The list of voters
-
80 లక్షలు
ఇదీ గ్రేటర్ ఓటర్ల సంఖ్య జనాభా కంటే అధికం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా కంటే ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇదేదో మేం చెబుతున్న విషయం కాదు... లెక్కలు తేల్చిన వాస్తవం. గత సంవత్సరం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రేటర్ జనాభా 78 లక్షలు. వివిధ కారణాలతో ఇటీవల జీహెచ్ఎంసీలో 6,30,652 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. దీంతో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 80,57,198గా తేలింది. అంటే అప్పటి జనాభా కంటే ఇంకా సుమారు 2.5 లక్షల ఓటర్లు అధికంగా ఉన్నారు. దీన్ని బట్టి ‘లెక్క’ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు వివరాలిలా ఉన్నాయి. నియోజకవర్గాల పరంగా చూస్తే... కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 6,16,437 మంది ఓటర్లు ఉండగా... ఆ తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లిలో 5,53,311 మంది, ఎల్బీనగర్లో 5,36,953 మంది ఉన్నారు. అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 1,98,285 మంది ఉన్నారు.తొలగించిన ఓటర్లు కూకట్పల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 1,08,972 మంది ఉన్నారు. యాకుత్‌పురా నియోజకవర్గంలో అత్యల్పంగా 424 మంది మాత్రమే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇళ్లకు తాళాలు, అనర్హులు లేకపోవడం విశేషం. మలక్‌పేట నియోజకవర్గంలోనూ ఇళ్లకు తాళాలు, అనర్హులైన ఓటర్లు (వయసు తక్కువ ఉన్నవారు) లేరు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. వివిధ రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున ఓటరు జాబితాలో లోటుపాట్లకు తావులేకుండా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రత్యేక చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాల నుంచి ఓటర్ల ముసాయిదాలపై అభ్యంతరాలను స్వీకరించేందుకు బుధవారం గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి బూత్ స్థాయి అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తారు. బూత్ స్థాయిలో ఓటర్ల నమోదు: శివకుమార్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రారంభమైన ఓటర్ల నమోదు కార్యక్రమంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి శివకుమార్ అన్నారు. బుధవారం గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గ కేంద్రాలతో పాటు బూత్‌లెవల్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తు న్న దృష్ట్యా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరై అకారణ ంగా ఓటరు జాబితా నుంచి తొలగించిన వారి వివరాలను అందజేయాలని శివకుమార్ కోరారు. టీడీపీ వినతిపత్రం ఓటర్ల జాబితా నుంచి అకారణంగా చాలా మందిని తొలగించారని ఆరోపిస్తూ హైదరాబాద్ జిల్లా టీడీపీ నాయకులు భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మంగళవారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస్, వనం రమేశ్, మేకల సారంగపాణి తదితరులు భన్వర్‌లాల్‌ను కలిసి జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలోనూ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పునర్విభజనలో అధికార పార్టీ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
మోగిన నగారా
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల పోలింగ్ ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం అమలులోకి వచ్చిన ‘కోడ్’ ఇంకా ఓటరు నమోదుకు అవకాశం తుది ఓటర్ల జాబితా ప్రకారం మూడు జిల్లాల పరిధిలో 1,33,506 మంది ఓటర్లు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 46,291, వరంగల్ జిల్లాలో 44,512, ఖమ్మం జిల్లాలో 42,703 ఓటర్లు ఉన్నారు. మూడోసారి పోరు శాసన మండలిని పునరుద్ధరించిన తర్వాత వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగిన రెండుసార్లు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన కపిలవాయి దిలీప్‌కుమార్ గెలుపొందారు. ఈయన పదవీకాలం 2015 మార్చిలో ముగుస్తోంది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇ వే కావడంతో రాష్ట్రం, కేంద్రం అధికారంలో ఉన్న టీ ఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా యి. ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎన్నికలైనా రాజకీయరంగును పులుముకోనున్నారుు. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఓటర్ల నమోదును ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావును ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి మద్దతుగా నిలుస్తోంది. ఆశావహులు టీఆర్ఎస్ పార్లీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బండ నరేందర్‌రె డ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు ముందు వరుసలో ఉన్నారు. ఇంకా టీఆర్ఎస్కు అ నుబంధంగా ఉండే తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, సాధారణ ఎ న్నికల్లో నల్లగొండ ఎంపీగా పోటీ చేసిన రాజేశ్వరరె డ్డి, తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం అధ్యక్షుడు ఎస్.సుందర్రాజు, రిటైర్డ్ లెక్చరర్ పులి సారంగపాణి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరిలో బండ నరేందర్‌రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు అధికంగా ఉన్నారుు. కాంగ్రెస్ పార్టీ నుంచి బండా ప్రకాశ్ పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ రంగల్ జిల్లాతో పోల్చితే ఖమ్మం, నల్గొండ జిల్లాలో వామపక్ష పార్టీలకు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఈ పార్టీల తరఫున పోటీ చేసే అవకా శం ఖమ్మం, నల్లగొండ నేతలకే దక్కే అవకాశం ఉం ది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఎం పీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోషించే పాత్ర కీలకం కానుంది. ఓటర్ల నమోదుకు అవకాశం జిల్లాలో ఇప్పటివరకు ఓటర్లుగా అర్హత ఉండి నమోదు చేసుకోని పట్టభద్రుల కోసం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 01-11-2014 నాటికి దేశంలోని ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభ్రులై ఉన్నా, అందుకు సమానమైన విద్యార్హతలు ఉన్నా, ఫారం18 ద్వారా సంబంధిత రుజువులు జత చే స్తూ ఓటుకోసం దరఖాస్తు సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ద్వారా ఓటు నమోదుకోసం దరఖాస్తు చేసుకునేవారు ఠీఠీఠీ.ఛిౌ్ఛ్ట్ఛ్చజ్చ్చ.జీఛి.జీ వెబ్ సైట్లోకి లాగిన్ అయి పారం పూర్తిచేయవచ్చు. ఇందులో ఓటు నమోదు కోసం ఫారం-18, తొలగింపుల కోసం ఫారం-7, సవరణ కోసం ఫారం-8, ఒక నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం నుంచి ఇంకో నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి మారడానికి ఫారం-8(ఏ) పూర్తి చేయాలి. ‘కోడ్ ’ కూసింది.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. నియమావళి మార్చి 23 వరకు అమలులో ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ నల్గొండ ప్రధాన కేంద్రంలో చేపడతారు. వరంగల్, ఖమ్మం డీఆర్వోలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. -
‘మండలి’ వేడి
తెరపైకి ఇప్పటికి ఐదుగురు వైఎస్సార్ సీపీ మద్దతుతో గొల్ల బాబూరావు పోటీ టీడీపీ అభ్యర్థిత్వం కోసం చైతన్యరాజు, పరుచూరి యత్నాలు పీడీఎఫ్ అభ్యర్థిగా రాము సూర్యారావు స్వతంత్రంగా రంగంలోకి దిగుతున్న పిల్లి డేవిడ్ ఈసారి ఓటర్ల సంఖ్య 20 వేలకు పైనే ఏలూరు సిటీ : శాసన మండలి ఎన్నికలకు ఈ నెలాఖరున నగారా మోగబోతోంది. ఓటర్ల జాబితాలు సిద్ధమవుతున్నారుు. ఈనెల 16న తుది ఓటర్ల జాబితా ప్రచురణ కానుంది. నెలాఖరు నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని, వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాల భోగట్టా. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. భారీగా ఎరిగిన ఓటర్ల సంఖ్య పోటీని తీవ్రతరం చేయనుంది. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనవిగా పేరొందిన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఓటర్లు ఏ విధమైన తీర్పు ఇస్తారనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులు తెరపైకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ కలిదిండి చైతన్యరాజు తాను టీడీపీ మద్దతుతో బరిలోకి దిగుతున్నట్టు చెబుతున్నారు. అదే పార్టీ నుంచి ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు సైతం పోటీకి సై అంటున్నారు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున సామాజిక వేత్త రాము సూర్యారావు, స్వతంత్ర అభ్యర్థిగా పిల్లి డేవిడ్‌కుమార్ బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిత్వం ఎవరికో టీడీపీ అభ్యర్థిత్వం ఎవరిని వరిస్తుందోననే అంశం ఆసక్తికరంగా మారింది. టీడీపీ తరఫున పోటీచేసే అవకాశం తనకే దక్కుతుందన్న ఉద్దేశంతో చైతన్యరాజు ఇప్పటికే ఎన్నికల గోదాలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు టీడీపీ టికెట్ తనకే ఖాయమని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయనను పోటీనుంచి తప్పించడానికి ఎమ్మెల్సీ సీటిస్తామని అధినాయకత్వం హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరికైనా టీడీపీ సీటివ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటారని చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బాబూరావు ఎమ్మెల్సీ ఎన్నికలు చప్పగా సాగుతాయేమో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు బరిలో నిలవడంతో రాజకీయూలు ఒక్కసారిగా వేడెక్కారుు. శాసన మండలిలో విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేయూలనే తపనతో తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు బాబూరావు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పాలన గాడి తప్పటం, చంద్రబాబు మాట తప్పడాన్ని అన్ని వర్గాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకత తప్పదనే అభిప్రాయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావుకు విజయావకాశాలు ఎక్కువే అంటున్నారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ సహకారంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని బాబూరావు చెబుతున్నారు. యూటీఎఫ్ మద్దతుతో ఆర్ఎస్ఆర్ ఏలూరుకు చెందిన సామాజికవేత్త రాము సూర్యారావు పీడీఎఫ్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) ఆయనకు మద్దతు ప్రకటించింది. మరోవైపు నిడదవోలు పట్టణానికి చెందిన పిల్లా డేవిడ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఓటర్లు పెరిగారు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలో 13,200 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. రానున్న ఎన్నికలకు ఓటర్ల సంఖ్య పెరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఓటు హక్కు నమోదు చేయించుకున్న వారి సంఖ్య 4,184 కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 5వేలకు పైగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 20 వేలు దాటిపోయేలా ఉంది. -
పట్టభద్రుల నమోదు ఇలా..
వైరా : పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో సవరణకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకు వీరికి అవకాశం ఉంటుంది. ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవడానికి, తప్పులు సరిచేసుకునేందుకు, మార్పులు, చేర్పులతో పాటు పేర్లు తొలగించడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 16 వరకు మార్పులు చేసేందుకు అవకాశం ఉంది. మరి ఏయే దరఖాస్తుకు ఎలాంటి ఫారం కావాలి... అవి ఎక్కడ దొరుకుతాయి... ఎక్కడ దరఖాస్తు చేయాలి..? తదితర వివరాలు ఇలా... దరఖాస్తు విధానం దరఖాస్తును ఇంటర్నెట్ ద్వారా http://ec-.in/ecimain1/formsvoters.aspx లింక్‌ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులో పూర్తి వివరాలు కరెక్ట్‌గా నమోదు చేయాలి. ఫారంలో చూపిన చోట ఈ-మెయిల్, ఫోన్ నంబరు ఇస్తే నమోదు వివరాల సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. దరఖాస్తుకు జత చేయాల్సినవి... పట్టభద్ర (డిగ్రీ) ధ్రువీకరణ పత్రం ఓటరు గుర్తింపు కార్డు అర్హతలు ఇవీ... నియోజకవర్గంలో స్థానికంగా నివాసం ఉండాలి. 2014 జనవరి 1వ తేదీకి మూడేళ్లకు ముందు భారతదేశంలో ఏదైనా విశ్వవిద్యాలయంలో పట్టభద్రులై ఉండాలి. (డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తి కావాలి) దేనికి ఏ ఫారం..? కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకునే వారు ఫారం 18 పేరును తొలగించేందుకు ఫారం 7 ఓటు హక్కులో ఏమైనా మార్పులు చేయాలంటే ఫారం 8ఏ ఓటు హక్కులో కొత్తగా చేర్పులు చేయాలంటే ఫారం 8 పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను జత చేయాలి. కొత్తగా పేరు నమోదు చేసుకునే వారు, పేరును తొలగించుకోవాలని అనుకునేవారు ఫొటో జత చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఎవరికి సమర్పించాలి..? పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గంలోని అసిస్టెంట్ ఎలక్ట్రోలర్ రిజిస్ట్రేషన్ అధికారికి ఇవ్వాలి. ఈనెల 25 నుంచి డిసెంబర్ 16లోగా దరఖాస్తులు అందించాలి. చేయకూడనివి... దరఖాస్తులో తప్పులు దిద్దినా (కొట్టివేతలు), దరఖాస్తు ఫారం చిరిగినా దానిని తిరస్కరిస్తారు. అదేవిధంగా ఏమైనా తప్పుడు సమాచారం పేర్కొంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకుంటారు. మరిన్ని వివరాలకు http:// ceo telangana.nic.in వెబ్ సైట్లో చూడొచ్చు. -
మళ్లీ ఎన్నికల సందడి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి నెల కొననుంది. మూడు నెలలుగా జోరుగా సాగిన మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల సందడి ఇటీవలే సద్దుమణిగింది. జిల్లాలో మాత్రం మళ్లీ ఎన్నికల వేడి రాజుకోనుంది. ఏడాదిగా ఖాళీ ఉన్న స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవికి ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వివరాలు పంపాలని జిల్లాలోని ఎన్నికల విభాగం అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఇప్పటికే స్థానిక సంస్థ ఎమ్మెల్సీని ఎన్నుకోనున్న ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘానికి పంపారు. తాజాగా ఈ స్థానిక ప్రజాప్రతినిధుల ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసి మూడేళ్లయినా వాటికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ ఎమ్మెల్సీ పదవి ఏడాదిగా ఖాళీగా ఉంటోంది. ఎట్టకేలకు వీటికి ఎన్నికలు జరగడం.. గురువారం నుంచి శనివారం వరకు వరుసగా మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక మండళ్లపాలక వర్గం కొలువుదీరడం.. ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఇటీవలే ప్రమాణ స్వీకారం చేయడం ముగిసింది. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్లెవరో తేలిపోవడంతో ఎన్నికల సంఘం ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి సారించింది. జిల్లాలోని స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ పదవికి చివరిసారిగా 2007 ఏప్రిల్‌లో ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ప్రేంసాగర్‌రావు టీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీల మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. లాటరీలో ఆయనకు ఆరేళ్ల పదవీ కాలం వచ్చింది. 2013 మేలో ఈ పదవీకాలం ముగిసింది. అయితే స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో ఏడాది కాలంగా ఈ పదవి ఖాళీగా ఉంటోంది. ఇప్పుడు అన్ని స్థానిక సంస్థలకు పాలకవర్గాలు కొలువుదీరడంతో ఈ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఇదీ టీఆర్ఎస్ ఖాతాలోకే.. జిల్లాలో 877 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లుగా ఉంటారు. ఇందులో 52 మంది జెడ్పీటీసీలు, 636 మంది ఎంపీటీసీలు కాగా, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 189 మంది కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. వరుస ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్కే అత్యధిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీ, కౌన్సిలర్ స్థానాలు దక్కడంతో ఈ ఎమ్మెల్సీ పదవి టీఆర్ఎస్ ఖాతాలోనే పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ పదవి కోసం ఆ పార్టీ నేతలు ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. ఇప్పటికే ఈ పదవి కోసం నలుగురు ముఖ్యనేతల పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ.. ఈ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బరిలో ఉండేది ఎవరో తేలనుంది. కాగా ‘స్థానిక’ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు రూ.లక్షలు ఖర్చు చేశారు. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై స్థానిక ప్రజాప్రతినిధులు ‘ఎన్నో’ ఆశలు పెట్టుకున్నారు. -
పోలింగ్ ఏజెంట్లు .. ఇవి పాటించండి
ఎన్నికల పోలింగ్ ఏజెంట్లుగా విధులు నిర్వర్తించేవారు కొన్ని మార్గదర్శకాలు పాటించాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. ముందుగా ప్రిసైడింగ్ అధికారికి లేఖ అందజేయాలి పోలింగ్‌కు ముందు, పోలింగ్ సమయంలో, ముగిసేదాక బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. బ్యాలెట్ పెట్టెలను సరైన రీతిలో భద్రపరచి సీల్ వేసేందుకు సహకరించాలి. ఎన్నికల రికార్డులను భద్రపరిచేందుకు సహకరించాలి. దొంగ ఓట్లు పడకుండా చూడాలి. ఓటర్ల జాబితా దగ్గర ఉంచుకోవాలి. చనిపోయిన, హాజరుకాని, అనుమానాస్పద పేర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రహస్య ఓటింగ్ నియమాన్ని భంగపర్చకుండా, సంబంధిత సమాచారాన్ని ఇతరులకు అందించకూడదు. వ్యక్తి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోకూడదు. బ్యాలెట్ పెట్టె, బ్యాలెట్ పేపర్‌ను ధ్వంసం చేయడం, తీసుకెళ్లడం, నాశనం చేయడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఏమాత్రం పాల్పడకూడదు. ఒకరి ఓటును ఇంకొకరు వేసే విధంగా ప్రోత్సహించకూడదు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడం, పొగతాగడం నిషేధం. -
16 నాటికి ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించాలి
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: అన్ని జిల్లాల్లో ఈ నెల 16వ తేదీ నాటికి ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లను ఆదేశించారు. ఆయన శనివారం హైదరాబాద్ నుంచి ఓటర్ల దరఖాస్తుల పరిశీలన, ఫొటో ఓటర్ల జాబితా ప్రచురణ, ఈవీఎంల భద్రత తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్షించారు. జిల్లాల్లో ఓటు హక్కు కోసం నూతనంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వీటిలో ఎన్నింటిపై విచారించారు అనే వివరాలను భన్వర్‌లాల్ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి సంబంధిత బూత్‌లెవల్ అధికారులు విచారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని జనవరి 10వ తేదీలోపు ముగించి జాబి తాను జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. దరఖాస్తుల విచారణకు సంబంధించి రాష్ట్ర సగటు 10 శాతం ఉంటే, చిత్తూరు జిల్లాలో 28 శాతం ఉం దన్నారు. జిల్లాలో ఈవీఎంలు, వాటి భద్రతపై దృష్టి సారించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ రాంగోపాల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,63,198 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీటిలో 73,776 దరఖాస్తులను విచారించి పరిష్కరించామన్నారు. మిగిలిన వాటిపై జనవరి 10వ తేదీ లోపు విచారణ జరుపుతామని పేర్కొన్నా రు. ఎన్నికల సామగ్రికి సంబంధించి జిల్లాలోని 5,358 బ్యాలెట్ యూనిట్లు, 4,194 కంట్రోల్ యూనిట్లను పశ్చిమబెంగాల్‌కు పంపినట్లు వివరించారు. ఎన్నికల సామగ్రిని భద్రపరుచుకునేందుకు అవసరమైన గోడౌన్లు నిర్మాణంలో ఉన్నాయని, పనులను త్వరలోనే పూర్తి చేస్తామ ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ బసంత్‌కుమార్, డీఆర్వో శేషయ్య, మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌కుమార్ గుప్తా, తిరుపతి, చిత్తూరు ఆర్డీవోలు రామచంద్రారెడ్డి, పెంచలకిషోర్, జెడ్పీ సీఈవో నాగేశ్వరరావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొన్నారు.