకు సూచించింది. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందించేలా నమ్మకమైన, కచ్చితమైన సమాచారం కోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నామని... పూర్తి సమాచారం ఇవ్వకుంటే ప్రభుత్వ పథకాలు అందే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ‘సర్వే’పై పలు విభిన్నమైన అభిప్రాయాలు వెలువడడంతోపాటు హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో... ‘సర్వే’పై ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ గురువారం పలు వివరాలు వెల్లడించారు. సర్వేకు సంబంధించి ఏ విషయంలోనూ సమాధానం తప్పనిసరికాదని.. అయినా ప్రజలంతా స్వచ్ఛం దంగా సమాచారం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ఖాతా నంబరును తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వం నుంచి పొందే లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయడానికి మాత్రమే బ్యాంకు అకౌంట్ నంబర్ అడుగుతున్నారని.. సమాచారం ఇవ్వకపోయినా ఫరవాలేదని తెలిపారు. ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా ఉండాలన్న నియమం లేదని.. ఇంట్లో యజమాని లేదా బాధ్యత కలిగిన వ్యక్తులు సమాచారమిచ్చినా సరిపోతుందని అధికారులు వెల్లడించారు. ఇంట్లో లేని వారికి సంబంధించిన ఏవైనా రుజువులు చూపించి.. వారి వివరాలు ఇవ్వవచ్చని చెప్పారు. కుటుంబ ఆదాయం ఎంతని మాత్రమేగాని ఏ రూపంలో ఆదాయం వస్తుందన్న వివరాలు అడగడం లేదని వివరించారు. ప్రజల హక్కును హరించడానికి ఈ సర్వే నిర్వహించడం లేదని, ప్రభుత్వ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకే దీనిని నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇది బేస్‌లైన్ సర్వే అని... భవిష్యత్తులో రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహ నిర్మాణం, విద్యార్థులకు ఉపకార వేతనాలు తదితర అంశాల్లో దీనిని ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపారు. ఈ సర్వే ఆధారంగా సంబంధిత శాఖలు తమ సొంత సర్వేలతో లబ్ధిదారులను ఎంపిక చేసుకుంటాయని చెప్పారు. ప్రభుత్వ శాఖలన్నీ పంచుకుంటాయి.. తెలంగాణలో 19వ తేదీన మొత్తం 3.76 లక్షల మంది ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకు సర్వే చేస్తారని, ఈ సర్వే పత్రాలను ఒక్కో మండలంలో 20 నుంచి 30 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లతో ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తామని పేర్కొన్నారు. ఈ వివరాలను అన్ని ప్రభుత్వ శాఖలు పంచుకుంటాయని అధికారులు తెలిపారు. కాగా.. ఈ సర్వేను ‘గణాంకాల చట్టం-2008’ కింద చేపట్టడం లేదని, ఆ చట్టం కింద చేపడితే... ప్రజలు విధిగా సమాచారం ఇవ్వాల్సి వస్తుందని ఓ అధికారి వివరించారు. ప్రస్తుత సర్వేలో అవసరమనుకుంటే వివరాలు ఇవ్వవచ్చని, ఇవ్వడానికి ఇష్టం లేకపోతే అదే విషయాన్ని ఎన్యుమరేటర్లు రాసుకుని వెళ్తారని తెలిపారు. కాగా.. ‘సమగ్ర’ కుటుంబ సర్వేపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోందన్న అంశంపై తమకెలాంటి సమాచారం లేదని ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ పేర్కొన్నారు. -
సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అవగాహన కోసమే సర్వే
మిర్యాలగూడ :తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అవగాహన కోసమే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. గురువారం పట్టణంలోని శాంతినికేతన్ కళాశాలలో ఎన్యుమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో ఆర్థిక, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు ఈ సర్వే దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈసర్వే వల్ల రేషన్‌కార్డు ఉన్న , పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులుండవని పేర్కొన్నారు. జిల్లాలో భూపంపిణీ కోసం సుమారు 300మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. శుక్రవారం స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మోతె మండలానికి చెందిన లబ్ధిదారులకు జిల్లా కేంద్రంలో రాష్ట్రవిద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చేతుల మీదుగా భూమి పట్టాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. జేసీ వెంట మిర్యాలగూడ ఆర్డీఓ బి. కిషన్‌రావు, మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ సురేష్, తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, మున్సిపల్ మేనేజర్ వసంత, ఆర్ఐ లక్ష్మణాచారి తదితరులు ఉన్నారు. -
‘సర్వే’పై ఎవరికీ ఫిర్యాదు చేయలేదు
టీడీపీ పార్లమెంటరీ నేత సుజనాచౌదరి న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్ర హోంశాఖ మంత్రికి తమ పార్టీ ఎంపీలు ఫిర్యాదు చేసినట్టు వచ్చిన వార్తలను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనాచౌదరి ఖండించారు. గురువారం ఆయన ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎవరికీ ఏ ఫిర్యాదు ఇవ్వలేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సర్వే ఎందుకో తెలియజేయాలని కోరామని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంది, అనుభవజ్ఞుడైన సీఎం ఉన్నారు. ఆయన ఏది కావాలనుకున్నా చేయొచ్చు. ఏది చేయాలో చేయకూడదో ఆయన నిర్ణయిస్తారు. సర్వేపై తెలంగాణ ప్రజల నుంచే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే తప్పో ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు’’ అన్నారు. ఉద్యోగుల విభజనపై మాట్లాడుతూ.. వారి విభజన ఆలస్యం కారణంగా రెండు రాష్ట్రాల్లో పరిపాలనా పరంగా ఎన్నో ఇబ్బం దులు తలెత్తుతున్నాయని, విభజన ఎప్పటికి పూర్తి చేస్తారో కేంద్రం స్పష్టత ఇవ్వాలనే విషయం గురువారం పార్లమెంట్లో ప్రస్తావించానన్నారు. ఉద్యోగుల విభజన పారదర్శకంగా చేస్తామని డీఓపీటీ మంత్రి జితేందర్‌సింగ్ సమాధానమిచ్చారని, నిర్దిష్టమైన సమయం తెలియజేయాలని తాను కోరినట్టు చెప్పారు. -
తప్పుల తడకగా ‘సెలవు’ జీవో
సర్వే పురస్కరించుకొని ఉత్తర్వులు ఒకే అంశంపై మూడు జీవోలు-అందులోనూ లోపాలు అయినా వర్తించని వేతనంతో కూడిన సెలవుదినం సాక్షి,సిటీబ్యూరోః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో ఈనెల 19వ తేదిన ప్రైవేటు కార్మికులకు ‘సాధారణ సెలవుదినం’గా ప్రకటిస్తూ ప్రభుత్వం(కార్మిక శాఖ) జారీ చేసిన ఉత్తర్వులు తప్పులతడకగా మారాయి. కార్మికుల సాధారణ సెలవు అంశంపై మూడు జీవోలు జారీ చేసినా అవి లోపభూయిష్టంగా ఉన్నాయి. ఒక తప్పు దిద్దుకొని మరో తప్పుతో లేని యాక్ట్‌లతో జీవోలు జారీ చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. అయినా కార్మికుల వేతనంతో కూడిన సెలవు దినం అమలుపై కచ్చితమైన ఆదేశాలు లేకపోవడం విశేషం తప్పులు ఇలా.. సమగ్ర కుటుంబ సర్వే పురస్కరించుకొని తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2014 కింద తెలంగాణ ప్రాంతంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈనెల 19వ తేదీ సాధరణ సెలవుదినంగా ప్రకటిస్తూ జీవో నంబర్ 75 ద్వారా ప్రభుత్వ(కార్మికశాఖ) కార్యదర్శి ఆర్.వి.రవిచంద్రన్ ఈ నెల 12(మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా కార్మిక శాఖకు సంబంధించి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2014 అనేది అసలు లేదు. మరోవైపు జీవోలో ఫ్యాక్టరీస్‌కు సంబంధించిన ఊసే ఎత్తలేదు. ఈ పొరపాటును సరిదిద్దుకునేందుకు మరుసటి రోజు(13వ తేదీ) హడావుడిగా జీవో 75ను రద్దు చేస్తూ రివైజ్డ్ జీవో నంబర్ 76ను జారీ చేశారు. ఇందులో తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1988, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 కింద సాధారణ సెలవుగా ప్రకటించారు. ఇక్కడ కూడా ఫ్యాక్టరీస్ జీవో నంబర్లో తప్పు ఉండడంతో దానిని సైతం రద్దు చేస్తూ అదేరోజు తిరిగి మరో జీవోను 77 నంబరుతో జారీ చేశారు. ఇందులో తెలంగాణ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1988, ఏపీ ఫ్యాక్టరీస్ ఆండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ (జాతీయ పండుగలు అండ్ ఇతర సెలవులు) యాక్ట్ 1974 కింద సెలవు దినంగా ప్రకటించారు. ప్రజల అవసరాలు దృష్ట్యా సెలవు దినంగా ప్రకటిస్తున్న కారణంగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం కేవలం సాధారణ సెలవు దినంగా ప్రకటించి చేతులు దులుపుకుంది. దీంతో 19వ తేదీన తప్పని సరిగా సెలవుగా గుర్తించే పరిస్థితి లేదు. ఒకవేళ వ్యాపార, వాణిజ్య సంస్థలు ఫ్యాక్టరీలు సెలవుదినం అమలును విస్మరిస్తే కార్మికులు ఒక రోజు వేతనాన్ని నష్టపోక తప్పదు. మరోవైపు లోప భూయిష్టమైన జీవోతో కార్మిక శాఖ కూడా చర్య తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. -
‘స్వచ్ఛంద’ సర్వేకు గ్రీన్‌సిగ్నల్
నిలుపుదలకు అనుబంధ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు ఎవరినీ బలవంతపెట్టబోమన్న రాష్ర్ట ప్రభుత్వం స్వచ్ఛందంగా వివరాలిస్తేనే నమోదుకు హామీ చట్ట ప్రకారమే సర్వే చేస్తున్నామని ఏజీ వాదన తదుపరి విచారణ 20కి వాయిదా హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేను నిలిపేయడానికి హైకోర్టు నిరాకరించింది. సర్వే సందర్భంగా పౌరుల నుంచి బలవంతంగా వివరాలు సేకరించబోమని, స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారి నుంచే వివరాలు నమోదు చేసుకుంటామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి హామీ ఇవ్వడంతో పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గణాంకాల సేకరణ చట్టానికి విరుద్ధంగా రాష్ర్ట ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టిందని, దీన్ని నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన గృహిణి సీతాలక్ష్మీ, మరొకరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన కోర్టు గురువారం మరోసారి విచారించింది. సీతాలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్‌రావు వాదనలు వినిపించారు. గణాంకాల సేకరణ చట్టం ప్రకారం పౌరుల వివరాలతో కూడిన సర్వేను నిర్వహించే అధికారం రాష్ట్రాలకు లేదని, అది కేంద్రం పరిధిలోనిదని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలకు ప్రత్యేకాధికారాలు గానీ, మినహాయింపులు గానీ లేవని కోర్టు దృష్టికి తెచ్చారు. సర్వే చేయాలనుకుంటే ముందుగా నోడల్ అధికారిని నియమించాలని, ఏదైనా ప్రభుత్వ శాఖ సర్వే చేయాలనుకుంటే ముందు నోడల్ అధికారిని సంప్రదించాలని, అతని సలహా మేరకే సర్వే చేపట్టాల్సి ఉంటుందని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. కానీ రాష్ర్ట ప్రభుత్వం తలపెట్టిన సర్వే విషయంలో ఈ నిబంధనలను సరిగా పాటించలేదని వాదించారు. పౌరుల వ్యక్తిగత వివరాలను భద్రపరిచే వ్యవస్థ కూడా లేదన్నారు. సర్వే పేరుతో పౌరుల వ్యక్తిగత వివరాలను వారి ఇష్టానికి వ్యతిరేకంగా సేకరించడానికి వీల్లేదన్నారు. తర్వాత అడ్వొకేట్ జనరల్(ఏజీ) రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. సర్వే నిర్వహించే అధికారం రాష్ట్రానికి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు దక్కడం లేదని, పథకాల దుర్వినియోగాన్ని అడ్డుకుని అసలైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశంతోనే సర్వే నిర్వహిస్తున్నామని వివరించారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. సంక్షేమ పథకాల వల్ల అయాచిత లబ్ధి పొందే దళారులే ఈ సర్వేకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఈ సర్వేపై వైఖరి ఏంటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని అడిగారు. చట్ట పరిధిలోనే సర్వే చేస్తున్నారని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ బి.నారాయణరెడ్డి కోర్టుకు నివేదించారు. తర్వాత ఏజీ తన వాదనలను కొనసాగిస్తూ.. ఈ సర్వేలో పౌరుల నుంచి స్వచ్ఛందంగానే వివరాలను సేకరిస్తామని, ఎవరినీ బలవంతం చేయబోమని తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఆ ప్రకటనను రికార్డ్ చేస్తూ.. ఆ ప్రకారమే సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. పిటిషనర్ల భయాందోళనలకు ప్రాథమిక ఆధారాలు కనిపించడం లేదని, అందువల్ల సర్వే నిలుపుదల కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు ఉత్తర్వులిచ్చారు. సర్వే చట్ట విరుద్ధమంటూ దాఖలైన ప్రధాన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. -
ఆ ఒక్కరోజు... అందరికీ పరీక్షే
►సమగ్ర ఇంటింటి సర్వేపై సర్వత్రా చర్చ ►కుటుంబసభ్యులంతా ఇంట్లో ఉండాలన్న నిబంధనతో ఆందోళన ►వలస జీవులకు తప్పని కష్టాలు ►సెలవు లేక కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల ఊగిసలాట ►ఆస్పత్రుల్లో ఉన్నవారు... ►అత్యవసర పనులపై వెళ్లిన వారికీ తిప్పలే! మెదక్: మెతుకుసీమలోని ఏ పల్లెలో చూసినా...ఈనెల 19న నిర్వహించ నున్న సమగ్ర ఇంటింటి సర్వేపై చర్చ కొనసాగుతోంది. ఆ ఒక్క రోజు ఇంట్లోని సభ్యులంతా అందుబాటులో ఉండాలన్న నిబంధన ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. పురిటిగడ్డలో బుక్కెడు బువ్వ దొరక్క..కన్న వారిని పోషించుకోలేక..బతుకు భారమై వలస బాట పట్టిన నిరుపేదలు..ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు..సెలవులేని కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు.. చిరు ఉద్యోగాల కోసం ఇతర దేశాలు వెళ్లిన శ్రమ జీవుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా అర్హులైన లబ్ధిదారులకు అందించాలని...ఎక్కడివారు అక్కడే ప్రయోజనాలు పొందాలన్న లక్ష్యంతో రూపొందించిన మహా సర్వే లక్ష్యం అభినందనీయమే అయినప్పటికీ ఇంట్లోని సభ్యులంతా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటివద్దే ఉండాలన్న షరతు మాత్రం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. అదికూడా ఒకేరోజు సర్వే నిర్వహిస్తామని, ఆపై అవకాశం లేదని తేల్చి చెప్పడంతో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. వలసపోతే..లెక్కలో లేనట్టేనా? గత కొన్నేళ్లుగా ఆశించిన వర్షాలు లేక కొంతమంది...పిల్లల పెళ్లిళ్లకు..ఇళ్ల నిర్మాణాలకు చేసిన అప్పులు తీర్చే మార్గంలేక పల్లెల్లో చాలా మంది పట్టణాలకు వలసబాట పట్టారు. మెదక్ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 30,33, 288 మంది జనాభా ఉన్నారు. కనీసం ఇందులో 5 నుంచి 10 శాతం మంది వలసలు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల్లో తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా చేనేత కార్మికుల మగ్గాలు మూలన పడటంతో దుబ్బాక, పాపన్నపేట, పెద్దశంకరంపేట, కొల్చారం, నారాయణ్‌ఖేడ్, తదితర మండలాలకు చెందిన చేనేత కార్మికులు చాలా మంది గుజరాత్, మహారాష్ట్రాలకు వలసలు వెళ్లారు. అలాగే పంటలు పండక ఆర్థికంగా చితికిపోయిన రైతులు కూలీలుగా మారి నిజామాబాద్ జిల్లాలోని గోదూర్, వర్ని, బోధన్ మండలాలకు వందల సంఖ్యలో తరలివెళ్లారు. సిద్దిపేట, మెదక్ మండలం బూర్గుపల్లి, వాడి, రామాయంపేట, పాపన్నపేట తదితర మండలాల నుండి నిరుపేదలు కుటుంబ పోషణకోసం పిల్లా పాపలను వదిలి దుబాయ్, మస్కట్‌లాంటి గల్ప్ దేశాలకు వలసలు వెళ్లారు. అయితే సమగ్ర ఇంటింటి సర్వే ప్రొఫార్మాలో సుమారు 95 కాలమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి పెద్దతోపాటు సభ్యులంతా తప్పసరిగా ఇంటి వద్దనే ఉండాలని అధికారులు చెబుతున్నారు. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్నవారు సొంత ఊరికి రావాలంటే అనేక ఇబ్బందులున్నాయన్నంటూ వారి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరస్థితిలో ఉన్నవారి పరిస్థితి ఏమిటీ? వందలాది మంది అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఏమిటని వారి కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే మీడియా లాంటి సంస్థల్లో, అత్యవసర వైద్య శాఖ, అగ్నిమాపకశాఖ, 108, 104 సంస్థల్లో పనిచేస్తున్న వారికి సెలవు దొరకడం కష్టం. ఇక కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల్లో కూడా చాలా మంది పనిచేస్తున్నారు. ఈనెల 19న నిర్వహించబోయే సర్వే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ , కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు సెలవు ప్రకటించలేదు. దీంతో పోస్టాఫీస్, రైల్వే తదితర సంస్థల్లో పనిచేస్తున్న వారు తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. గల్ప్ దేశాల్లో ఉన్నవారు ఒక్కరోజు సర్వే కోసం సొంత గ్రామాలకు రావాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అసలు ఒక్కరోజే ఎందుకు? ఒకేరోజు రాష్ట్రమంతా ఒకేసారి సర్వే నిర్వహించడం ద్వారా బోగస్ నమోదులను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో నిర్వహించిన సర్వేలో ఒక్కో వ్యక్తి రెండు, మూడు చోట్ల తమ పేర్లు నమోదు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇది కొంత వరకు నిజమే అయినప్పటికీ ప్రజల పరిస్థితిని కూడా సర్కార్ అర్థం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. సర్వేను కనీసం వారం రోజులపాటు కొనసాగించాలంటున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
సమగ్ర సర్వేకు సిద్ధం
-
సమగ్ర సర్వేకు సిద్ధం
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది.వారం రోజులుగా ఇదే అంశంపై కసరత్తు చేస్తున్న కలెక్టర్ రొనాల్డ్ రాస్ జిల్లా, మండల అధికారులకు రెండు రోజులుగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్వేకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. సర్వేలో పాల్గొనే అధికారులు, ఎన్యూమరేటర్లకు మంగళవారం మండల స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 56 కేంద్రాలలో ఈ శిక్షణ కొనసాగుతుంది. ఇందులో ప్రభుత్వ సిబ్బందితోపాటు ప్రైవేట్ సిబ్బంది కూడా ఉన్నందున పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు. లోటుపాట్లు లేకుండా 27,635 మంది ప్రభుత్వ ఉద్యోగులు శిక్షణలో పాల్గొననున్నారు. ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ఆశ వర్కర్లు కలిపి మరో మూడున్నర వేల మంది కూడా శిక్షణ పొందుతారు. వీరికి సోమవారం కలెక్టర్ అనుమతి పత్రాలను జారీ చేశారు. సర్వేను పకడ్బందీగా చేపట్టాలని, ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులకు ఉపదేశించారు. ప్రతి మండలంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేసుకొని ఉద్యోగులను ఎన్యూమరేటర్లుగా నియమించుకోనున్నారు. ప్రతి ఇంటికి కరపత్రం, ప్రతి గ్రామానికి పది చొప్పున పోస్టర్లు పంపిణీ చేశారు. మండల ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమానికి ఇన్చార్జిలుగా వ్యవహరించనున్నారు. సర్వే వివరాలను నమోదు చేయడానికి 1200 కంప్యూటర్లను సిద్ధం చేశా రు. అవసరమైన వాహనాలను సమకూరుస్తున్నారు. జిల్లా జనాభా 25,51,335 జిల్లా జనాభా 25,51,335 కాగా, నివాస గృహాలు 6,68,146 ఉన్నాయి. పట్టణ జనాభా 5,88,372, గ్రామీణ జనాభా19,62,963. ఒక కార్పొరేష న్, మూడు మునిసిపాలిటీలు, 718 గ్రామాలు ఉన్నాయి. ఈ వివరాల న్నింటినీ సర్వేలో సేకరించనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 25 నుంచి 30 ఇళ్లను కేటాయించారు. సర్వే ఇలా ఉంటుంది ఎన్యూమరేటర్లకు కుటుంబ సభ్యులు తమ పూర్తి వివరాలు చెప్పాలి. కుటుంబ సభ్యులతో పాటు తాత, ముత్తాతల వివరాలు సేకరించనున్నారు. ఎన్యూమరేటర్ల వద్ద 80 అంశాలతో కూడిన నమూనా ఫారం(25) అందుబాటులో ఉంటుంది. అందులో వివరాలు నమోదు చేస్తారు. ము ఖ్యంగా కులం, భూముల వివరాలు, సొంత ఇళ్లు, రేషన్‌కార్డు, పెన్షన్ వివరాలు తెలియజేయాలి. సర్వేలో గ్రామాధికారులతోపాటు మండలంలోని ప్రతి శాఖ అధికారి, ఎంపీడీఓ, తహశీల్దార్సహా సుమారు 18 శాఖలకు చెందిన అధికారులు పాల్గొంటారు. ఇవి ఉండాలి సర్వే రోజు ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు, వంట గ్యాస్ పుస్త కం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఇంటికి సంబంధించిన పత్రాలు, భూముల వివరాలు తెలియజేసే పత్రాలు, ఇళ్ల కొనుగోలు దస్తావేజులు, వాహనపత్రాలు, ఆస్తుల వివరాలు, ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్ ఏది అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. 19న సెలవు 19న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ప్రతి ఒక్కరు ఇంటి వద్దే ఉండాలి. బస్సులు నడవవు. ప్రైవేట్ వాహనాలను అధికారులు తీ సుకుంటారు. దూరప్రాంతా లవారు ఒక రోజు ముందుగానే ఇంటికి చేరుకోవాలి. -
19న ఇంటింటా వివరాల నమోదు
డిచ్పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని కుటుంబాలకు చెందిన పూర్తి చరిత్రను అధికారులు నమోదు చేయనున్నారు. ఇలాంటి సర్వే ఇంతవరకు దేశంలోని ఏ రాష్ట్రంలో జరిగిన దాఖలాలు లేవని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రం మొత్తంలో ఒకే రో జు ఈనెల 19న సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు సర్వేకు సంబంధించి సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఇతర జిల్లా స్థాయి అధికారులు మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల్లో న మూనా కుటుంబ సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయి లో సరే ్వ నిర్వహించినప్పుడు ఎలాంటి సమస్యలు వ స్తాయి, వాటిని ఎలా అధిగమించాలనే విషయమై న మూనా సర్వే చేశారు. సర్వే జరిగే రోజు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండి సర్వే సిబ్బందికి సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే పలుమార్లు కోరారు. ఆ రోజు ప్ర భుత్వం సెలవు దినం గా ప్రకటించింది. ఇంట్లో లేని వారి పేర్లు నమోదు చేయబోరని, చివరకు శుభకార్యాలను సైతం వాయిదా వేసుకోవాలని సీఎం సూచించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ రోజు ఇంటికి తాళం వేసి ఉండకుండా చూసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. విభాగం ఏ : గుర్తింపు వివరములు 1. జిల్లా పేరు: 2. మండలం పేరు: 3.గ్రామ పంచాయతీ పేరు/ మున్సిపాలిటీ పేరు: 4. రెవెన్యూ గ్రామం పేరు: 5.ఆవాసం పేరు/డివిజన్ పేరు/వార్డు పేరు: 6. నివశిస్తున్న ప్రదేశం/వాడ/కాలనీపేరు: 7. ఇంటి నెంబరు: 8. ఈ ఇంట్లో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య: విభాగం బి: కుటుంబ వివరములు: 1. కుటుంబ యజమాని పేరు: ఇంటి పేరు.. పూర్తి పేరు 2. తండ్రి/భర్త పేరు: 3. కుటుంబ సభ్యుల సంఖ్య: 4.మతం: హిందూ.. ముస్లిం.. క్రైస్తవ .. సిక్కు.. జైన.. బౌద్ధ.. ఇతరులు 5. సామాజిక వర్గం/కులం పేరు: ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. ఓసీ.. 6. గ్యాస్(ఎల్పీజీ )కనెక్షన్ ఉందా?: ఉంది.. లేదు.. 7. వినియోగదారుని సంఖ్య: 8. మొబైల్ ఫోన్ నెం.(ఆప్షనల్) 9. ఆదాయం పన్ను చెల్లించే కుటుంబమా?: అవును.. కాదు అనాథల వివరాలు (ఉన్నట్లయితే) 10. అనాథలు ఎక్కడ నివశిస్తున్నారు (సొంత ఇంట్లో.. బంధువుల ఇంట్లో.. బహిరంగ ప్రదేశాల్లో.. పాడుబడ్డ ఇంట్లో.. అనాథాశ్రమంలో) 11. అనాథాశ్రమంలో ఉంటే ఆశ్రమం పేరు: 12. ఆశ్రమం ఉన్న గ్రామం: 13. ఆశ్రమం ఉన్న మండలం: 14. అనాథ స్థితి (తల్లిదండ్రులు చనిపోయారు.. తల్లి/తండ్రి వదిలేశారు.. కొడుకులు/కూతుళ్లు వదిలేశారు) విభాగం సి: 1.క్రమ సంఖ్య 2. వ్యక్తిపేరు(కుటుంబ యజమానితో మొదలుకొని): 3. కుటుంబ యజమానికి సంబంధం: 4. లింగం(ఆడ.. మగ.. ఇతరులు): 5. పుట్టిన తేదీ.. తెలియనట్లయితే వయసు: 6. వైవాహిక స్థితి 7. పూర్తయిన విద్యార్హత 8. బ్యాంకు/పోస్టాఫీసు అకౌంటు ఉన్నదా ?.. లేదా? 9. పోస్టాఫీసు అకౌంట్ ఉన్నట్లయితే పోస్ట్ ఆఫీస్ శాఖ పేరు: 10. ’’ ’’ అకౌంట్ నెంబరు: 11.బ్యాంకు అకౌంట్ ఉన్నట్లయితే బ్యాంకు పేరు: 12. ’’ ’’ బ్యాంకు బ్రాంచి పేరు: 13. ‘‘ ’’ బ్యాంకు అకౌంట్ నెంబరు: 14. ఉద్యోగం: ఉన్నది.. లేదు 15. ఉద్యోగం ఉన్నట్లయితే ఉద్యోగం రకం: 16. ప్రభుత్వ పెన్షన్‌దారు అయితే (1.కేంద్ర ప్రభుత్వ పెన్షన్ 2. రాష్ట్రప్రభుత్వ పెన్షన్ 3. ప్రభుత్వరంగ సంస్థల పెన్షన్ 17. ప్రధానమైన వృత్తి: 18. సామాజిక పింఛన్‌దారులైతే పింఛన్ రకం 19. ఎస్‌హెచ్‌జీ సంఘ సభ్యత్వం:1 ఉన్నది 2. లేదు 20. ఆధార్ కార్డు(యుఐడి) నెంబర్: విభాగం డి: వికలాంగుల వివరాలు 1.క్రమ సంఖ్య 2. వికలాంగుల పేరు: 3. ఎలాంటి వైకల్యం: 4. సదరం సర్టిఫికెట్ ఉందా: 1 ఉన్నది 2.లేదు 5. సదరం సర్టిఫికెట్ ఉన్నట్లయితే ఐడీ నెంబరు 6. వైకల్యశాతం సర్టిఫికెట్ విభాగం ఇ: దీర్ఘకాలిక వ్యాధులు 1. క్రమ సంఖ్య 2. దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న వ్యక్తి పేరు: 3. వ్యాధి రకం విభాగం ఎఫ్: ఇంటి వివరములు 1. నివాస స్థితి: సొంతం.. కిరాయి.. తాత్కాలిక గూడు(ప్లాస్టిక్ కప్పు మొదలైనవి) 2. ఇంటి కప్పు రకం(1.గుడిసె 2. పెంకులు /రేకులు/బండలు 3. కాంక్రీట్ శ్లాబ్ 3. గదుల సంఖ్య (వంట గది కాకుండా) 4. కిరాయి.. తాత్కాలిక గూడుల్లో ఉంటున్న వారికి సంబంధించి ఇంకా ఎక్కడైనా ఇల్లు ఉందా? 5. కిరాయి.. తాత్కాలిక గూడుల్లో ఉంటున్న వారికి సంబంధించి ఇంటి స్థలం ఉందా (1.అవును 2.కాదు) 6. మీరు ఎప్పుడైనా ప్రభుత్వ బలహీనవర్గాల గృహ నిర్మాణ కార్యక్రమంలో లబ్ధి పొందారా?(1.అవును 2.కాదు) 7. 8.9.10.11.12 క్రమసంఖ్యల్లో మరుగుదొడ్డి, విద్యుత్, మీటర్ ఉందా? తదితర వివరాలు భర్తీ చేయాలి. విభాగం జి .. హెచ్‌లలో వ్యవసాయం.. పశు సంపదలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విభాగం ఐ : కుటుంబ సొంత చరాస్తుల వివరములు: చరాస్తి రకం: 1. మోటార్ సైకిల్/స్కూటర్ 2. మూడుచక్రాల మోటార్ వాహనం/ఆటో 3. కారు/జీపు/జేసీబీ/నాలుగు చక్రాల మోటార్ వాహనం, ఇతర భారీ వాహనాలు 4. ట్రాక్టర్/ దున్నే యంత్రం/కోత కోసే యంత్రం/ ఇతర వ్యవసాయ యంత్రాలు 5. ఎయిర్ కండిషనర్ (పైవి ఉన్నది.. లేదు వివరాలు రాయాలి. ఉన్నట్లయితే వాహన రిజిస్ట్రేషన్ నెంబర్. ఒకే రకమైన వాహనాలు రెండు ఉన్నట్లయితే ఒకదాని రిజిస్ట్రేషన్ నెంబరు రాస్తే చాలు. తాత్కాలిక సంచార కుటుంబాలు/జాతుల వారికి సంబంధించిన వివరాలు: శాశ్వత నివాసం.. ఎంతకాలంగా ఉంటున్నారు తదితర వివరాలు: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వారి వివరాలు: ఏ రాష్ట్రం నుంచి వచ్చారు.. మాట్లాడే భాష.. వచ్చిన సంవత్సరం క్రమ సంఖ్యలో భర్తీ చేయాల్సిన వాటికి సంబంధించిన కోడ్ నెంబర్లు విడిగా ఇచ్చారు. వాటిని చూసి భర్తీ చేస్తారు. ధ్రువీకరణ.. పైన తెలిపినసమాచారం వాస్తవమని..యదార్థమని నేను ధ్రువీకరిస్తున్నాను. పై సమాచారం తప్పుగా తేలినచో ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధిని రద్దుపరచి ప్రభుత్వ పథకాలకు అనర్హుడు/అనర్హురాలిగా ప్రకటించగలరు. ఇట్టి విషయం దైవ సాక్షిగా/ఆత్మసాక్షిగా ధ్రువీకరిస్తున్నాను. కుటుంబ యజమాని/సభ్యుల యొక్క సంతకం లేదా ఎడమచేతి బొటనవేలి ముద్ర. ఎన్యూమరేటర్ సంతకం.. వివరాలు పర్యవే క్షక అధికారి సంతకం.. వివరాలు అవసరమైన సందర్భాల్లో కుటుంబ యజమాని/ సభ్యుల సంతకం తీసుకునేముందు ధ్రవీకరణ చదివి వినిపించాలి -
సర్వేపై అవగాహన కల్పించాలి
నిర్మల్ : సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఈ నెల 19న చేపట్టే సర్వే రోజు వారంతా ఇంట్లోనే ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని రాజరాజేశ్వర గార్డెన్స్‌లో శుక్రవారం రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో సమగ్ర కు టుంబ సర్వేపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సర్వేల ద్వారానే ఒక ప్రాంతం అభివృద్ధిని సరిగా అంచనా వేయవచ్చని తెలిపారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సర్వే ద్వారా ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రజలంతా ఆ రోజున ఇంట్లో నే ఉండేందుకు ప్రభుత్వం సెలవు సైతం ప్రకటించిందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటికీ సెలవు ఉం టుందన్నారు. ఈ సర్వేలో ప్రజలంతా తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. సర్వే సందర్భంగా ప్రతీ వ్యక్తి వద్ద బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, భూముల పట్టాదారు పాస్‌బుక్, ఎల్పీజీ పాస్‌బుక్, పింఛన్‌దారులైతే పింఛన్ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. గ్రామాలు, వార్డుల్లో దండోరా లాంటి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 19వ తేదీ కంటే ముందు ఒక డెమో సర్వే చేయాలని చెప్పారు. సమగ్ర సర్వే కోసం జిల్లాలో సు మారు 30 వేల మంది సిబ్బందిని నియమించామన్నారు. వారికి త్వరలోనే డివిజన్ల వారీగా శిక్షణ ఉంటుందన్నారు. 11న ప్రజాప్రతినిధులకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఉంటుందని చెప్పారు. సర్వే విధులు నిర్లక్ష్యం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే అల్లోల ఇం ద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ డివిజన్లో సుమా రు 10 వేల మంది గల్ఫ్, ఇతర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లారని, సర్వే సందర్భంగా స్వగ్రామాల్లో వారి వివరాలనూ రికార్డు చేయాలన్నారు. ఆర్డీవో జల్ద అరుణశ్రీ, డ్వామా పీడీ గణేశ్ రా థోడ్, మెప్మా పీడీ రాజేశ్వర్ రాథోడ్, మున్సిపల్ చైర్మన్ గణేశ్ చక్రవర్తి, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో.. ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో శుక్రవారం సమగ్ర కుటుంబ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ సర్వేలో భాగంగా ప్రతీ ఎన్యుమరేటర్ 25 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని నిర్ణీత ప్రొఫార్మాలో సేకరిస్తాడని పేర్కొన్నారు. సర్వే కోసం ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సింగరేణి, పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామని తెలిపారు. పనులు, విద్యాభ్యాసం కోసం ఇతర దేశాలు వెళ్లినవారి వివరాలు నమోదు చేయరాదని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సర్పంచులు, గ్రామాధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
మినహాయింపు ఇవ్వాల్సిందే
సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్రేత రులకు సమగ్ర కుటుంబ సర్వే నుంచి మినహాయింపును ఇచ్చేందుకు కేసీఆర్‌తో మాట్లాడతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉపాధి కోసం ముంబై, శివారు ప్రాంతాలకు వచ్చిన వలస కూలీలు, ఉపాధి కార్మికులు 19న తప్పకుండా సొంత ఊరిలో ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడి తెలంగాణ ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్నారు. ఆ రోజు రావడం కుదరకపోతే, పనిచేస్తున్న చోట సెలవు దొరకకపోతే ఎలా? అని ఆందోళన చెందుతున్నారు. వలస బిడ్డల కష్టాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని, వారికి మినహాయింపునివ్వాలని కోరుతున్నారు. దీనిపై కిషన్ రెడ్డిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించింది. స్పందించిన ఆయన మహారాష్ట్రతోపాటు తెలంగాణ రాష్ట్రేతర ప్రజలకు మినహాయింపునిచ్చేలా కేసీఆర్‌తో, సంబంధిత అధికారులతో మాట్లాడతామన్నారు. ప్రవాస తెలంగాణ ప్రజల కోసం నిబంధనలను సడలించాలని కోరతామని తెలిపారు. ఉన్నఫలంగా స్వగ్రామాలకు తరలి రావాలంటే కష్టమవుతుందని, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, మినహాయింపు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. ఇదిలాఉండగా తెలంగాణలోని స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇక్కడి ప్రజలు టికెట్లను బుక్ చే సుకుంటున్నారు. అయితే రైళ్లతోపాటు బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్‌లో టికెట్లన్నీ బుక్ అయిపోయానని, టికెట్లు దొరకడం కష్టంగా మారిందని చెబుతున్నారు.