నిర్భయంగా ఓటు వేయండి | Freely approach Vote | Sakshi
Sakshi News home page

నిర్భయంగా ఓటు వేయండి

Published Sat, Sep 13 2014 1:32 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

నిర్భయంగా ఓటు వేయండి - Sakshi

నిర్భయంగా ఓటు వేయండి

నేడు నందిగామ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలు
ఉభయ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలపై సీఈఓ భన్వర్‌లాల్
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్, 16న కౌంటింగ్
ఓటర్ స్లిప్‌లేని వారు 11 గుర్తింపు కార్డుల్లో దేనితోనైనా ఓటేయవచ్చు
మెదక్ లోక్‌సభకు 1,837 పోలింగ్ కేంద్రాలు
నందిగామ అసెంబ్లీకి 200 పోలింగ్ కేంద్రాలు
మెదక్‌లో మంత్రులు, ఉప సభాపతి, ఎమ్మెల్యేలు ఓటేసి వచ్చి ఇంట్లో కూర్చోవాలి
ఓటర్ కాని వారు నియోజకవర్గాల్లో ఉండరాదు

 
హైదరాబాద్: తెలంగాణలోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ స్థానానికి శనివారం ఉప ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శుక్రవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో కన్నా అత్యధికంగా ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదు చేయాలని, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. 95 శాతం మంది ఓటర్లకు ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేశామని, ఎవరికైనా ఫొటో ఓటర్ స్లిప్ రాకపోతే పోలింగ్ బూత్‌ల దగ్గర స్లిప్‌లు ఇచ్చే ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ గుర్తింపు, ఫొటో ఓటర్ స్లిప్ లేని వారు ప్రత్యామ్నాయంగా 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చునని ఆయన వివరించారు. మెదక్ లోక్‌సభ స్థానంలో 15,43,700 మంది ఓటు హక్కు విని యోగించుకోవడానికి 1,837 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 1,141 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని లైవ్ వెబ్ కాస్టింగ్ చేస్తున్నామన్నారు.

మండల, జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో అభ్యర్థులు, ప్రజలు పోలిం గ్ సరళిని లైవ్‌లో చూడవచ్చునని ఆయన తెలి పారు. నందిగామ అసెంబ్లీ స్థానంలో 1,84,061 మంది ఓటర్లు ఉన్నారని, వారికి 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పా రు. ఇందులో 129 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ చేస్తున్నామన్నారు. మెదక్‌లో కేంద్ర ఎన్నికల సంఘం నలుగురు పరిశీలకులను, నందిగామలో ఇద్దరు పరిశీలకులను నియమిం చిందన్నారు. గత ఎన్నికల్లో ఏర్పాటు చేసిన చోటే ఇప్పుడు పోలింగ్ కేంద్రాలున్నాయని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానంలో 77 శాతం, నందిగామ అసెంబ్లీ స్థానంలో 85 శాతం పోలింగ్ జరిగిందని, ఇప్పు డు అంతకు మించి పోలింగ్ జరుగుతుందని భన్వర్‌లాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పోలింగ్ భద్రతకు 19 కేంద్ర సాయుధ పోలీసు కంపెనీల ను ఏర్పాటు చేశామని, అలాగే 11,000 మంది పోలీసు, పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. ఓటు వేయడంలో ఎటువంటి సమస్యలు వచ్చినా 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యా దు చేయవచ్చన్నారు. మెదక్ లోక్‌సభ పరిధిలో ఒక మంత్రి, ఉపసభాపతి, నలుగురు ఎమ్మెల్యేలున్నారని, శనివారం వారు ఓటు వేసి వచ్చి ఇంట్లో కూర్చోవాలని, బయట తిరగడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లు కాని వారు ఎవరూ ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉండరాదని ఆయన చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. మెదక్ లోక్‌సభ పరిధిలో కోటి రూపాయలు, నందిగామలో 27.30 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్ణాటక సరిహద్దుల్లో చెక్‌పోస్టును ఏర్పాటు చేశామన్నారు.
 
 ఓటర్ గుర్తింపు కార్డు లేని వారు ఇలా..


ఓటర్ గుర్తింపు కార్డు లేని వారు ఈ కార్డుల్లో దేనితోనైనా వెళ్లి ఓటు వేయవచ్చు.  పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్ పాసు పుస్తకం, పాన్ కార్డు, ఆధార్ కార్డు, స్మార్ట్ కార్డు, ఉపాధి హామీ కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement