Secret voting
-
ఖర్గే వర్సెస్ థరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ల మధ్య పోటీ నెలకొంది. సోమవారం జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్ ఎలక్టోరల్ కాలేజీలోని 9 వేల మందికి పైగా పీసీసీ ప్రతినిధులు రహస్య ఓటింగ్ ద్వారా ఏఐసీసీ కొత్త చీఫ్‌ను ఎన్నుకోనున్నారు. 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలను చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో అ«ధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి మాత్రమే. ఖర్గే ఎన్నిక లాంఛనమే! కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ఎవరికీ మద్దతివ్వకున్నా గాంధీ కుటుంబం అండదండలతో ఖర్గే బరిలో దిగారు. జీ 23 అసమ్మతి నాయకులతో పాటు ఇతర సీనియర్లూ మద్దతు ప్రకటించడంతో ఆయన గెలుపు లాంఛనంగా కన్పిస్తోంది. అయితే పార్టీలో బ్లాక్ అధ్యక్షుడి నుంచి స్వయంకృషితో ఎదిగిన దళిత నాయకుడైన మల్లికార్జున ఖర్గే (80), అపారమైన మేధస్సుతో ఐక్యరాజ్య సమితిలో పని చేసిన అనుభవంతో కొత్త ఆలోచనలు చేసే నాయర్ కమ్యూనిటీకి చెందిన శశిథరూర్ ( 66) మధ్య రసవత్తర పోటీ సాగుతుందని కొందరు యువ నాయకుల అంచనా. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో అనుభవానికి ప్రాధాన్యతనివ్వాలని సంస్థాగతంగా పార్టీ గురించి ప్రతీ అంశం తెలిసిన వారినే గెలిపించాలని ఖర్గే ప్రచారం చేశారు. పార్టీలో మార్పు కోరుకునే వారు, వికేంద్రీకరణకు మద్దతునిచ్చేవారు తనను బలపరచాలంటూ థరూర్ విజ్ఞప్తి చేశారు. పీసీసీ ప్రతినిధుల్ని కలుసుకున్న సమయంలో ఖర్గేకి అండగా సీనియర్ నాయకులు నిలబడితే, యువ నాయకులందరూ థరూర్‌కి స్వాగతం పలికిన దృశ్యాలు కనిపించాయి. ఇరువురు నేతలూ తాము గాంధీ కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామనే స్పష్టం చేస్తూ వచ్చారు. గాం«ధీ కుటుంబానికి వీర విధేయుడైన ఖర్గే వారిచ్చే సూచనలు, సలహాలు తాను తప్పక పాటిస్తానని చెబితే గాంధీ కుటుంబ సభుల్ని దూరంగా ఉంచి పార్టీ అధ్యక్షులెవరూ పని చేయలేరని పార్టీ రక్తంలో వారి డీఎన్ఏ ఉందని థరూర్ వ్యాఖ్యానించడం విశేషం. అనారోగ్య కారణాలతో సోనియాగాంధీ, అధ్యక్ష పదవిపై ఆసక్తి లేక రాహుల్‌గాంధీ పోటీకి దిగడానికి నిరాకరించడంతో ఈ సారి ఎన్నికలు అనివార్యమయ్యాయి. సోనియా, ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ బళ్లారిలోని ఓటేయనున్నారు. -
కొత్త సెక్రటరీ జనరల్ కోసం ఐరాస రహస్య ఓటింగ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవి కోసం 12 మంది అభ్యర్థులు పోటీపడుతున్న నేపథ్యంలో.. సమితి భద్రతా మండలి బుధవారం తొలి రహస్య ఓటింగ్ నిర్వహించింది. ఈ పోలింగ్‌లో పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరెస్ ఆధిక్యంలో ఉండగా.. స్లొవేనియా మాజీ అధ్యక్షుడు డానిలో టర్క్ రెండో స్థానంలో నిలిచారని సమితి దౌత్యవేత్తలు తెలిపారు. భద్రతామండలి సభ్యులు 15 మంది రహస్యంగా నిర్వహించిన పోలింగ్‌లో ‘ప్రోత్సహించటం, తిరస్కరించటం, మౌనం’ అనే మూడు అంశాల వారీగా అభ్యర్థులకు ఓట్లు వేయగా.. ఆంటోనియోకు 12, డానిలోకు 11 ప్రోత్సాహం ఓట్లు వచ్చాయని దౌత్యవేత్తలు వివరించారు. ఒక అభ్యర్థిని తిరస్కరిస్తూ 11 ఓట్లు వచ్చినట్లు చెప్పారు. మండలి సభ్యులు మళ్లీ వచ్చే వారం సమావేశమై మరో విడత పోలింగ్ నిర్వహించే అవకాశముంది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ పదవీ కాలం ఈ ఏడాది చివరితో ముగియనుంది. -
ఇదీ బాబు మాట...!
ఎమ్మెల్యేలుగా పార్టీ గుర్తుపై గెలిచిన వారికి రహస్య ఓటింగ్ ఎందుకు? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున గెలిచారో ఆ మెజారిటీ మేరకు దామాషా పద్ధతిన ఎమ్మెల్సీలు ఇవ్వాలి. అలా చేస్తేనే బేరసారాలు ఆగిపోతాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా పద్ధతిలో నిర్వహించేలా చూడాలని ఎన్నికల కమిషన్‌ను కోరబోతున్నాం. ఓటుకు నోటు వ్యవహారం బయటపడిన తర్వాత ఈ నెల 4వ తేదీ అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో జరిగిన జన్మభూమి మావూరు కార్యక్రమంలో ప్రసంగిస్తూ చంద్రబాబు అన్న మాటలివి. ప్రతిపక్షం ఏమంది...!! ప్రజా ప్రతినిధుల సంఖ్యను బట్టి దామాషా పద్ధతిలో ఎమ్మెల్సీ స్థానాలను కేటాయిస్తే రాజకీయ బేరసారాలు ఆగిపోతాయన్న మాటకు చంద్రబాబునాయుడు కట్టుబడి ఉండాలి. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బలం ఉన్న చోటే ఆయా పార్టీలు పోటీచేద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పేందుకు చంద్రబాబు ముందుకు రావాలి. టీడీపీకి బలం ఉన్న చోటే పోటీ చేస్తే మంచిది. చంద్రబాబు మాటలపై జూన్ 5వ తేదీన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో అన్న మాటలు. చంద్రబాబు చేసిందేమిటి...!!! తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు అయిదు కోట్ల రూపాయలు ఆశ చూపి అందులో రేవంతర్‌రెడ్డి 50 లక్షలిస్తుండగా అడ్డంగా దొరికిన వ్యవహారం బయటపడిన తర్వాత చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. నైతిక విలువలపై ఉద్బోధిస్తూ చంద్రబాబు చేసిందేమిటని ఒకసారి పరిశీలిస్తే... ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి బలం లేకపోయినా, లేదని స్పష్టంగా తెలిసినా... కర్నూలు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను పోటీకి నిలిపారు. బలం లేకపోయినా పోటీకి నిలపడమంటే ఏమనుకోవాలి? నైతిక విలువలకు కట్టుబడి పోటీకి పెట్టారనుకోవాలా? లేకపోతే... చంద్రబాబు చెప్పేదానికి, చేసే దానికీ పొంతన ఉండదన్న అభిప్రాయం నిజమేనని ఇక్కడ అర్థం కావడం లేదా! -
నన్ను విమర్శించే హక్కు ఎవరికీ లేదు
♦ ‘జన్మభూమి-మాఊరు’ సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ♦ అధికారుల్ని వేదికపైకి పిలిచి హెచ్చరికలు సాక్షిప్రతినిధి, అనంతపురం/తిరుపతి: తనను విమర్శించే నైతికహక్కు ఎవరికీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను నిప్పులా బతికానని, 30 ఏళ్లు ఎవరూ వేలెత్తి చూపని విధంగా బతికిన పరిస్థితి తనదని పేర్కొన్నారు. ‘తెలంగాణలో టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ నేతలు కొనుగోలు చేశారు. వైఎస్సార్ సీపీ కూడా టీఆర్ఎస్కు ఓటేసింది. ఎమ్మెల్యేలుగా పార్టీ గుర్తుపై గెలిచిన వారికి రహస్య ఓటింగ్ ఎందుకు? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఏ పార్టీ తరఫున గెలిచారో ఆ మెజార్టీ మేరకు దామాషా పద్ధతిన ఎమ్మెల్సీలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు, చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఆర్.మల్లవరం గ్రామాల్లో బుధవారం జరిగిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ కుట్రపూరిత, అవినీతి రాజకీయాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ.. టీడీపీని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నాయి. వీటితో టీఆర్ఎస్ కూడా లాలూచీ పడింది. దీనివల్లే మనకు కష్టాలొచ్చాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేసిన వైఎస్సార్సీపీ.. ఆ పార్టీని సమర్థిస్తూ నన్ను విమర్శిస్తోంది. నన్ను విమర్శించే నైతికహక్కు ఎవ్వరికీ లేదు. వైఎస్సార్సీపీ నేతలు దీక్ష పెడుతున్నారు. 22 వేల నుంచి 24 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశాం. డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి రుణంగా 10వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఎన్నికల కోడ్ అడ్డుగా లేకపోతే ఈ రోజే చెక్కులు పంపిణీ చేసేవాళ్లం. ఇలాంటి పనులు యజ్ఞంలా చేస్తుంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు 24 గంటలూ రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు’ అని అన్నారు. యథేచ్ఛగా ఎన్నిల కోడ్ ఉల్లంఘన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మంత్రులు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్‌కు రాష్ట్రప్రభుత్వం తూట్లు పొడిచింది. సాక్షాత్తూ సీఎం చంద్రబాబే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. ఆయనతోపాటు మంత్రివర్గ సహచరులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ అధికారికంగా జన్మభూమి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మరోవైపు ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి లేకుండా అధికారులను బదిలీ చేయరాదన్న నిబంధనకూ ప్రభుత్వం పాతరేసింది. స్థానిక సంస్థల కోటా కింద 12 శాసనమండలి స్థానాలకు ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించడం తెలిసిందే. కానీ సీఎంతోపాటు మంత్రులందరూ బుధవారం అధికారికంగా జన్మభూమి నిర్వహించారు. మరోవైపు ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక ఈసీ ముందస్తు అనుమతి లేకుండా అధికారుల్ని కదల్చరాదన్న నిబంధనకూ రాష్ట్రప్రభుత్వం పాతరేసి కొంత మంది అధికారులను బదిలీ చేసింది. -
రహస్య బ్యాలెట్
సీఎం ఎన్నికకు బీజేపీ ప్రతిపాదన న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు విషయమై బీజేపీ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. రహస్య బ్యాలెట్ విధానం ద్వారా ముఖ్యమంత్రిని ఎన్నుకునేలా చర్యలు తీసుకోవాలని ఎల్జీని కోరాలని భావిస్తోంది. జాతీయ ప్రాదేశిక ప్రాంత చట్టం, 1991లో అందుకు అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. చట్టంలోని సెక్షన్ 9(2) ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో రహస్య ఓటింగ్ నిర్వహించాలి. అందులో ఎక్కువమంది అభ్యర్థులు బలపర్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చు. ఇప్పటిదాకా బిల్లును ఆమోదించే విషయంలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కూడా ఈవిధానాన్ని అనుసరించవచ్చు. ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత సభలో అత్యధిక మెజార్టీ ఉన్న పార్టీ అధికారపక్షం, ఆ తర్వాత ఎక్కువ మంది సభ్యులున్న పార్టీ ప్రతిపక్షం అవుతుంది. అయితే ఈ చట్టం ప్రకారం పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం ఉండదు. అంతేకాక ఏ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఎవరిని బలపర్చారో కూడా తెలిసే అవకాశం లేదు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ డిమాండ్ చేస్తున్నారు. అలాకాకుండా అసెంబ్లీలో మెజార్టీ సభ్యులున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినా తమకేమీ అభ్యంతరం లేదని సతీశ్ స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ ఎన్నికలకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉందని, ఈ మూడు ప్రతిపాదనల్లో తాము దేనినైనా అంగీకరిస్తామని ఉపాధ్యాయ్ తెలిపారు. కాగా బీజేపీ చేసిన ఈ డిమాండ్‌పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రహస్య ఓటింగ్ నిర్వహించడమంటే బేరసారాలకు బహిరంగంగా తలుపులు తెరిచినట్లేనని పేర్కొంటున్నారు. -
పోలింగ్ ఏజెంట్లు .. ఇవి పాటించండి
ఎన్నికల పోలింగ్ ఏజెంట్లుగా విధులు నిర్వర్తించేవారు కొన్ని మార్గదర్శకాలు పాటించాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. ముందుగా ప్రిసైడింగ్ అధికారికి లేఖ అందజేయాలి పోలింగ్‌కు ముందు, పోలింగ్ సమయంలో, ముగిసేదాక బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. బ్యాలెట్ పెట్టెలను సరైన రీతిలో భద్రపరచి సీల్ వేసేందుకు సహకరించాలి. ఎన్నికల రికార్డులను భద్రపరిచేందుకు సహకరించాలి. దొంగ ఓట్లు పడకుండా చూడాలి. ఓటర్ల జాబితా దగ్గర ఉంచుకోవాలి. చనిపోయిన, హాజరుకాని, అనుమానాస్పద పేర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రహస్య ఓటింగ్ నియమాన్ని భంగపర్చకుండా, సంబంధిత సమాచారాన్ని ఇతరులకు అందించకూడదు. వ్యక్తి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోకూడదు. బ్యాలెట్ పెట్టె, బ్యాలెట్ పేపర్‌ను ధ్వంసం చేయడం, తీసుకెళ్లడం, నాశనం చేయడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఏమాత్రం పాల్పడకూడదు. ఒకరి ఓటును ఇంకొకరు వేసే విధంగా ప్రోత్సహించకూడదు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడం, పొగతాగడం నిషేధం.