Bhanvarlal
-
‘భన్వర్‌లాల్‌పై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది’
-
‘భన్వర్‌లాల్‌పై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది’
సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ కేంద్ర ఎన్నికల కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతికి లేఖ రాశారు. నంద్యాల ఉప ఎన్నికలో నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకే భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్ష గట్టిందని అన్నారు. నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డబ్బు పంపిణీ అక్రమాలను కూడా భన్వర్‌లాల్ అడ్డుకున్నారని లేఖలో శర్మ చెప్పారు. అందుకే ఆయన్ను ప్రభుత్వం టార్గెట్ చేసుకుందని తెలిపారు. భన్వర్‌లాల్ లాంటి నిజాయితీ గల అధికారులను కాపాడేందుకు ఇందులో కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు. గతంలో బిహార్‌లో ఇలాగే జరిగినప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుందని గుర్తు చేశారు. -
అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగనందుకే..
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనల ప్రకారం నడుచుకోవడంతో రాష్ట్ర ఎన్నికల మాజీ ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఏ.కే.జ్యోతికి బుధవారం ఆయన లేఖ రాశారు. సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల అధికారులుగా నియమితులైన వారు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయకుంటే ఎదుర్కొంటున్న సమస్యలను లేఖలో వివరించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుగుణంగా పనిచేయలేదన్న కారణంతో భన్వర్‌లాల్‌పై మూసివేసిన కేసులను తిరగతోడి వేధిస్తున్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులపై వేధింపులకు తానే సాక్షినన్నారు. ప్రభుత్వం దమననీతికి నిదర్శనం 2014 ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేయలేదన్న కారణంతో భన్వర్‌లాల్‌కు పదోన్నతి కల్పించకుండా అదే బ్యాచ్‌కు చెందిన ఇతర అధికారులకు మాత్రం ఇచ్చారని తెలిపారు. సాధారణంగా ప్రమోషన్లకు కేసులు అడ్డంకిగా ఉన్నప్పుడు ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు తగు నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. ప్రభుత్వం తనపై కేసును మూసివేయకుండా చాలా ఏళ్లు పక్కన పెట్టినప్పటికీ భన్వర్‌లాల్ ఎప్పుడూ భయపడలేదన్నారు. తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ కేసును ఒక కొలిక్కి తేవటానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని తెలిపారు. ఆ తర్వాత కేసును మూసివేసి భన్వర్‌లాల్‌కు ప్రమోషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పదవీ విరమణ రోజున తిరగతోడటం దమననీతికి అద్ధం పడుతోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని, లేదంటే సొంత రాష్ట్రానికి చెందిన క్యాడర్ అధికారులు ఎన్నికల అధికారులుగా పనిచేయడానికి ముందుకురారని ఐవైఆర్ నివేదించారు. ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా పనిచేయని పలువురు అధికారులను ప్రభుత్వం ఎలా పక్కన పెట్టిందో తనకు తెలుసన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఇతర రాష్ట్రాలకు చెందిన క్యాడర్ అధికారులను నియమించాలని ఐవైఆర్ సూచించారు. కాగా పదవీ విరమణ చేసిన రోజునే భన్వర్‌లాల్‌పై ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కక్ష సాధింపులో భాగమేనని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల జేఏసీ విమర్శించింది. -
అంకితభావంతో పనిచేయండి
2018లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ 18 ఏళ్లు నిండిన అందరినీ నమోదు చేయాలి ఎన్నికల కేసుల సత్వర పరిష్కారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఏలూరు (మెట్రో): 2018లో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని అంకితభావంతో చేపట్టాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కాటంనేని భాస్కర్‌తో కలిసి 15 నియోజకవర్గాల ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ తదితర దళాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సర్వీసు ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. 2018 ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కోసం చేపట్టిన చర్యలను భన్వర్‌లాల్ సమీక్షించారు. 2019 మే మాసంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విడత చేపట్టిన జాబితా సవరణ ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ఏలూరు నగరంతో పాటు అర్బన్ లోకల్ బాడీ, జిల్లాలో నూతనంగా విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల సమయంలో కోర్టుల్లో నమోదైన కేసులను విశ్లేషించండి : ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు చేపట్టిన వారిపై నమోదైన కేసులను విశ్లేషించడంలో జిల్లా దేశానికే ఆదర్శంగా నిలవాలని భన్వర్‌లాల్ సూచించారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ రానున్న ఏడాది చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాలో మూడు ఎస్సీ, ఒకటి ఎస్టీలతో కలిపి మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయని, వీటిలో 28,76,166 మంది ఓటర్లుగా ఉన్నట్లు సెప్టెంబరులో జరిగిన స్పెషల్ డ్రైవ్ అనంతరం గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. జిల్లాలో 1819 ఏళ్ల వయస్సు ఉన్న యువ జనాభా అంచనా ప్రకారం 1,48,644 మంది ఉండగా వీరిలో ఇంతవరకూ 31836 మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. జిల్లా జనాభాలో ప్రతి వెయ్యి మందిలో 699 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు. 3132 పోలింగ్ కేంద్రాలున్నాయని వీటిలో ఎక్కువుగా ప్రభుత్వ స్కూల్ భవనాలు, అంగన్వాడీ భవనాలు ఉన్నాయన్నారు. 2014 ఎన్నికల్లో పోలీస్, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి 200 కేసులు నమోదుకాగా 185 కేసుల విచారణ పూర్తయి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందన్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి నమోదైన 18 కేసుల్లో 13 కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నమోదైన వివిధ కేసులకు సంబంధించి పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడా రూపొందించి తద్వారా కేసుల పురోగతిని పర్యవేక్షిస్తున్నామన్నారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, ఏజేసీ ఎంహెచ్.షరీఫ్, ఎఎస్పీ వి.రత్న, డీఆర్ఓ కె.హైమావతి, భూసేకరణ ప్రత్యేకాధికారి భానుప్రసాద్, నర్సాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, ఆర్డీఓలు జీ.చక్రధరరావు, బి.శ్రీనివాసరావు, ఎస్.లవన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ఝాన్సీరాణి, ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్లు వైవీ చౌదరి, అమ్మాజీ, జడ్పీ సీఈఓ, ఇన్‌ఛార్జి డీపీఓ డి.సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నంద్యాల ఉప ఎన్నికకు సిద్ధం కండి
– డీ డూప్లికేట్ ఓటర్లకు తావులేకుండా చర్యలు తీసుకోండి – మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయండి –పోలింగ్ కేంద్రాలను క్షుణంగా పరిశీలించాలి – రెండుమూడురోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం – అధికారులతో సమీక్షలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆదివారం స్టేట్‌గెస్ట్ హౌస్‌లోని సమావేశ మందిరం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నంద్యాల నియోజక వర్గ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ... డీ డూప్లికెట్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి బోగస్ ఓటర్లను తొలగించాలని సూచించారు. ఇప్పటికే నంద్యాల అసెంబ్లీలో 2.09 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, కొత్తగా ఓటరు నమోదుకు 10,500 దరఖాస్తులు వచ్చాయన్నారు. నంద్యాల నియోజక వర్గం పరిధిలో ఆర్డీఓతో సహా తహసీల్దారు, డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు ఒకే చోట మూడేళ్లకు పైబడి పని చేస్తుంటే వారందరిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. స్వంత జిల్లాకు చెందిన వారిని నియమించరాదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ఇతర నియోజక వర్గాలకు చెందిన ఉద్యోగులనే పోలింగ్ సిబ్బందిగా నియమించాలని వెల్లడించారు. పోలింగ్‌కు ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్ లెవల్, సెకండ్ లెవల్ చెకింగ్ చేపట్టాలన్నారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్! నంద్యాల ఉప ఎన్నిక ప్రక్రియ మొత్తం సెప్టంబర్ 12లోపు పూర్తి కావాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూలు వెలువడగానే జిల్లా మొత్తం మీద కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఇంకా డీ డూప్లికేట్ ఓటర్లు ఉన్నారా? ఓటర్ల జాబితాలో ఇప్పటికీ డీ డూప్లికేట్ ఓటర్లు ఉండటం పట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత టెక్నాలజీలో బోగస్ ఓటర్లు ఉండటమేమిటని ప్రశ్నించారు. తాను స్వయంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశానని ఇందులోనే డీ డూప్లికేట్ ఓటర్లు ఉండటం గుర్తించినట్లు తెలిపారు. ఓటరు నమోదు ఆశించిన స్థాయిలో లేదు జిల్లాలో ఆశించిన స్థాయిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జరగడం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అన్నారు. 18–19 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదు కావడం లేదని చెపా్పరు. జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర వృత్తి విద్యాసంస్థల్లో ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించాలని వివరించారు. వారంతా 2019 ఎన్నికలలోపు ఓటర్లుగా నమోదు అయ్యే విధంగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికను స్వేచ్ఛగా ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గంలోని అధికారులను మార్చినట్లు తెలిపారు. బార్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డీ డూప్లికేట్ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, జేసీ ప్రసన్న వెంకటేష్, జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, అన్ని నియోజక వర్గాల ఇఆర్ఓలు వెంకటసుబ్బారెడ్డి, ఈశ్వర్, హుసేన్‌సాహెబ్, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు, తిప్పేనాయక్, జయకుమార్, మల్లికార్జునుడు, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్లో మార్పులు
మే 1 నుంచి 22 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మునిసిపల్ ప్రాం తాలు లేని 83 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సవరించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం ఓ ప్రకట నలో తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ఆల స్యం కావడంతో షెడ్యూల్లో మార్పులు చేసినట్లు పేర్కొ న్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం మే 1న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించనున్నారు. మే 22 వరకు అభ్యంతరాలను స్వీకరించి మే 31లోగా వాటిని పరిష్కరించనున్నారు. జూన్ 15న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నా రు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఓటర్ల జాబితాలో తప్పుల దిద్దుబాటు, ఇతర అభ్యంతరాల కోసం మే 1 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 2017 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
బ్యాలెట్ పత్రాలు తనిఖీ చేసిన భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ బుధవారం తనిఖీ చేశారు. ఈ నెల 19న జరుగనున్న ఎన్నికల బ్యాలెట్ పత్రాల ముద్రణ 13వ తేదీన పూర్తయింది. అప్పటి నుంచి హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో వీటి పరిశీలన, తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం భన్వర్‌లాల్ వీటిని తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి, అడిషనల్ సీఈవో అనూప్‌సింగ్, రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌లు ఆయన వెంట ఉన్నారు. దాదాపు 20 టేబుళ్లను సందర్శించి భన్వర్‌లాల్ బ్యాలెట్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల ఛాయాచిత్రాలు స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను కూలంకషంగా పరిశీలించాలని, ఏవిధమైన పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమీక్షలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రామకృష్ణారావు, అధికారులు చంద్రయ్య, శశికిరణాచారి, ప్రేమ్‌రాజ్, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అధికారులు, డీఆర్వోలు పాల్గొన్నారు. -
‘కోడ్’ ఉల్లంఘనులపై చర్యలు తీసుకోండి
సీఈవో భన్వర్‌లాల్‌కు బీజేపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఉపాధ్యాయ కోటా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాజ్‌భవన్ సిబ్బంది గృహ సముదాయాన్ని ప్రారంభించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) భన్వర్‌లాల్‌కు బీజేపీ బృందం విజ్ఞప్తి చేసింది. సోమవారం సచివాలయంలో సీఈవోను ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, పార్టీనాయకులు ఎస్ మల్లారెడ్డి, సాంబమూర్తి, కాసం వెంకటేశ్వర్లు, ప్రకాశ్‌రెడ్డి, దాసరి మల్లేశం కలసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ నెల 9న పోలింగ్ ఉన్న విషయం తెలిసినా రాజ్‌భవన్ సిబ్బంది గృహ సముదాయాన్ని ఆదివారం గవర్నర్, సీఎం, మంత్రులు కలసి ప్రారంభించారని వెల్లడించారు. అంతకు ముందు బీజేపీ కార్యాలయంలో చింతల రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు వింత పరీక్ష
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు పరీక్ష!
17న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. అదే రోజు స్థానిక ఎమ్మెల్సీల ఎన్నికలు కూడా ► ఒకేరోజు రెండు ఎన్నికల్లో ఓటు ఎలా? ► ఈసీకి లేఖ రాస్తామన్న భన్వర్‌లాల్ ► పోలింగ్ తేదీ మారే అవకాశం ► ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలలో త్వరలో ఖాళీ కానున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే పోలింగ్ తేదీ మారే సూచనలు కన్పిస్తున్నాయి. స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల పోలింగ్ కూడా వచ్చేనెల 17న జరగనుండటమే ఇందుకు కారణం. శాసనసభ్యుల కోటాలో శాసనమండలికి ఎన్నికైన సభ్యులలో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఏడుగురు, తెలంగాణకు చెందిన ముగ్గురు మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ఏపీకి చెందిన కె.ప్రతిభాభారతి, బి.చెంగల్రాయుడు, సి.రామచంద్రయ్య, ఎం.సుధాకరబాబు, వెంకట సతీష్‌కుమార్ రెడ్డి సింగారెడ్డి, పి.జె.సి.శేఖరరావు, మహ్మద్ జానీల పదవీకాలం వచ్చేనెల 29వ తేదీన ముగియనుంది. తెలంగాణ ఎమ్మెల్సీలు సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వి, ఎం.రంగారెడ్డి, వి.గంగాధర్ గౌడ్ల పదవీకాలం కూడా మార్చి 29నే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాలలో కొత్తవారి ఎన్నిక కోసం ఈ నెల 28వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదే తేదీ నుంచి మార్చి 7 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థలు.. ఈ రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకే రోజు రెండు ఎన్నికల్లో ఓటేయడం శాసన సభ్యులకు సాధ్యం కానందున, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. మార్చి 18న ‘టీచర్, గ్రాడ్యుయేట్’ ఓట్ల లెక్కింపు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని ఎన్నికల కమిషన్ మార్చి 18వ తేదీకి మార్పు చేసింది. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పోలింగ్ వచ్చే నెల 9వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపును మార్చి 15వ తేదీన చేపట్టాలని ఎన్నికల కమిషన్ తొలుత ప్రకటించింది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు మార్చి 17న పోలింగ్ జరుగుతున్నందున అంతకన్నా ముందుగా గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఫలితాలను ప్రకటిస్తే వాటి ప్రభావం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల పోలింగ్‌పై పడుతుందనే భావనతో ఎన్నికల కమిషన్ ఈ ఓట్ల లెక్కింపు తేదీని మార్చి 18వ తేదీకి మార్పు చేసింది. ఎమ్మెల్యే కోటా ఎన్నికల షెడ్యూల్ -
ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు
-
ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు
హైదరాబాద్: ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను గురువారం వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. భన్వర్‌లాల్ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మేల్యే ఆర్కే, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు. -
12న ఓటర్ల జాబితా విడుదల
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నవరం/రాజానగరం: త్వరలో జరగనున్న ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 12వ తేదీన ఓటర్ల జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలియజేశారు. మూడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, రెండు టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే మార్చి 29లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. శనివారం ఆయన సతీసమేతంగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలోని సప్తగిరి అతిధి గృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని, వీరికి ఓటరు దినోత్సవం సందర్భంగా జనవరి 25వ తేదీన వారి కలర్ ఫొటోతో కూడిన ఓటరు కార్డులు పంపిణీ చేస్తారని తెలిపారు. తాను ఏ గుర్తుపై ఓటు వేసిందీ ఓటరుకు కనిపించేలా ఓటింగ్ యంత్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేస్తోందని తెలిపారు. త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఈవి«ధానం అమల్లోకి వస్తోందన్నారు., 2019 సంవత్సరంలో జరిగే రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నాటికి ఇక్కడ కూడా వస్తాయని తెలిపారు. సమర్థులను ఎన్నుకోండి యువతకు ఓటు హక్కు వినియోగంపై పూర్తి అవగాహన ఉండాలని, అప్పుడే సమర్థవంతవంతమైన పాలకులను ఎన్నుకునే వీలుంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో భావిఓటర్లతో శనివారం సాయంత్రం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానాలిచ్చారు. -
సత్యదేవుని సన్నిధిలో భన్వర్‌లాల్
అన్నవరం : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ దంపతులు రత్నగిరిపై శనివారం సత్యదేవుని వ్రతమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందజేశారు. తొలుత ఆలయం వద్ద వారికి దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పండితులు ఘన స్వాగతం పలికారు. చైర్మన్, ఈవోలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. భన్వర్‌లాల్‌ను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు, శంఖవరం తహసీల్దార్ వెంకట్రావు, ఎస్ఐ పార్థసారధి తదితరులున్నారు. -
వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
► అభ్యర్థుల ఖర్చుపై నిఘా, ఇకపై లెక్కలు చెప్పాలి ►ఎన్నికల ఖర్చు నిర్ణయించాలని కేంద్రానికి ప్రతిపాదన ►2019 ఎన్నికల్లో ఓటేస్తే గుర్తు కనిపిస్తుంది ►తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ బి.కొత్తకోట/కదిరి: ఏపీ, తెలంగాణ రాష్ట్రా ల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతా యని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు, తెలంగాణలో ఒక ఉపాధ్యాయ నియోజక వర్గానికి మార్చి మొదటి వారంలో ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై లోపాలున్నట్టు ఆరోపణలు రావడంతో వాటిని సరిచేశామన్నారు. ప్రస్తు త ఎన్నికల్లో అభ్యర్థులు లెక్కలు చెప్పాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఎన్నికల సంఘం నిఘా ఉంటుందని, ఓటర్లను ప్రలోభపె ట్టినా, ఓటుకు నగదు ఇచ్చినా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మాదిరే ఎన్నికల వ్యయం ఎంత అన్నది నిర్ణయించాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపామన్నారు. 2019 ఎన్నిక ల్లో ఈవీఎంలకు వీవీపీఏటీ (ఓటర్ వెరిఫి యబుల్ పేపర్ ట్రయల్)లను అమర్చు తామని చెప్పారు. దీంతో ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారో ఆ గుర్తు కనిపిస్తుందని చెప్పా రు. జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటుహక్కు కోసం దరఖాస్తులు చేసు కున్నారని, మొత్తం 6 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. ఈనెల 6న కొత్త ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు. వీరికి సరికొత్త రంగుల గుర్తింపు కార్డులను జారీ చేస్తు న్నట్టు చెప్పారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సమావే శాల నిర్వహణ, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అంది స్తామన్నారు. 15–17 ఏళ్ల వయస్సున్న విద్యార్థులు డ్రాయింగ్ పోటీల్లో పాల్గొని మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందితే జాతీయస్థాయిలో పోటీపడే అవకాశం ఉంటుందని, విజేతకు రాష్ట్రపతి బహుమతిని ప్రదానం చేస్తారని వివరిం చారు. ఇలా ఉండగా, సోమవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామిని సతీసమేతంగా దర్శిం చుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లా డారు. ఓటరుకు ఆధార్‌కార్డు తప్పనిసరా అని ప్రశ్నించగా.. ఇప్పటికే దీనిపై సుప్రీం కోర్టు స్టే విధించిందన్నారు. తదుపరి నిర్ణయం కూడా కోర్టు ఆదేశాల మేరకే ఉంటుందన్నారు. -
‘ఓటర్లుగా నమోదు కండి’
నేటి నుంచి ప్రక్రియ ప్రారంభం సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఉభయ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల ముసారుుదా జాబితాలను బుధవారం ప్రకటించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆ జాబితాల్లో పేర్లు లేనివారితో పాటు వచ్చేఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు గురువారం నుంచి ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చేనెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువుందని ఆయన తెలిపారు.ఓటర్లుగా నమోదుకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చునన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఈఓఆంధ్రా.ఎన్ఐసీ.ఇన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. -
ప్రత్యేక సీఎస్‌గా భన్వర్‌లాల్‌కు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారిగా కొనసాగుతున్న భన్వర్‌లాల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సీఎస్(ప్రధాన కార్యదర్శి)గా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మిగతా అధికారులకు గతంలోనే ప్రత్యేక సీఎస్‌లుగా పదోన్నతి కల్పించినప్పటికీ అప్పుడు భన్వర్‌లాల్‌కు అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవాలి
తెలంగాణ, ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే భవిష్యత్తు ఉండదనే ఆలోచన ప్రజల్లో బలంగా ఉందని, ఆ అభిప్రాయాన్ని మార్చేం దుకు ఉపాధ్యాయులు ప్రయత్నించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన వందేమాతరం ప్రతిభా పురస్కారాలు- 2016 ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. గతంలో 95 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని, ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాను రాజస్తాన్‌లోని ఏడారి ప్రాంతమైన నాగోల్ జిల్లాలో పుట్టి అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఏఎస్ అధికారి నయ్యానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులను రిక్రూట్ చేసే పద్ధతిని తొలగించి సెలక్ట్ చేసే విధానం రావాలన్నారు. ప్రభుత్వ బడిని ప్రజల బడిగా మార్చాలని, విద్యాబోధన ఒక అభిరుచి కావాలని అభిప్రాయపడ్డారు. పాఠశాలలను తనిఖీ చేసే విధానానికి స్వస్తి చెప్పి టీచర్లను నమ్మేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు 5 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయివేట్ పాఠశాలలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. విలువలతో కూడిన నాణ్యమైన, నైతిక విద్య అందించి, పాఠశాలలను కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పారు. చుక్కా రామయ్య గంటపాటు చేసిన సుదీర్ఘ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ సజ్జనార్, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు టి.రవీంద్ర, ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ భానుప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఎమ్మెల్యే అంశం హైకోర్టు పరిధిలో..
కోర్టు తీర్పు తరువాతే స్పందిస్తాం: భన్వర్‌లాల్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే అనర్హత అంశం హైకోర్టు పరిధిలో ఉందని, కోర్టు తీర్పు తరువాతే తాము స్పందిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. నారాయణఖేడ్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించేందుకు బుధవారం ఆయన మెదక్ జిల్లా సంగారెడ్డిలోని కలెక్టరేట్‌కు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అనర్హత అంశంపై విలేకరులు ప్రశ్నించగా.. ఆయన పైవిధంగా స్పందించారు. అంతకుముందు కలెక్టర్ రోనాల్డ్ రాస్, జిల్లా అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించిన తరువాత రాజకీయ పార్టీల జిల్లాశాఖ అధ్యక్షులు అధ్యక్షులు, నాయకులతో భన్వర్‌లాల్ సమావేశమై నారాయణఖేడ్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఖేడ్ ఉప ఎన్నికకు తొలి నామినేషన్ నారాయణఖేడ్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు కాంగ్రెస్ అభ్యర్థి పి.సంజీవరెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. -
సర్వం సిద్ధం
♦ వరంగల్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి: భన్వర్‌లాల్ ♦ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ♦ మొత్తం 10 వేల మందితో భద్రతా ఏర్పాట్లు ♦ విధుల్లో 8,160 మంది పోలింగ్ సిబ్బంది ♦1,778 పోలింగ్ కేంద్రాల్లో 498 అత్యంత సమస్యాత్మకం సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. 5 గంటలకల్లా క్యూలో ఉన్న వారందరినీ ఓటు వేసేందుకు అనుమతిస్తామని చెప్పారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టామన్నారు. 2 వేల మంది కేంద్ర బలగాలతోపాటు మొత్తం 10 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. నక్సలైట్ల ప్రాబల్యమున్న భూపాలపల్లి నియోజకవర్గంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. 8,160 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారని.. వారు ఇప్పటికే అన్ని కేంద్రాలకు తరలివెళ్లినట్లు చెప్పారు. 632 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలిస్తారన్నారు. 626 పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఇందుకు 476 మంది వీడియోగ్రాఫర్లు, 824 మంది విద్యార్థులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 96.01 శాతం మందికి ఓటరు స్లిప్పులను పంపిణీ చేసినట్లు చెప్పారు. గత సాధారణ ఎన్నికల్లో వరంగల్ నియోజకవర్గంలో 76.15 శాతం పోలింగ్ నమోదైందని.. ఈసారి అంతకు మించి ఓటింగ్ జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఓటర్లకు ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద టార్పాలిన్లు, టెంట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. మొత్తం 1,778 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుందని భన్వర్‌లాల్ చెప్పారు. శాంతి భద్రతల దృష్ట్యా వీటిలో 498 కేంద్రాలను అత్యంత సమస్మాత్మకమైనవి, 642 సమస్యాత్మకమైనవి, 605 సాధారణ కేంద్రాలు, 33 నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతంలో ఉన్నవిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి నగదు, మద్యం పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడితే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని భన్వర్‌లాల్ కోరారు. టోల్‌ఫ్రీ నంబరు 180042522747కు ఫోన్ చేయాలని, లేదా 8790499899కు ఎస్ఎంఎస్ పంపించాలని సూచించారు. ఇప్పటివరకు తమకందిన ఫిర్యాదుల ఆధారంగా రూ.1.88 కోట్ల నగదు, ఒక మారుతీ కారు, 5,035 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని, అలాంటి ఎస్ఎంఎస్లుంటే 9491089257కు పంపించాలని కోరారు. పోలింగ్ రోజున ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉందని తెలిపారు. -
తాజా నిర్ణయాలు, ప్రకటనలపై ఈసీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: వివిధ నిర్ణయాలు.. ప్రకటనలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసీ ఈ చర్యకు ఉపక్రమించింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోడ్‌ను ఉల్లంఘించినట్లుగా ఇటీవల ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుమార్‌రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ముఖ్యమంత్రి, మంత్రులు ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రకటిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌రావు ఫిర్యాదు చేశారు. క్రిస్మస్ను అధికారిక ఉత్సవాలుగా ప్రకటించటం, కాలేజీ హాస్టళ్లకు సన్న బియ్యం, ఉస్మానియా యూనివర్సిటీకి మెస్ చార్జీల బకాయిల చెల్లింపులు, బీసీలకు కల్యాణ లక్ష్మి పథకం వర్తింపు, కాళోజీ హెల్త్ వర్సిటీకి వీసీ నియామకం కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణించటం, టెట్ నిర్వహణ, పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి ఆమోదం తెలిపిందని.. ప్రభుత్వం కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఎమ్మెల్యే లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. దీని ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. ప్రకటనలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. కొత్త ప్రకటనలు వద్దు: భన్వర్‌లాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కొత్త నిర్ణయాలు, కొత్త పథకాలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు, ప్రకటనలేవీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి నిర్ణయాలన్నీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వస్తాయన్నారు. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి వివిధ పార్టీల నుంచి ఎన్నికల కమిషన్‌కు మొత్తం తొమ్మిది ఫిర్యాదులు అందాయని, వీటిలో నాలుగింటిని పరిశీలించి ప్రాథమిక నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించినట్లు చెప్పారు. మిగతా ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక కోరినట్లు వివరించారు. ఉత్తర్వులేవీ జారీ చేయలేదు: సీఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు వివరణ సమర్పించింది. పాలనాపరమైన కారణాలతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ నుంచి తగిన ఆమోదం పొందిన తర్వాతే సంబంధిత ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. -
తొలి ఓటరుకు జై!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి గురువారం సాయంత్రం అయిదు గంటలకల్లా ప్రచారపర్వం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) భన్వర్‌లాల్ ప్రకటించారు. నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నాయకులందరూ ప్రచార గడువు ముగిశాక అక్కడ ఉండటానికి వీల్లేదని స్పష్టంచేశారు. ప్రచార గడువు ముగిసేలోపే వారంతా జిల్లా దాటి వెళ్లాలని ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో భన్వర్‌లాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, నియోజకవర్గంలో మొత్తం 1,778 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 626 కేంద్రాల నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ జరుగుతుందని, మరో 300 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది లేకుండా టెంట్లు, తాగునీరు, టాయ్లెట్లు ఉంటాయని, వికలాంగులకు ట్రై సైకిళ్లు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. తొలి ఓటరుకు పుష్పగుచ్ఛం అన్ని పోలింగ్ కేంద్రాల్లో మొట్టమొదటగా ఓటు వేసేందుకు వచ్చే ఓటరుకు ఎన్నికల కమిషన్ ఘనస్వాగతం పలకనుంది. పోలింగ్ అధికారులు, సిబ్బంది వారికి గౌరవంగా పుష్పగుచ్ఛం అందిస్తారని సీఈవో చెప్పారు. 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. గతంలో ఆరు గంటల వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని గంట పాటు కుదించిన విషయాన్ని ఓటర్లు గుర్తించాలని కోరారు. 93.46 శాతం ఓటరు స్లిప్పులు వరంగల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 15,09,671 మంది ఓటర్లుంటే ఇప్పటివరకు 93.46 శాతం మంది ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. వివిధ కారణాలతో 22,319 మందికి ఓటరు స్లిప్పులు అందలేదన్నారు. ఓటింగ్ రోజున సైతం ఓటరు స్లిప్పులు పొందేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రత్యేక కేంద్రాలుంటాయని, సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారన్నారు. ఫోటో ఓటరు గుర్తింపు కార్డు లేదా ఈసీ గుర్తించిన పది కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు, బ్యాంకు లేదా పోస్టాఫీసు పాసు పుస్తకాలు, పాన్ కార్డు, స్మార్ట్ కార్డు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపిస్తే ఓటుకు అనుమతిస్తారని చెప్పారు. తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు చెబుతాం ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలు, మద్యం, నగదు, కానుకల పంపిణీ జరిగితే వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని భన్వర్‌లాల్ సూచించారు. 180042522747 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. లేదా 8790499899 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలని కోరారు. ‘ఎంసీసీ’ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి సమాచారం చేరవేస్తే సరిపోతుందని అన్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నామో ఫిర్యాదుదారులకు తెలియజేస్తామని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు రూ.1.79 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ‘నోటా’కు ఓటు వేసి ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించవచ్చని తెలిపారు. ఎస్ఎంఎస్లు పంపితే క్రిమినల్ కేసులు ప్రచార గడువు ముగిశాక ఎస్ఎంఎస్ల ద్వారా ప్రచారం చేయటం కూడా నిషిద్ధమేనని, దీన్ని ఉల్లంఘించి వాటిని పంపించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఈవో హెచ్చరించారు. బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తే సంబంధిత సర్వీసు ప్రొవైడర్లపైనా కేసులు పెడతామన్నారు. 19వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు విధిగా బంద్ పాటించాలన్నారు. మీడియా సంస్థలు ప్రచార ప్రకటనలు చేయవద్దన్నారు. -
‘వరంగల్ బ్యాలెట్’పై అభ్యర్థుల ఫొటో
♦ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ♦ ఉపపోరు బరిలో 23 మంది ♦16 వరకు ఓటరు నమోదు గడువు పొడిగింపు ♦ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించే విధానం వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల నుంచి రాష్ట్రంలోనూ ప్రారంభం కానుంది. బ్యాలెట్ పేపర్‌పై ఉండే పేరు, పార్టీ పేరు, చిహ్నం ఆధారంగా ఇప్పటి వరకు ఓటర్లు తాము ఓటేయాలనుకుంటున్న అభ్యర్థిని గుర్తు పట్టేవారు. అయితే, అభ్యర్థుల పేర్లు, చిహ్నాల్లో దగ్గరి పోలికలు ఉంటే ఓటర్లు గందరగోళానికి గురై వేరే అభ్యర్థికి ఓటేయడంతో ఫలితాలు తారుమారైన సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఈ నేపథ్యంలో ఈవీఎం పెట్టెలపై అతికించే బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. బిహార్ శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేయగా, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ద్వారా తెలంగాణలో సైతం ఇది అమల్లోకి వస్తోంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ శనివారం తన కార్యాలయంలో విలేకరులతో ఈ విషయాన్ని వెల్లడించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని భన్వర్‌లాల్ తెలిపారు. గతం లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగేదని, అయితే చలికాలం నేపథ్యంలో త్వరగా చీకటిపడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఏడు నామినేషన్ల తిరస్కరణ మొత్తం 38 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 7 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని, 8మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, 23మంది అభ్యర్థులు పోటీలో మిగిలారన్నారు. పోలింగ్ కోసం 16 మంది ఓ బ్యాలెట్, ఏడుగురు అభ్యర్థులతో మరో బ్యాలెట్‌ను వినియోగిస్తామన్నారు. 1,778 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న ఈ ఎన్నికల కోసం ఇప్పటికే 15,09,671మంది ఓటర్లు జాబితాలో ఉండగా, మరో లక్ష మంది కొత్త ఓటర్లకు అవకాశముందన్నారు. ఓటరు నమోదుకు గడువును ఈ నెల 16 వరకు పొడిగించామన్నారు. 8790499899 టోల్‌ఫ్రీ నంబర్‌కు గైఖీఉ ్ఱఠిౌ్ట్ఛటఐఈ ూౌా అని ఎస్ఎంఎస్ పంపి ఓటరు జాబితాలో పేరు ఉన్నది లేనిది తెలుసుకోవచ్చన్నారు. బూత్ స్థాయి అధికారులే ఇంటింటికీ తిరిగి ఓటరు చిట్టీలను అందజేస్తారన్నారు. బందోబస్తు కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయని, అదనంగా 5 వేలకు పైగా రాష్ట్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటాయన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భూపాలపల్లిలో కట్టుదిట్టమైన భత్రత కల్పిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమలు, అభ్యర్థుల ఖర్చులపై నిఘా కోసం 148 ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలపై వెబ్ కెమెరాలతో లైవ్ పర్యవేక్షణ ఉంటుందని, ఈ సదుపాయం లేనిచోట కెమెరాలతో రికార్డింగ్ చేస్తామన్నారు. -
జీహెచ్ఎంసీ ఓట్ల పునఃపరిశీలన
-
జీహెచ్ఎంసీ ఓట్ల పునఃపరిశీలన
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితాలను పునః పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నగరంలో బీసీ ఓటర్లను గుర్తించేందుకు జీహెచ్ఎంసీ చేస్తున్న ఇంటింటి సర్వే ఈనెల 18లోగా ముగియనుంది. పనిలో పనిగా ఈ సందర్భంగా తొలగించిన ఓట్లన్నీ పునఃపరిశీలన జరపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించింది. అకారణంగా లక్షలాది ఓట్లు గల్లంతైనట్లుగా వచ్చిన అభియోగాలు, వివిధ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే 14 మంది అధికారుల బృందంతో విచారణ జరిపించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ గుప్తా సారథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన ఈ బృందం వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పలువురు ఓటర్లను ముఖాముఖి కలిసి నిజానిజాలు ఆరా తీసింది. ఈ సందర్భంగా వెల్లువెత్తిన ఫిర్యాదులతో.. భారీ సంఖ్యలోనే ఓట్లు గల్లంతైనట్లుగా ఈ బృందం గుర్తించింది. వీరిచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఓటర్ల పునఃపరిశీలనకు ఈసీ నిర్ణయించింది. తొలిగించిన ఓట్లన్నీ ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని.. వారిచ్చే అప్పీళ్లను స్వీకరించాలని ఆదేశించింది. ఈ సర్వే సందర్భంగా ఇంటింటికి వచ్చే బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో)లకు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను తొలిగించినట్లు గుర్తిస్తే.. తగిన ధ్రువీకరణ పత్రాలతో బీఎల్వోలకు అప్పీలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
‘కోడ్’ కొర్రి పెట్టింది
వరంగల్‌లో ఎన్నికల వేళ మద్యం అమ్మకాలపై ఆంక్షలు సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే మద్యం వ్యాపారులకు పండుగే! 4 నెలల్లో అమ్మే సరకు వారంలొనే విక్రయించి లాభాలు పొందుతారు. అయితే వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనా అక్కడి వ్యాపారులు మాత్రం లబోదిబోమంటున్నారు. ఓటర్లకు భారీగా మద్యం పంపిణీ చేస్తున్నారన్న కారణంతో ఎన్నికల కమిషన్ సరకు స్టాక్ పంపిణీపై ఆంక్షలు విధిం చింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ నెల 21 నుంచి ఫలితాలు వెల్లడించే నవంబరు 24 వరకు మద్యం (ఐఎంఎల్, బీరు) అమ్మకాలు గతేడాది ఇవే తేదీల్లో జరిగిన విక్రయాలకు మించవద్దని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మద్యం వ్యాపారులు డిపోల నుంచి స్టాక్‌ను తీసుకునేటప్పటి నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయి. 2014లో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 24 వరకు ఒక షాపు రూ.10 లక్షల విలువైన మద్యం స్టాక్‌ను డిపోల నుంచి తీసుకుంటే ఆ దుకాణానికి ఈసారి కూడా దాదాపు అంతే విలువైన మద్యాన్ని (పెట్టెల లెక్కన) ఇవ్వడం జరుగుతుంది. కొత్త మద్యం విధానం ఈనెల నుంచే అమలులోకి రాగా వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్‌గా మారిన నేపథ్యంలో లెసైన్సు ఫీజును రూ.20 లక్షల మేర పెంచారు. ఈ పరిస్థితుల్లో అందివచ్చిన ఉప ఎన్నిక ద్వారా విక్రయాలు పెంచి లాభాలు పొందాలనుకున్న వ్యాపారులకు ఎన్నికల కమిషన్ నిర్ణయంతో దిమ్మతిరిగినట్లయింది. -
వరంగల్ ఉప ఎన్నిక: ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు ముద్రిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు. 1751 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఓటింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తామని, అభ్యర్థులు 70 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చేనెల 21న వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 25 వరకు ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని భన్వర్ లాల్ చెప్పారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 14,75,311 మంది ఓటర్లున్నారని, 96,846 ఓట్లను తొలగించినట్టు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్: ఈ నెల 28న వరంగల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ నామినేషన్ దాఖలుకు చివరి తేదీ నవంబర్ 4 నవంబర్ 5న నామినేషన్ల పరిశీలిన నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 7 నవంబర్ 21న పోలింగ్ నవంబర్ 24న ఓట్ల లెక్కింపు -
'గ్రేటర్లో 6.35 లక్షల ఓటర్లను తొలగించాం'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో 6.35 లక్షలమంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఓటర్ల తొలగింపు విషయంలో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు సోమవారం భన్వర్‌లాల్‌ను కలిశాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటర్ల తొలగింపు విషయమై ఆయనకు ఫిర్యాదు చేశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా నివాసం ఉండని వారి పేర్లను మాత్రమే ఓటర్ల జాబితా నుంచి తొలిగించినట్టు తెలిపారు. ఈ విషయమై మరో 19 లక్షలమందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. గ్రేటర్లో తొలగించిన ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందిస్తామన్నారు. -
నేటి నుంచి ఓటు హక్కు నమోదు: భన్వర్‌లాల్
సాక్షి,హైదరాబాద్: ఏపీ, తెలంగాణల్లో నేటి(సోమవారం) నుండి ఓటు హక్కు నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ కొత్త ఓటరు దరఖాస్తు(ఫాం -6)ను ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించామని, నేరుగా తమ సమీప ప్రాంతంలో ఉన్న అధికారులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ceotelangana.nic.inనుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ceoandhra.nic.inనుండి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భన్వర్‌లాల్ తెలిపారు. -
15 లక్షల బోగస్ ఓటర్లు
నగరంలో నిర్దేశిత జనాభాకన్నా మించిన ఓటర్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీఈవో భన్వర్‌లాల్ భేటీ ఆధార్ సీడింగ్, బోగస్ ఏరివేతకు సహకరిస్తామన్న సీఎం ఓటు హక్కును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచన 20 రోజుల్లోగా వందశాతం సీడింగ్ పూర్తిచేస్తామని వెల్లడి హైదరాబాద్ కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం ప్రకారం జనాభాలో 66 శాతం ఓటర్లు ఉండాల్సి ఉంటే, హైదరాబాద్‌లో ఓటర్ల శాతం అంతకు మించిపోయిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 15 లక్షల మంది బోగస్ ఓటర్లున్నట్లు అంచనా వేశామన్నారు. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయటం తప్పనిసరి అని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అమలు చేస్తామని, బోగస్ ఓటర్లను ఏరివేయడానికి ఈసీ తీసుకుంటున్న చర్యలకు సహకరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముందుగా హైదరాబాద్ నగరంలో, ఆ తర్వాత రాష్ట్రమంతటా ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 15-20 రోజుల్లోనే వంద శాతం ఆధార్ సీడింగ్ చేస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో సోమవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది బోగస్ ఓటర్లుండే అవకాశం ఉన్నందున, మొదట ఇక్కడే సీడింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కోరారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జరగాల్సి ఉన్నందున, అంతకన్నా ముందే ఓటర్ల జాబితాలు రూపొందాలన్నారు. సాధారణ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు ఒకే ఓటరు లిస్టు ఉండేలా చూడాలని సీఎం చెప్పారు. నగరంలోని ఓటర్లంతా తమ ఓటు హక్కును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. లేకుంటే వారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుంటే.. అందులో 24 హైదరాబాద్‌లోనే ఉన్నాయని, బోగస్ ఓటర్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఆధార్ సీడింగ్‌కు సహకరించాలని అభ్యర్థించారు. ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వారికి ఒకటీ, రెండుసార్లు విజ్ఞప్తి చేయాలని, అప్పటికీ స్పందించకపోతే ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతికుమారి పాల్గొన్నారు. -
ఒక్కరికి ఒకటే ఓటు: భన్వర్‌లాల్
సోమందేపల్లి: ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల ఒక్క వ్యక్తికి దేశ వ్యాప్తంగా ఒకే ఓటు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం జూలకుంట గ్రామంలో వెలసిన భైలాంజనేయస్వామి విగ్రహాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కొంతమంది మూడు నాలుగు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని, దీనిని నివారించాలనే ముఖ్య ఉద్దేశంతో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేస్తున్నామన్నారు. ఇలా చేయడం వల్ల ఓటరు కార్డు ఉన్న వ్యక్తి ఏ ప్రాంతానికి నివాసం వెళ్లినా అతని ఓటు కూడా అక్కడకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ అవుతుందన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం
సిటీబ్యూరో: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలతో పాటు సిబ్బందిని వెంటనే నియమించనున్నట్టు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ శుక్రవారం రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు దాఖలైన 2,118 దరఖాస్తులను వెంటనే పరిశీలించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని బ్యాలెట్‌బాక్స్‌లను స్థానిక ఎన్నికల నిమిత్తం ఇతర జిల్లాలకు పంపించామని, వాటిని తిరిగి తెప్పిస్తామన్నారు. హైదరాబాద్ జిల్లాలో 151 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఓటర్ల సంఖ్య 1200కన్నా మించితే అదనపు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఓటర్ల జాబితాలో 40 శాతం మందివి ఫొటోలు ఉన్నాయని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కమిషనర్లు హరికృష్ణ, రవికిరణ్ పాల్గొన్నారు. అమల్లోకి ప్రవర్తనా నియమావళి.. అంతకుముందు మీడియాతో సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు జీహెచ్ంఎసీ అదనపు కమిషనర్ (ఎన్నికలు), మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల డీఆర్ఓలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని చెప్పారు. 413 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 2,86,311 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 97 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 66,100 ఓటర్లు, రంగారెడ్డి జిల్లాలో 165 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,33,003 మంది, హైదరాబాద్ జిల్లాలోని 151 పోలింగ్ కేంద్రాల పరిధిలో 87,208 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని వివరించారు. మొత్తం ఓటర్లలో పురుషులు 1,92,110 మంది కాగా, మహిళలు 94,188 మంది, ఇతరులు 13 మంది ఉన్నట్టుచెప్పారు. నామినేషన్ వేసేందుకు జనరల్ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.5 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
రెండు రాష్ట్రాల్లో మండలి ఎన్నికల కోడ్
ఫొటో గుర్తింపుకార్డు ఉంటేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు అనుమతి పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ సాక్షి, మహబూబ్‌నగర్: ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రా ల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రులు, మంత్రులు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చే పథకాలను కూడా నిలుపుదల చేయాల్సి ఉంటుందన్నారు. బుగ్గకార్లు కూడా వాడడానికి వీల్లేదని చెప్పారు. గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఫిబ్రవరి 19వ తేదీలోపు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచిం చా రు. నామినేషన్లు స్వీకరించే తేదీ(ఫిబ్రవరి 26న) వెలువరించే ఓటరు లిస్టులో పేర్లు నమోదు చేస్తామని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ఓటర్లకు ఫొటో గుర్తింపుకార్డు తప్పనిసరని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పేరు నమోదు చేసుకోవాలని, పనిచేసే చోటును పరిగణనలోకి తీసుకోబోమన్నారు. . పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం లోపలతో పాటు బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికకు నేటితో ప్రచార గడువు ముగిసిందని తెలిపారు. తిరుపతి ఎన్నికలకు సంబంధించి 256 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. 2014 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలామంది ఇప్పటి వరకు ఖర్చు వివరాలు ఇవ్వలేదని.. వారికి త్వరలో నోటీసులు ఇస్తున్నామన్నారు. వారు స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ చెప్పారు. -
మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు
సీఈవో భన్వర్‌లాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ శానసమండళ్లకు సంబంధించి 15 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయని రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ఈ నెల రెండోవారంలో వెలువడుతుందన్నారు. ఏపీ శాసనమండలిలో 4 ఎమ్మెల్యే కోటా స్థానాలు, 2 ఉపాధ్యాయ కోటా స్థానాలు మార్చి 29 నాటికి ఖాళీ కానున్నాయి. తెలంగాణలో కూడా 7 ఎమ్మెల్యే కోటా స్థానా లు, 2 పట్టభద్రుల కోటా స్థానాలు అదే సమయానికి ఖాళీ కానున్నాయి. తెలంగాణ మండలిలో ఎమ్మెల్యే కోటా స్థానాలు 7 ఖాళీ అవు తున్నా..6 స్థానాలకే ఎన్నికలుంటాయి. స్థానాల కేటాయింపులో ఒక ఎమ్మెల్సీ తెలంగాణకు ఎక్కువగా రాగా ఏపీకి ఒకటి తక్కువ వచ్చింది. దీంతో ఏపీ మండలిలో ఎమ్మెల్యే కోటా స్థానాలు నాలుగే ఖాళీ అవుతున్నా.. తెలంగాణలో ఒక స్థానాన్ని తగ్గించి దాన్ని ఏపీలో కలిపి 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, డూప్లికేట్ ఓటర్ల తొలిగింపునకు ఆధార్ అనుసంధానాన్ని త్వరలో చేపడుతున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. -
అక్కడ మద్యం, డబ్బు ఊసేలేదు
‘సాక్షి’తో భన్వర్‌లాల్ శ్రీలంక అధ్యక్ష ఎన్నికల తీరు మనకు విభిన్నం కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లూ లేవు అంతా ప్రింట్, ఎలక్ట్రానిక్మీడియాతోనే ప్రచారం సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు అనగానే మైకులు, వాహనాలు, బ్యానర్లు, కటౌట్లు, మద్యం, డబ్బు పంపిణీ... ఊరూరా ప్రచారంతో హోరెత్తించడం మన దేశంలో మామూలే. కాని శ్రీలంకలో మాత్రం వీటన్నింటికి భిన్నంగా ఎన్నికలు జరుగుతాయి. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు పరిశీలకునిగా రెండు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల నిర్వహణాధికారి భన్వర్‌లాల్ దాదాపు వారం పదిరోజులపాటు పర్యటించి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీలంక ఎన్నికల సమయంలో మూడు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. అక్కడి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించి... దేశం మొత్తంమీద పోలైన ఓట్లను ఆరేడు గంటల్లో లెక్కించి ఫలితం ప్రకటించారు. మన దగ్గర పోలైన విధంగానే పోలింగ్ 72 శాతం పైగా నమోదు అయింది. అక్కడి ఎన్నికల్లో అనుభవాలు భన్వర్‌లాల్ మాటల్లోనే.. ‘శ్రీలంక ఎన్నికల్లో హంగూ ఆర్బాటం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను నష్టపరిచేలా గోడలపై రాతలు, పోస్టర్లు అంటించరు. మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్లు ఎక్కడా కనిపించలేదు. శ్రీలంకలో తమిళులు ఎక్కువగా ఉండే జాఫ్నా ప్రాంతంలోని వావుయాన, ముల్తేవు(ఎల్టీటీఈపై చివరి యుద్ధం జరిగిన ప్రాంతం), మన్నర్ జిల్లాల్లో నేను విస్తృతంగా పర్యటించాను. జనవరి 2న వెళ్లగా, అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ 8న జరిగింది. పోలింగ్ రోజు కూడా ఈ ప్రాంతాల్లో బాగా పర్యటించి ఎన్నికల విధానాన్ని పరిశీలించాను. ఎన్నికలు జరుగుతున్న వాతావరణమే ఎక్కడా కనిపించలేదు. అంతా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా బ్యానర్లు, కటౌట్లు, పోస్టర్లు సందడే ఉండదు. మైకుల హోరూ లేదు. అధ్యక్ష అభ్యర్థి తరుఫున జిల్లాకో ఏజెంట్‌ను నియమించారు. వారు మాత్రమే తిరిగారు. అభ్యర్థులు ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, పత్రికల్లో ప్రచారాన్ని కొనసాగించారు. అక్కడ ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో కాకుండా బ్యాలెట్‌తోనే నిర్వహించారు. ఎన్నికల రోజే ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఆరేడు గంటల్లో ఫలితాలు ప్రకటించడం విశేషం. సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఓటింగ్ జరిగితే... ఆ బ్యాలెట్ బాక్సులను సాయంత్రం ఆరున్నర ఏడు గంటల్లోగా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తీసుకుని వచ్చారు. రాత్రి ఏడున్నర నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. అర్ధరాత్రి ఒకటిన్నర వరకు లెక్కించారు. యాభై శాతం పైగా ఓట్లు పొందిన వారు అధ్యక్షునిగా ఎన్నికవుతారు. ఓటర్లలో చైతన్యం ఎక్కువ. ఈసారి ఎన్నికలు పూర్తి నిశ్శబ్ద ప్రభంజనంలా జరిగాయి. మన దగ్గర ఓటర్లను లైన్లలో నిల్చోమని చెప్పడానికి పోలీసులను ఉపయోగించాల్సి వస్తుంది. కాని అక్కడ అదేమీ ఉండదు. ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి క్యూ లైన్లలో నిల్చుని ఓట్లు వేసే క్రమశిక్షణ బాగుంది. ఈ ఎన్నికల పరిశీలన అనంతరం నేను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక కూడా పంపించాను. కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను నష్టపరిచే చర్యలను నిషేధించాలని సూచించా’ అని భన్వర్‌లాల్ తెలిపారు. -
ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం
ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తిరుపతి: ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం ఇక తప్పనిసరి అని.. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తామన్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఆయన అధికారులతో ‘ఫొటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ-2015’పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఈనెల 13 నుంచి జనవరి 15 వ తేదీవరకు ఆధార్ అనుసంధానం ఉంటుందన్నారు. 2015 జనవరి ఒకటో తారీఖు నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు, సవరణ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నూతన ఓటర్లకు కలర్ ఫొటోతో కూడిన ఎపిక్ కార్డును జనవరి 25వ తేదీకల్లా అందజేస్తామని చెప్పారు. నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7 తేదీల్లో ఓటర్ల సవరణ, నమోదుపై సంబంధిత బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలు నూతన జాబితాలోనే ఉంటాయన్నారు. శ్రీవారి సేవలో భన్వర్ లాల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం తర్వాత ఆయన ఆలయానికి వచ్చారు. శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. -
రెండు రాష్ట్రాల్లో 13 నుంచి ఓటర్ల నమోదు
డిసెంబర్ 8 వరకు అవకాశం జనవరి 15న తుది జాబితా హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే నెల 13వ తేదీ నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సాధారణంగా నవంబర్ 1వ తేదీ నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను కారణంగా, తెలంగాణలో పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ పూర్తి కానుందున ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వచ్చే నెల 13వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు భన్వర్‌లాల్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులందరూ ఓటర్లగా నమోదుకు అర్హులన్నారు. డిసెంబర్ 8 వరకు ఓటర్లుగా నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 15న ప్రకటిస్తారు. ఓటర్ల నమోదు, జాబితా సవరణ షెడ్యూల్ ఈ విధంగా ఉంది... ముసాయిదా జాబితా ప్రకటన : 13-11-2014 ఓటర్లుగా నమోదు, అభ్యంతరాలు, సవరణలు: 13-11-2014 నుంచి 08-12-2014 గ్రామసభల్లో, స్థానిక సంస్థల్లో పేర్లు చదువుతారు: 19-11-2014, 26-11-2014 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఆఫీసర్లు, పార్టీల ఏజెంట్లు కూర్చుని దరఖాస్తుల స్వీకరణ: 16-11-2014, 23-11-2014, 30-11-2014, 07-12-2014 దరఖాస్తుల పరిష్కారం: 22-12-2014 సప్లమెంటరీ జాబితా ప్రచురణ, ఫొటోలు, పేర్లు నమోదు: 05-01-2015 ఓటర్ల తుది జాబితా ప్రకటన: 15-01-2015 -
నిర్భయంగా ఓటు వేయండి
నేడు నందిగామ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలు ఉభయ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలపై సీఈఓ భన్వర్‌లాల్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్, 16న కౌంటింగ్ ఓటర్ స్లిప్లేని వారు 11 గుర్తింపు కార్డుల్లో దేనితోనైనా ఓటేయవచ్చు మెదక్ లోక్‌సభకు 1,837 పోలింగ్ కేంద్రాలు నందిగామ అసెంబ్లీకి 200 పోలింగ్ కేంద్రాలు మెదక్‌లో మంత్రులు, ఉప సభాపతి, ఎమ్మెల్యేలు ఓటేసి వచ్చి ఇంట్లో కూర్చోవాలి ఓటర్ కాని వారు నియోజకవర్గాల్లో ఉండరాదు హైదరాబాద్: తెలంగాణలోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ స్థానానికి శనివారం ఉప ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శుక్రవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో కన్నా అత్యధికంగా ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదు చేయాలని, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. 95 శాతం మంది ఓటర్లకు ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేశామని, ఎవరికైనా ఫొటో ఓటర్ స్లిప్ రాకపోతే పోలింగ్ బూత్‌ల దగ్గర స్లిప్‌లు ఇచ్చే ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ గుర్తింపు, ఫొటో ఓటర్ స్లిప్ లేని వారు ప్రత్యామ్నాయంగా 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చునని ఆయన వివరించారు. మెదక్ లోక్‌సభ స్థానంలో 15,43,700 మంది ఓటు హక్కు విని యోగించుకోవడానికి 1,837 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 1,141 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని లైవ్ వెబ్ కాస్టింగ్ చేస్తున్నామన్నారు. మండల, జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో అభ్యర్థులు, ప్రజలు పోలిం గ్ సరళిని లైవ్‌లో చూడవచ్చునని ఆయన తెలి పారు. నందిగామ అసెంబ్లీ స్థానంలో 1,84,061 మంది ఓటర్లు ఉన్నారని, వారికి 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పా రు. ఇందులో 129 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ చేస్తున్నామన్నారు. మెదక్‌లో కేంద్ర ఎన్నికల సంఘం నలుగురు పరిశీలకులను, నందిగామలో ఇద్దరు పరిశీలకులను నియమిం చిందన్నారు. గత ఎన్నికల్లో ఏర్పాటు చేసిన చోటే ఇప్పుడు పోలింగ్ కేంద్రాలున్నాయని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానంలో 77 శాతం, నందిగామ అసెంబ్లీ స్థానంలో 85 శాతం పోలింగ్ జరిగిందని, ఇప్పు డు అంతకు మించి పోలింగ్ జరుగుతుందని భన్వర్‌లాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పోలింగ్ భద్రతకు 19 కేంద్ర సాయుధ పోలీసు కంపెనీల ను ఏర్పాటు చేశామని, అలాగే 11,000 మంది పోలీసు, పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. ఓటు వేయడంలో ఎటువంటి సమస్యలు వచ్చినా 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యా దు చేయవచ్చన్నారు. మెదక్ లోక్‌సభ పరిధిలో ఒక మంత్రి, ఉపసభాపతి, నలుగురు ఎమ్మెల్యేలున్నారని, శనివారం వారు ఓటు వేసి వచ్చి ఇంట్లో కూర్చోవాలని, బయట తిరగడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లు కాని వారు ఎవరూ ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉండరాదని ఆయన చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. మెదక్ లోక్‌సభ పరిధిలో కోటి రూపాయలు, నందిగామలో 27.30 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్ణాటక సరిహద్దుల్లో చెక్‌పోస్టును ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ గుర్తింపు కార్డు లేని వారు ఇలా.. ఓటర్ గుర్తింపు కార్డు లేని వారు ఈ కార్డుల్లో దేనితోనైనా వెళ్లి ఓటు వేయవచ్చు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్ పాసు పుస్తకం, పాన్ కార్డు, ఆధార్ కార్డు, స్మార్ట్ కార్డు, ఉపాధి హామీ కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్. -
ఏపీలో 8, తెలంగాణలో 3
మండలి స్థానాలపై ఈసీకి సీఈఓ భన్వర్‌లాల్ ప్రతిపాదనలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానాలను 50 నుంచి 58కి పెంచేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ మండలిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సంఖ్యను మూడుకు పెంచేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ పెంపుపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో పాటు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ మేరకు సవరణలు తీసుకురావాల్సి ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం శాసనసభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, అలాగే స్థానిక సంస్థలు ఎక్కువగా ఉన్నందున ఆ మేరకు ఎమ్మెల్సీల సంఖ్యను పెంచేందుకు వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో ప్రస్తుతం శాసనసభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఎమ్మెల్సీ స్థానాలను 40కి మించి పెంచడం సాధ్యం కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ మండలిలో స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీల సంఖ్య 17 మాత్రమే ఉండాలి. అయితే స్థానిక సంస్థలు ఎక్కువగా ఉన్నందున.. ఆ సంఖ్యను ఇప్పుడు మరో మూడుకు పెంచేందుకు వీలుగా భన్వర్‌లాల్ ఈసీకి ప్రతిపాదనలు పంపారు. అలాగే ‘ఎమ్మెల్యే’ స్థానాల సంఖ్యను కూడా మరో మూడు పెంచేందుకు, అలాగే పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి చెరొక స్థానం చొప్పున పెంచేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ పెంపుతో ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య 58కి పెరుగుతుంది. ఇక తెలంగాణ శాసనమండలిలో 14 మంది ‘స్థానిక’ ఎమ్మెల్సీలుండాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం 11 మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడు ‘స్థానిక’ స్థానాలను పెంచాల్సిందిగా సీఈఓ ప్రతిపాదించారు. ఇందుకు ఆమోదం లభిస్తే తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీల సంఖ్య 40కి చేరుతుంది. -
పకడ్బందీగా ఉప ఎన్నిక నిర్వహించండి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చిలకలపూడి (మచిలీపట్నం) : నందిగామ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ సూచించారు. హైదరాబాద్ నుంచి ఆయన గురువారం సాయంత్రం కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారం ముగిసిన అనంతరం ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో ప్రతి ఓటరు సంతకంతో పాటు వేలిముద్రను సేకరించాలని చెప్పారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు ఓటర్ స్లిప్‌లు 88శాతం పంపిణీ చేశారని, మిగిలిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాలోని అన్ని మద్యం షాపులను మూసివేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించాలని చెప్పారు. అలాగే నియోజకవర్గ సరిహద్దు జిల్లాల్లో కూడా మద్యం షాపులు తెరవకూడదన్నారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. ఎక్కువశాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జి.విజయకుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన
10నుంచి 14కు.. సాక్షి, నెల్లూరు : రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. 2019 సాధారణ ఎన్నికల నాటికి పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సివుంది. ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీంతో పునర్విభజన ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ విషయం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పునర్విభజన నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 14కు పెరగనుంది. నూతనంగా అల్లూరు, రాపూరు, వింజమూరుతో పాటు నాయుడుపేట లేదా నెల్లూరు సెంట్రల్ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. రాష్ట్రంలో విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల తర్వాత రెండు లక్షలకు పైగా ఎస్టీ జనాభా ఉన్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 5కి పెరగనున్నాయి. వీటిలో నెల్లూరులో ఏదో ఒక నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్కానున్నట్లు సమాచారం. అయితే పునర్విభజన ప్రక్రియలో అధికార పార్టీ కీలకపాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను కలిపి అదనపు నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు పాత నియోజకవర్గాల సరిహద్దుల్లో మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు జిల్లాలోని నియోజకవర్గాల ముఖచిత్రం ఇలా ఉండనుంది. -
17 లోపు ఎన్నికల ఖర్చుల వివరాలు పంపాలి
చిత్తూరు (జిల్లాపరిషత్): ఎన్నికల నియ మ నిబంధనలను అతిక్రమించిన వారిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కేసుల వివరాలను, అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఈనెల 17వ తేదీలోగా సమర్పిం చాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కోరారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిం చినందుకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన అభినందించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలి తాలను పోలింగ్ కేంద్రాల వారీగా ఫాం-20ను ఈసీ వెబ్సైట్ నందు పొం దుపరచాలన్నారు. ఇందుకు గాను హార్డ్‌కాపీతో పాటు సాప్టుకాపీని హైదరాబా ద్ ఎన్నికల కార్యాలయానికి పంపాల న్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన ఖర్చులు ఏ విధంగా నమోదు చేసి సమర్పించాలన్న దానిపై ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించకపోతే వెంటనే నిర్వహించాలన్నారు. జిల్లాలో ఫాస్ట్‌ట్రా క్ ఖర్చుల వివరాలను తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఆర్వో ఒంగోలు శేషయ్య మాట్లాడుతూ ఫాం-20ను ఇదివరకే సమర్పించామన్నారు. జిల్లాలో 203 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారని, వీరిలో 45 మంది అభ్యర్థులు ఖర్చుల వివరాలను అందజేశారన్నారు. మోడల్‌కోడ్ ఆఫ్ కాండక్టు (ఎంసీసీ) కమిటీచే గుర్తించిన నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నిబంధన లు అతిక్రమించిన 217 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. జిల్లాలో అభ్యర్థులు తమ ఖర్చులను ఏ విధంగా నమోదు చేయాలన్న దానిపై ఒకరోజు అవగాహన సదస్సును ఈనెల 9న నిర్వహించామని ఎన్నికల అధికారికి డీఆర్వో తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌గుప్తా, చిత్తూ రు, తిరుపతి ఆర్డీవోలు పెంచలకిషోర్, సీహెచ్.రంగయ్య, జిల్లా ఆడిట్ అధికారి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాలెట్ పోరులో ‘బ్రహ్మ’సూత్రాలు
ఏకసభ్య ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం త్రిసభ్య సంఘంగా మార్చినపుడు శేషన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ చర్య తనను పక్కకు నెట్టివేయడానికి తీసుకున్నదేనని వాదించారు. కానీ, ఏ కమిషన్ అధికారాన్ని సర్వ సత్తాక శక్తి అని న్యాయస్థానం నిర్వచించిందో, అదే నిర్వచనాన్ని గౌరవించడం దగ్గర ఆ న్యాయస్థానమే విఫలమైంది. సాంకేతిక సమాచార వ్యవస్థ లేని రోజులలో, బ్యాలెట్ మాత్రమే వినియోగంలో ఉన్న కాలంలో పోలింగ్ బూత్‌లను ఆక్రమించేవారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో ఆ పద్ధతి తిరిగి అమలులోకి వచ్చేసింది. ఇంతకంటె ఈ ఎన్నికలు విసిరిన పెద్ద సవాలు - ప్రచార ఆయుధంగా, సమాచారాన్ని బట్వాడా చేసే ఆయుధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రాక్షసంగా ఉపయోగించడం. ఇవన్నీ కలిసి ప్రజాస్వామిక వ్యవస్థలోనే ఎన్నికలలో పోటీ పడుతున్న అభ్యర్థుల మధ్య సమన్యాయం సాధ్యం కాని అసమ వ్యవస్థకు దోహదం చేశాయి. హెచ్ ఎస్ బ్రహ్మ (కేంద్ర ఎన్నికల కమిషనర్) సమన్యాయానికి చోటులేని వ్యవస్థలో రాజ్యాంగ ఉల్లంఘనలే కాదు, ఎన్నికల చట్టాల, నిబంధనల ఉల్లంఘన కూడా పెద్దపెద్ద నాయకుల స్థాయిలోనే యథేచ్ఛగా సాగిపోతుంది. 1990 డిసెంబర్లో టీఎన్ శేషన్ భారత ఎన్నికల కమిషనర్‌గా పదవీ స్వీకారం చేసే వరకు పలు రాజకీయ పక్షాలూ, వాటి అభ్యర్థులూ అలాంటి ఉల్లంఘనలలో ఆరితేరినవారే. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని తు.చ. తప్పకుండా పాటించి అన్ని రాజకీయ పార్టీలను గడగడలాడించినవాడు శేషన్. ప్రభుత్వమే రూపొందించిన ఎన్నికల నిబంధనలకూ, ప్రవర్తనా నియమావళికీ ఆ ప్రభుత్వమే ఎంత విరుద్ధంగా నడుచుకుంటున్నదో శేషన్ ఎత్తి చూపే సరికి పీవీ నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంగారు పడవలసి వచ్చింది. బహుళ సభ్య కమిషన్ నిర్మాణం వెనుక అలాంటి పరిస్థితులలోనే ఏకసభ్య కమిషన్‌గా ఉన్న ఎన్నికల సంఘాన్ని బహుళ సభ్యుల వ్యవస్థగా మార్చడానికి పీవీ ప్రభుత్వం సాహసించింది. మరో ఇద్దరు కమిషనర్లను జత చేసింది. ఈ ఎత్తు అటు అధికార వర్గంలోని వారికీ, ఇటు ప్రతిపక్షాలకూ, అవినీతి రాజకీయ నేతలకూ వాటంగానే తోచింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ పంచుకునే వ్యవస్థలో ఈ ఏర్పాటు సంపన్న వర్గ పక్షాలన్నింటికీ ఆమోదయోగ్యమే అయింది. నిజానికి ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అక్షరసత్యంగా శేషన్ ఎప్పుడు అమలు జరపడం ప్రారంభించారో అప్పటి నుంచి రాజకీయ పక్షాలూ, నేతలూ అంతా శేషన్ కమిషన్ అధికారాలను ప్రశ్నిస్తూ కోర్టులకు వెళ్లారు. ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థకు వ్యతిరేకంగా అసాధారణ పరిస్థితులలో తప్ప, తప్పని పరిస్థితులలోనే జోక్యం చేసుకునే సుప్రీంకోర్టు తలుపులు తట్టినవారు కూడా లేకపోలేదు. న్యాయస్థానాల వైఫల్యం ఎన్నికల నిర్వహణ, నియంత్రణ వంటివి పూర్తిగా ఎన్నికల సంఘం స్వతంత్ర నిర్ణయాల ఆధారంగా జరుగుతాయని రాజ్యాంగంలోని 324వ అధికరణ పేర్కొంటున్నది. ఎన్నికల కమిషన్ అధికారాన్ని ‘సాధికారిక సర్వసత్తాక శక్తి’ అని ఒక తీర్పులో సుప్రీంకోర్టు నిర్వచించింది కూడా. ఇదంతా కాలగర్భంలో కలిసిపోయి ఎన్నికల సంఘం బహుళ సభ్య సంఘంగా మారిపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య పరిధులు ఉన్నందువల్ల ఒక వ్యవస్థ నిర్ణయాలలో మరొక వ్యవస్థ జోక్యం ఉండరాదని పాలకశక్తులు బెదిరించడం వల్లనో ఏమో, కోర్టు కూడా ఒక్కొక్క సందర్భంలో ముందు ఇచ్చిన మంచి తీర్పులను తిరగదోడుతూ ఉంటుంది. ఏకసభ్య ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం త్రిసభ్య సంఘంగా మార్చినపుడు శేషన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ చర్య తనను పక్కకు నెట్టివేయడానికి తీసుకున్నదేనని వాదించారు. కానీ, ఏ కమిషన్ అధికారాన్ని సర్వ సత్తాక శక్తి అని న్యాయస్థానం నిర్వచించిందో, అదే నిర్వచనాన్ని గౌరవించడం దగ్గర ఆ న్యాయస్థానమే విఫలమైంది. నానాటికీ తీసికట్టు ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, శేషన్ తరువాత ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన చాలా కమిషన్లు నియమావళి అమలులో సడలింపు ధోరణినే ప్రదర్శించాయి. నిబంధనలను ఉల్లంఘించిన అనేక మంది నాయకులకు మొదట నోటీసులు జారీ చేయడం, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం కనిపించినా; బెదిరింపులు, ఒత్తిళ్ల మేరకు క్రమంగా సడలించుకుంటున్నాయి. బాహాటంగా జరుగుతున్న ఉల్లంఘనలను కూడా ఎన్నికల కమిషన్లు చూసీచూడనట్టు ఊరుకుంటున్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గాంధీనగర్‌లో ఓటు వేసిన(ఏప్రిల్ 30) తరువాత, బయటకు వచ్చి వేలి మీది సిరా ముద్రను చూపుతూనే, తన పార్టీ గుర్తును కూడా ప్రదర్శించారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు కూడా అదేరోజున జూబ్లీహిల్స్‌లోని ఒక కేంద్రంలో ఓటు వేసి వచ్చి, రెండు ఓట్లూ (లోక్‌సభ, శాసనసభ) బీజేపీకే వేశానని ఇతరులను ప్రభావితం చేసే తీరులో ప్రకటించారు. ఎవరికి ఓటు వేసినదీ ఓటరు బహిర్గతం చేయకూడదని కోడ్ చెబుతోంది. చంద్రబాబు కోడ్‌ను ఉల్లంఘించారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ ప్రకటించినందుకు, టీడీపీ నేత రాద్ధాంతం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసు నమోదు కావడంతో మోడీ కూడా అడ్డగోలు వాదనలకు దిగారు. పోలింగ్ బూత్‌కు వంద మీటర్ల అవతల పార్టీ గుర్తును చూపిస్తే ఉల్లంఘన కాదన్నది మోడీ వాదన. కానీ మీటర్ల లెక్కలు ఎక్కడా లేవు. ప్రజా ప్రాతినిధ్య చట్టం (1951) ప్రకారం పోలింగ్ 48 గంటలకు ముందు నుంచి సభలూ సమావేశాల ఏర్పాటు నిషిద్ధం. 126(బి) ప్రకారం ఎన్నికలకు సంబంధించిన ఏ అంశాన్నీ ఏ రూపంలోనూ ప్రదర్శించకూడదు. అదే నిబంధన సెక్షన్-3 ఎన్నికల అంశం అంటే, ఓటరును ప్రభావితం చేసే, లేదా ప్రలోభపెట్టేదని స్పష్టం చేసింది. ఉల్లంఘనలలో మేటి జోడీ ఎన్నికల చట్టంలోని 125(ఎ) నిబంధన ప్రకారం అభ్యర్థులు మతం, జాతి, కులం పేరిట విద్వేష వాతావరణం సృష్టించడం శిక్షార్హం. కానీ మోడీ ఆది నుంచీ మైనారిటీల భద్రతకు చిచ్చుపెట్టే తీరులోనే ప్రసంగాలు చేశారు. ప్రజలను మోసగించే వాళ్లు తమను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో గమనించరు. ఇందులో మోడీ, బాబు ఒకరికొకరు తీసిపోరు. అవసరమైతే ఇరువురు పరస్పరం మోసగించుకోవడానికి కూడా వెనుదీయరు. సొంత డబ్బాకు టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా దుర్వినియోగం చేయవచ్చునో బాబు, మోడీలకు బాగా తెలుసు. ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో మూడేళ్లుగా మోడీ ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తున్నదో ప్రసిద్ధ విశ్లేషకుడు రాణా అయూబ్ వెల్లడించాడు. ఐటీ, బ్లాగర్లు, అనుకూల విద్యార్థి బృందం, ఎన్ఆర్ఐ వ్యాపారస్థులూ ఇందులో భాగస్వాములు. ‘దేశ్ గుజరాత్’ అనే వెబ్ మోడీ ప్రజా సంబంధాల గురించి ఊదరగొడుతుంది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ‘సంస్కార ధామ్’ మోడీ ప్రచారానికి ఆయన సీఎం కాకముందునుంచే పని చేస్తోంది. షికాగో కేంద్రంగా పనిచేసే నేషనల్ ఇండియన్ అమెరికన్ పబ్లిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ ముగ్గురు అమెరికా పార్లమెంటు సభ్యులు గుజరాత్లో పర్యటించడానికి ఏర్పాట్లు చేసింది. ‘నమో గుజరాత్’, ‘వికాస గుజరాత్’ అనే చానళ్లు మోడీ కీర్తిని చాటుతూ ఉంటాయి. గుజరాత్లో పెట్టుబడులు పెట్టాలన్న కెనడా నిర్ణయానికి కారణం- ఆప్కో వరల్డ్‌వైడ్ అనే సంస్థ. యూరప్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ఇంగ్లండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ గుజరాత్ పర్యటనకు ముందు లాబీయింగ్ చేసింది. ఇండియన్ అమెరికన్స్ ఫర్ ఫ్రీడమ్ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జోయి వాల్ష్కు మద్దతు ఇస్తూ ఉంటుంది. మోడీకి వీసా ఇవ్వవలసిందని క్లింటన్‌కు లేఖ రాసినవాడు వాల్ష్. అక్కడే గుజరాతీలు నెలకొల్పిన హిందూ అమెరికన్ ఫౌండేషన్ నిధులు ఇస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులలో ఒకరు హెచ్ ఎస్ బ్రహ్మ చెప్పినట్టు, మనది పేరుకే ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ ఆచరణలో మన పనులన్నీ ‘అసమ వ్యవస్థ’ నిర్మాణానికి దోహదం చేస్తున్నాయి. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఏబీకే ప్రసాద్ -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి
గుంటూరుసిటీ,న్యూస్‌లైన్ :సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ బూత్‌ల వద్ద ప్రజలకు ఎండ తగలకుండా టెంట్లు, తాగునీటి వసతి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ సమాధానమిస్తూ జిల్లాలోని 17 నియోజకవర్గాలకు గాను 11 మంది మాత్రమే ఈవీఎం ఇంజనీర్లు ఉన్నట్లు చెప్పారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో గత ఎన్నికలలో అతితక్కువ ఓటింగ్ నమోదైన దృష్ట్యా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు చెప్పారు. దీనిద్వారా క్యూలో ఎంతమంది ఉన్నారనే సమాచారం కూడా తెలుసుకోవచ్చన్నారు. జిల్లాలో 83 శాతం వరకు ఓటర్‌స్లిప్పులు పంపిణీ చేశామని, 6వ తేదీ లోపు నూరు శాతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టరు వివేక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వెబ్‌కాస్టింగ్‌పై అవగాహన.. సార్వత్రిక ఎన్నికలకు వెబ్ కాస్టింగ్ సక్రమంగా నిర్వహించాలని జేసీ వివేక్‌యాదవ్ ఆదేశించారు. ఆదివారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపం, శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలలో ఇంజనీరింగ్ విద్యార్థులకు వెబ్‌కాస్టింగ్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఎన్నికల సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా జాగ్రత్తగా వీడియో గ్రఫీ చేయాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు ఆర్డీవో బి.రామ్మూర్తి, వివిధ కళాశాలల ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
శోభకు ఎక్కువ ఓట్లు వస్తే గెలిచినట్లు ప్రకటిస్తాం
* ఆమె మరణించినందు వల్ల ఉప ఎన్నిక నిర్వహిస్తాం * ఆళ్లగడ్డ ఎన్నికపై అనుమానాలు నివృత్తి చేసిన ఎన్నికల కమిషన్ సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ శాసనసభా నియోజకవర్గం ఎన్నికపై ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. ఈ నియోజకవర్గానికి యథావిధిగా ఎన్నిక జరగనుండగా, ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడిన దివంగత శోభా నాగిరెడ్డికి ఎక్కువ ఓట్లు పోలైతే ఆమెను గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఆమె మరణించినందు వల్ల ఆ స్థానానికి తిరిగి ఉపఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. నిబంధనల మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మరణించిన తర్వాత జరిగే పోలింగ్‌లో ఆ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలైతే గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వివరణ ఇస్తూ పంపిన సమాచారంలో పేర్కొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఆమె పేరును వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బ్యాలట్ పత్రాల్లో ముద్రించామని, అందువల్ల మరణించిన అభ్యర్థికి ఓట్లేస్తే అవి ’నోటా’ ఓట్లు (ఎవరికీ చెందని ఓట్లు)గా పరిగణించబోమని కమిషన్ స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన శోభా నాగిరెడ్డి ఈ నెల 24న మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ ఈ ఎన్నిక తీరుపై ప్రజల్లోనూ, రాజకీయవర్గాల్లోనూ అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ కోశాధికారి పి.కృష్ణమోహన్‌రెడ్డి ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరుతూ ఈ నెల 26వ తేదీన లేఖ రాశారు. దీనిపై ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి కె.ఎఫ్.విల్ఫ్రెడ్ వైఎస్సార్ కాంగ్రెస్‌కు రాసిన లేఖలో... ‘మృతి చెందిన శోభానాగిరెడ్డి పేరును ఇప్పటికే అభ్యర్థుల జాబితాలో పొందుపరిచాం. బ్యాలట్ పత్రాల్లోనూ ఈవీఎంపై ఉన్న బ్యాలట్ పత్రంపై కూడా ఆమె పేరును చేర్చాం. ఎన్నికల ఫలితాల ప్రకటన అనేది 1961 సంవత్సరపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లోని 64వ నిబంధన ప్రకారం బ్యాలట్ పత్రంపై ఉన్న ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని గెలుపొందినట్లుగా ప్రకటించాలి. ఇక్కడ ‘అభ్యర్థి’ అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో ఉన్న వారు అని అర్థం. అందువల్ల మరణించిన వ్యక్తి కూడా 64వ నిబంధన కింద అభ్యర్థే అవుతారు. చనిపోయిన వ్యక్తికి వేసిన ఓట్లు ‘నోటా’ ఓట్లుగా పరిగణించడానికి గాని, మిగతా అభ్యర్థుల కన్నా మృతి చెందిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినపుడు మరణించినవారిని గెలిచినట్లుగా ప్రకటించకపోవడానికి ఎలాంటి అవకాశం లేదు. ఈ సందర్భంలో మరణించిన ఆమె ఎక్కువ ఓట్లు కనుక పొందితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. ఎన్నికైన తరువాత ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 150, 151-ఏ, నిబంధనల ప్రకారం ఆ స్థానంలో ఉప ఎన్నికను నిర్వహిస్తారు’ అని వివరణ ఇచ్చారు. -
నేటితో రాజకీయ ప్రత్యక్ష ప్రసారాలకు తెర!
- సోమవారం సాయంత్రం నుంచి అమలు - అన్ని టీవీ చానళ్లకూ నోటీసులు - వీడియో కాన్ఫరెన్స్‌లో భన్వర్‌లాల్ ఆదేశం - ఆచరణ సాధ్యం కాదంటున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్:ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా సోమవారం సాయంత్రంతో తెలంగాణలో ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో సీమాంధ్రలో జరిగే రాజకీయ నాయకుల ప్రచారాన్ని వార్తా చానళ్లు(టీవీలు) ప్రత్యక్ష ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) భన్వర్‌లాల్ ఆదివారం ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన విసృ్తతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసు, రెవెన్యూ అధికారులకు భన్వర్‌లాల్ ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. నిబంధనల ప్రకారం పోలింగ్ జరగడానికి 48 గంటల ముందు నుంచి ఆయా నియోజకవర్గాల్లో ప్రచార ఘట్టానికి తెరపడుతుంది. దీన్ని పక్కాగా అమలు చేయడంతో పాటు బల్క్ ఎస్సెమ్మెస్‌లు, వాయిస్ కాల్స్‌ను నియంత్రించడానికి పోలీసు, రెవెన్యూ విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ మేరకు ఆయా సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖలు రాస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటి సీఈఓ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యక్ష ప్రసారాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు భన్వర్‌లాల్ పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణలో ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగుస్తున్నప్పటికీ.. సీమాంధ్రలో మే 4వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి గడువుంది. మరోపక్క తెలంగాణలో ఎన్నికలు జరిగే 30వ తేదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తిరుపతిలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇతర పార్టీల కీలక నేతలు సైతం అదేరోజు అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయా నేతలు గుప్పించే హామీలు, లేవనెత్తే అంశాలు తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని సీఈఓ అభిప్రాయపడ్డారు. దీనిని కట్టడి చేయడం కోసం ఎన్నికల కోడ్‌తో పాటు సంబంధిత చట్టాల్లోని అంశాలను ప్రస్తావిస్తూ వార్తా చానళ్ల యాజమాన్యాలకు సోమవారం నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.ప్రాంతీయ చానళ్ల ప్రధాన కార్యాలయాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నందున నగర పోలీసులకు ఈ బాధ్యతలను అప్పగించారు. అయితే, ఈ విధానం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా అమలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ రకంగా నోటీసులు ఇచ్చినా ఫలితం ఉండదని వారు అంటున్నారు. దీన్ని అమలు చేయాలంటే దేశ వ్యాప్తంగా వివిధ దశల్లో పోలింగ్ జరిగిన ప్రతిసారీ జాతీయ చానళ్ల ప్రసారాలను ఆపాల్సి ఉంటుందని, మరోపక్క ఇంత తక్కువ సమయంలో కేవలం పోలీసు విభాగం నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు ఆపడమనేది ఆచరణ సాధ్యం కాదని పేర్కొంటున్నారు. అయితే, అమలు సాధ్యాసాధ్యాలను పక్కనబెట్టి.. సీఈఓ ఇచ్చిన ఆదేశాలను అన్ని వార్తా చానళ్ల యాజమాన్యాలకు తప్పనిసరిగా తెలియజేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఎన్నికల సంఘం నుంచి మరోసారి స్పష్టత తీసుకోవడంతో పాటు రాజకీయ ప్రత్యక్ష ప్రసారాలపై సీఈఓ ఇచ్చిన ఆదేశాలను సంబంధిత సెక్షన్ల సహితంగా చానళ్ల దృష్టికి తీసుకెళ్లి, లిఖిత పూర్వక మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలింగ్ ఏర్పాట్లపై నగర కమిషనర్ అనురాగ్ శర్మ సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. -
రేపటితో తెలంగాణలో ప్రచారం బంద్
బయటివ్యక్తులు నియోజకవర్గాలను వీడి వెళ్లాలని ఈసీ ఆదేశం హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 30న పోలింగ్ జరిగే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సోమవారం సాయంత్రం 6 గంటలతో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. అయితే నక్సలైట్ ప్రభావిత 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఆరోజు సాయంత్రం 4 గంటలకే ప్రచా రం ముగియనుంది. అంతే కాకుండా తెలంగాణ జిల్లాల్లోని నియోజకవర్గా ల్లో ఓట్లు లేని వారందరూ ఆయా నియోజకవర్గాలను సోమవారం సాయంత్రం 6 గంటలకల్లా విడిచి వెళ్లాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలను తనిఖీలు చేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే పంపించేయాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇక తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, చెన్నూరు, మంథని, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, భూపాలపల్లి, ములుగు, భద్రాచలంలో 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. మిగతా 108 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 265 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 1669 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 2,81,66,266 మంది ఓటు హక్కు వినియోగించడానికి వీలుగా 30,518 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా రు. కాగా, ఈ ప్రాంతంలో 8 లోక్‌సభ, 31 అసెంబ్లీ స్థానాల్లో 15 మంది కన్నా ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉండడంతో అక్కడ రెండేసి ఈవీఎంలను వినియోగించనున్నారు. అంబర్‌పేట అసెంబ్లీకి అత్యధికంగా 32 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే 75 శాతం ఓటర్లకు ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్‌ల పంపిణీ పూర్తి చేశారు. మిగతా స్లిప్‌ల పంపిణీ ఆదివారానికి పూర్తి చేయనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 125 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 4.40 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు 14,661 మందిని అరెస్టు చేశారు. 8,227 బెల్ట్ షాపులను మూయించారు. పోలింగ్ ఎగ్జిట్‌పోల్ నిర్వహించరాదు.. తెలంగాణలో 30న పోలింగ్ జరగనున్నందున 48 గంటల ముందు నుంచి ఎటువంటి ఒపీనియన్ పోల్ ప్రసారాలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రసారం చేయరాదని కమిషన్ పేర్కొంది. అలాగే పోలింగ్‌రోజు ఎవరూ ఎగ్జిట్‌పోల్ ని ర్వహించరాదని.. తెలంగాణ జిల్లాల్లో ఎన్నికలకు సంబంధిం చి 28వ తేదీ సాయంత్రం నుంచి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ఎటువంటి ప్రచారం ఇవ్వరాదని స్పష్టం చేశారు. -
46 వేల కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్
సీఈఓ భన్వర్‌లాల్ వెల్లడి డబ్బు, మద్యం పంపిణీ చేస్తే 8790499899 కు సమాచారమివ్వాలి సీమాంధ్రలో రేపటి నుంచి ఓటర్ స్లిప్‌ల పంపిణీ తెలంగాణలో 25 కల్లా స్లిప్‌లు పంపిణీ పూర్తి ఎక్కువ అభ్యర్థులు ఉన్న చోట అదనంగా ఈవీఎంలు 90 శాతం పోలింగ్ జరగాలని కమిషన్ టార్గెట్ ఓటును అమ్ముకోవద్దు. బ్రహ్మాస్త్రం ఓటు ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం హైదరాబాద్: రాష్ర్టంలోని 79 వేల పోలింగ్ కేంద్రాలకు గాను 46 వేల పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఇందులో రవాణా సౌకర్యం లేని మారు మూల ప్రాంతాల్లోని 156 పోలింగ్ కేంద్రాల్లో కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. బీఎస్ఎన్ఎల్ అధికారులతో సోమవారం సమావేశమైన ఆయన లైవ్ వెబ్ కాస్టింగ్‌ను ఖరారు చేశారు. డెరైక్ట్ శాటిలైట్ టెలిఫోన్ స్టేషన్ ద్వారా ఈ పోలింగ్ కేంద్రాల లోపల జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను కెమెరాల్లో బంధించనున్నారు. సీమాంధ్రలో ఓటర్ల స్లిప్‌ల పంపిణీ బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 25వ తేదీ కల్లా ఓటర్ల స్లిప్‌ల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. సోమవారం భన్వర్‌లాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలు.. సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. చాలా స్థానాల్లో 15 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఆ రోజున వాస్తవంగా ఏ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులున్నారో తేలుతుంది. అప్పుడు 15 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో ఈవీఎంలు అధికంగా కావాల్సి వస్తుంది. అందుకు అనుగుణంగా అదనపు ఈవీఎంలను ఏర్పాటు చేస్తాం. తెలంగాణ జిల్లాల్లోని 17 పార్లమెంట్, 119 అసెంబ్లీ స్థానాల్లో 8 పార్లమెంట్, 31 అసెంబ్లీ స్థానాల్లో 15 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందుకోసం అదనంగా 16,200 ఈవీఎంలను సిద్ధం చేశాం. ఏ స్థానంలోనైనా 64 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులుంటేనే ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలను వినియోగించాల్సి వస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ నమోదు చేయాలని టార్గెట్ పెట్టింది. ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓటు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. కమిషన్ పెట్టిన టార్గెట్‌ను అందరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. ఓటుకు నోటు తీసుకోవద్దు. ఐదేళ్లకోసారి వచ్చే బ్రహ్మాస్త్రం ఓటు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నందున డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను పెంచుతున్నాం. ఇప్పటి వరకు 108 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నాం. 13,300 మందిని అరెస్టు చేశారు. 8043 బెల్ట్‌షాపులను మూయించాం. ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రంలో 400 కంపెనీలు కేంద్ర సాయుధ బలగాలు వినియోగిస్తున్నాం. ఇప్పటికే సగం పైగా కంపెనీలు వచ్చాయి. వీరిని కూడా డబ్బు, మద్యం నిరోధించేందుకు వినియోగిస్తాం.మద్యం, డబ్బు పంపిణీపై ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలి. నియోజకవర్గం నంబర్ వేసి సమాచారాన్ని 8790499899 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంటుంది. సమాచారం వచ్చిన వెంటనే నిమిషాల్లో ఆ ప్రాంతానికి ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్తుంది. అఫిడవిట్స్‌లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. ఆ కేసు న్యాయస్థానంలో తేలాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి ఆ కేసు ఎటువంటి ఆటకం కలగదు. తెలంగాణలో 28వ తేదీ సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సీమాంధ్ర జిల్లాల్లో మే 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసి ఎన్నికలయ్యే వరకూ సీమాంధ్ర రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులు లేకుండా సీమాంధ్ర అభ్యర్థుల పేరున టీవీల్లో ప్రచారం చేసుకోవచ్చు. ఆ ఎన్నికల సమయంలో సీమాంధ్ర అభ్యర్థుల పేరుతో చేసిన ప్రసారాల వ్యయాన్ని అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారు. -
మౌలిక వసతులు కల్పించాం : కలెక్టర్
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అన్ని మౌలిక వసతులు కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వివరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, ఫామ్-6 దరఖాస్తుల పరిష్కారం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పోలింగ్ అధికారుల శిక్షణ, కమ్యూనికేషన్ ప్రణాళిక వంటి పలు అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, షామియానా,ప్రథమ చికిత్సా కేంద్రం తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అవసరమైన చోట్ల తాత్కాలిక ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గత డిసెంబర్ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జిల్లాలో 2,14,372 ఓటర్ల దరఖాస్తులు పరిష్కరించామని, మిగిలిన 70, 958 దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తొలిదశ శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకులు చేరుకున్నారని తెలిపారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ సదుపాయాన్ని కల్పించి కమ్యూనికేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు చేసుకున్న ఫామ్-6 దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేసి అర్హులైన వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను అందజేయాలని సూచించారు. ప్రతి ఓటరు బూత్ స్థాయి అధికారి ద్వారా ఫొటో ఓటరు స్లిప్పులను నూరుశాతం పంపిణీ చేయాలని కోరారు. నామినేషన్ల దరఖాస్తులను అప్పటికప్పుడే పరిశీలించి వివరాలను సకాలంలో ఎన్నికల కమిషన్‌కు నివేదించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించే వారిపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న నగదు తదితర వివరాల నివేదికను అందజేయాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో విజయవాడ పోలీస్ కమిషనర్ బీ. శ్రీనివాసులు, మచిలీపట్నంనుంచి ఎస్పీ జె. ప్రభాకరరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ సీఐ పి.మురళీధర్, ఆర్ఐ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏ పార్టీ కోసం పనిచేసినా కఠిన చర్యలు
ఉద్యోగులకు భన్వర్‌లాల్ హెచ్చరిక పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు పెంపు ఈ నెల 12 నుంచి సీమాంధ్రలో నామినేషన్లు ప్రారంభం సమాంధ్రల లో నామినేషన్లకు ఐదు రోజులే, మిగతా మూడు రోజులు సెలవులే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కుడి చేతి చూపుడు వేలుకు ఇంక్ కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీకైనా పరోక్షంగా పనిచేసినా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరిగే తెలంగాణ, అలాగే మే 7వ తేదీన పోలింగ్ జరిగే సీమాంధ్రలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో షామియానాలను వేస్తామన్నారు. ఎండకు ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. నక్సలైట్ ప్రభావిత నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు చెప్పారు. ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపిన మరికొన్ని వివరాలు... ప్రతి పోలింగ్ కేంద్రంలో మంచినీరు, విద్యుత్, టాయిలెట్, ర్యాంపు సౌకర్యాలతో పాటు ఓటర్లు ఎండబారిన పడకుండా షామియానాలు ఏర్పాటు. పోలింగ్ సమయం కూడా గతంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంది. ఇప్పటి ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సీమాంధ్ర జిల్లాల్లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు ఈ నెల 12వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. అప్పటినుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే 19వ తేదీ వరకు నామినేషన్లను సమయం ఉన్నప్పటికీ మధ్యలో మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లో నామినేషన్లు స్వీకరించరు. దీంతో సీమాంధ్రలో నామినేషన్ల స్వీకరణ ఐదు రోజులే ఉంటుంది. 13వ తేదీ ఆదివారం, 14వ తేదీ అంబేద్కర్ జయంతి, 18వ తేదీ గుడ్‌ఫ్రైడే సెలవులు వచ్చాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు కుడి చేతి చూపుడు వేలుపై ఇంక్ మార్క్ వేస్తారు. ఈ ఇంక్ మార్క్ పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చేవరకు చెరిపేయకుండా చూస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1800 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు రూ.90 కోట్ల నగదు, 70 కేజీలు బంగారం, 290 కేజీల వెండి, 3,11,764 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నాయి. తెలంగాణలో మార్చి నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి సీమాంధ్రలో ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోలింగ్ తేదీలకు ముందే ఓటర్ స్లిప్‌లతో పాటు, గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. పోలింగ్ రోజు ఓటర్లు గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్‌లతో పాటు కమిషన్ పేర్కొన్న మరో 16 రకాల కార్డులను చూపించి ఓటు వేయవచ్చు. -
అనర్హులను అడ్డుకోండి...
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సూచన బూత్‌ల వద్ద క్యూ ఉంటే ఓటరుకు మెస్సేజ్ జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ వెల్లడి పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశం కవాడిగూడ,న్యూస్‌లైన్: ఈసారి ఎన్నికల్లో అనర్హులు నామినేషన్ దాఖలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సాధారణ ఎన్నికల జీహెచ్ఎంసీ రౌండ్‌టేబుల్ సమావేశం సోమేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం లోయర్‌ట్యాంక్‌బండ్ హోటల్ మారియట్‌లో జరిగింది. దీనికి భన్వర్‌లాల్‌తోపాటు హైదరాబాద్ కలెక్టర్ ఎంకే మీనా, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ప్రత్యేక కమిషనర్ రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల్లో 20శాతం పోలింగ్ పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూఅధికంగా ఉండటం కారణంగా చాలామంది వెనుదిరిగి వెళ్తున్నారని, ఈ పరిస్థితి నివారించేందుకు ఓటర్లకు ఎస్ఎంఎస్ సౌకర్యం కల్పించే యోచన ఉన్నట్లు చెప్పారు. పోలింగ్‌బూత్‌ల వద్ద ఎంతమంది క్యూలో ఉన్నారు అనే విషయాన్ని ఓటర్లకు సమాచారమిచ్చేందుకు ప్రత్యేక ఎస్ఎంఎస్ నంబర్ ను తయారుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీకాకుండా జీహెచ్ఎంసీ 21111111 నంబర్ కు ఫోన్‌చేసి సమాచారమడిగితే వివరాలు చెబుతారని తెలిపారు. రెండురోజుల్లో ప్రత్యేక ఎస్ఎంఎస్ నంబర్‌ను ప్రకటిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎంకే మీనా మాట్లాడుతూ నియె ూజకవర్గాల్లోని సెక్టార్లలో అసిస్టెంట్ సెక్టార్ అధికారి అత్యంత క్రియాశీలకంగా పనిచేయాలని, అసిస్టెంట్ సెక్టార్ అధికారులను సెక్టార్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పోలింగ్‌బూత్‌ల వద్ద ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించా రు. పోలింగ్‌బూత్‌ల వద్ద అన్నిరకాల సదుపాయాలు సమకూర్చాలంటూ.. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచార వ్యయంపై ఎప్పటికప్పుడు అధికారులు నివేదిక తయారుచేసి పంపాలన్నారు. ముందుగానే ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, పోలింగ్‌బూత్‌లను ఓటర్లకు పరిచయం చేయడం, పోలింగ్‌రోజును ఓటర్లకు తెలియజేయడం, బూత్‌ల వద్ద రిస్పెషన్ల ఏర్పాట్ల గురించి వివరించా రు. ఈసందర్భంగా జీహెచ్ఎంసీ 24 నియోజకవర్గాల్లో జరిపిన సర్వేవివరాలను అధికారులకు వివరించారు. ఇందులో 93.67 శాతం మందికి ఓటరు ఐడీకార్డులు ఉన్నట్లు తేలిందని, 86శాతం మంది ఎన్నికలు జరుగుతున్నట్లు టీవీల ద్వారా తెలుసుకున్నారని, ఎస్సీలు, వీకర్‌సెక్షన్‌కాలనీల్లో ఎన్నికలు ఉన్నట్లుగా తమకు తెలియదని 30 నుంచి 40 శాతం మంది చెప్పినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎంఎస్ ఎన్నికలకు సంబంధించి ప్రజల సమస్యలు.. వివిధ రకాల ఫిర్యాదులు ఎస్ఎంఎస్ ద్వారా స్వీకరించి పరిష్కరించేందుకు అధికారులు కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదు రాగానే అది అందిన విషయాన్ని తెలియజేస్తారు. సమస్య పరిష్కారం కోసం వెంటనే దాన్ని సంబంధిత అధికారికి ఎస్ఎంఎస్ చేస్తారు. -
జిల్లాకు త్వరలో అదనపు బలగాలు
సాక్షి, కాకినాడ: ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు ఇరవై నాలుగు కంపెనీల పారా మిలటరీ దళాలు వస్తాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్లోని కోర్టుహాల్లో పోలీసు సూపరింటెండెంట్లు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లతోను, రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ వేర్వేరుగా సమావేశమయ్యారు. కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి నిర్వహించిన అధికారులసమావేశంలో భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం అందించిన హ్యాండ్ బుక్‌ను అధికారులు అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. వ్యయ పరిశీలన తదితర మార్గదర్శకాలతో కూడిన హ్యాండు బుక్‌లను కూడా త్వరలో పంపుతామన్నారు. జిల్లాలో 37 లక్షల మంది ఓటర్లుండగా ఇంకా 30 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు.ఓటరు జాబితాలో పేరు లేకపోతే 92462 80027 సెల్ నంబర్‌కు ఓట్ అని టైపు చేసి ఐడీ కార్డునెంబర్ టైపు చేసి ఎస్ఎంఎస్ పంపితే ఓటరుగా ఎక్కడ నమోదయిందీ సమాధానం లభిస్తుందన్నారు. లేకుంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
తెలంగాణలో నేడే నోటిఫికేషన్
సీఈఓ భన్వర్‌లాల్ వెల్లడి తెలంగాణ జిల్లాల్లో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో ఎన్నికల నగారా మోగుతోంది. నేటి ఉదయం 11 గంటలకు 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు.. తెలంగాణ జిల్లాల్లోని 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు బుధవారం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 9వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థుల ఆస్తులు, కేసుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌లోని ప్రతి కాలమ్‌ను పూరించాలి. ఏదైనా కాలమ్ వర్తించకపోతే అదే విషయాన్ని రాయాలి. ఏ కాలమ్ వదిలినా నామినేషన్ చెల్లదు. అఫిడవిట్లో అభ్యర్థి దేశంలోని ఆస్తులతో పాటు ఇతర దేశాల్లోని ఆస్తులు, పెట్టుబడులను వివరించాలి. అలాగే అభ్యర్థి భార్యతో పాటు తనపై ఆధారపడిన పిల్లలు, ఇతరుల ఆస్తుల వివరాలను వెల్లడించాలి. గుర్తింపు పొందిన పార్టీల తరుఫున పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌ను ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. రిజిష్టర్, రిజిష్టర్ కాని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను పది మంది చొప్పున ప్రతిపాదించాలి. నామినేషన్‌తో పాటు ఓటర్‌గా నమోదైన పత్రాన్ని సమర్పించాలి. స్వయంగా అభ్యర్థిగాని వారి తరుఫున మరొకరు గాని నామినేషన్ దాఖలు చేయవచ్చు. నామినేషన్ దాఖలు సందర్భంగా రిటర్నింగ్ కార్యాలయానికి వంద మీటర్ల లోపునుంచి మూడు వాహనాలనే అనుమతిస్తారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు లోక్‌సభకైతే రూ. 25వేలు, అసెంబ్లీకైతే రూ.10వేలు చొప్పున డిపాజిట్ చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారైతే లోక్‌సభకు రూ.12,500, అసెంబ్లీకైతే రూ. 5,000 డిపాజిట్ చేయాలి. తెలంగాణ జిల్లాల్లో ప్రభుత్వ సెలవు రోజులైన 5వ తేదీ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, 8వ తేదీ శ్రీరామనవమి రోజుల్లో కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ రెండు రోజులను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం కింద సెలవు ప్రకటించనందున ఆ రోజుల్లో కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. జంటనగరాల్లో ఓటర్లందరికీ ఈ నెల 7వ తేదీ నుంచి ఓటర్ స్లిప్ పంపిణీ ప్రారంభించి ఈ నెల 20వ తేదీకల్లా పూర్తిచేస్తారు. మిగతా తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేస్తారు. ఈవీఎంల వినియోగంపై తెలంగాణ జిల్లాల్లో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహిస్తారు. తెలంగాణ జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, చెన్నూరు, మంథని, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. -
రేపటి నుంచే నామినేషన్లు
-
రేపటి నుంచే నామినేషన్లు
హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి తొలిదశ నోటిఫికేషన్ రేపు ఉదయం 10 గంటలకు వెలువడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగే చివరి ఎన్నికలు ఇవి. రెండు దశలలో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి దశలో తెలంగాణలో, రెండవ దశలో సీమాంధ్రలో ఎన్నికలు నిర్వహిస్తారు. రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఉదయం 10 నుంచి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. తెలంగాణలోని ఏజెన్సీ పరిధిలో ఉన్న 11 శాసనసభ నియోజకవర్గాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. సిర్పూర్, అసిఫాబాద్, ఖానాపూర్, చెన్నూర్, మంథని, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, ములుగు, భద్రాచలం, బెల్లంపల్లి నియోజకవర్గాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్ నిర్వహిస్తారు. మిగిలిన 108 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల సెక్యూరిటీ డిపాజిట్ 10 వేల రూపాయలని, ఎస్సీ, ఎస్టీలకు 5వేల రూపాయలని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఓటర్లు 6 కోట్ల 41 లక్షలకు చేరినట్లు తెలిపారు. వారిలో 3 కోట్ల 22లక్షల 3వేల మంది పురుషులు, 3 కోట్ల 18 లక్షల 50 వేల మంది మహిళలని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో 77.50 కోట్ల రూపాయల నగదు, 69.50 కిలోల బంగారం, 288 కిలోల వెండి, 1.85 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు భన్వర్‌లాల్ వివరించారు. ఇదిలా ఉండగా, ఎన్నికల కోడ్‌లో భాగంగా తెలంగాణ, సీమాంధ్రలో 23,762 కేసులను ఎక్సైజ్ శాఖ నమోదు చేసింది. 8509 మందిని అరెస్ట్ చేశారు. 6867 మందిపై సీఆర్పీసీ కేసులు నమోదు చేశారు. -
పోలింగ్ 90 శాతానికి తగ్గొద్దు
అర్హులైన ప్రతి ఓటరుపేరుజాబితాలో ఉండాలి అధికారులకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సూచన బీఎల్ఓలు ఇంటింటికి పోల్ చీటీలు పంచుతారు ఓటర్ల నమోదుకు రాజకీయ పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో 2009 సాధారణ ఎన్నికల్లో 72శాతం పోలింగ్ నమోదయిందని, ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పోలింగ్ 90 శాతానికి తగ్గకుండా చూడాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా అధికారులకు సూచించారు. ఓటర్ల నమోదులో అధికారులతో పాటు రాజకీయ పక్షాలు కూడా సహకరించాలని కోరారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులతో విడివిడిగా సమావేశ మయ్యారు. కలెక్టర్ జి.కిషన్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఎస్పీలు వెంకటేశ్వర్రావు, కాళిదాసు పాల్గొన్నారు. ఈ సమావేశాలలో భన్వర్‌లాల్ మాట్లాడుతూ పోలింగ్ విషయంలో అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు. ఓటరు నమోదుకు అవకాశం ఉన్నందున వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని, అర్హులైన ఓటరు జాబితాలో తన పేరు లేదని ఆందోళన చేసే పరిస్థితి కల్పించవద్దని చెప్పారు. ఈవీఎంల వాడకంపై ప్రతి ఓటరుకు అవగాహన ఉండేలా ఛైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను భన్వర్‌లాల్ అభినందించారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వారం ముందు పోల్‌చీటీల పంపిణీ ఓటరు జాబితాలో పేరు విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేందుకు పోలింగ్‌కు వారం రోజుల ముందు బీల్వో(బూత్ లెవల్ ఆఫీసర్)లు ఇంటిం టికి వెళ్లి చీటీలు పంచుతారని, పంపిణీ క్రమంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పార్టీల ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని భన్వర్‌లాల్ కోరారు. ఓటరు నమోదు శాతాన్ని పెంచేందుకు రాజకీ య పార్టీలు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ పార్టీలకు సంబంధించిన కండువాలు, జెండాలు ఒకసారి కొనుగోలు చేసినవే ఎన్నికలు పూర్తయ్యేవరకు ఉపయోగస్తామని, వానిటి ప్రతిచోటా లెక్కించడం వల్ల ఇబ్బందిగా ఉంటుందని భన్వర్‌లాల్ దృష్టికి తెచ్చారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో టేబుల్, కుర్చీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. సమావేశంలో కాగ్రెస్ పార్టీ నుంచి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నుంచి గుడిమల్ల రవికుమార్, టీడీపీ నుంచి ఎడబోయిన బస్వారెడ్డి, బీజేపీ నుంచి మురళీమనోహర్, సీపీఐ నుంచి టి.శ్రీనివాస్‌రావు, వీరగంటి సదానందం, బీఎస్పీ నుంచి కట్కం యాదగిరి పాల్గొన్నారు. నిట్‌లో భన్వర్‌లాల్.. నిట్ క్యాంపస్ : జిల్లా ఎన్నికల అధికారుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సోమవారం నిట్ గెస్ట్‌హౌజ్‌లో కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు. భన్వర్‌లాల్‌ను కలెక్టరేట్లో జరిగే సమావేశానికి ఆహ్వానించడానికి జిల్లా కలెక్టర్ కిషన్, వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు వచ్చారు. ఈ సందర్బంగా భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్ కిషన్‌ను సాధారణ ఎన్నికలకు సంబంధించి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో ఎన్నికల అధికారులతో సమావేశం కావడానికి భన్వర్‌లాల్ బయలుదేరి వెళ్లారు. -
'చివరి అవకాశాన్ని వినియోగించుకోండి'
హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ.38కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవసరాల కోసం నగదును తరలించేవారు కచ్చితమైన ఆధారాలు చూపాలని స్పష్టం చేశారు. 1,911 ఫ్లయింగ్ స్వాడ్లు పని చేస్తుండగా, 899 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకుంటే 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగుతుందన్నారు. ఇప్పటివరకూ 34లక్షల బోగస్ ఓట్లను తొలగించామని భన్వర్‌లాల్ పేర్కొన్నారు. కొత్తగా ఆరు లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశామని, మొత్తం ఓటర్ల సంఖ్య 6కోట్ల 30 లక్షలకు చేరిందన్నారు. ఓటరు నమోదుకు చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలని భన్వర్‌లాల్ సూచించారు. పోలింగ్ స్టేషన్ వివరాలు ఆన్లైన్లో తెలుసుకునేందుకు జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని భన్వర్‌లాల్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వాయిదాపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా నిర్ణయం రాలేదని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ఈఆర్సీ విజ్ఞప్తిని ఈసీకి పంపినట్లు ఆయన తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకుంటే 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని భన్వర్‌లాల్ కోరారు. -
మరోసారి భారీగా ఎస్ఐల బదిలీలు
- పలువురు రేంజ్ వీఆర్‌కు నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : ఎన్నికల బదిలీల ప్రక్రియ ఊపందుకుంది. గత నెల 26న 48 మంది ఎస్సైలను బదిలీ చేయగా, తాజాగా గురువారం భారీగా 66 మంది ఎస్సైలకు స్థానం కల్పించారు. గత నెల 26న జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న 35మంది పీఎస్ఐలకు స్టేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అదేసమయంలో ఆయా స్టేషన్ల లో పనిచేస్తున్న వారిని జిల్లా, రేంజ్ వీఆర్లకు బదిలీ చేశారు. రేంజ్ వీఆర్‌కు బదిలీ అయిన ర్యాంకర్ ఎస్ఐలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తమను బదిలీ చేశారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీ సు అధికారుల సంఘం జిల్లా, రాష్ట్ర కమిటీలు ఎన్నికల ప్రధాన కమిషనర్ భన్వర్‌లాల్‌ను కలిసి బదిలీల విషయాన్ని చర్చించారు. దీంతో ర్యాంకర్ ఎస్ఐలు రేంజ్ వీఆర్ నుంచి జిల్లాకు వచ్చారు. వీరితో పాటు 9 మంది పీఎస్ఐలు గుంటూరు రేంజ్ నుంచి జిల్లా వీఆర్‌కు వచ్చారు. తాజాగా జిల్లా వీఆర్, పలు స్టేషన్లలో పనిచేస్తున్న 66 మంది ఎస్ఐలు, పీఎస్ఐలను బదిలీ చే స్తూ ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీల్లో తొమ్మిది మందిని రేంజ్ వీఆర్‌కు, ఇద్దరిని జిల్లా వీఆర్‌కు బదిలీ చేశారు. తొమ్మిది మంది పీఎస్ఐలకు పోస్టింగ్‌లు కల్పించారు. బదిలీ అయిన వారు వెంటనే తమ విధుల్లో చేరాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగరంలోని పలు స్టేషన్ల్లో ఎస్ఐలు గురువారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. శుక్ర, శనివారాల్లో సీఐల బదిలీలు జరగున్నట్లు సమాచారం. -
మార్చి 1 నుంచి ఓటర్లకు స్మార్ట్ కార్డులు: భన్వర్‌లాల్
అరసవల్లి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఓటర్ల నమోదు కార్యక్రమంలో కొత్త ఓటర్లుగా నమోదైన వారికి స్మార్ట్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. ఆదివారం ఆయన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బినామీ, డూప్లికేషన్ ఓట్లను తొలగించిన అనంతరం రాష్ట్రంలో కొత్తగా చేరిన ఓట్లు 72 లక్షలు అని వెల్లడించారు. కొత్తవారితోపాటు పాత ఓటర్లకు కూడా స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 900 ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ప్రత్యేకంగా ప్రింటర్లు ఏర్పాటు చేసి కొత్త కార్డులు ఇస్తామన్నారు. ఒక్కో కార్డుకు రూ.25 చొప్పున వసూలు చేస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 36 లక్షల మంది బోగస్ ఓటర్లను గుర్తించి తొలగించామన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేనందున రాష్ట్రం యూనిట్‌గా సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
రాష్ట్రంలో కొత్త ఓటర్లు 76.26 లక్షలు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం విభజన జరిగినా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 76.26 లక్షల మంది ఓటర్లుగా నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున కొత్త ఓటర్లు నమోదు కావడం ఇదే తొలిసారిని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. శనివారం నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రాష్ట్రంలో 69,014 పోలింగ్ కేంద్రాలతోపాటు జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రా ల్లో నిర్వహిస్తామని చెప్పారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి కార్యక్రమం ఉంటుం దన్నారు. భన్వర్‌లాల్ చెప్పిన వివరాలివీ.. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 69,014 పోలింగ్ కేంద్రాల్లో ఆయా పరిధిలోని ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తాం. అక్కడే బూత్ స్థాయి ఆఫీసర్లు ఓటు నమోదు పత్రాలతో ఉంటారు. జాబితాలో పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ చూసుకోండి. పేరు లేకపోతే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోండి. సవరణ ప్రక్రియలో భాగంగా... మృతి చెందిన, రెండు మూడు చోట్ల పేర్లు ఉన్న, ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లిన 33.64 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించాం. అలాంటి వారు శనివారం ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలి. జాబితాలో పేరు ఉందో తెలుసుకోవడానికి 9246280027కు ఠిౌ్ట్ఛ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ ఎస్ఎంఎస్ చేయాలి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో కొత్తగా ఓటరుగా నమోదైన ఐదుగురికి కలర్ ఫొటోతో గుర్తింపు కార్డులను జారీ చేస్తాం. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. వచ్చే నెలాఖరు లేదా మార్చి తొలి వారంలో షెడ్యూల్ వస్తుంది. ఒక రాష్ట్రం ఉన్నా రెండు రాష్ట్రాలున్నా ఎన్నికలు జరుగుతాయి. గత ఏడాది జనవరి 15న ప్రకటించిన ఓటర్ల జాబితాలో 5.81 కోట్ల మంది ఓటర్లుండగా ఇప్పుడు కొత్తగా ఓటర్ల నమోదు, తొలగింపు తర్వాత రాష్ట్ర ఓటర్ల సంఖ్య 6.24 కోట్లకు చేరింది. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 31న ప్రకటిస్తాం. ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 50,10,024 మంది ఓటర్లున్నారు. -
16 నాటికి ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించాలి
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: అన్ని జిల్లాల్లో ఈ నెల 16వ తేదీ నాటికి ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లను ఆదేశించారు. ఆయన శనివారం హైదరాబాద్ నుంచి ఓటర్ల దరఖాస్తుల పరిశీలన, ఫొటో ఓటర్ల జాబితా ప్రచురణ, ఈవీఎంల భద్రత తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్షించారు. జిల్లాల్లో ఓటు హక్కు కోసం నూతనంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వీటిలో ఎన్నింటిపై విచారించారు అనే వివరాలను భన్వర్‌లాల్ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి సంబంధిత బూత్‌లెవల్ అధికారులు విచారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని జనవరి 10వ తేదీలోపు ముగించి జాబి తాను జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. దరఖాస్తుల విచారణకు సంబంధించి రాష్ట్ర సగటు 10 శాతం ఉంటే, చిత్తూరు జిల్లాలో 28 శాతం ఉం దన్నారు. జిల్లాలో ఈవీఎంలు, వాటి భద్రతపై దృష్టి సారించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ రాంగోపాల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,63,198 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీటిలో 73,776 దరఖాస్తులను విచారించి పరిష్కరించామన్నారు. మిగిలిన వాటిపై జనవరి 10వ తేదీ లోపు విచారణ జరుపుతామని పేర్కొన్నా రు. ఎన్నికల సామగ్రికి సంబంధించి జిల్లాలోని 5,358 బ్యాలెట్ యూనిట్లు, 4,194 కంట్రోల్ యూనిట్లను పశ్చిమబెంగాల్‌కు పంపినట్లు వివరించారు. ఎన్నికల సామగ్రిని భద్రపరుచుకునేందుకు అవసరమైన గోడౌన్లు నిర్మాణంలో ఉన్నాయని, పనులను త్వరలోనే పూర్తి చేస్తామ ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ బసంత్‌కుమార్, డీఆర్వో శేషయ్య, మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌కుమార్ గుప్తా, తిరుపతి, చిత్తూరు ఆర్డీవోలు రామచంద్రారెడ్డి, పెంచలకిషోర్, జెడ్పీ సీఈవో నాగేశ్వరరావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొన్నారు. -
జనవరికి ఓటర్ల తుది జాబితా
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ నాటికి జిల్లాల్లో ఓటర్ల తుది ఫొటో జాబితా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లను ఆదేశించారు. ఫొటో ఓటర్ల జాబితా రూపకల్పనపై హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. భన్వర్‌లాల్ మాట్లాడుతూ తప్పులు లేని ఓటర్ల జాబితా కోసం ఇంటింటి సర్వేను వెంటనే పూర్తి చేయాలని ఆదేశిం చారు. అనర్హుల పేర్లను తొలగించాలని సూచించారు. బూత్ లెవల్ అధికారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, అభ్యంతరాలు, పరిష్కార వివరాలను ఈ నెల 15వ తేదీకి సేకరించి వెంటనే వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో యువత నమోదు శాతం పెంచేందుకు విద్యా సంస్థలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఆదివారాలతో సహా ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్వోలు నిర్దేశిత కేంద్రాల్లో ఉండాలని స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుప్పంలో 43 వేల డూప్లికేట్ పేర్లు జిల్లాలో కొత్తగా 1.2 లక్షల మంది ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ రాంగోపాల్ భన్వర్‌లాల్‌కు వివరించారు. వీరిలో సాధారణ ప్రజలు 57 వేల మంది, 18-19 ఏళ్ల వయసు గల వారు 63 వేల మంది ఉన్నారని పేర్కొన్నారు. యువత నమోదు శాతం పెరిగేందుకు జిల్లాలోని కళాశాలలను గుర్తించామని చెప్పారు. తప్పులు లేని ఫొటో ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 43 వేల డూప్లికేట్ పేర్లు ఉన్నాయన్నారు. డూప్లికేట్ పేర్ల తొలగింపునకు అన్ని నియోజకవర్గాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో శేషయ్య, పడా ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరెడ్డి, ఆర్డీవో పెంచలకిషోర్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
ఓటరు నోమోదు
=మొక్కుబడిగా ఓటరు నమోదు =తెరుచుకోని పోలింగ్ కేంద్రాలు =అందుబాటులో లేని ఫారాలు =అధికారులు, రాజకీయ పార్టీల నిర్లక్ష్యం =ప్రజలకు శాపం ‘ఓటరు నమోదు తప్పనిసరి. ఇందుకు అందరూ ముందుకు రావాలి. అధికారులు యువ ఓటర్లపై దృష్టి పెట్టాలి. శత శాతం నమోదుకు కృషి చేయాలి’..రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశాలివి. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ నామమాత్రంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఓటరు నమోదు కేంద్రాలు తెరుచుకోవడం లేదు. ఉన్న కేంద్రాల్లో ఫారాలు అందుబాటులో ఉండడం లేదు. అధికారుల నుంచి రాజకీయ పార్టీల వరకూ అంతా పట్టనట్టే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. గత నెల 24వ తేదీ నుంచి మూడు ఆదివారాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నప్పటికీ బిఎల్వోలు నిర్దేశించిన కేంద్రాలవద్ద అందుబాటులో ఉండటంలేదు. వెరశి ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు కావడం లేదు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయ పార్టీలు పట్టనట్టు ఉంటున్నాయి. జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు శాతం ఇంకు తార్కాణం. గత నెల 18వ తేదీ వరకు జిల్లాలో 30,76,374 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 15,33,783 మంది పురుషులు, 15,42,591 మహిళా ఓటర్లు. వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గత నెల 18వ తేదీ నుంచి మరోసారి ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 10వ తేదీ వరకు చేర్పులు, సవరణలకు అవకాశముంది. ఈసారి యువ ఓటర్లపై ప్రధానంగా దృష్టి సారించాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదే శించింది. దాని ప్రకారం కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు సమీక్షలు నిర్వహించి ఎన్నికల సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. జిల్లాలోని కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించి ఓటరు నమోదుపై విద్యార్థుల్లో అవగాహన కలిగించాలని సూచించారు. నమోదు ఫారాలెక్కడ? నవంబర్ 18వ తేదీ నుంచి ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించినా నవంబర్ 24, డిసెంబర్ 1, 8 తేదీల్లో ఓటరు నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా తేదీల్లో జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు నమోదు పత్రాలను స్వీకరిస్తారని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు. కానీ ఆయా తేదీల్లో చాలా పోలింగ్ కేంద్రాలు అసలు తెరుచుకోలేదు. ప్రజలు కేంద్రాలకు వెళ్లి తాళాలు వేసి ఉండడాన్ని చూపి వెనుదిరిగారు. నగరంలో కొన్ని కేంద్రాల్లో సిబ్బంది ఉన్నా ఓటరు నమోదు ఫారాలు లేవు. సోమవారం నిర్వహించిన రెండో దఫా ప్రత్యేక కార్యక్రమంలో కూడా ఇదే తంతు కనిపించింది. కొన్ని చోట్ల నమోదు ఫారాలు ఉన్నా వాటిని సమర్పించిన తర్వాత ఎకనాలెడ్జ్మెంట్ ఇవ్వడం లేదు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించకపోవడం వల్లే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువ ఓటర్లు ఎక్కడ? ఈ దఫా యువ ఓటర్లపై దృష్టి సారించినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. జిల్లాలో 2011 గణాంకాల ప్రకారం 44,44,536 మంది జనాభా ఉన్నారు. వీరిలో 18, 19 ఏళ్లవారు సుమారుగా 1.89 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 3.9 శాతం యువత మాత్రమే ఓటరుగా నమోదయ్యారు. కళాశాలలకు ఓటరు నమోదు ఫారాలు పంపించడం, అవగాహన కలిగించడం ద్వారా యువ ఓటర్ల శాతం పెరుగుతుందని అధికారులు భావించారు. కానీ ఇప్పటి వరకు కేవలం 3 శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. -
కొత్తవారికి అవకాశం కల్పించండి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈ ఏడాదికి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందికీ ఓటుహక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే బూత్‌స్థాయి అధికారుల డేటాను తప్పనిసరిగా నమోదు చేయాల ని ఆదేశించారు.మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఏటా కొత్త వారికి అవకాశం కల్పిం చడం కంటే తొలగించే వారి జాబితానే ఎక్కువగా ఉంటుందని, ఈసారి అలా కాకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని సూచించారు. ఇదివరకు ఉన్న పోలింగ్ కేంద్రాలతో పాటు, కొత్తగా ఏర్పాటుచేసిన వాటన్నింటిని తనిఖీచేసి పరిశీలించాలన్నారు. అవి ఎన్నికల సమయంలో అనుకూలంగా ఉన్నాయో, లేదో పరిశీలించిన తరువాతనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా డిసెంబర్ నాటికి అన్ని జిల్లాల్లో ఈవీఎం గోదాంల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ..బూత్‌స్థాయి అధికారుల డాటా నమోదుకు సంబంధించి రిజిస్టర్ల నిర్వాహణ చేపట్టాలని ఈసీఓకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేసి కొత్త ఓటర్లకు నమోదుకు ఫారం 6ను 70శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. ఇక ఫారం 7, 8, 8ఏ ప్రక్రియకు సంబంధించి ఐదు శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రాలన్నింటిని వ్యక్తిగతంగా పరిశీలించడం పూర్తయ్యిందని, ఇక పోలింగ్ కేంద్రాల జాబితాను ఈనెల 12న ప్రచురించినట్లు కలెక్టర్ వివరించారు. వీటితోపాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కొత్త గోదాంలో ఉంచామన్నారు. దీంతోపాటు ఆర్ఓ, ఏఆర్‌ఓల నియామాకానికి ఇటీవల ప్రతిపాదనలు పంపామని, అదే విధంగా పోలింగ్ సిబ్బంది, వెబ్‌కాస్టింగ్‌కు విద్యార్థుల జాబితాను సేకరించనున్నట్లు తెలిపారు. ఈనెల 20న అఖిలపక్షం సమావేశం.. అనంతరం ఆర్డీఓలు, తహశీల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ఈనెల 20న అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని సూచించారు. ఇక తహశీల్దార్లు అన్ని పోలింగ్ కేంద్రాలను వ్యక్తిగతంగా తనిఖీచేసి ఫోటోలతో సహా నివేదిక పంపాలని ఆదేశించారు. అదేవిధంగా కొత్త ఓటర్లకు వచ్చిన దరఖాస్తులను 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక బోగస్ ఓటర్లు ఎవరైనా ఉంటే ఇంటింటి సర్వే నిర్వహించి వాటిని తొలగించాలని సూచించారు. దీంతోపాటు ఆధార్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇదివరకు జిల్లాలో కేవలం 45 శాతం ప్రక్రియ మాత్రమే పూర్తయిందని, మిగిలిన శాతాన్ని వేగవంతంగా పూర్తిచేసేందుకు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో రాంకిషన్, ఏఓ కిషన్‌రావు, ఆర్డీఓలు నారాయణరెడ్డి, యాస్మిన్ బాష, వెంకటేశ్వర్లు, కిమ్యానాయక్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.