ఎన్నికల పోలింగ్ ఏజెంట్లుగా విధులు నిర్వర్తించేవారు కొన్ని మార్గదర్శకాలు పాటించాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది.
ఎన్నికల పోలింగ్ ఏజెంట్లుగా విధులు నిర్వర్తించేవారు కొన్ని మార్గదర్శకాలు పాటించాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది.
ముందుగా ప్రిసైడింగ్ అధికారికి లేఖ అందజేయాలి
పోలింగ్‌కు ముందు, పోలింగ్ సమయంలో, ముగిసేదాక బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. బ్యాలెట్ పెట్టెలను సరైన రీతిలో భద్రపరచి సీల్ వేసేందుకు సహకరించాలి.
ఎన్నికల రికార్డులను భద్రపరిచేందుకు సహకరించాలి.
దొంగ ఓట్లు పడకుండా చూడాలి.
ఓటర్ల జాబితా దగ్గర ఉంచుకోవాలి. చనిపోయిన, హాజరుకాని, అనుమానాస్పద పేర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
రహస్య ఓటింగ్ నియమాన్ని భంగపర్చకుండా, సంబంధిత సమాచారాన్ని ఇతరులకు అందించకూడదు.
వ్యక్తి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోకూడదు.
బ్యాలెట్ పెట్టె, బ్యాలెట్ పేపర్‌ను ధ్వంసం చేయడం, తీసుకెళ్లడం, నాశనం చేయడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఏమాత్రం పాల్పడకూడదు.
ఒకరి ఓటును ఇంకొకరు వేసే విధంగా ప్రోత్సహించకూడదు.
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడం, పొగతాగడం నిషేధం.