మెదక్ లోక్‌సభ పరిధిలో సమగ్ర సర్వే వద్దు | No comprehensive survey of the range of Medak Lok Sabha | Sakshi
Sakshi News home page

మెదక్ లోక్‌సభ పరిధిలో సమగ్ర సర్వే వద్దు

Published Sun, Aug 17 2014 2:33 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

మెదక్ లోక్‌సభ పరిధిలో సమగ్ర సర్వే వద్దు - Sakshi

మెదక్ లోక్‌సభ పరిధిలో సమగ్ర సర్వే వద్దు

ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలతో తేల్చి చెప్పిన భన్వర్‌లాల్
 సాక్షి, హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక నిర్వహణకు షెడ్యూల్ విడుదలైనందున ఆ నియోజకవర్గంలో సమగ్ర కుటుంబ సర్వే చేయవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ‘ఎన్నికల కోడ్’ అమలులోకి వచ్చినందున  అక్కడ సర్వే చేయడానికి వీలులేదు. ఆ స్థానాన్ని మినహాయించుకుని మిగతాప్రాంతాల్లో నిర్వహించుకోవచ్చు’ అని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు  దీంతో తొలి అవాంతరం ఎదురైంది. ఈ నెల 19న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల వద్దకు అధికారులు వెళ్లి సర్వే చేయాల్సి ఉండటం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement