చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: అన్ని జిల్లాల్లో ఈ నెల 16వ తేదీ నాటికి ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లను ఆదేశించారు. ఆయన శనివారం హైదరాబాద్ నుంచి ఓటర్ల దరఖాస్తుల పరిశీలన, ఫొటో ఓటర్ల జాబితా ప్రచురణ, ఈవీఎంల భద్రత తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌స ద్వారా సమీక్షించారు. జిల్లాల్లో ఓటు హక్కు కోసం నూతనంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వీటిలో ఎన్నింటిపై విచారించారు అనే వివరాలను భన్వర్‌లాల్ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి సంబంధిత బూత్‌లెవల్ అధికారులు విచారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని జనవరి 10వ తేదీలోపు ముగించి జాబి తాను జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. దరఖాస్తుల విచారణకు సంబంధించి రాష్ట్ర సగటు 10 శాతం ఉంటే, చిత్తూరు జిల్లాలో 28 శాతం ఉం దన్నారు. జిల్లాలో ఈవీఎంలు, వాటి భద్రతపై దృష్టి సారించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
కలెక్టర్ రాంగోపాల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,63,198 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీటిలో 73,776 దరఖాస్తులను విచారించి పరిష్కరించామన్నారు. మిగిలిన వాటిపై జనవరి 10వ తేదీ లోపు విచారణ జరుపుతామని పేర్కొన్నా రు. ఎన్నికల సామగ్రికి సంబంధించి జిల్లాలోని 5,358 బ్యాలెట్ యూనిట్లు, 4,194 కంట్రోల్ యూనిట్లను పశ్చిమబెంగాల్‌కు పంపినట్లు వివరించారు. ఎన్నికల సామగ్రిని భద్రపరుచుకునేందుకు అవసరమైన గోడౌన్లు నిర్మాణంలో ఉన్నాయని, పనులను త్వరలోనే పూర్తి చేస్తామ ని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జేసీ బసంత్‌కుమార్, డీఆర్‌వో శేషయ్య, మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌కుమార్ గుప్తా, తిరుపతి, చిత్తూరు ఆర్‌డీవోలు రామచంద్రారెడ్డి, పెంచలకిషోర్, జెడ్పీ సీఈవో నాగేశ్వరరావు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొన్నారు.
16 నాటికి ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించాలి
Published Sun, Jan 5 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement