ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
నల్లగొండ-వరంగల్-ఖమ్మం
జిల్లాల పట్టభద్రుల పోలింగ్
ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం
అమలులోకి వచ్చిన ‘కోడ్’
ఇంకా ఓటరు నమోదుకు అవకాశం తుది ఓటర్ల జాబితా ప్రకారం మూడు జిల్లాల పరిధిలో 1,33,506 మంది ఓటర్లు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 46,291, వరంగల్ జిల్లాలో 44,512, ఖమ్మం జిల్లాలో 42,703 ఓటర్లు ఉన్నారు.
మూడోసారి పోరు
శాసన మండలిని పునరుద్ధరించిన తర్వాత వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగిన రెండుసార్లు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిన కపిలవాయి దిలీప్‌కుమార్ గెలుపొందారు. ఈయన పదవీకాలం 2015 మార్చిలో ముగుస్తోంది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇ వే కావడంతో రాష్ట్రం, కేంద్రం అధికారంలో ఉన్న టీ ఆర్‌ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా యి. ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎన్నికలైనా రాజకీయరంగును పులుముకోనున్నారుు. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఓటర్ల నమోదును ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావును ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి మద్దతుగా నిలుస్తోంది.
ఆశావహులు
టీఆర్‌ఎస్ పార్లీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బండ నరేందర్‌రె డ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు ముందు వరుసలో ఉన్నారు. ఇంకా టీఆర్‌ఎస్‌కు అ నుబంధంగా ఉండే తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, సాధారణ ఎ న్నికల్లో నల్లగొండ ఎంపీగా పోటీ చేసిన రాజేశ్వరరె డ్డి, తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం అధ్యక్షుడు ఎస్.సుందర్‌రాజు, రిటైర్డ్ లెక్చరర్ పులి సారంగపాణి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరిలో బండ నరేందర్‌రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు అధికంగా ఉన్నారుు. కాంగ్రెస్ పార్టీ నుంచి బండా ప్రకాశ్ పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ రంగల్ జిల్లాతో పోల్చితే ఖమ్మం, నల్గొండ జిల్లాలో వామపక్ష పార్టీలకు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఈ పార్టీల తరఫున పోటీ చేసే అవకా శం ఖమ్మం, నల్లగొండ నేతలకే దక్కే అవకాశం ఉం ది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఎం పీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోషించే పాత్ర కీలకం కానుంది.
ఓటర్ల నమోదుకు అవకాశం
జిల్లాలో ఇప్పటివరకు ఓటర్లుగా అర్హత ఉండి నమోదు చేసుకోని పట్టభద్రుల కోసం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 01-11-2014 నాటికి దేశంలోని ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభ్రులై ఉన్నా, అందుకు సమానమైన విద్యార్హతలు ఉన్నా, ఫారం18 ద్వారా సంబంధిత రుజువులు జత చే స్తూ ఓటుకోసం దరఖాస్తు సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ద్వారా ఓటు నమోదుకోసం దరఖాస్తు చేసుకునేవారు ఠీఠీఠీ.ఛిౌ్ఛ్ట్ఛ్చజ్చ్చ.జీఛి.జీ వెబ్ సైట్‌లోకి లాగిన్ అయి పారం పూర్తిచేయవచ్చు. ఇందులో ఓటు నమోదు కోసం ఫారం-18, తొలగింపుల కోసం ఫారం-7, సవరణ కోసం ఫారం-8, ఒక నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం నుంచి ఇంకో నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి మారడానికి ఫారం-8(ఏ) పూర్తి చేయాలి.
‘కోడ్ ’ కూసింది..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. నియమావళి మార్చి 23 వరకు అమలులో ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ నల్గొండ ప్రధాన కేంద్రంలో చేపడతారు. వరంగల్, ఖమ్మం డీఆర్వోలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు.
మోగిన నగారా
Published Thu, Feb 12 2015 2:07 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement