Voter registration
-
ఈ నెల 28 వరకు ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2025లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, ముసాయిదా ఓటర్ల జాబి తాపై అభ్యంతరాలు, ఇతర మార్పులు, చేర్పుల ప్రక్రియ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. వీటికి సంబంధించి ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్ల డించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారంతా ఓటరు నమోదు కోసం దర ఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దర ఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 6న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తా మని వెల్లడించారు. శనివారం సి.సుదర్శన్‌రెడ్డి బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండబోయే వారు కూడా ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చని.. వారికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఓటు హక్కు కల్పిస్తామని సీఈఓ తెలి పారు. ఓటర్ల సౌకర్యం కోసం వచ్చే శని, ఆది వారాల్లో (9, 10 తేదీల్లో) ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని చెప్పారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ (eci.gov.in), ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా సైతం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.8 లక్షలకుపైగా కొత్త ఓటర్లుఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా గత నెల 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 3,34,26,323 మంది ఓటర్లుండగా.. అందులో 1,66,16,446 మంది పురుషులు, 1,68,07,100 మంది మహిళలు, 2,777 మంది మూడో జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. 15,948 మంది సర్వీస్ ఓటర్లు, 3,578 మంది ప్రవాసీ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి అక్టోబర్ 20 మధ్యలో 8,02,805 మంది కొత్త ఓటర్లు నమోదుకాగా.. 4,14,165 మంది అనర్హులైన ఓటర్లను తొలగించామని, మరో 5,93,956 మంది ఓటర్ల వివరాలను సరిదిద్దామని వెల్లడించారు. రాష్ట్రంలో 18–19 ఏళ్ల యువ ఓటర్ల సంఖ్య 8.51 లక్షల నుంచి 10.03 లక్షలకు పెరిగిందని తెలిపారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 2,25,462 మంది, వికలాంగ ఓటర్లు 5,28,085 మంది ఉన్నారని వివరించారు. -
‘సమన్వయం’తో ముందుకు!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేలా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీలోగా ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ నెలాఖరులోగా అభ్యరి్థని ఖరారు చేయాలని భావిస్తోంది. ఎన్నికల వ్యూహాల అమలు కోసం ప్రత్యేకంగా వార్ రూమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలతో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. పథకాలు, కార్యక్రమాలపై విస్తృత ప్రచారంఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని రేవంత్ సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి విచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందని, ప్రధానంగా డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, టీచర్లకు ప్రమోషన్లు, టీచర్ల బదిలీ చేపట్టడంతో పాటు ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ అంశాలను పట్టభద్రులైన యువత దృష్టికి ప్రధానంగా తీసుకెళ్లాలని సూచించారు. రుణమాఫీతో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీల ఏర్పాటు లాంటి విప్లవాత్మక కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. తక్షణమే ఓటర్ల నమోదుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను పార్టీ పక్షాన వెంటనే ప్రారంభించాలని, ఈ ప్రక్రియలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలను భాగస్వాములను చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ద్వారా రాష్ట్రంలోని యువత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉందనే విషయాన్ని మరోమారు తెలియజేయాలని, ఈ మేరకు ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీలోని అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని కోరారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్‌లు కూడా జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఒకప్పుడు పెద్ద తతంగమే ఉండేది. సమీపంలోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత దాని పరిస్థితేమిటో తెలిసేది కాదు. ఓటర్ల జాబితా విడుదలైనప్పుడు అందులో పేరుంటే ఓటు హక్కు వచ్చినట్టు తెలిసేది! ఇదంతా గతం. ఇప్పుడు ఎన్నికల సంఘం టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. సేవలు, విధులను దాదాపుగా డిజిటలీకరించింది. తద్వారా పాదర్శకతను పెంచే దిశగా కృషి చేస్తోంది. ఓటరుగా నమోదు మొదలుకుని తప్పొప్పులు, చిరునామా సవరణలు, ఓటు బదిలీ దాకా ఇప్పుడన్నీ కూర్చున్న చోటినుంచి ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. అంతేనా?! ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది, అక్కడికెలా వెళ్లాలి, అభ్యర్థులు, వారి ఆస్తులు, కేసుల వివరాల వంటివన్నీ స్మార్ట్ ఫోన్ నుంచే తెలుసుకోవచ్చు. ఎన్నికల్లో అవకతవకలపై ఫిర్యాదులు కూడా ఆన్లైన్లోనే చేసేయవచ్చు. ఇలా గడిచిన దశాబ్ద కాలంలో ఎన్నికల సంఘం తీసుకొచి్చన డిజిటల్ మార్పులు అన్నీ ఇన్నీ కావు. వాటిని ఓసారి తెలుసుకుందాం...ఎల్రక్టానిక్ పోస్టల్ బ్యాలెట్ (2016)ఎన్నికల విధుల్లో ఉండే సరీ్వస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్లను ఎల్రక్టానిక్ రూపంలో పంపించేందుకు ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది. ఎల్రక్టానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్‌గా పిలుస్తారు.ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ (2019)తమ నియోజకవర్గంలో పోలింగ్ ఎప్పుడో ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు. ఓటరు జాబితాలో తమ పేరునూ పరిశీంచుకోవచ్చు. అభ్యర్థుల సమాచారం కూడా తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ ఎంత ఉందన్నది ఎప్పడికప్పుడు తెలుసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు కూడా అందుబాటులో ఉంటాయి.ఎరోనెట్ (2018) ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్స్ నెట్వర్క్ సంక్షిప్త రూపమే ఎరోనెట్. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉమ్మడి సదుపాయాలు వినియోగించుకునేందుకు వీలుగా డిజిటల్ నెట్‌వర్క్‌ను ఈసీ రూపొందించింది. ఎన్వీఎస్పీ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా పౌరులు నమోదు చేసే డేటాకు ఇది బ్యాకప్‌గా పని చేస్తుంటుంది.సి–విజిల్ యాప్ (2018)ఎన్నికల నియమావళిని అభ్యర్థులు ఉల్లంఘించినా, అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చు చేస్తున్నా; ఓటర్లను ధన, వస్తు రూపంలో ప్రలోభాలకు గురి చేస్తున్నా ఎవరైనా సరే ఈ యాప్ ద్వారా నేరుగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఫొటో, వీడియో రుజువులను లొకేషన్ జియోట్యాగ్ చేసి అప్లోడ్ చేయవచ్చు.సక్షమ్ ఈసీఐ యాప్ (2023)గతంలో దీన్ని పర్సన్స్ విత్ డిజెబుల్డ్ యాప్ (పీడబ్ల్యూడీ)గా పిలిచేవారు. దివ్యాంగులు ఇందులో అభ్యర్థుల సమాచారం, పోలింగ్ కేంద్రాలకు ఎలా వెళ్లాలి? ఫిర్యాదుల నమోదు, బూత్ వరకు వెళ్లేందుకు సాయం కోరడం తదితర సేవలను పొందవచ్చు. అబ్జర్వర్ యాప్ (2019)ఎన్నికల పరిశీలకులు (సాధారణ, పోలీసు, వ్యయ) ఈ యాప్ ద్వారా తమ నివేదికలను ఫైల్ చేయవచ్చు. సి–విజిల్ యాప్ ద్వారా వచి్చన ఫిర్యాదులు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడ ఉందన్నది ఈ యాప్ ద్వారా ఎన్నికల అధికారులు చూడవచ్చు. అవసరమైతే స్క్వాడ్‌ను పిలవడం తదితర టాస్క్‌లను నిర్వహించుకోవచ్చు.గరుడ యాప్ (2020)బూత్ స్థాయి అధికారుల కోసం తెచి్చన యాప్. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్, క్షేత్రస్థాయి తనిఖీలు, డాక్యుమెంట్లు, ఫొటోల అప్‌లోడింగ్‌కు వీలు కల్పిస్తుంది.నో యువర్ క్యాండిడేట్ (2022)అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు ఈ యాప్ ద్వారా ఓటర్లు తెలుసుకోవచ్చు. అభ్యర్థులు అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు, వారిపై క్రిమినల్ కేసులు తదితర పూర్తి సమాచారం లభిస్తుంది.ఓటర్ టర్నౌట్ యాప్ (2019)పోలింగ్ నాడు దేశవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎలా ఉందో ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది.క్యాండిడేట్ నామినేషన్ యాప్ (2020)అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ యాప్ ద్వారా డిజిటల్‌గానే దాఖలు చేయవచ్చు. అఫిడవిట్ డిజిటల్ కాపీని అప్లోడ్ చేసి, సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఆన్లైన్లోనే చెల్లించవచ్చు.ఈ–ఎపిక్/డిజిటల్ ఓటర్ ఐడీ కార్డులు (2021) ఎలక్షన్ ఫొటో ఐడీ కార్డ్ (ఎపిక్) ఎంతో ముఖ్యమైనది. భౌతిక కార్డు లేని వారు ఈ–ఎపిక్‌ను ఈసీ పోర్టల్ నుంచి మొబైల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ప్రింట్ చూపించి కూడా ఓటు వేయవచ్చు.నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (ఎన్వీఎస్పీ) (2015) ఈ పోర్టల్ (వెబ్సైట్) ద్వారా కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, నియోజకవర్గాలు, వాటి పరిధిలో పోలింగ్ కేంద్రాల సమచారం తెలుసుకోవచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో), ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ల వివరాలు కూడా ఇక్కడే లభిస్తాయి. ఎన్వీఎస్పీ ఆధునీకరణ (2019) ఓటర్లకు కావాల్సిన సేవలన్నింటికీ ఏకీకృత పోర్టల్‌గా www.nvsp.in పేరుతో ఈసీ దీన్ని అభివృద్ధి చేసింది. తర్వాత ఠి్టౌ్ఛటట.్ఛఛిజీ.జౌఠి.జీnకు అనుసంధానం చేసింది. ఐటీ నెట్వర్క్ (2019) దేశవ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో తాజా సమాచారం, ఓట్ల లెక్కింపు తాలూకు తాజా ఫలితాలు తెలుసుకునేందుకు ఎన్నికల సిబ్బంది కోసం తీసుకొచి్చన నెట్వర్క్. 2019 ఎన్నికల కౌంటింగ్‌కు ముందు దీన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, రిటరి్నంగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఐటీ సదుపాయం ద్వారా తాజా సమాచారం తెలుసుకుని డిజిటల్ తెరలపై ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడింది. ఆధార్‌తో అనుసంధానం (2022) ఓటర్ జాబితాలో కచ్చితత్వానికి వీలుగా ఓటర్ల ఎపిక్‌లతో ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని ఈసీ చేపట్టింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటు నమోదుకు మూడు రోజులే గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటు నమోదుకు ఇక మూడు రోజుల సమయమే ఉంది. 18 సంవత్సరాల వయసు నిండి.. ఓటర్ జాబితాలో పేరులేని వారంతా ఈ నెల 15లోగా ఆన్లైన్ ద్వారా గానీ లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో గానీ ఫాం–6ను సమర్పించడం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓటర్ జాబితాలో పేరుందో, లేదో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ.. జాబితాలో పేరు లేకపోతే పోలింగ్ రోజు ఓటు వేయలేరు. పేరు లేకపోతే ఈ నెల 15లోగా ఫాం–6 సమర్పిస్తే తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తాం. సాధారణంగా అయితే నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశముంటుంది. 15వ తేదీ తర్వాత నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు జారీ చేయడానికి 10 రోజుల సమయం పడుతుంది. అందువల్ల చివరి వరకు ఆగకుండా ఏప్రిల్ 15లోగా నమోదు చేసుకోవడం మంచిది’ అని సూచించారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు రాకుండా.. అధికారులు అన్ని ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అని సరి చూసిన తర్వాతే ఓటర్‌గా నమోదు చేస్తున్నారు. ఆన్లైన్లో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నా.. ఫిజికల్‌గా ఆధార్ కాపీ, వయసు నిర్దారణ ధ్రువపత్రంతో పాటు ఇంత వరకు ఎక్కడా ఓటు హక్కు లేదన్న ధ్రువీకరణ పత్రాలను తీసుకొని ఓటర్‌గా నమోదు చేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేసి వదిలేయకుండా.. అన్ని కాపీలను తీసుకువచ్చి ఇవ్వాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్‌గా నమోదు కావడమే కాకుండా మే 13న జరిగే పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని మీనా సూచించారు. -
Voter Registration: మిగిలింది 3 రోజులే.. ఇదే లాస్ట్ ఛాన్స్!
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు ఓటు లేని అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఓటరు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 15 చివరి గడువుగా నిర్ణయించింది. అర్హులు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు మరో మూడు రోజులే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి, కొత్తగా ఓటును పొందడానికి ఇదే చివరి అవకాశం. అప్లయ్ చేసుకోండిలా.. ఈ నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నిండిన యువతీయువకులు(2006 మార్చి 31వ తేదీలోపు జన్మించిన వారు) ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఇందుకు ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరించేలా ఎస్సెస్సీ మార్కుల మెమో జత చేయాలని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులను నేరుగా ఆయా బీఎల్వోలు (బూత్ లెవల్ అధికారులు) లేదా సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని సూచిస్తున్నారు. ఓటర్స్ హెల్ప్‌లైన్, ఎన్‌వీఎస్‌వీ పోర్టల్‌లో ఆన్లైన్ ద్వారా కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అయితే ప్రజలు దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా నిర్ణీత ప్రూఫ్‌లు తప్పక జతచేయాల్సి ఉంటుంది నిర్ణీత గడువులోపు అందిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం ఉంటే వారిని ఓటర్లుగా గుర్తిస్తారు. ఈ నెల 25వ తేదీన ప్రకటించే ఓటరు అనుబంధ జాబితాలో వారి పేర్లు చేర్చుతారు. ఈ జాబితాలో పేర్లు కలిగిన కొత్త ఓటర్లతో పాటు సాధారణ ఓటర్లు మే 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. చదవండి: ఓటులో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? ఇప్పటికే ఓటరు జాబితాలో పేరుండి నివాసం వారి ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి మార్చుకోవడానికి, కుటుంబ సభ్యులందరివీ ఒకే పోలింగ్ కేంద్రంలో లేకపోతే మార్చు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి వారందరూ ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
బీజేపీలో ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ జోష్
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. గతేడాది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఏవీఎన్‌రెడ్డి బీజేపీ బీ–ఫామ్‌పై గెలిచి మండలిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. త్వరలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగే ఎన్నికల్లోనూ ఈ ఫలితమే పునరావృతం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పట్టభద్రుల స్థానం నుంచి గెలుపునకు ఓటర్ల నమోదు కీలకం కావడంతో దానిపై దృష్టి పెట్టింది. ఇందుకోసం పాతవారితోపాటు పెద్దఎత్తున కొత్తగా డిగ్రీలు, పీజీలు పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. ఓటర్ల నమోదుకు సంబంధించి పెద్దమొత్తంలో ఫామ్–18 దరఖాస్తులను ము ద్రించి పోలింగ్ బూత్ స్థాయి వరకు పంపాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ స్థానానికి గత ఎన్నికల్లో పార్టీ పరంగా జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ఓట్లు దక్కని ఈ మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడం ద్వారా సత్తా చాటాలని నాయకత్వం యో చిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే... ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో పార్టీ కి సానుకూలత పెరుగుతుందని అంచనావేస్తోంది. పార్టీ లో తీవ్ర పోటీ ఈ సీటు కోసం బీజేపీ నేతల మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంది. ఈ టికెట్‌ను తనకు కేటాయించాలని డా.ఎస్.ప్రకా‹Ùరెడ్డి ఇప్పటికే నాయకత్వాన్ని కోరగా, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్ కూడా ఈ సీటును కోరుకుంటున్నారు. గతంలో పోటీచేసి ఓడిన ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారు. వీరితోపాటు వివిధ విద్యాసంస్థల అధినేతలు, విద్యావేత్తలు కూడా బీజేపీ టికెట్‌ను కోరుకుంటున్న వారిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ స్థానం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి జూన్ 8 లోగా ఎన్నిక నిర్వహించాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రెష్‌గా ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానం నుంచి పోటీకి ఉత్సాహం చూపుతున్న ఇతర పార్టీ ల నాయకులు సైతం ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేవారు సైతం ఈ విషయంలో తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ పట్టభద్రుల సీటుకు ఓటర్ల నమోదుకు మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును ఇన్చార్జిగా నియమించారు. -
బ్రో.. ఇది దొంగ ఓటు!
రెండు లక్షల పుస్తకాలు చదివానన్న స్వయం ప్రకటిత మేధావి ఆయన.. విలువల గురించి, అనుబంధాల గురించి ఊగిపోతూ ప్రసంగించడం ఆయనకు అలవాటు.. అందరూ తనలాగే ఆలోచించాలని, తన మార్గంలోనే నడవాలని ప్రవచన పలుకులు పలకడం కూడా ఆయనకే సొంతం. ‘చంద్రబాబు చేత.. చంద్రబాబు కొరకు.. చంద్రబాబు యొక్క..’ అంటూ అందరూ ఆ బాబు బాగు కోసమే పరితపించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన నేత. ఎన్నెన్నో నీతులు చెప్పే ఈ నేత నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయం చిరునామాతో ఓటు పొందడం ఇప్పుడు చర్చనీయాంశం. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేమరి. సాక్షి, అమరావతి : ఓటు దొంగలే.. దొంగా దొంగా అని అరుస్తున్నారు. మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు ‘రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి’ అని స్వయంగా ఫిర్యాదు చేసిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. రాష్ట్రంలో నమోదు చేసుకున్న ఓటుపై ‘అదీ దొంగ ఓటే’ అన్న చర్చ ఉంది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్నే తన నివాసంగా పేర్కొంటూ ఆయన ఓటు పొందారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయన ఓటు ఏజీజడ్ 3083045 గుర్తింపు కార్డు నంబరుతో గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 197వ నంబరు పోలింగ్ బూత్ పరిధిలో ఉంది. ఓటర్ లిస్టులో ఆ ఓటు ఇంటి నంబరు 11–1903గా పేర్కొన్నారు. అయితే మంగళగిరి పట్టణ పరిధిలో ఆ ఇంటి అడ్రసు గురించి ఆరా తీస్తే అది జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం అడ్రసేనని స్పష్టమైంది. కొత్తగా ఒక ఇంటి చిరునామాతో ఓటు నమోదు చేసుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని, ఈ లెక్కన ఒక పార్టీ కార్యాలయం అడ్రసుతో ఓటు నమోదు దొంగ ఓటు కిందకే వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల అవగాహన కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా రూపొందించి, జారీ చేసిన వివిధ రకాల నిబంధనావళిలో ఒకటైన.. ‘మ్యానువల్ ఆన్ ఎలక్ట్రోల్ రోల్స్’ ప్రకారం కొత్తగా వేరొక అడ్రసుతో ఓటరు నమోదుకు ఇంటి అడ్రసును ‘ఆర్డనరీ రెసిడెన్స్’ పేరుతో ప్రత్యేకంగా విశదీకరించారు. ఈ అంశంపై గౌహతి హైకోర్టు వెలువరించిన ఒక తీర్పు ప్రకారం ఇంట్రి అడ్రసు అంటే.. శాశ్వతంగా నివాసం ఉండేది అని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొంది. టెంపరరీ లేదా క్యాజువల్ నివాసంగా అది ఉండకూడదని ఆ నిబంధనలో స్పష్టంగా ఉంది. ‘రెగ్యులర్‌గా రాత్రివేళ నిద్రించే ప్రాంతాన్నే’ ఆ వ్యక్తి ఆర్డనరీ రెసిడెన్స్‌గా గుర్తించాలని స్పష్టం చేసింది. కానీ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అప్పడప్పుడు హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రైవేట్ హోటల్లో బస చేస్తుంటారు. పార్టీ విధుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి వెళ్తుంటారు. అలాంటప్పుడు పార్టీ కార్యాలయం ఆయన శాశ్వత నివాసం ఎలా అవుతుందన్న విమర్శలున్నాయి. ఈ లెక్కన మంగళగిరి పార్టీ కార్యాలయం అడ్రసుతో ఆయన ఆరు నెలల ముందు నమోదు చేసుకున్న ఓటు.. దొంగ ఓటు కిందకే వస్తుందని అధికారుల స్థాయిలో చర్చ సాగుతోంది. ఆ చిరునామాలో పవన్ ఓటు మాత్రమే.. 2019 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. తన ఎన్నికల అíఫిడవిట్లో తన కుటుంబ సభ్యుల వివరాలలో భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం అడ్రసు 11–1903తో ఇప్పుడు పవన్ తన ఒక్కరి ఓటు మాత్రమే నమోదు చేసుకోవడం విశేషం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2019 ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 91వ పోలింగ్ బూత్‌లో పవన్ తన ఓటు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల కిత్రం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయ అడ్రసుకు ఓటును మార్చుకున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తమ్ముడి బాటలోనే అన్న నాగబాబు రాష్ట్రంలో పవన్‌కళ్యాణ్ నమోదు చేసుకున్న ఓటు దొంగ ఓటు.. అని చర్చ సాగుతున్న తరుణంలో.. అతని సోదరుడు నాగబాబు కూడా దొడ్డి దారిన రాష్టంలో దొంగ ఓట్ల నమోదుకు పూనుకున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే నాగబాబు మొన్నటి తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు అంటే 2023 డిసెంబరు 4 తేదీన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి పట్టణ పరిధిలో వడ్డేశ్వరం – రాధా రంగ నగర్‌లోని 5–263 ఇంటి అడ్రసు పేరుతో అన్లైన్లో ఓటుకు దరఖాస్తు చేశారు. నాగబాబు, ఆయన భార్య, కూతురు నిహారిక, కుమారుడు వరుణ్‌తేజ్ (సినీ నటుడు), కోడలు లావణ్య త్రిపాఠి (సినీ నటి) కలిపి మొత్తం ఆరుగురు ఆ ఇంటి అడ్రసులో నివాసం ఉంటున్నట్లు పేర్కొంటూ ఓట్లు నమోదు ఫారాన్ని అన్లైన్లో నమోదు చేశారు. అయితే ప్రాథమిక స్థాయిలో బూత్ లెవల్ అధికారి (బీఎల్వో) పరిశీలనలో నాగబాబు గానీ, వారి కుటుంబం గానీ ఆ అడ్రసులో నివాసం ఉండడం లేదని తేలింది. ఈ ఇల్లు జనసేన పార్టీ అభిమానిదని స్థానికులు పేర్కొన్నారు. ఆ తర్వాత కూడ మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా నాగబాబు, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లి తహాసీల్దార్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆ ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లారు. అయితే నాగబాబు, ఆయన కుటుంబ సభ్యులందరి తరుఫున సంబంధిత అడ్రసులో పేర్కొన్న ఇంటి యజమానే అధికారుల ముందు హాజరైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడ నివాసం.. అక్కడ వ్యాపారమట! అధికారుల విచారణ సమయంలో నాగబాబు తాను తాడేపల్లిలో నివాసం ఉంటున్నానని, అయితే ప్రస్తుతం వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నందున స్వయంగా విచారణకు రాలేకపోయినట్టు తాను సంతకం చేసిన ఒక పేపరు ఆ ఇంటి యజమాని ద్వారా పంపారు. మరో ఇద్దరు ఇలాగే పేపర్‌పై రాసి.. దానిని ఫొటో తీసి ఆ ఇంటి యజమాని ద్వారా పంపారు. మిగిలిన మరో ముగ్గురి నుంచి ఎలాంటి అఫిడవిట్ లేదని తెలిసింది. మొత్తంగా ఆ అడ్రసులో పేర్కొన్న ఇంటి యజమానే నాగబాబు కుటుంబ సభ్యులు ఆరుగురి తరుఫున విచారణకు హాజరయ్యారు. ఆ ఇంటి అడ్రసులో నాగబాబు కుటుంబం నివాసం ఉంటడం లేదని అధికారులు నిర్ధారించుకుని, ఆ ఆరుగురి ఓట్లను తిరస్కరించారు. సినీ నటుడిగా, పార్టీ అధ్యక్షుడి హోదా లేదా కీలక బాధ్యతల్లో ఉన్న పవన్‌కళ్యాణ్, నాగబాబు లాంటి వారే తమ సొంత ఓట్ల నమోదు ప్రక్రియలో ఇలా అడ్డదారులు తొక్కడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
ఓటర్ల నమోదుకు రేపే చివరి అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో మీ పేరు లేదా? జాబితాలో పేరు ఉన్నా మరో ప్రాంతానికి నివాసం మార్చారా? మీ పేరు, ఇతర వివరాలు తప్పుగా అచ్చు అయ్యాయా?.. ఇలాంటి కారణాలతో నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఓటేయలేమని బాధపడుతున్నారా? అయితే మీలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పిస్తోంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6, ఇతర ప్రాంతానికి ఓటు బదిలీ, పేరు, ఫొటో, ఇతర వివరాల దిద్దుబాటు కోసం ఫారం–8 దరఖాస్తులను అక్టోబర్ 31లోగా సమర్పిస్తే వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికల్లో మీకు ఓటు హక్కు లభించనుంది. నివాసం ప్రస్తుతం ఉండే నియోజకవర్గంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా, లేదా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారినా ఫారం–8 దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఓటరు జాబితా/ ఓటరు గుర్తింపు కార్డులో ఫొటో సరిగ్గా లేకపోయినా, పేరు, ఇతర వివరాలు తప్పుగా వచ్చినా ఫారం–8 దరఖాస్తు ద్వారానే సరిదిద్దుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారితో ప్రత్యేకంగా అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రచురించనుంది. తుది ఓటర్ల జాబితాతో పాటు అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందు నాటికి వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. నవంబర్ 3న రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా, 10తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. దానికి 10 రోజుల ముందు అనగా, అక్టోబర్ 31 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు. దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, వివరాల దిద్దుబాటు.. తదితర సేవల కోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https://voters.eci.gov.in లో అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్(వీహెచ్ఏ)ను మొబైల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని కూడా ఈ సేవలను పొందవచ్చు. లేకుంటే స్థానిక బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ), ఓటరు నమోదు అధికారి (ఈఆర్వో)ను కలసి సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి అందజేయాల్సి ఉంటుంది. ఓటరు నమోదు కోసం కొత్తగా దిగిన ఫొటోతో పాటు చిరునామా, వయసు ధ్రువీకరణ కోసం పదో తరగతి మార్కుల పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు డిమాండ్ నోటీసు, గ్యాస్/బ్యాంక్ పాసుపుస్తకాలు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి? ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా ? అనేది తెలుసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా https://electoralsearch.eci. gov.in అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. ఓటరు వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్), మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులువు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేయడానికి వీలుండేది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయసు ఇతర వివరాలను కీ వర్డ్స్‌గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు. అయితే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో పేరును సులువుగా సెర్చ్ చేయవచ్చు. కొత్త ఎపిక్ కార్డు నంబర్ ఎలా తెలుసుకోవాలి? గతంలో కేంద్ర ఎన్నికల సంఘం 13/14 అంకెల సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేయగా, గత కొంత కాలంగా 10 అంకెల సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. పాత ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఆధారంగా మీ కొత్త ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ https://ceotserms2.telangana.gov.in/ ts search/ Non Standard Epic.aspx ను సందర్శించి మీ పాత కార్డు నంబర్ ఆధారంగా కొత్త ఎపిక్ కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు. -
ఓటర్ల నమోదుకు కొత్త వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఓటర్ల నమోదు, వివరాల మార్పు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం వినియోగిస్తున్న నేషనల్ ఓటర్ పోర్టల్ సర్వీస్(ఎన్వీపీఎస్) వెబ్‌సైట్‌కి బదులు ‘ఓటర్స్’పేరుతో కొత్త వెబ్సైట్ ( https:// www.voters.eci.gov.in )ను అందుబాటులోకి తెచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, జాబితా నుంచి పేరు తొలగింపు, చిరునామా మార్పు వంటి అవసరాలకు 6, 6ఏ, 7, 8 వంటి ఫారాలను వినియోగిస్తూ ఇకపై కొత్త వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, పాత వెబ్సైట్ ఇక పనిచేయదని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత విశిష్ట రిఫరెన్స్ నంబర్‌ను ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా దరఖాస్తుదారులకు పంపిస్తామన్నారు. ఈ నంబర్ ద్వారా దరఖాస్తు స్థితిగతులను తెలుసుకోవచ్చు అన్నారు. కొత్త పోర్టల్ ద్వారా ఓటర్ల జాబితాను పరిశీలించవచ్చని, ఓటరుగుర్తింపు కార్డుకోసం, ఓటరు కార్డులో మార్పులకోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు ఏ పోలింగ్ బూత్, శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాడు అన్న వివరాలు సైతం తెలుసుకోవచ్చు అని వెల్లడించారు. పోలింగ్ బూత్ స్థాయి అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)ల వివరాలను సైతం తెలుసుకోవచ్చని తెలిపారు. -
ఓటరు నమోదుకు ఏడాదిలో 4 కటాఫ్ తేదీలు
న్యూఢిల్లీ: కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదిలో నాలుగు కటాఫ్ తేదీలను అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల చట్టంలో సవరణలు చేయనుంది. దీనివల్ల దేశంలో జరిగే స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఉపయోగపడే ఉమ్మడి ఓటరు జాబితా రూపకల్పనకు వీలవుతుంది. యువజన ఓటర్లు మరింత మందిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి కూడా ఈ ప్రయత్నం తోడ్పడుతుందని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ప్రస్తుతం జనవరి ఒకటో తేదీన, అంతకంటే ముందు 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఆ ఏడాది తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చు. ఆ ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే, జనవరి 2 జన్మించినా వారు మళ్లీ ఏడాదిదాకా ఆగాల్సిందే. అందుకే, ఏడాదిలో నాలుగు కటాఫ్ తేదీలను జత చేస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 14(బి)ని సవరించాలని యోచిస్తున్నట్లు న్యాయశాఖ తెలిపింది. సంవత్సరంలో.. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లను కటాఫ్ తేదీలుగా మార్చే ప్రతిపాదనలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని కేంద్రం తెలిపింది. -
ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం
సాక్షి, అమరావతి: కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని పేర్కొంది. వారితోపాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ ఇలా.. ► ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31 వరకు ఇంటింటి ఓటరు జాబితా పరిశీలన ► నవంబర్1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల ► నవంబర్ 30 వరకు అభ్యంతరాల స్వీకరణకు అనుమతి ► నవంబర్ 20, 21 తేదీల్లో ఓటరు నమోదుపై ప్రచార కార్యక్రమం ► అదే తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. ► ఆ పోలింగ్ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులున్నా సరిచేసుకోవచ్చు. http://www.nvsp.in లేదా వోటర్ హెల్ప్‌లైన్ అనే మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► డిసెంబర్ 20 నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తి ► జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల ఓటర్ల జాబితా సిద్ధం చేయండి ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా సిద్ధంచేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రచురించాలని ఆయన పేర్కొన్నారు. దీంతో నగర పంచాయతీల్లో అన్ని వార్డుల్లో.. మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు ఓటర్ల జాబితా సిద్ధంచేయనున్నారు. -
జనవరి 15న ఓటర్ల తుది జాబితా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను జనవరి 15న ప్రచురిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కె.విజయానంద్ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన మూసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు డిసెంబర్ 15లోగా తెలియజేయాలని రాజకీయ పార్టీలను కోరారు. సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో రాజకీయ పార్టీలతో శుక్రవారం ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. విజయానంద్ మాట్లాడుతూ, నూతన ఓటర్ల నమోదుకు కూడా సహకరించాలన్నారు. 1,500 మంది ఓటర్లతో కూడిన పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ.. ఈనెల 16న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,00,79,025 మంది ఓటర్లుగా నమోదైనట్లు తెలిపారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు జనవరి 5లోగా పరిష్కారం చూపుతామన్నారు. ఈ నెల 28, 29 తేదీలతో పాటు డిసెంబర్ 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా సవరణలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం ముఖ్యమని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు రాష్ట్రంలో కొత్తగా 80 లక్షల మంది ఓటర్లకు ఫొటో ఐడెంటిటీ కార్డులు జారీ చేసినట్లు విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 740 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటర్ల నివాసానికి రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజనులకు కూడా అందుబాటులో ఉండేలా పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. రేషనలైజేషన్ తర్వాత రాష్ట్రంలో 45,917 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు సహకరించండి మార్చిలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల కోసం ఎన్నికలు జరగనున్నాయని, ఓటర్ల నమోదుకు సహకరించాలని పార్టీలను విజయానంద్ కోరారు. ప్రస్తుతం 30 వేల మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. డిసెంబర్ 31లోగా రాష్ట్రంలో అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. -
జిల్లాలవారీగా ఓటర్ల ముసాయిదా జాబితాల ప్రకటన
సాక్షి, అమరావతి: జిల్లాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను జిల్లాల కలెక్టర్లు సోమవారం ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారిని ఓటర్‌గా నమోదు చేసేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్ల జాబితాలో పేరులేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. డిసెంబర్ 15 వరకు ఓటర్‌గా నమోదుకు లేదా అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో, డిసెంబర్ 12, 13 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. ఓటర్లుగా చేరేందుకు, ఏదైనా మార్పులు, చేర్పులున్నా బూత్ స్థాయి ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను, అభ్యంతరాలను వచ్చే ఏడాది జనవరి 5 నాటికి పరిష్కరిస్తారు. జనవరి 14న తుది ఓటర్ల జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయో, లేదో సరిచూసుకుని జనవరి 15న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ప్రస్తుత ముసాయిదా జాబితాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఓటర్లు ఖాళీలను భర్తీ చేయండి ఖాళీగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శులు, బూత్ స్థాయి ఆఫీసర్ల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకుని.. ఇంకా ఖాళీలుంటే ఆ వివరాలతో నివేదిక పంపించాలని కోరారు. రాష్ట్రంలో తాజా ఓటర్ల సంఖ్య ఇలా -
ఓటు నమోదుకు...48 గంటలే
సాక్షి, కడప : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. నచ్చని నేతలను ఇంటికి సాగనంపడానికి ఉన్న ఒకే ఒక మార్గం.. నచ్చిన నాయకులను అధికారంలోకి తెచ్చుకుని చక్కని భవితను నిర్మించుకునే సాధనం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఓటు లేదని తర్వాత దిగులు పడేకన్నా ముందే మేలుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం కోరుతోంది. ఓటరు ఐడీ ఉందనో.. గత ఎన్నికల్లో ఓటేశామనో ధీమా పడితే పొరపాటే.. తాజా జాబితాలో పేరు ఉందో లేదో తక్షణం చూసుకోవాల్సిందే. లేకపోతే ఓటరుగా పేరు నమోదు చేయించుకోవాలి. ఎన్నికల కమిషను నిర్దేశించిన ఫారం–6 ద్వారా కొద్దిపాటి వివరాలు సమర్పిస్తే చాలు..మండలంలోని తహసీల్దారు కార్యాలయంలో ఈ దరఖాస్తు సమర్పించాలి. పట్టణాలు లేదా నగరాల్లో మున్సిపల్ కమిషనరు కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలి. బూత్ లెవల్లో కూడా అధికారి ఉన్నారు. ఆయనకూ ఫారం–6 అందజేయవచ్చు.www.nvsp.in వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో నమోదు చేసుకునే వీలుంది. ఆలస్యం చేస్తే ఈసారి ఎన్నికల్లో ఓటేసే అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఈనెల 15 తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. ఉన్న అవకాశమల్లా ఓటరుగా నమోదు చేసుకోవడమే. మునుపెన్నడూ లేనివిధంగా ఎన్నికల కమిషను కొత్త ఓటర్లను చేర్పించడంపై ఎంతో అవగాహనకు కృషి చేస్తోంది. ఎన్నికల వేళ ఓటు లేదనే గందరగోళం.. వివాదాలకు తెరదించేందుకు ముందుచూపుతో అడుగులేస్తోంది. వైస్సార్ జిల్లాలో .. మొత్తం ఓటర్లు : 20,56,660 పురుషులు :10,15,964 మహిళలు : 10,40,400 ఇతరులు : 296 -
ఇక నాలుగు రోజులే...
అనంతపురం అర్బన్: ఓటరు నమోదుకు ఇక నాలుగు రోజులే గడువు ఉంది. ఈనెల 15 లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అందువల్ల ఇప్పటికీ ఓటు నమోదు చేసుకోని వారు వెంటనే నమోదు చేయించుకోవాలి. అలాగే ఓటర్లంతా జనవరి 11న విడుదల చేసిన తుది ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలి. జిల్లాలోని 3,879 పోలింగ్ కేంద్రాల్లోనూ అక్కడి బీఎల్ఓల వద్ద, తహసీల్దారు కార్యాలయాల్లోనూ ఓటరు జాబితాలు అందుబాటులో ఉంచారు. జాబితాలో పేరులేని వారు వెంటనే ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఆందోళనకు గురిచేసిన ఫారం–7 ఓటు తొలగింపునకు నిర్దేశించిన ఫారం–7 అధికంగా దాఖలు కావడంతో ఓటర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటరు జాబితా సవరణ ఉంటుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులు ఫారం–7ను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు సిద్ధపడ్డారు. ఈ వ్యవహారం వెలుగు చూపడంతో వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఈనెల 15 వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. ఓటరు తొలగింపునకు అధికసంఖ్యలో ఫారం–7 రావడం కూడా ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఫారం–7 దరఖాస్తులను పరిశీలించి నివేదికనుతమకు పంపాలని అధికారులను ఆదేశించింది. ఫారం–7 అడ్డుపెట్టుకుని నిజమైన ఓటరును తొలగిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున ఇక ఓట్ల తొలగింపు ఉండదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. జాబితాలో పేరుందో లేదో చూసుకోవాలి ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రజలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఓటు లేదని గుర్తిస్తే వెంటనే నమోదు చేసుకోవాలి. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో జిల్లాలో 29,87,264 మంది ఉన్నారు. గత ఏడాది సెప్టెంబరు 1న ప్రకటించిన ఓటర్ల జాబితలో ఏకంగా 1,01,772 ఓట్లు గల్లంతయ్యాయి. ఈ క్రమంలో అదే ఏడాది అక్టోబరు 31 వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 11 ఓటర్ల తుదిజాబితాను ప్రకటించారు. ఆ ప్రకారం జిల్లాలో 30,58,909 మంది ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ చాలా మంది అర్హులు ఓటరుగా నమోదు కాలేదు. ముఖ్యంగా 18–19 ఏళ్ల మధ్య వయసున్న వారు జిల్లాలో 1,64,816 మంది ఉండగా, ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో కేవలం 38,335 మంది నమోదు చేసుకున్నారు. ఇప్పటికీ అధిక శాతం యువత తమ ఓటు నమోదు చేసుకోలేదు. నమోదుకు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఇప్పటికీ ఓటరుగా నమోదు కాని వారు ఓటును నమోదు చేసుకోవాలి. ఓటరుగా నమోదు చేసుకోండి ఓటరుగా నమోదుకు ఈనెల 15 వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికీ ఓటరుగా నమోదు కాని వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓటరు జాబితాలను బీఎల్ఓలు, తహసీల్దారు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాము. అదే విధంగా ఆన్‌లైన్‌లోనూ చూసుకోవచ్చు. ఓటు లేకపోతే వెంటనే ఫారం–6 ద్వారా మాన్యువల్‌గా బీఎల్ఓలు, తహసీల్దారు కార్యాలయంలో, లేదా మీసేవలో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. – ఎస్.డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ -
నేడు ఒక్కరోజే..!
నల్లగొండ : ఓటరు నమోదుకు సోమవారం ఒక్కరోజే అవకాశం ఉంది. ఓటరు జాబితాలో పేరు లేనివారు ఇప్పుడు నమోదు చేసుకుంటేనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఓటుహక్కు కోల్పోవాల్సిందే. అర్హులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1,628 పోలింగ్స్టేషన్లలో ప్రత్యేక క్యాంపులు పెట్టి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించడమే లక్ష్యం.. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటహక్కు నమోదు చేసుకునే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టి ఓటుహక్కు నమోదు చేసుకునే విధంగా జిల్లాలో అనేక ప్రచార, చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఓటుహక్కు నమోదు చేసుకుంది. అంతేకాకుండా ఒకచోట నుంచి మరోచోటుకు ఓటును మార్పుకోవడంతోపాటు పేర్లలో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు కూడా అవకాశం ఇవ్వడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కానీ ఎన్నికల సమయానికి అక్కడక్కడా ఓట్లు గల్లంతయ్యాయి. చాలా మంది ఓటర్లు ఓటు వేసే అవకాశం లేక నిరాశకు గురయ్యారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన, 1 జనవరి 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా.. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి 25వ తేదీ ఓటరు నమోదుకు చివరి తేదీగా నిర్ణయించి అవకాశం కల్పిం చింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంతా బిజీగా ఉండడంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఓటరు నమోదు ఫిబ్రవరి 4 వరకు పొడిగించింది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులు సోమవారం ఓటు నమోదుకు చివరి గడువు కావడంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1,629 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. సెలవు దినం ప్రజలకు అనుకూలంగా ఉంటుందని ఆది వారం ఈ క్యాంపులు ఏర్పాటు చేశా రు. ప్రతీ పోలింగ్స్టేషన్లో బీఎల్ఓలను ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంచారు. వారి వద్ద కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఫారం–6తో పాటు మార్పులు, చేర్పుల కోసం కూడా దరఖాస్తులను సిద్ధంగా ఉంచారు. ప్రజల నుంచి మంచి స్పందన.. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు లేనివారు ఓటుహక్కు నమోదు చేసుకోవడంతోపాటు కొందరు పేర్లలో దొర్లిన తప్పిదాలను సరి చేసుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. క్యాంపులను పరిశీలించిన జేసీ, ఆర్డీఓ.. పోలింగ్ స్టేషన్లలో నిర్వహించిన ప్రత్యేక క్యాంపులను జిల్లా జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, నల్లగొండ ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. నల్లగొండ పట్టణంలోని పశు వైద్యశాల వద్ద ఉన్న పోలింగ్ స్టేషన్‌తోపాటు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉన్న పోలింగ్‌స్టేషన్‌ను రామగిరి, ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ స్టేషన్‌ను సందర్శించి ఓటు నమోదు, తదితర విషయాలపై బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. నేడు ఆఖరి గడువు.. ఓటు నమోదుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనుంది. వచ్చే పార్లమెంట్, తదితర ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఓటు లేని వారు ఓటుహక్కు నమోదు చేసుకోవాల్సిందే. ఓట్లు గల్లంతైనా.. 18 సంవత్సరాలు నిండి ఓటు లేనివారు దరఖాస్తు చేసుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. -
ఓటు మీ హక్కు.. వినియోగించుకోండి
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితాలో పేరు నమోదు.. పొరపాట్ల సవరణ.. చిరునామా మార్పు తదితరాల గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నా అది ప్రజలందరికీ చేరడం లేదని, వీటిపై వారందరికీ అర్థమయ్యేలా సరళమైన తెలుగుభాషలో ఓటరు నమోదుపై చైతన్యం కలిగేలా ఇంటింటికీ పోస్టుకార్డుల పంపిణీని చేపట్టామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. అంతే కాకుండా తమవైపు నుంచి ప్రజలకు చేరవేస్తున్న సమాచారంతోపాటు వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకునేందుకు కూడా ఉపకరిస్తుందని సీఈఓ చిరునామాతో రిప్లయ్ పోస్టుకార్డుతో కూడిన లేఖలను పంపామన్నారు. ‘ఓటు మీ హక్కు.. ఓటు వేయడం మీ బాధ్యత’అంటూ రజత్‌కుమార్ స్వీయ సంతకంతో కూడిన లేఖల్ని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే మేరకు రాష్ట్రంలోని కోటి ఐదు లక్షల కుటుంబాలకు చేరేలా వీటిని పంపించి నట్లు తెలిపారు. సంక్రాంతికన్నా ముందుగానే పంపాలనుకున్నప్పటికీ, ఆలోగా అన్ని పోస్టుకార్డుల్ని పోస్టల్‌శాఖ తమకు సమకూర్చలేకపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు పోయిందని, ఓటు వేయలేకపోయాని పలువురు వేదన వ్యక్తం చేయడంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్కరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఈ లేఖలు ఉపకరించగలవన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆలోచన రావడానికి కారణం.. ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి గురువారం రజత్‌కుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఓటర్ల ఇళ్ల వద్దకుబూత్‌స్థాయి అధికారులు రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా నగరంలో బీఎల్ఓలు (బూత్‌స్థాయి అధికారులు) తమ ఇళ్లకు రాలేదని, ఇంటింటికీ సర్వే చేయకుండానే ఓట్లు తొలగించారని పలువురు తమ దృష్టికి తేవడంతో ఈ రకంగానైనా బీఎల్ఓలు ప్రతీ ఇంటికీ వెళ్తారనే ఉద్దేశంతోనూ తిరుగు పోస్టుకార్డుతో కూడిన లేఖల పంపిణీని బీఎల్ఓల ద్వారా చేపట్టామన్నారు.ప్రతి ఇంటికి వెళ్లి లేఖను ఇవ్వడంతోపాటు వారి నుంచి అకనాలెడ్జ్‌మెంట్‌కూడా తీసుకోవాల్సి ఉన్నందున కచ్చితంగా వెళతారనే ధీమా వ్యక్తం చేశారు. ఈ రకంగానైనా బీఎల్ఓలకు, ఓటర్లకు మధ్య సంబంధం ఏర్పడుతుందన్నారు. తమ లక్ష్యాన్ని నూరు శాతం పూర్తిచేసేవారికి ప్రోత్సాహక బహుమతులిచ్చే ఆలోచన ఉందని చెప్పారు. లేఖలకు ఓటర్ల నుంచి ధన్యవాదాలు లేఖలు పంపినందుకు ధన్యవాదాలు అంటూ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, తాను దాదాపు వంద లేఖల్ని చదివానని తెలిపారు. కొందరు ఖాలీ రిప్లయ్ కార్డులు కూడా పంపారని, చాలామంది ఎపిక్‌కార్డులు రాలేదని ఫిర్యాదు చేశారన్నారు. ప్రకటనల కోసం చేస్తున్న ఖర్చులో భాగంగానే ఇంటింటికీ పోస్టుకార్డు పంపినట్లు తెలిపారు. వాట్సాప్ మెసేజ్‌లు, ఎస్ఎంఎస్ల గురించి కూడా ప్రస్తావన వచ్చినప్పటికీ, బీఎల్ఓలు ప్రజలను నేరుగా కలుసుకునేందుకు పోస్టుకార్డుల్ని పంపిణీ చేశామన్నారు. ఉర్దూ చదివే వారికోసం ఉర్దూలోనూ ఈ లేఖలు పంపించనున్నట్లు తెలిపారు. ఓటు నమోదుపై ప్రజలకు ఏమాత్రం అవగాహన లేదనడం కూడా సరికాదని, అసెంబ్లీ ఎన్నికల ముందు రెండునెలల్లో ఇరవై లక్షలమందికి పైగా నమోదు చేసుకున్నారని చెప్పారు. దివ్యాంగులు, థర్డ్జెండర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేపట్టిన కార్యక్రమాలు అసెంబ్లీ పోలింగ్‌లో మంచి ఫలితమిచ్చాయని చెప్పారు. వివరాలతో లేఖలు.. ఓటరు నమోదుపై చాలామందికి సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేసేందుకూ, వారికి సులభంగా అర్థమయ్యేలా కొత్తగా పేరు నమోదు చేసుకోవాలంటే ఏ ఫారం నింపాలి.. చిరునామా మారితే ఏ ఫారం భర్తీచేయాలి.. పొరపాట్ల సవరణకు ఏ ఫారం వినియోగించాలో లేఖలో వివరించామన్నారు. ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయవచ్చో కూడా తెలిపామన్నారు. పోలింగ్‌కు ముందు నామినేషన్ల గడువు వరకు ఓటరు జాబితాలో ఎప్పుడైనా పేరు నమోదు చేసుకోవచ్చునని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రం ఇప్పుడే సరిచూసుకోవాలని రజత్‌కుమార్ ప్రజలను కోరారు. ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే ఓటు వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
రేపటి నుంచి కొత్త ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా వార్షిక ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం నుంచి పునఃప్రారంభించనుంది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులు ఓటరు నమోదుకు అర్హులు కానున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించనుందని, అందులో పేర్లు ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సూచించింది. ఒకవేళ పేర్లు గల్లంతైతే మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ నెల 26 నుంచి జనవరి 25 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది. ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిశీలించి ఫిబ్రవరి 11 నాటికి పరిష్కరించనుంది. ఫిబ్రవరి 18 నాటికి ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులు చేయడంతోపాటు అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. ఫిబ్రవరి 22న తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించనుంది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇదే జాబితాను వినియోగించనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ నెల 26న ప్రకటించనున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించి చూసుకోవాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో లక్షల మంది ఓట్లు గల్లంతుకావడం, ఇందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఓటర్లకు క్షమాపణ చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చేపట్టనున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. మూసాయిదా జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి http://ceotelangana.nic.in వెబ్సైట్ లేదా 9223166166/51969 నంబర్లకు ‘ TS< SPACE>VOTEVOTERID NO’ నమూనాలో ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. -
ముగిసిన ఓటరు నమోదు
సాక్షి, నల్లగొండ : ఓటరు నమోదు ప్రక్రియ ముగిసింది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం గత నెల 12న ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు ఓటరు నమోదు కోసం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఉప ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డిలు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అనుకున్న విధంగానే చాలావరకు యువ ఓటర్లు ఆసక్తిచూపారు. పాత జాబితా తర్వాత రెండో తుది జాబితాతో పోలిస్తే జిల్లాలో సుమారు 50వేల ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. గత నెల 12న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా నాటి నుంచి శుక్రవారం వరకు ఓటు నమోదు చేసుకునేందుకు తిరిగి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లోనూ యువత దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దీంతో శుక్రవారం వరకు జిల్లావ్యాప్తంగా 6 నియోజకవర్గాల పరిధిలో 16,302 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా వచ్చిన దరఖాస్తులను బట్టి జిల్లాలో అదనంగా 16,302 మంది ఓటర్లు కొత్తగా అదనపు జాబితాలో చేరే అవకాశం ఉంది. ఇంకా రాత్రి వరకు ఆన్లైన్లో వస్తే అధికారులు వాటిని కూడా అధికారులు పరిశీలించి అదనపు జాబితాలో చేర్చనున్నారు. మొత్తానికి కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారి దరఖాస్తులను అన్నింటినీ అధికారులు పరిశీలించి ఈ నెల 19న అదనపు ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. -
ఇంకా అవకాశం ఉంది
నల్లగొండ : ఓటరు నమోదుకు ఇంకా అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఇప్పటివరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారానే నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ఏడాది జనవరి ఒకటి వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటుహక్కు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించారు. అందుకు సంబంధించి జిల్లా ఎన్నికల సంఘం సూచనల మేరకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, ఏఓలు ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిం చారు. గ్రామం, పట్టణాల్లో బీఎల్ఓలు ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. దీంతో జిల్లా అధికారులు ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు వచ్చాయి. వచ్చినవా టిని పరిశీలించి 49వేల మంది కొత్తవారికి ఓటు హక్కు కల్పించారు. అదే విధంగా మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చి సరిచేశారు. తుది ఓటరు జాబితాను ఈ నెల 11న విడుదల చేశారు. ఓటరు తుది జాబితాను విడుదల చేసినప్పటికీ ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఉన్నారని భావించిన ఎన్నికల కమిషన్ మరోసారి అవకాశం కల్పించింది. నవంబర్ 12న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అభ్యర్థులకు నామినేషన్ చివరి తేదీ నవంబర్ 19. అప్పటివరకు కొత్తగా ఓటరు నమోదుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 12నుంచి కొత్తగా ఓటు కోసం నమోదుచేసుకున్న వారికి అధికారులు మదర్ రోల్లో కాకుండా ప్రత్యేక సప్లిమెంటరీ ముద్రించి ఓటు హక్కు కల్పిస్తారు. 12నుంచి ఇప్పటివరకు 15 వేల వరకు దరఖాస్తులు.. ఎన్నికల తుది జాబితా ఈనెల 11వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు సుమారు 15 వేల వరకు నూ తన ఓటుహక్కు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపా రు. నవంబర్ 19 వరకు గడువు ఉన్నం దున దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఓటు ఉందా లేదా చెక్ చేసుకోవడం.. తమ ఓటు ఉందా లేదా అనేది ఓటర్లు సంబంధిత పోలింగ్ స్టేషన్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో చెక్ చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు. ఒకవేళ లేనట్లయితే చివరి అవకాశం ఉన్నందున ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వెబ్సైట్లో ఓటరు కార్డు నంబర్ కొడితే ఓటు హక్కు ఉందా లేదా అనేది తెలిసిపోతుందని చెబుతున్నారు. -
ఓటరు వెల్లువ
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఓటరు జాబితా స్పెషల్ రివిజన్ కోసం కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు, చిరునామా మార్పులు తదితరాల కోసం సెప్టెంబర్ 25తో గడువు ముగిసింది. ఆ తేదీ నాటికి హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, గడువు ముగిశాక కూడా ఈ దరఖాస్తుల సంఖ్యపెరుగుతూనే ఉంది. ఈ వారంరోజుల్లో కొత్తగా 56,368 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొత్తగా ఓటరు నమోదుతో పాటు చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉన్నప్పటికీ, 75 శాతం కొత్త ఓటరు కోసం వచ్చినవే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలనను అధికారులు ఇంకా ప్రారంభించలేదు. 25వ తేదీ గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలించి, అర్హులైన వారివి జాబితాలో చేర్చారు. ఈనెల 8వ తేదీన తుది జాబితా వెలువరించాకే, గడువు తర్వాత అందిన వాటిని పరిశీలించనున్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారిలో 1.46 లక్షల మంది కొత్త ఓటర్లు కాగా, 16,889 మంది పొరపాట్ల సవరణకు దరఖాస్తు చేసుకున్నారు. మరణించిన వారు, స్థానికంగా లేనివారివి మరో 6755 దరఖాస్తులు ఉన్నాయి. ఇల్లు మారిన వారెందరో.. నగరంలో ఎక్కువ మంది అద్దె ఇళ్లల్లో ఉండడం తెలిసిందే. అలాంటి వారు తాము ఇల్లు మారిన ప్రతిసారి ఓటరు జాబితాలోనూ చిరునామా మార్చుకోవాలి. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారిన వారి సంగతటుంచి, ఒక నియోజకవర్గంలోనే ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారిన వారు 22,386 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే, స్థానికంగా ఒక చోట ఉండేందుకు అలవాటు పడిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లలేక, పిల్లల చదువులు తదితరమైన వాటి దృష్ట్యా అదే ప్రాంతంలో ఇతర ఇళ్లకు మారుతున్నారు. కోర్ సిటీలోనే ఇంతమంది ఉండగా, గ్రేటర్ మొత్తంలో ఇలాంటి వారు 50వేల మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలన పూర్తి ఓటర్ల జాబితాపై అభ్యంతరాల పరిశీలన పూర్తయిందని, ఈమేరకు జాబితాను రూపొందించి, కొత్తగా ఓటర్లయిన వారి వివరాల జాబితా ప్రచురణ 7వ తేదీకి పూర్తవుతుందని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) జయరాజ్ కెన్నెడి తెలిపారు. 8వ తేదీన తుది జాబితాలను వెల్లడించనున్నట్లు ఆయన వివరించారు. -
ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం
సాక్షి, నల్లగొండ : సాధారణ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా డబుల్ ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఇందుకు మొదటి సారిగా ఉపయోగిస్తున్న ఈఆర్ఓ నెట్ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా రెండు ఓట్లు, ఆపై ఎక్కువ ఉన్నవారిని గుర్తించి తొలగింపునకు చర్యలు చేపట్టారు. ఒకటే ఓటు ఉండాలని.. రెండు ఓట్లు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో యువత ఓటుహక్కు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంది. మరోవైపు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరు, వాటిపై సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమం పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు నేరుగా, ఆన్లైన్ ద్వారా లక్షా 4వేల 195 దరఖాస్తులు వచ్చాయి. అందులో కొత్తగా ఓటు నమోదుకు 60,626 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే యువత ఓటు నమోదుపై పెద్దఎత్తున శ్రద్ధ కనబరిచింది. ఇందుకు అధికారులు తీసుకున్న కార్యక్రమాలు ఫలించినట్లు స్పష్టమవుతోంది. జిల్లాకు ఇప్పటికే 2,600 బ్యాలెట్ బాక్సులు, 2,030 ఈవీఎంలు, 2,200 వీవీ ప్యాట్లు బెంగళూరు నుంచి తెప్పించి కలెక్టరేట్లోని ఈవీఎం గోదాముల్లో భద్రపరిచారు. రాజకీయ పక్షాల సమక్షంలో వాటి పనితీరుపై ఇప్పటికే కలెక్టరేట్లో అవగాహన కల్పించారు. డబల్ ఓట్లపై దిద్దుబాటు చర్యలు.. ఈఆర్ఓ నెట్ ద్వారా డబుల్ ఓట్ల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. రెండు ఓట్లు ఉన్న వారికి ఎక్కడ ఓటు కావాలని అడుగుతున్నారు. ఒక ఓటు తొలగించుకోవాలని నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతోపాటు ఓటరు మోదు దరఖాస్తులు, అడ్రసు, పేరుమార్పుతోపాటు, ఒక పోలింగ్‌బూత్ నుంచి మరో పోలింగ్ బూత్‌కు ఓటు మార్చుకునేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అక్టోబర్ 8న తుది ఎన్నికల జాబితా విడుదల చేసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటరు నమోదు ప్రక్రియ ముగిసిన నాటినుంచి ఆర్డీఓలు, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. బీఎల్ఓలు, ఇతర ఎన్నికల సిబ్బంది ఈ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నారు. నియోజకవర్గానికి పది అవగాహన టీమ్‌లు ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కల్పించేందుకు ప్రతి నియోజకవర్గానికి పది టీ మ్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 1628 పోలింగ్‌కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలకు వీరు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని శనివారం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. నల్లగొం డ తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దానిని అక్కడే ఉంచుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. అవగాహనకు వాడే యంత్రాలను ఎన్నికల్లో వాడబోమని, ఇవి టెస్టింగ్ యంత్రాలని తెలిపారు. కలెక్టరేట్లో కాల్‌సెంటర్.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని నివృత్తి చేసుకోవడంతోపాటు పరిష్కారానికి కలెక్టరేట్లో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని కలెక్టర్ ఇప్పటికే ప్రారంభించారు. 18004251442 ఫోన్‌నంబర్ కేటాయించారు. ఏదైనా సమస్య ఉంటే ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు. -
ఇక విచారణ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారంతో ముగిసింది. ఇక బుధవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ కొనసా గనుంది. ఈ తంతు ముగిసిన తర్వాత అధికారులు ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా.. ఓటరు జాబితాలో ఉన్న పేర్లను ఏకపక్షంగా తొలగించకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. వీటిని అనుసరిస్తూ అధికారులు, సిబ్బంది విచారణ చేపట్టనున్నారు. భారత ఎన్నికల సంఘం ఈనెల 10వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారు ఓటరు జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే అభ్యంతరాలు, ఏమైనా మార్పులు, చేర్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ ఈనెల 25వ తేదీ వరకు కొనసాగింది. దరఖాస్తులను ఆన్లైన్లో.. సంబంధి త పోలింగ్ కేంద్రంలో బూత్ లెవల్ అధికారిని సంప్రదించడం ద్వారా.. తెలంగాణ వెబ్సైట్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. ఓటు ప్రాముఖ్యతపై పోస్టర్లను ప్రదర్శించారు. దీంతో జిల్లాలో అనేక మంది కొత్త ఓటర్లతోపాటు మార్పు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది.. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారు.. మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు విచారణ సిబ్బంది వెళ్లి వారు చేసుకున్న దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. బుధవారం నుంచి సిబ్బంది ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. దరఖాస్తుదారులకు సంబంధించిన ఆధారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఉదాహరణకు.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఆధార్ కార్డు, లేనిపక్షంలో అతడి వద్ద ఉన్న ఇతర గుర్తింపు కార్డులను పరిశీలిస్తారు. వాటిని సరిపోల్చుకుంటారు. ఒకవేళ ఎటువంటి గుర్తింపు కార్డు లేదంటే చుట్టుపక్కల వారిని విచారించి.. వారు ఎప్పటి నుంచి స్థానికంగా ఉంటు న్నారు అనే వివరాలను సేకరిస్తారు. ఆయా వివరాల ప్రకారం సిబ్బంది నివేదికను తయారు చేస్తారు. వచ్చే నెల 4వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం 8వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. 77,581 దరఖాస్తులు ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై జిల్లావ్యాప్తంగా 77,581 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించిన అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఈ దఫా ఓటరు నమోదుపై అధికారులు ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు. ప్రజలకు ఓటు హక్కు విలువ తెలిపే చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించడంతో దరఖాస్తులు కూడా అదేస్థాయిలో వచ్చాయి. కొత్త ఓటరు నమోదు కోసం 39,322, ఓటు తొలగింపు కోసం 30,290, ఓటు సవరణ కోసం 3,359, ఓటు మార్పు కోసం 4,610 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఓట్ల తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తుల్లో 17,115 మంది మృతిచెందారని, వారి పేర్లు తొలగించాలని వచ్చాయి. వికలాంగుల కోసం నిర్వహించిన కార్యక్రమంలో 19,564 మంది తమకు ఓటు హక్కు కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. -
నేనూ ఓటరునే..
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఓటరుగా నమోదు కోసం దాదాపు 2.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదుకు గడువు ముగిసే సమయానికి గ్రేటర్ పరిధిలో దాదాపు 4.20 లక్షల దరఖాస్తులందగా వీటిలో దాదాపు 2.50 లక్షలు కొత్తగా ఓటరు నమోదుకు సంబంధించిన(ఫారం–6) దరఖాస్తులున్నాయి. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్తగా ఓటు హక్కు కోసం 1.34 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ఓటర్ల నమోదు, సవరణల కోసం మొత్తం 1,77,983 దరఖాస్తులందగా అందులో కొత్తగా జాబితాలో పేరు నమోదు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో అసెంబ్లీ నియోజకవర్గానికి చిరునామా మార్పునకు సంబంధించి (ఫారం–6 ద్వారా) 1,34,535 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చిరునామా మార్పునకుసంబంధించిన వారు పోను కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు దాదాపు లక్షా 34 వేల మంది ఉంటారని భావిస్తున్నారు. వీటిల్లో 92,271 మంది వ్యక్తిగతంగా ఆఫ్‌లైన్‌లో ఓటరు నమోదుకు దరఖాస్తులు అందజేయగా 44,264 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. జాబితాలో పేరు తొలగింపు కోసం (ఫారం–7 ద్వారా) 6,202 మంది, పొరపాట్ల సవరణల కోసం( ఫారం–8 ద్వారా) 14,880 మంది, ఒకే నియోజకవర్గంలో ఇళ్లు మారిన వారు( ఫారం–8ఏ) 22,366 మంది దరఖాస్తుచేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 1,18,350 మంది వ్యక్తిగతంగా, 59,633 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాసులన్నింటి విచారణను అక్టోబర్ 4వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉన్నందున ఈనెలాఖరునాటికే పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ తెలిపారు. ఇందుకుగాను 380మంది బీఎల్ఓలు, 578 మంది సూపర్వైజర్లు, వీఆర్ఓలు ఆయా ఇళ్లకు వెళ్లి విచారణ జరుపుతారన్నారు. ఈ విచారణ పర్యవేక్షణకు ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను ప్రత్యేకంగా నియమించామని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలో రెండు లక్షలకు పైనే... సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పుల కార్యక్రమం ముమ్మరంగా సాగింది. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 25 వరకు మొత్తం 2,24,821 దరఖాస్తులు అందాయి. జిల్లాలో అధికారులు, సిబ్బంది ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారీగా స్పందన లభించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎంవీరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 19.87 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. -
జిల్లా యంత్రాంగం పనితీరు భేష్
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముం దస్తు ఎన్నికల ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం పనితీరు బాగుందంటూ ప్రత్యేక పరిశీలకుడు ఎల్.శశిధర్ కితాబిచ్చారు. జిల్లాలో బూత్‌లెవెల్‌లో ఓటర్ నమోదుకు చేపడుతున్న కార్యక్రమాలను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీలు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల ఎర్పాట్లపై జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. ఓటరు నమోదుకు విస్తృత ప్రచారం కల్పించడంలో జిల్లా యంత్రాంగం కృషి అభినందనీయమన్నారు. కాగా, ఓటరు నమోదు, చేర్పులు, మార్పులకు గడువు పొడిగించాలని నాయకులు కోరగా.. ఈ విషాయిన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తానని తెలిపారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ బూత్‌లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని రెండేళ్లుగా కోరుతున్నా పార్టీలు అలా చేయలేదని.. అదే జరిగితే ఓటరు నమోదు, చేర్పులు, మార్పులకు ఎంతో సులువయ్యేదని తెలిపారు. సమావేశంలో జేసీ ఎస్.వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లుతో పాటు వివిధ పార్టీల నాయకులు రంగారావు, పద్మజారెడ్డి, హాదీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లోని కాల్‌సెంటర్‌ను ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు శశిధర్ పరిశీలించారు. ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలి భూత్పూర్ (దేవరకద్ర) : ఓటరు నమోదును పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు శశిధర్ సూచించారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ హరిజన్‌వాడలో పోలింగ్ బూత్‌ను కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జెడ్పీ సీఈఓ శాంతకుమారితో కలిసి ఆయన పరిశీలించారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై తహసీల్దార్ జ్యోతిని అడిగి తెలుసుకున్నారు. ఈవీఎం గోదాంలో పరిశీలన మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ఎన్నికల కమిషన్ నుండి జిల్లాకు కొత్తగా వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై సోమవారం డెమానిస్ట్రేషన్ నిర్వహించారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమక్షంలో రాజకీయ పార్టీల నాయకులు వీటి పని విధానాన్ని స్వయంగా పరిశీలించారు. నాయకులు రంగారావు, అంజయ్య పాల్గొన్నారు. -
త్వరపడండి..!
ఓటరు జాబితాలో మీ పేరుందో లేదో చూసుకున్నారా? మీ ఓటరు కార్డులో ఏవైనా సవరణలుంటే సరిదిద్దుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారా? ఓటు హక్కు లేనివారు కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకున్నారా? ఇంకా ఎవరైనా ఈ దరఖాస్తులు చేయని పక్షంలో తొందరగా చేసుకోండి. ఇంకా మూడు రోజులే అవకాశం ఉంది. ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ, చిరునామా, పోలింగ్ కేంద్రాల్లో మార్పులు చేర్పులు, కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం ఈ నెల 25 వరకు గడువుంది. ఈ నేపథ్యంలో ఆయా దరఖాస్తులకు సంబంధించి సమగ్ర వివరాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, సిటీబ్యూరో : వాస్తవానికి జనవరిలో ప్రకటించాల్సిన ఓటర్ల జాబితాను ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 8న ప్రకటించనున్నారు. దీంతో ఓటర్ జాబితాలోపొరపాట్ల సవరణ, చిరునామా, పోలింగ్ కేంద్రాల్లో మార్పులుచేర్పులకు... 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారు ఓటరుగా పేరు నమోదుచేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఆయా దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 25వరకు అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిజీహెచ్ఎంసీ వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్య ధోరణిలో ఉంటారు. తీరా పోలింగ్ రోజు తమ ఓటు లేదని, వివరాలు తప్పులతడకగా ఉన్నాయని విమర్శిస్తుంటారు. చివరి క్షణంలో అలా చేసే బదులు ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. ఆలస్యమెందుకు.. త్వరపడండి మరి. ఇప్పటికే ఓటర్లుగా నమోదైనవారు www.ceotelangana.nic.in వెబ్సైట్లో వివరాలు తెలుసుకోవచ్చు. తమ నియోజకవర్గం ఎంచుకొని పేరు, ఇంటి నెంబర్, చిరునామా తదితర ఎంటర్ చేయాలి. ఒకవేళ జాబితాలో పేరు లేనట్లయితే నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లోనే లేదా ఓటరు నమోదు కేంద్రాల్లో(పోలింగ్ కేంద్రాల్లో) సంబంధిత ఫారం–6 పూర్తి చేసి అక్కడి అధికారులకు అందజేయాలి. పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటారు. 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ఓటు హక్కు నమోదు కోసం ఫారం–6 పూర్తి చేసివ్వాలి. చిరునామాలో మార్పులకూ ఇదే ఫారమివ్వాలి. ⇔ హైదరాబాద్ జిల్లా పరిధిలో 1,581 ఓటరు నమోదు కేంద్రాలున్నాయి. ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా మీకు సమీపంలోని నమోదు కేంద్రాన్ని తెలుసుకోవచ్చు. ⇔ జీహెచ్ఎంసీ వెబ్సైట్లో అవర్ సర్వీసెస్ మెనూ నుంచి ‘ఎలక్షన్స్’ ఆప్షన్‌లోకి వెళ్లి పోలింగ్ కేంద్రాలు, ముసాయిదా జాబితాలోపేరున్నదో? లేదో? తెలుసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాలు... ⇔ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా, నేరుగా దరఖాస్తు చేసుకున్నా పుట్టిన తేదీ, చిరునామా ధ్రువీకరణలకు ఈ కింది పత్రాలు అవసరం. ⇔ పుట్టిన తేదీ ధ్రువీకరణకు మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్, ప్రభుత్వ పాఠశాల నుంచి పొందిన బర్త్ సర్టిఫికెట్, పుట్టిన తేదీతో కూడిన 8వ తరగతి లేదా పదో తరగతి మార్కుల మెమో, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్‌లలో ఏదో ఒకటి. ⇔ చిరునామా ధ్రువీకరణకు బ్యాంక్, కిసాన్, పోస్టాఫీస్, కరెంట్ పాస్‌బుక్, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్‌కంటాక్స్ అసెస్మెంట్ ఆర్డర్, తాజా రెంట్ అగ్రిమెంట్లలో ఏదో ఒకటి. ⇔ పైవేవీ లేనివారు వాటర్, టెలిఫోన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ కనెక్షన్ బిల్స్‌లో ఏదో ఒకటి జత చేయాలి. వీటిల్లో దరఖాస్తుదారు పేరు లేనివారికి కనీసం తల్లిదండ్రుల పేర్లుండాలి. ⇔ చిరునామా ధ్రువీకరణకు పోస్టల్ శాఖ ద్వారా అందిన ఉత్తరాన్ని కూడా వినియోగించొచ్చు. నమోదు కేంద్రం గుర్తింపు ఇలా.. ‘మైజీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా ఓటరు జాబితాలో పేరుందో? లేదో తెలుసుకోవడంతో పాటు ఓటరు నమోదు కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవచ్చు. యాప్‌లో ‘నియర్ మి’ ఓపెన్ చేసి, స్క్రీన్ కుడివైపున్న ఎరుపు అడ్డగీతలపై నొక్కితే వివిధ అంశాలతో మెనూ వస్తుంది. అందులో ‘ఎలక్టోరల్ ఎన్రోల్మెంట్ క్యాంప్’ను ఓపెన్ చేస్తే... ఓటర్ నమోదు కేంద్రాలు ఎక్కడున్నాయో ఎరుపు రంగులో కనిపిస్తాయి. వాటిపై నొక్కితే వార్డు, సర్కిల్, నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ నెంబర్‌తో సహా ఓటరు నమోదు కేంద్రం చిరునామా కనిపిస్తుంది. మీరున్న ప్రదేశం నుంచి అక్కడికి ఎలా చేరుకోవాలో గూగుల్ మ్యాప్ ద్వారా సూచిస్తుంది. ఎంత సమయం పడుతుందో కూడా తెలుపుతుంది. సాంకేతికతతో ‘సవరణ’ సాక్షి, సిటీబ్యూరో: ఓటర్ జాబితాలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతికతను వినియోగిస్తోంది. బోగస్ ఓట్లను ఏరివేసేందుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్వర్క్(ఏరోనెట్) విధానాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన ఈ విధానం ద్వారా ఒక వ్యక్తికి ఎక్కడెక్కడ ఓటు హక్కు ఉందో తెలిసిపోతుంది. ఈ వివరాల ఆధారంగా అధికారులు విచారించి, ఒకే ఓటు కల్పిస్తారు. ఈ నెల 10న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎంతో మంది నగరంలో స్థిరపడ్డారు. కొంతమందికి సొంతూరుతో పాటు సిటీలోనూ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడీ విధానంతో వాటిని తొలగిస్తారు. ⇔ ‘సువిధ’ యాప్: దరఖాస్తు చేసినా ఓటు హక్కు రాలేదనే ఫిర్యాదులకు చెక్ పెట్టేలా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలో సేవలందించేలా ‘సువిధ’ యాప్ రూపొందించారు. ⇔ ‘సివిజిల్’ యాప్: ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సామాన్యులు సైతం ఫిర్యాదు చేసేలా సివిజిల్ యాప్‌ను రూపొందించారు. పోలీసులు క్షేత్రస్థాయిలో విచారించి ఫిర్యాదు అందుకున్న రెండు గంటల్లో నివేదిక అందించాల్సి ఉంటుంది. జిల్లాలోని 803 పోలింగ్ కేంద్రాలకు జియోట్యాగింగ్ పూర్తి చేశారు. ⇔ దివ్యాంగులందరికీ ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఆన్లైన్లో నమోదు ఇలా... ⇔ www.ceotelangana.nic.in వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. ⇔ ఇందులో ఈ–రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఫారం 6, ఫారం 7, ఫారం 8, ఫారం 8ఎ, ట్రాక్ యువర్ స్టేటస్ ఇన్ ఎన్వీఎస్పీ, నో యువర్ స్టేటస్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ⇔ వీటిలో మీకు అవసరమైన దానిపై క్లిక్ చేయాలి. ఇంగ్లిష్ భాషను ఎంచుకోవాలి. ⇔ అక్కడ అడిగిన వివరాలన్నీ పూర్తి చేయాలి. కుటుంబం లేదా పొరుగింటివారి ఓటరు కార్డు నెంబర్ పొందుపరచాలి. అన్ని వివరాలు నింపాక పక్కనే ఉండే ప్రాంతీయ (తెలుగు) భాషలోనూ భర్తీ చేయాలి. ⇔ వివరాలన్నీ కరెక్ట్‌గా పూర్తి చేసి, జతపరచాల్సిన పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ⇔ తర్వాత రెఫరెన్స్ ఐడీ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్‌తో అప్లికేషన్ స్థితిని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ⇔ పోలింగ్‌బూత్, బీఎల్ఓ, ఈఆర్ఓ, డీఈఓ వివరాలు కూడా పొందొచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసేవారు పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటో, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేరుగా అధికారులకు దరఖాస్తు చేసుకునేవారు నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు అందజేయాల్సి ఉంటుంది. హెల్ప్‌లైన్ 1800–599–2999 ఓటరు నమోదు, చిరునామాల్లో మార్పు, పొరపాట్ల సవరణ తదితరాలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా... ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారం కావాలన్నా టోల్‌ఫ్రీ నెంబర్ 1800–599–2999కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. 1950 నెంబర్‌కు ఫోన్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఈ హెల్ప్‌లైన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ఏ ఫారం దేనికి? ⇔ ఫారం 6 – కొత్తగా ఓటు నమోదు, ఒక నియోజకవర్గం నుంచి మరోనియోజకవర్గానికి చిరునామా మార్పు. ⇔ ఫారం 6ఎ – ప్రవాస భారతీయులునగరంలో ఓటరుగా నమోదుచేసుకోవడానికి ⇔ ఫారం 7 – జాబితాలో పేరు తొలగింపు కోసం, ఎవరి పేరుపై అయినాఅభ్యంతరాలకు ⇔ ఫారం 8 – జాబితాలో పొరపాట్లసవరణకు ⇔ ఫారం 8ఎ – ఒకే అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇల్లు మారిన వారు చిరునామాలో మార్పు కోసం సమర్పించాలి. హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలు –3,826 ⇔ గతంలో 3,761 మాత్రమే ఉండగా... ప్రజల సౌకర్యార్థం 65 కేంద్రాలు అదనంగా పెంచారు. ⇔ నియోజకవర్గానికి ఒకరు చొప్పున జిల్లాలోని 15 నియోజకవర్గాలకు 15మంది ఓటరు నమోదు అధికారులు(ఈఆర్ఓ) ఉన్నారు. వీరు కాకుండా 32మంది సహాయ ఈఆర్ఓలు, 575మంది సూపర్వైజర్లు, పోలింగ్ కేంద్రానికి ఒకరు చొప్పున 3,826 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారు. ⇔ క్లెయిమ్స్, అభ్యంతరాలను 1,581 ప్రాంతాల్లోని ఓటరు నమోదు కేంద్రాల్లోఈ నెల 25 వరకు స్వీకరిస్తారు. -
ఎన్నారైలకు ఓటు నమోదు అవకాశం
ప్రవాస భారతీయులు ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు జాతీయ ఓటర్ సర్వీస్ పోర్టల్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950(ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్) ప్రకారం ఎవరైనా తమ సాధారణ నివాసంలో ఆరు నెలలకు పైగా లేనట్లయితే వారి పేరు ఓటరు జాబితా నుండి తొలగిస్తారు. సైన్యం, భద్రతా దళాలలో పని చేసేవారికి నివాసం విషయంలో మినహాయింపు ఇచ్చి ‘సర్వీస్ ఓటర్’ గా నమోదు చేస్తారు. తమ సాధారణ నివాసమైన గ్రామం లేదా పట్టణం నుండి వేరే ప్రాంతానికి వలస వెళ్లి ఆరు నెలలకు పైగా వాపస్ రానివారు, విదేశాలకు వలస వెళ్లిన ఎన్నారైల పేర్లు కూడా ఓటరు జాబితా నుండి తొలగిస్తారు. 2010లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణ సెక్షన్ 20-ఎ ప్రకారం 18 సంవత్సరాలు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశంలో 'ఓవర్సీస్ ఎలక్టర్స్' గా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ప్రవాస భారతీయులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ పాస్‌పోర్టులో పేర్కొన్న చిరునామా ప్రకారం సంబంధిత శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి భారత ఎన్నికల సంఘం వారి ఫారం 6-ఎను ఆన్లైన్ నింపి తమ దరఖాస్తులను సమర్పించాలి. ఒక కలర్ ఫోటో (3.5 x 3.5 సైజు), పాస్‌పోర్టు, వీసా పేజీ కాపీలను అప్లోడ్ చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత భారతదేశంలోని చిరునామాలో బంధువులను విచారిస్తారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఏడు రోజుల్లో ఓటరుగా నమోదు చేస్తారు. ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు. “ఓవర్సీస్ ఎలక్టర్స్(ప్రవాసి ఓటర్లు)గా నమోదు అయినవారు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్‌కు స్వయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. వీరికి ఓటరు గుర్తింపు కార్డు జారీ చేయరు. కాబట్టి, ఒరిజినల్ పాస్‌పోర్ట్ చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. వీరికి ఎన్నికలలో పోటీ చేసే హక్కుతో పాటు సాధారణ ఓటరుకు ఉండే అన్ని హక్కులు సమానంగా ఉంటాయి. ఎన్నారైలు 'ప్రాగ్జీ' (ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) విధానాన్ని అమలు చేసే అవకాశాలను భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. పోస్టల్ బ్యాలెట్, ఈ-బ్యాలెట్ (ఆన్లైన్ ఓటింగ్) లేదా ఎంబసీల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని ప్రవాసులు కోరుతున్నారు. విదేశాల్లో ఉంటూ స్వదేశంలో జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తే ఎన్నారైలు భారత ఎన్నికలను ప్రభావితం చేయగలుగుతారు. ఆన్లైన్లో ఇలా నమోదు చేయాలి.. భారత ఎన్నికల సంఘం వెబ్సైట్ లింకు http://www.nvsp.in/Forms/Forms/form6a?lang=en-GB ను క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఫామ్ 6ఎ కనిపిస్తుంది. ముందుగా ఓటరు నమోదు అధికారి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ(పాస్‌పోర్ట్ ప్రకారం), ఆ ఊరిలో ఉన్న ఒక బంధువు పేరు, బంధుత్వం నమోదు చేయాలి. పుట్టిన స్థలం, జిల్లా, రాష్ట్రం, లింగం(స్త్రీ, పురుష, ఇతర), ఈ-మెయిల్, ఇండియా మొబైల్ నెంబర్‌ను పేర్కొనాలి. ఇండియాలోని చిరునామా(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా) ఇంటి నెంబర్, వీధి పేరు, పోస్టాఫీసు పేరు, గ్రామం/ పట్టణం, జిల్లా, పిన్ కోడ్ తెలియజేయాలి. పాస్ పోర్ట్ నెంబరు, పాస్ పోర్ట్ జారీ చేసిన ప్రదేశం పేరు, పాస్ పోర్ట్ జారీ చేసిన తేదీ మరియు గడువు ముగిసే తేదీ, వీసా నెంబర్, వీసా క్యాటగిరీ (సింగిల్ ఎంట్రీ / మల్టిపుల్ ఎంట్రీ / టూరిస్ట్ / వర్క్ వీసా), వీసా జారీ చేసిన తేదీ మరియు గడువు ముగిసే తేదీ, వీసా జారీ చేసిన అథారిటీ పేరు తెలియజేయాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు కావడానికి గల కారణం ఉద్యోగం కొరకా, విద్య కొరకా, లేదా ఇతర కారణాలా వివరించాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు అయిన తేదీ పేర్కొనాలి. విదేశంలో నివసిస్తున్న ప్రదేశం యొక్క పూర్తి పోస్టల్ అడ్రస్ అనగా ఇంటి నెంబర్, వీధి, గ్రామం/ పట్టణము, రాష్ట్రం, దేశం, పిన్ కోడ్లను నమోదు చేయాలి. 3.5 x 3.5 సైజు (పాస్ పోర్ట్ సైజు) గల కలర్ ఫోటో, చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్టు, వీసా పేజీలను జెపిజి(ఇమేజ్) ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. దరఖాస్తుదారు ఇవ్వాల్సిన డిక్లరేషన్(వాంగ్మూలం) : నాకు తెలిసినంతవరకు ఈ దరఖాస్తులో పేర్కొన్న వివరాలు నిజమైనవి. నేను భారత పౌరుడిని. నేను ఇతర దేశం యొక్క పౌరసత్వాన్ని కలిగిలేను. ఒకవేళ నేను విదేశీ పౌరసత్వం పొందినట్లయితే వెంటనే భారత రాయబార కార్యాలయానికి తెలియజేస్తాను. ఒకవేళ నేను భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి సాధారణ నివాసిగా మారినట్లయితే మీకు వెంటనే తెలియజేయగలను. ఓటరు నమోదు కొరకు ఇతర నియోజకవర్గాలలో దరఖాస్తు చేసుకోలేదు. ఇది వరకు నాకు ఓటరు గుర్తింపు కార్డు ఉన్నట్లయితే దానిని మీకు వాపస్ చేస్తాను. తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 సెక్షన్ 31 ప్రకారం నేను శిక్షార్హుడిని అని నాకు తెలుసు. - మంద భీం రెడ్డి, ప్రవాసి మిత్ర 9849422622 -
ఓటరు నమోదుకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యువకులతోపాటు ఇంకా ఓటరుగా నమోదు కాని వ్యక్తులకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పించింది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఓటరు జాబితాల సవరణకు విస్తృత రీతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ప్రకటించింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాల సవరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఓటరుగా నమోదు చేసుకునేందుకు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలు, దిద్దుబాట్ల కోసం ఇదే గడువులోగా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఆన్లైన్లో ఓటరుగా నమోదు కావడానికి http:// www.nvsp.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 21 నుంచి వచ్చే నెల 30 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి ప్రస్తుత ఓటరు జాబితాలను పునఃపరిశీలిస్తారు. జూన్ 16 నుంచి జూలై 14 వరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పోలింగ్ కేంద్రాల భవనాల పరిశీలన జరుపుతారు. జూలై 2 నుంచి 31 వరకు ఓటరు నమోదు కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఓటరు నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలు, దిద్దుబాట్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తులను నవంబర్ 30 నాటికి పరిష్కరిస్తారు. వచ్చే ఏడాది జనవరి 4న ఓటరు తుది జాబితాను ప్రచురిస్తారు. -
ఓటరు నమోదుపై దృష్టి సారించండి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పోలింగ్‌బూత్‌కు సంబంధించిన ఓటరు లిస్టును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. మరోవైపు రాష్ట్రంలోని రైతుల సమస్యల పరిష్కారం, సలహాల కోసం కాంగ్రెస్ పార్టీ రైతు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. 040–24601254 నంబర్‌తో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్‌లైన్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో ప్రారంభించారు. . -
కాబూల్‌లో మళ్లీ ఆత్మాహుతి దాడి
కాబూల్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఆత్మాహుతి దాడితో అఫ్గానిస్తాన్ మరోసారి ఉలిక్కి పడింది. ఆ దేశ రాజధాని కాబూల్‌లోని ఓ ఓటరు నమోదు కేంద్రం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. 112 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో అధికశాతం మహిళలు, పిల్లలే ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ స్పష్టం చేసింది. దాడితో ఘటనాస్థలంలో భీతావహ వాతావరణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న రెండంతస్తుల భవనంతోపాటు అక్కడ ఉన్న పలు కార్లు ధ్వంసమయ్యాయి ఓటరు నమోదు కార్యాలయం ప్రధాన ద్వారం వద్దే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు కాబూల్ పోలీస్ చీఫ్ దావూద్ అమీన్ తెలిపారు. ఈ దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. బాంబు దాడిని నాటో ఖండించింది. ‘ఈ హింస అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను వ్యతిరేకించే శక్తుల అమానుషత్వాన్ని, పిరికితనాన్ని తేటతెల్లం చేస్తుంది’ అని అమెరికా అంబాసిడర్ జాన్ బాస్ ట్వీటర్లో పేర్కొన్నారు. మరోచోట ఆరుగురు దుర్మరణం కాబూల్‌లోని బగ్లాన్ ప్రావిన్స్‌లో రోడ్డు పక్కన జరిగిన మరో బాంబు దాడిలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఈ రెండు దాడులను తీవ్రంగా ఖండించారు. వరుస దాడులు అక్టోబరు 20న జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి అఫ్గాన్ ప్రభుత్వం ఈ నెల 14 నుంచి దేశవ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కాబూల్‌లో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. పోలింగ్ కేంద్రాలకు రక్షణ కల్పించడం అఫ్గాన్ పోలీసులకు సమస్యగా తయారైంది. -
ఆత్మాహుతి దాడిలో 31మంది మృతి
కాబూల్ : ఆత్మాహుతి దాడితో అఫ్గానిస్తాన్ మరోసారి ఉలిక్కిపడింది. తాజాగా అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మృతి చెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు. కాబూల్‌లోని ఓటరు నమోదు కేంద్రం ప్రవేశ మార్గంలో ఈ దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ దాడికి పాల్పడింది ఎవరనేది తెలియరాలేదు. తాలిబన్ ఉగ్ర సంస్థ మాత్రం దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అక్టోబర్‌లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 14 నుంచి దేశవ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఓటరు నమోదు కేంద్రం వద్ద ఉన్న జనసమూహాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ గుర్తు తెలియని దుండగుడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. చివరిసారిగా కాబూల్‌లో ఈ ఏడాది మార్చి 21న ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో 29 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. -
ఏడాదంతా ఓటర్ల నమోదు సాధ్యమా?: కేంద్రం
న్యూఢిల్లీ: వయోజనులు ఏడాదిలో ఎప్పుడైనా ఓటరుగా నమోదుచేసుకునే అవకాశాల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కేంద్రం కోరింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం..జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు మాత్రమే ఆ ఏడాది ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు. జనవరి 1 గడువు దాటిన తరువాత వయోజనులైతే ఇక వారు తదుపరి ఏడాదే నమోదుచేసుకోవాలి. గతంలో ఓటరు నమోదుకు ఈసీ నాలుగు కటాఫ్ తేదీలుగా జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1ని ప్రతిపాదించగా, కేంద్రం జనవరి 1, జూలై 1లకు సమ్మతించింది. కానీ ఇప్పుడు 18 ఏళ్లు నిండిన వాళ్లు ఏడాదిలో ఎప్పుడైనా ఓటరుగా నమోదుచేసుకునేందుకున్న అవకాశాలను పరిశీలించాలని ఈసీకి సూచించింది. -
ఓటరు నమోదు పెంపునకు క్లబ్‌లు
నల్లగొండ: దేశవ్యాప్తంగా ఓటరు నమోదు ప్రక్రియను పెంచేందుకు భారత ఎన్నికల కమిషన్ యువతను లక్ష్యంగా చేసుకుంది. రానున్న రోజుల్లో యువ ఓటర్లు కీలకంగా మారనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కొత్తగా క్లబ్‌ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. దీనికి సంబంధించి జిల్లాలోని ఎన్నికల విభాగాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో యువతీ, యువకులను టీములుగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా క్లబ్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. నిరక్షరాస్యులైన వారి కోసం ‘చునావో పాఠశాల’పేరుతో పోలింగ్ స్టేషన్ల పరిధిలో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ శాఖలు, ఉద్యోగ సంఘాలు కూడా ‘ఓటర్ అవేర్నెస్ ఫోరం’లు నెలకొల్పాలి. ఈ క్లబ్‌ల ద్వారా ఓటరు నమోదు పెంచడంతోపాటు, ఓటు ప్రాధాన్యతపై యువకుల్లో అవగాహన కలిగించాలి. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలన్నది ఎన్నికల సంఘం అంతిమ లక్ష్యం. భవిష్యత్ ఓటర్ల కోసం: విద్యార్థులను భవిష్యత్ ఓటర్లుగా మార్చేందుకు పాఠశాలలు, కళాశాలల్లో క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో 9,10 తరగతి విద్యార్థులు, కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులతో కలిపి క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. వీటికి టీచరు, అధ్యాపకుడు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఓటరు విధానం, నమోదు ప్రక్రియ, ఎన్నికలు జరిగే విధానంపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తారు. ఉద్యోగుల క్లబ్‌లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వేతర సంఘాలు క్లబ్‌లను ఏర్పాటు చేయాలి. వీటిని ఓటరు అవేర్నెస్ ఫోరం(వీఏఎఫ్) అని పిలుస్తారు. ప్రభుత్వశాఖలవారీగా ఫోరంలు ఏర్పా టు చేసుకోవాలి. సంబంధిత శాఖ అధికారి ఫోరానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. 25 నాటికి పూర్తి చేయాలి మొదటి విడత జిల్లాలో 30 శాతం విద్యాసంస్థల్లో క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. ఈ నెల 25 నాటికి మొత్తం క్లబ్‌ల నియామకం పూర్తి చేయాలి. ఆ తర్వాత నుంచి ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు విద్యాసంస్థల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా కమిటీ క్లబ్‌ల పర్యవేక్షణకు జిల్లాస్థాయిలో కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా డీఆర్వో, సభ్యులుగా ఆర్డీఓలు, జెడ్పీసీఈఓ, డీఈఓ, ఆర్ఐఓ, వయోజన విద్యాధికారి, డీడబ్ల్యూఓ, డీఎంహెచ్ఓ, డీఏఓ ఎన్ఐసీ, స్పోర్ట్స్ అధికారి, ఎన్జీ కాలేజీ ప్రిన్సిపల్, బాలికల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ఉంటారు. కొత్త ఓటర్ల నమోదుకు.. డిగ్రీ, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను కొత్త ఓటర్లుగా నమోదు చేసేందుకు డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, మెడిసిన్ కాలేజీల్లో క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించేందుకు ఈ క్లబ్‌లు దోహద పడతాయి. ఎంపిక చేసిన విద్యార్థులతో క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. అధ్యాపకులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. చునావో పాఠశాల పట్టణాల్లో, గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల పరిధిలో నిరక్షరాస్యులైన వారు, చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి ఓటర్లుగా నమోదు చేయాలి. వీటిని చునావో పాఠశాలగా పిలు స్తారు. వీటికి పీఎస్ పరిధిలోని బూత్ స్థాయి అధికారి నోడల్ అధికారిగా పనిచేయాలి. -
ఓటరు నమోదుకు స్పెషల్ డ్రైవ్
విజయనగరం కంటోన్మెంట్: ఓటరు నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డీఆర్వో శ్రీలత చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18–21 ఏళ్లలోపు యువతను గుర్తించి ఓటు నమోదు చేసేందుకు జూలై 1 నుంచి 31 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రస్థాయి నుంచి బీఎల్ఓల వరకు అధికారులు ప్రజల ఇంటికి వెళ్లి ఓటర్లను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం లాంటి పనులు చేయాలన్నారు. ఈ మేరకు ఈ మధ్య కాలంలో విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. వివిధ కాలేజ్‌ల ప్రిన్సిపాల్స్‌కు కూడా ఓటరు నమోదుపై ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సెల్ విభాగం పర్యవేక్షకురాలు వైఆర్కే వాణి, టీడీపీ తరుపున ఐవిపి రాజు, వైఎస్సార్ సీపీ తరపున ఎస్‌వివి రాజేష్, ఎం. అప్పలనాయుడు, బీఎస్పీ తరుపున ఆర్జి శివప్రసాద్, సీపీఎం తరుపున రెడ్డి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు నమోదుపై ప్రచారం నిర్వహించండి
– 11న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం – వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ల జాబితా సవరణ, ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి స్పందన అంతంతమాత్రంగానే ఉందని, దీనిపై అన్ని వృత్తి విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా ప్రోత్సహించాలన్నారు. అన్ని విద్యా సంస్థల్లో ఫారం–6 దరఖాస్తులను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ నెల 11వ తేదీని ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటరు నమోదు దినంగా ప్రకటించిందని, ఆ రోజునా అన్ని పోలింగ్ కేంద్రాలను తెరచి ఉంచి ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. ఎంఎల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయులు, పట్టభద్రుల నుంచి ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తులను గురువారం సాయంత్రం వరకు స్వీకరించాలని తెలిపారు. బీఎల్ఓలకు గౌరవ వేతనాలు చెల్లించేందుకు విడుదల చేసిన బడ్జెట్ ల్యాప్స్ కాకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కర్నూలు నుంచి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఫారం–6 దరఖాస్తులు 22605, ఫారం–7 దరఖాస్తులు 415, ఫారం–8 దరఖాస్తులు 7570, ఫారం–8ఎ దరఖాస్తులు 355 వచ్చాయన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, అన్ని నియోజకవర్గాల ఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. -
5లోగా నమోదు చేసుకోండి
ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదుకు ఈనెల 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఉభయ రాష్ట్రాల్లోని ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు, కడప–అనంతపురం–కర్నూలు, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రైవేటు ఎయిడెడ్, ఎయిడెడ్ స్కూల్ టీచర్లు కూడా అర్హులని చెప్పారు. -
31 నుంచి ఓటరు నమోదు: భన్వర్ లాల్
సాక్షి, తిరుమల: 2017 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ ఈ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభిస్తామని ఆయన తిరుమలలో వెల్లడించారు. బుధవారం తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ అన్ని మండల కేంద్రాలు, ఆర్డీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. -
ట్రంప్‌కు కన్నబిడ్డలే ఓటెయ్యరట!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న రిపబ్లికన్ పార్టీ వివాదాస్పద అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు సొంతింట్లోనే ఆదరణ కరువైంది. ఆయన కన్నబిడ్డలే ఆయనకు ఓటేసే పరిస్థితి లేకుండా పోయింది. ఓటు నమోదుకు విధించిన ఆఖరు తేది నాటికి ట్రంప్ కుమార్తె, కుమారుడు ఓటు నమోదు చేసుకునే విషయంలో విఫలమయ్యారు. దీంతో న్యూయార్క్‌లో ఏప్రిల్ 19న జరిగే ప్రైమరీ ఓటింగ్‌లో తమ తండ్రికి ఓటేసి అవకాశం కోల్పోయారు. ట్రంప్‌కు ఇవంకా, ఎరిక్ ట్రంప్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 'వాస్తవానికి వారు ఓటు నమోదుచేసుకునేందుకు చాలా సమయం ఉంది. కానీ, సరైన నియమ నిబంధనలు తెలియక వారు ఓటు రిజిస్ట్రేషన్ లో విఫలమయ్యారు' అని ట్రంప్ స్వయంగా చెప్పారు. 'వారు ఈ ఘటనపట్ల ఎంతో బాధపడుతున్నారు. అయినా ఏం ఫర్వాలేదు. నేను అర్ధం చేసుకోగలను. ఒక ఏడాది ముందే ఓటు నమోదుచేసుకోవాల్సి ఉండేది. కానీ అలా చేయలేదు. అందుకే ఎరిక్, ఇవాంక ఓటు వేయలేకపోవచ్చు' అని ట్రంప్ చెప్పాడు. సాధారణంగా న్యూయార్క్‌లో ఓటు ఉపయోగించుకునే వారు ఓటు సమయానికి కొద్ది నెలల ముందే పార్టీ తరుపునగానీ, పార్టీ మారుతున్న దస్త్రంపై గానీ నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి వారికి అక్టోబర్ 9, 2015ను ఓటు నమోదుచేసుకునేందుకు ఆఖరు తేదిగా నిర్ణయించారు. కాగా, ట్రంప్‌తో పాటు ప్రచారంలో పాల్గొన్న కుమార్తె, కుమారుడు ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో విఫలం కావడంతో వారికి ఇచ్చే అలవెన్సులు కట్ చేస్తానంటూ ట్రంప్ జోక్ చేశాడు. -
మోగిన నగారా
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల పోలింగ్ ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం అమలులోకి వచ్చిన ‘కోడ్’ ఇంకా ఓటరు నమోదుకు అవకాశం తుది ఓటర్ల జాబితా ప్రకారం మూడు జిల్లాల పరిధిలో 1,33,506 మంది ఓటర్లు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 46,291, వరంగల్ జిల్లాలో 44,512, ఖమ్మం జిల్లాలో 42,703 ఓటర్లు ఉన్నారు. మూడోసారి పోరు శాసన మండలిని పునరుద్ధరించిన తర్వాత వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగిన రెండుసార్లు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన కపిలవాయి దిలీప్‌కుమార్ గెలుపొందారు. ఈయన పదవీకాలం 2015 మార్చిలో ముగుస్తోంది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇ వే కావడంతో రాష్ట్రం, కేంద్రం అధికారంలో ఉన్న టీ ఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా యి. ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎన్నికలైనా రాజకీయరంగును పులుముకోనున్నారుు. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఓటర్ల నమోదును ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావును ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి మద్దతుగా నిలుస్తోంది. ఆశావహులు టీఆర్ఎస్ పార్లీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బండ నరేందర్‌రె డ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు ముందు వరుసలో ఉన్నారు. ఇంకా టీఆర్ఎస్కు అ నుబంధంగా ఉండే తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, సాధారణ ఎ న్నికల్లో నల్లగొండ ఎంపీగా పోటీ చేసిన రాజేశ్వరరె డ్డి, తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం అధ్యక్షుడు ఎస్.సుందర్రాజు, రిటైర్డ్ లెక్చరర్ పులి సారంగపాణి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరిలో బండ నరేందర్‌రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు అధికంగా ఉన్నారుు. కాంగ్రెస్ పార్టీ నుంచి బండా ప్రకాశ్ పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ రంగల్ జిల్లాతో పోల్చితే ఖమ్మం, నల్గొండ జిల్లాలో వామపక్ష పార్టీలకు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఈ పార్టీల తరఫున పోటీ చేసే అవకా శం ఖమ్మం, నల్లగొండ నేతలకే దక్కే అవకాశం ఉం ది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఎం పీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోషించే పాత్ర కీలకం కానుంది. ఓటర్ల నమోదుకు అవకాశం జిల్లాలో ఇప్పటివరకు ఓటర్లుగా అర్హత ఉండి నమోదు చేసుకోని పట్టభద్రుల కోసం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 01-11-2014 నాటికి దేశంలోని ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభ్రులై ఉన్నా, అందుకు సమానమైన విద్యార్హతలు ఉన్నా, ఫారం18 ద్వారా సంబంధిత రుజువులు జత చే స్తూ ఓటుకోసం దరఖాస్తు సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ద్వారా ఓటు నమోదుకోసం దరఖాస్తు చేసుకునేవారు ఠీఠీఠీ.ఛిౌ్ఛ్ట్ఛ్చజ్చ్చ.జీఛి.జీ వెబ్ సైట్లోకి లాగిన్ అయి పారం పూర్తిచేయవచ్చు. ఇందులో ఓటు నమోదు కోసం ఫారం-18, తొలగింపుల కోసం ఫారం-7, సవరణ కోసం ఫారం-8, ఒక నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం నుంచి ఇంకో నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి మారడానికి ఫారం-8(ఏ) పూర్తి చేయాలి. ‘కోడ్ ’ కూసింది.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. నియమావళి మార్చి 23 వరకు అమలులో ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ నల్గొండ ప్రధాన కేంద్రంలో చేపడతారు. వరంగల్, ఖమ్మం డీఆర్వోలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. -
ఓటర్ నమోదును ప్రోత్సహించండి
విజయనగరం కంటోన్మెంట్ : ఓటర్ నమోదును ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఓటర్ జాబితా పరిశీలకుడు, ఆర్డబ్ల్యూఎస్ విభాగం కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులు, రాజకీయ పక్షాలతో ఓటర్ జాబితా ఎన్రోల్మెంట్ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదుపై సలహాలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు భవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, ఓటర్ నమోదు కోసం వివిధ కాలేజీల్లో గతంలో డ్రాప్ బాక్స్లుండేవని, ఇప్పుడవి లేకపోవడంతో యువత నుంచి స్పందన రావడం లేదని చెప్పారు. ఇంటర్నెట్లో ఓటరు నమోదుకు అవకాశం ఉన్నప్పటికీ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని, దీనివల్ల అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. కేంద్రాల వద్ద బీఎల్వోలు కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు. దీనికి జవహర్‌రెడ్డి స్పందిస్తూ ఓటరు నమోదుకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ నాయక్‌ను ఆదేశించారు. కలెక్టర్ నాయక్ మాట్లాడుతూ, అన్ని కాలేజీల్లోనూ డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అంతే కాకుండా ఓటరు నమోదుకు గతంలో తాము తీసుకున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమీక్షలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. గొట్లాం పోలింగ్ బూత్ సందర్శన .. సమీక్ష సమావేశం అనంతరం జవహర్ రెడ్డి గొట్లాంలోని పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. అక్కడి బీల్వోలతో మాట్లాడారు. ఓటరు నమోదుకు అర్హులను ఎలా గుర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొండపల్లి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఓటరు దరఖాస్తులు, వివిధ క్లైములు, అప్డేషన్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్ సైనీ, సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, డీఆర్వో వై నరసింహారావు, ఆర్డీఓ జె. వెంకటరావు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఓటర్లుగా నమోదు చేయించాలి
హాలియా : దేశంలోని ఏదేని యూనివర్సిటీ నుంచి 2011 నాటికి డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం హాలియాలో జరిగిన సాగర్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పారు. పట్టభద్రుల నియోజకవర్గంలో గత ఎన్నికల నాటికి 1.34లక్షల మంది ఓటర్లు ఉండగా జిల్లాలో 47వేల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. పట్టభద్రులను గ్రామాలవారీగా గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపైనే ఉందన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహ్మయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని చెప్పారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమూర్తియాదవ్, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మల్గిరెడ్డి లింగారెడ్డి, ఇస్లావత్ రాంచందర్ నా యక్, రావుల చినబిక్షం, మండల అధ్యక్షుడు రవి నాయక్, పగిళ్ల సైదులు, అనుముల శ్రీనివాసరెడ్డి, వర్రా వెంకట్‌రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బహునూతల నరేందర్ పాల్గొన్నారు. -
ఓటరు సందడి..!
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో ఓటరు సందడి మొదలు కానుంది. కొత్తగా యువతీ, యువకులు తమ ఓటును జాబితాలో నమోదు చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫొటో ఓటర్ల తుది జాబితా తయారీకి ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అర్హులు. ఈ నెల 13 నుంచి డిసెంబర్ 8 వరకు అర్హులైన యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ 8 వరకు కొనసాగనుంది. ఈ ప్రక్రియలో దాదాపు లక్ష మందిని ఓటర్లుగా నమోదు చేసేందుకు అధికారులు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లా యంత్రాంగం ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా ఆర్డీవోలకు అందజేసి ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇందులో భాగంగానే గురువారం సాయంత్రం వరకు కొన్ని మండలాలకు ముసాయిదా ఓటరు జాబితాలు అందాయి. నమోదు కోసం నాలుగు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలను సైతం నిర్వహించి లక్ష్యం చేరుకోనున్నారు. 2,257 పోలింగ్ కేంద్రాలు.. జిల్లాలో మొత్తం 2,257 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు నమోదు ప్రక్రియ జరుగనుంది. పోలింగ్ కేంద్రాలతోపాటు తహశీల్దార్, ఆర్డీవో, మున్సిపాలిటీ, మీ సేవలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెల 19న, 26న గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫొటో ఓటర్ల జాబితా ప్రకటించిన అనంతరం అన్ని గ్రామాల్లో జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పులు, తొలగింపులు, తప్పొప్పులను సరి చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రాామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఓటరు నమోదుపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కాగా, సిర్పూర్ (టి) నియోజకవర్గంలో 226 పోలింగ్ కేంద్రాలు ఉండగా, చెన్నూర్‌లో 208, బెల్లంపల్లిలో 190, మంచిర్యాలలో 245, అసిఫాబాద్‌లో 254, ఖానాపూర్‌లో 218, ఆదిలాబాద్‌లో 230, బోథ్‌లో 223, నిర్మల్‌లో 222, ముథోల్‌లో 241 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. షెడ్యూల్ ఇదీ.. ఈ నెల 13న ముసాయిదా ఫొటో ఓటరు జాబితా విడుదల ఈ నెల 13 నుంచి డిసెంబర్ 8 వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగనుంది. ఇందులో కొత్తగా, మార్పులు, చేర్పులు, తొలగింపులు, తదితర వాటి కోసం అధికారులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెల 19న, 26న గ్రామ పంచాయతీలలో, సభలలో ఓటర్ల జాబితా ప్రకటించడం. అనంతరం ఓటర్ల జాబితా చదివి విన్పించడం. చదివిన ఓటరు జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నట్లైతే.. పేరుండి ఫొటో లేనట్లైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 16న, 23న, 30న, డిసెంబర్ 7న నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తారు. నమోదు ప్రక్రియ ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి, తప్పొప్పులను సరి చేసిన అనంతరం తయారు చేసిన ఓటరు జాబితాను డిసెంబర్ 22న ప్రకటిస్తారు. 2015 జనవరి 5లోగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో కొత్త ఓటర్ల వివరాలను అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన నెల రోజులలోపు సంబంధిత ఓటరుకు ఎన్నికల కమీషన్ నుంచి ఓటరు గుర్తింపు కార్డు రానుంది. 2015 జనవరి 15న తుది జాబితాను విడుదల చేస్తారు. -
'ఓటరు నమోదుకు ఇదే చివరి అవకాశం'
-
యువతా మేలుకో..
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఎన్నికల వేళ ఓటరు ప్రాధాన్యత పెరిగింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు, ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఇతరులకు వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఓటరుగా నమోదయ్యేందుకు వచ్చే నెల 19వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ నెల 9వ తేదీని ప్రత్యేక ఓటరు నమోదు దినంగా ప్రకటించింది. 18-19 ఏళ్ల యువతీ యువకుల ఓటరు నమోదు జిల్లాలో అతి తక్కువగా ఉంది. ఈ వయసు గ్రూపు యువతీ యువకులు దాదాపు 3 లక్షల మంది ఉండగా.. 71,577 మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. మిగిలిన వారంతా ఆదివారం పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటన్నిటిని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరచి ఉంచాలని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుందని.. అందులో పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవచ్చన్నారు. ఒకవేళ లేకపోతే అక్కడే ఫారం-6 దరఖాస్తు పూర్తి చేసి అందజేయాలన్నారు. అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
ఓటరు నమోదుకు నేడే తుది గడువు
ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం చివరి అవకాశం కల్పించింది. ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని 2,990 పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ లెవల్ అధికారులు ఓటరు దరఖాస్తు ఫారాలతో అందుబాటులో ఉండనున్నారు. వీరివద్ద తాజాగా(31-01-2014) సవరించిన ఓటర్ల జాబితా ఉంటుంది. ఇందులో పేరున్నది... లేనిది... ఓ సారి సరిచూసుకుంటే ఎన్నికల రోజు ఏ టెన్షన్ లేకుండా ఓటేయొచ్చు. జాబితాలో మీపేరు తప్పుగా ఉన్నా... ఫొటో వేరే వారిది ఉన్నా.... మీ చిరునామాలో మార్పులున్నా... బూత్ లెవల్ అధికారి వద్ద ఉన్న ఫారం పూరి ్తచేసి వారికే ఇస్తే సరిపోతుంది. పోలింగ్‌కు ముందే అధికారికంగా ప్రకటించే ఓటర్ల జాబితాలో మీ పేరుంటుంది. ఫొటో గుర్తింపు కార్డు కూడా పొందే వీలుంటుంది. తర్వాత చేస్తే... ప్రస్తుతం ఎన్నికల ప్రకటన విడుదల సమయంలో ఎన్నికల సంఘం చెప్పినట్లు నామినేషన్లు వేసే ముందు రోజు వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పులూ సవరించుకోవచ్చు. అరుుతే వారి పేరు జాబితాలో కాకుండా... అదనపు జాబితాలో చేరుస్తారు. ఆ జాబితాలో వారి పేరు మాత్రమే ఉంటుంది. ఫొటో ఉండే అవకాశం తక్కువ. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే... ఆదివారం ఆయూ పోలింగ్ కేంద్రాల పరిధిలోని బీఎల్ఓ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవడం శ్రేయస్కరం. ఏ ఫారం ఎందుకంటే... ఫారం-6 : కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వారు ఫారం-6 పూర్తి చేయూలి. దీంతోపాటు మీ చిరునామా రుజువు కోసం కరెంటు బిల్లు, రేషన్‌కార్డు, ఇంటి పన్ను రసీదులలో ఏదేని ఒకదాన్ని జతచేయూలి. వీటితోపాటు ఒక పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఫారానికి అతికించాలి. సంతకం తప్పనిసరిగా చేయాలి. 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు వయసు ధ్రువీకరణ నిమిత్తం ఎస్సెస్సీ మెమో జీరాక్స్ జతచేయాలి. ఫారంలో మీ సెల్ నంబర్ రాస్తే సమాచారం కోసం ఉపయోగపడుతుంది. ఫారం-7 : జాబితాలోంచి పేరు తొలగించడానికి ఇది ఉపయోగ పడుతుంది. జాబితాలో మీ పేరు రెండు చోట్ల ఉన్నా... ప్రస్తుతం ఉన్నచోట తొలగించాలన్నా.. ఫారం-7 పూర్తి చేసి ఇవ్వాలి. దరఖాస్తు పూర్తిగా నింపి సంతకం చేయాలి. తొలగింపుకోసం ఓటరు స్వయంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫారం-8 : సవరణల కోసం ఇది ఉపయోగ పడుతుంది. జాబితాలో అక్షర దోషాలు, చిరునామా తప్పుగా ఉన్నా... ఫొటో పాతదిగా ఉన్నా... మీ ఫొటో ఉండాల్సిన చోట ఇతరుల ఫొటో ఉన్నా... ఫారం-8 పూర్తి చేసి, ఇందుకు అవసరమైన రుజువులు జతచేసి అధికారులకు అందజేయాలి. ఫారం-8(ఏ) : ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజక వర్గానికి పేరు మార్చుకోవడానికి ఫారం-8(ఏ)ని పూర్తి చేసి ఇవ్వాలి. ఓటర్ల జాబితాలో మీ పేరు ఏ నియోజక వర్గంలో ఉన్నది తెలియజేయాలి. అలా చేస్తే పాతచోట తొలగించి మీరు కోరుకున్న కొత్త నియోజక వర్గంో జాబితాలో మీ పేరు చేర్చుతారు. ఆన్లైన్ దరఖాస్తు ఇలా... అధికారుల వద్ద దరఖాస్తులు తీసుకుని పూర్తిచేసి ఇవ్వకుండా నేరుగా ఇంట్లోంచి కూడా ఆన్లైన్ ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఇంటర్నెట్లో ఠీఠీఠీ.ఛిౌ్ఛ్చఛీజిట్చ.జీఛి.జీ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. ఫారం-6 సెలెక్ట్ చేసుకుని పూర్తిచేసి ఒక కలర్ ఫొటోను బ్రౌజ్ చేయాలి. ఫారంలో పూర్తి వివరాలు... పేరు, ఇంటి నంబర్, తండ్రి పేరు. వయసుతో పాటు సెల్ నంబర్ తప్పనిసరి. ఓటర్ల నమోదు సమాచారం కోసం... ఓటర్ల నమోదుకు సంబంధించిన సమాచారం కోసం కలెక్టరేట్లోని టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 18004252747 నంబర్‌కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ టోల్‌ఫ్రీ నంబర్ 1950కు ఉదయం10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. జిల్లాలోని అన్ని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఫారాలు అందుబాటులో ఉన్నాయి. -
ఓటరు నమోదుకు చివరి అవకాశం
కలెక్టరేట్, న్యూస్‌లైన్:ఓటరు జాబితాలో పేర్లు లేని వారు నమోదు చేసుకోవడానికి చివరి అవకాశాన్ని కల్పిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. ఆదివారం రోజు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఫారం-6 ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం ఆమె కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,047 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధలను రాజకీయ పార్టీలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. ఓటర్లకు లంచం ఇవ్వడం, ప్రలోభాలకు గురిచేయడం, ఇతరుల ఓట్లను వినియోగించుకునేందుకు వేరేవారు ఓటర్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. పోలీసుల అనుమతి మేరకే ర్యాలీలు, సభలు నిర్వహించాలన్నారు. కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి కలెక్టర్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి జేసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. నగదు తరలింపు విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. అతిక్రమిస్తే కేసులు: ఎస్పీ ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ హెచ్చరించారు. అతిక్రమించిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్ఓ దయానంద్, వివిధ పార్టీల నాయకులు జగన్మోహన్రెడ్డి, గోపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రాజయ్య, దయానంద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పనుల పరిశీలన సమావేశం అనంతరం కలెక్టర్ స్మితా సబర్వాల్ పాత డీఆర్డీఏ కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం గోదాం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 17లోగా పనులు పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ బాల్రెడ్డికి సూచిం చారు. జిల్లాకు దాదాపు 10 వేలకు పైగా ఈవీఎంలు వస్తున్నట్టు చెప్పారు. వీటిని భద్రపర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు గోదాంలో ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్ ప్రారంభం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ స్మితా సబర్వాల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ విభాగంలోని 08455-272525 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుందన్నారు. -
ఓటర్లుగా నమోదుకు చివరి అవకాశం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో.. ఓటర్లుగా నమోదు చేసుకొనేందుకు చివరి అవకాశం కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. * రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 9వ తేదీ (ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరకు ఓటర్ల జాబితాలతో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. * జాబితాలో పేరు ఉందో లేదో చూసుకుని.. పేరు లేకపోతే అక్కడికక్కడే ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు ఓటర్‌గా నమోదుకు అవకాశం ఉంటుంది. * ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ‘వీఓటీఈ’ అని టైప్ చేసి గుర్తింపు కార్డు నెంబర్‌తో 9246280027 నెంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపితే కొద్ది సేపట్లోనే పేరు ఉందో లేదో జవాబు వస్తుంది. * పోలింగ్‌కు వారం రోజుల ముందు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేస్తారు. రెండు దఫాలు ఈ పంపిణీ జరుగుతుంది. అయినా స్లిప్‌లు అందనివారికి పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రం వద్ద ఇస్తారు. -
మరో ఛాన్స్
సాక్షి, గుంటూరు : ఓటరు నమోదుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పించింది. ఓటర్ల తుది జాబితాలో పేరు లేని వారు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే పది రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందవచ్చని వెల్లడించింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందినవారు కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనవచ్చని తెలిపింది. అయితే ఓ చోట ఓటు ఉండి మరో చోట కూడా పొందితే క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం లేకపోలేదు. జనవరి 31వ తేదీ ప్రచురించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లా జనాభాలో ఓటర్లు 70.2 శాతంగా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే తెనాలిలో 73.9 శాతంగా ఉంది. 2011 లెక్కలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఏడాదికి 2.6 శాతం పెంచి 2014 జనాభాను అంచనా చేశారు. దీని ప్రకారం తెనాలి నియోజకవర్గంలో జనాభా 3,05,149 మంది ఉంటే, ఓటర్లు 2,25,636 మంది ఉన్నారు. అంటే ప్రతి వెయ్యి మంది జనాభాలో 739 మంది ఓటర్లున్నారు. జనాభాలో ఓటర్ల శాతం 73.9 శాతంగా ఉంది. అత్యల్పంగా జనాభాలో ఓటర్లు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ 3,22,346 మంది జనాభా ఉంటే, ఓటర్లు 2,15,517 మంది ఉన్నారు. ప్రతి వెయ్యిమంది జనాభాలో 668 మందిఓటర్లున్నట్లు లెక్క. ప్రతి వెయ్యిమంది జనాభాకు పెదకూరపాడులో 712 మంది ఓటర్లు, తాడికొండలో 695, మంగళగిరిలో 670, పొన్నూరులో 726, వేమూరులో 733, రేపల్లెలో 701, బాపట్లలో 690, ప్రత్తిపాడులో 697, గుంటూరు వెస్ట్‌లో 709, చిలకలూరిపేటలో 680, నరసరావుపేటలో 681, సత్తెనపల్లిలో 699, వినుకొండలో 704, గురజాలలో 716, మాచర్లలో 702 మంది చొప్పున ఓటర్లున్నారు. జిల్లాలో సెక్స్ రేషియో 1027 గా ఉం ది. అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు 1,027 మంది మహిళలున్నట్లు అంచనా. ఇది చిలకలూరిపేట నియోజకవర్గంలో మాత్రం 1058గా నమోదైంది. వినుకొండలో తక్కువగా 1008 మంది ఉన్నారు. -
రేపు ఓటరు నమోదు కార్యక్రమం
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు.. తప్పుల సవరణలకు దరఖాస్తుల స్వీకరణ, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్‌కేంద్రాల్లో కొత్త ఓటర్ల అభినందన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్తగా ఓటరుగా నమోదైన 18 -19 ఏళ్ల వారికి ఎపిక్ కార్డులు అందజేయనున్నారు. వివరాలివీ... ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లాలోని పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 3091 పోలింగ్ కేంద్రాల్లో శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటు నమోదు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇటీవల కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకున్నవారిలో 18-19 ఏళ్ల వారికి గుర్తింపు కార్డులిస్తారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఫారం-6ను భర్తీ చేయాలి. ఇతరత్రా అవసరాల కోసం పోలింగ్స్టేషన్లలో ని సిబ్బందిని సంప్రదించి సంబంధిత ఫారం-7, ఫారం-8, ఫారం-8ఎలను భర్తీచేయాలి. పాటించాల్సినవి.. దరఖాస్తులు తప్పుల్లేకుండా భర్తీ చేయాలి. చిరునామా మారినప్పుడు, ఓటరు కార్డులోనూ దానిని సరి చేయించుకోవాలి. పాత ఇంటి చిరునామాను తొలగించుకొని, కొత్త చిరునామాతో కొత్త ఐడీ కార్డు పొందాలి. ఓటరు కార్డును అడ్రస్‌ప్రూఫ్‌గా వినియోగించుకోవాలంటే ఇంటిపేరు పూర్తిగా రాయాలి. -
ఓటుకు పోటు
సాక్షి, గుంటూరు: పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఓటు హక్కు కోసం బీఎల్వోల వద్ద, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న యువత కొత్త జాబితాలో తమ పేరు చూసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియలో భాగంగా అధికారులు ఏవో సాకులతో దాదాపు సగం దరఖాస్తులను తిరస్కరించారని, బోగస్ ఓట్ల తొలగింపుల్లో కొందరు అర్హుల ఓట్లు కూడా తొలగించారని సమాచారం. ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా జిల్లాలో 2,66,245 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు లక్షన్నర మందికే ఓటర్ల జాబితాలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. పై పెచ్చు తొలగింపులకు అందిన 24,251 దరఖాస్తులతో పాటు అధికార యంత్రాంగం సుమోటోగా తొలగించిన ఓట్ల సంఖ్య 50 వేలకు పైగా ఉన్నాయి. ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా ప్రచురించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తుది జాబితా అనంతరం మళ్లీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలకు ఓటు హక్కు దక్కుతుందో లేదోనని జిల్లా ఓటర్లు ఆందోళనలో ఉన్నారు. బోగస్ ఓట్లు, ఎలక్టోరల్ పాపులేషన్ రేషియో (ఈపీ రేషియో) పేరుతో అధికారులు తొలగింపులు అధికంగా చేపట్టినట్లు తెలుస్తోంది. పైగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారికీ జాబితాలో చోటు కల్పించారో.. లేదో.. నన్న అనుమానం వ్యక్తమౌతోంది. శుక్రవారంతో ఓటర్ల చేర్పులు, తొలగింపులపై రెవెన్యూ యంత్రాంగం విచారణ పూర్తి చేసింది. ప్రస్తుతం జాబితా ప్రచురణ కోసం కంప్యూటరైజేషన్, డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగించనున్నారు. ఈపీ రేషియో అంటే... సార్వత్రిక ఎన్నికల కోసం అధికారులు తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారు చేయాల్సి ఉంది. అర్హులైన వారికి అంటే జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఓటు హక్కు కల్పించాలి. ఎన్నికల కమిషన్ నిర్ధేశాల ప్రకారం ఈపీ రేషియో అంటే ప్రతి వంద మంది జనాభాలో 66 నుంచి 70 వరకు ఓటర్లుండాలి. జనాభాలో 70 శాతానికి మించి ఓటర్లుంటే అధికారులు అక్కడ బోగస్ ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సాకుతో అర్హులై దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించలేదు. తుది జాబితా ప్రకటించే ముందు ఎన్నికల కమిషన్‌కు జాబితా పంపి అనుమతి తీసుకోవాలి. సాధారణంగా అధికార యంత్రాంగం 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈపీ రేషియోతో సరిచూసి ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. 2011 నుంచి మూడేళ్ళ వ్యవధిలో సంబంధిత నియోజకవర్గంలో పెరిగిన జనాభాను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సుమోటో తొలగింపులు ఎక్కడ అధికం మామూలుగా బోగస్ ఓట్లు అధికారులు క్షేత్ర పరిశీలనకు వె ళ్లి నిష్పాక్షిక విచారణ జరిపితే ఎవ్వరికి అభ్యంతరం ఉండదు.అధికారులు ఈపీ రేషియో కోసమో.. అధికంగా చేర్పులకు దరఖాస్తులు అందాయోనని సుమోటో తొలగింపులు చేపట్టడంతో పాటు చేర్పులకు కొన్ని చోట్ల అవకాశం కల్పించలేదు. సవరణలకు 29,478 దరఖాస్తులు అందాయి. వీటిని ఏ మేరకు పరిగణనలోకి తీసుకున్నారో అనుమానమే. నరసరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల, పెదకూరపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లు అధికంగా ఉన్నాయని అంచనాకు వచ్చారు. చిలకలూరిపేట, మాచర్ల, వేమూరు నియోజకవర్గాల్లో అర్హులైన వారి ఓట్లు అధికంగా తొలగించినట్లు ఆరోపణలున్నాయి. పిల్లల చదువుల నిమిత్తం ఎక్కువ మంది గుంటూరులో నివాసం ఉంటున్నారని, అక్కడ ఓటు కోసం దరఖాస్తు చేసి ఇక్కడ ఓటును అలాగే ఉంచడంతో తొలగింపులు చేపట్టామనేది రెవెన్యూ యంత్రాంగం వాదన. మరో రెండు రోజులు జాబితా రూపకల్పన కోసం కసరత్తు చేసి కంప్యూటరీకరణ చేయనున్నారు. 31 నాటికల్లా ప్రచురించే తుది జాబితాలో ఎవరి ఓటుకు పోటేశారో.. వెల్లడి కానుంది. -
ప్రశాంతంగా ఒక్కలిగ సంఘం ఎన్నికలు
93.12 శాతం పోలింగ్ నమోదు సోమవారం ఓట్ల లెక్కింపు కోలారు/మాలూరు/ముళబాగిలు, న్యూస్‌లైన్ : రాష్ట్ర ఒక్కలిగ సంఘానికి సంబంధించి కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల నుంచి మూడు డెరైక్టర్ల స్థానాలకు ఆదివారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 93.12 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం గోకుల విద్యా సంస్థలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. కోలారు, చిక్కబళ్లాపురంలో మొత్తం 35500 ఓటర్లు ఉండగా 32162 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోలారులోని మహిళా సమాజ కళాశాల, సదాశివ స్మారక భవనంతోపాటు మొత్తం 19 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోలారు తాలూకాలో 9354 మంది ఓటర్లు ఉండగా 8157 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కలిగ సంఘానికి జరిగిన ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. మహిళా సమాజ తదితర పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల మద్దతు దారులు మకాం వేసి ఓటర్లను ఓటు అడగడం కనిపించింది. బరిలో 14 మంది అభ్యర్థులు : ఒక్కలిగ సంఘం డెరైక్టర్ల స్థానాలకు నిర్వహించిన ఎన్నికలో కోలారు చిక్కబళ్లాపురం నుంచి 14 మంది బరిలో ఉన్నారు. వీఈ రామచంద్ర, కేబి గోపాలకృష్ణ, హెచ్‌సీ నవీన్‌కుమార్, పి. నాగరాజ్, ఆర్.నంజుండగౌడ, డీకే రమేష్, యలువళ్లి రమేష్, డి.రామచంద్ర, టి.ఎం.రఘునాథ్, హెచ్. లోకేష్, సి.వి. లోకేష్ గౌడ, ఎన్.శ్రీరామరెడ్డి, ఎం.ఎల్. సతీష్, ఎం.ఎన్. సదాశివరెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 14 మందిలో ఎక్కువ ఓట్లు పొందిన ముగ్గురు అభ్యర్థులను ఉభయ జిల్లాల నుంచి డెరైక్టర్లుగా ఎంపిక చేస్తారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఒక్కలిగ సంఘం డెరైక్టర్ల స్థానాలకు ఆదివారం మాలూరు, ముళబాగిలులో ఎన్నికలు నిర్వహించారు. మాలూరులో బీజీఎస్ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 85 శాతం పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్యే మంజునాథ్‌గౌడ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అదేవిధంగా ముళబాగిలులోని నేతాజీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 1227 మంది ఓటర్లకుగాను 1018 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ఓటరు నమోదుకు 88,943 దరఖాస్తులు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటరు నమోదు కోసం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. ఓటరు నమోదుకు రికార్డు స్థాయిలో 88,943 దరఖాస్తులు అందాయి. కలెక్టర్ కాంతిలాల్ దండేతో పాటు పార్వతీపురం సబ్ కలెక్టర్ స్వేతామహంతి ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. గిరిజన ప్రాంతాలతో పాటు వారపు సంతల్లో ఓటరు నమోదు ఫారాలు అందుబాటులో ఉంచి కొత్త ఓటర్లను చేర్పించడంలో సఫలీకృతులయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదు కోసం మహిళలు 39,430, పురుషులు 37,523 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా 11,989 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా కురుపాం నియోజకవర్గంలో 13,729 మంది దరఖాస్తు చేసుకోగా, గజపతినగరంలో 6,486 దరఖాస్తులు మాత్రమే అందాయి. ఓటరు కార్డుల్లో తప్పుల సవరణ కోసం 6,856 మంది, చిరునామా మార్పు కోసం 4,778 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓటరు నమోదుకు విశేష స్పందన రావటంపై ఇన్చార్జి కలెక్టర్ యూసీజీ నాగేశ్వరరావు బీఎల్ఓలు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. -
వెలవెల
=మొక్కుబడిగా ఓటర్ల నమోదు =సిబ్బంది గైర్హాజరు =దరఖాస్తుల కొరత =మధ్యాహ్నానికే బూత్‌ల మూత =జనానికి తప్పని అవస్థలు సిటీబ్యూరో, న్యూస్‌లైన్ నెట్వర్క్ : మళ్లీ అదే తీరు... గ్రేటర్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమం అధికారుల తీరుతో వెలవెలబోయింది. పాతనగరం మినహా పలు చోట్ల నమోదు కార్యక్రమం పేలవంగా జరిగినట్లు ‘న్యూస్‌లైన్’ పరి శీలనలో వెల్లడైంది. సోమవారం సాయంత్రంతో ము గియనున్న ఈ కార్యక్రమంపై పోలింగ్ బూత్‌ల వారీ గా విస్తృత ప్రచారం చేయకపోవడం పెద్ద లోటుగా పరిణమించింది. చాలాచోట్ల కనీసం బ్యానర్ ఏర్పాటు చేయకపోవడం, ఆయా కేంద్రాల వద్ద మున్సిపల్ అధికారులు అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల ఓటర్ల నమోదు కార్యక్రమం అంతంత మాత్రంగానే సాగింది. పలు కేంద్రాల్లో ఫారం 6, 7, 8, 8ఏలు అందుబాటులో లేకపోవడంతో సిటీజనులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగాల్సిన కార్యక్రమం చాలా చోట్ల మధ్యాహ్నం ఒంటిగంటకే ముగిసింది. అదీ మొక్కుబడిగానే. ఓటరు నమోదు కేంద్రాలపై నమ్మకం లేక పలువురు సిటీజనులు ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ 6 ఫారాలను సమర్పించడం గమనార్హం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్,తార్నాక, మల్కాజ్గిరి, మెహిదీపట్నం, కుత్బుల్లాపూర్, బాలానగర్, చిక్కడపల్లి, అంబర్పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చాలా కేంద్రాల వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది విధులకు గైర్హాజరవడంతో కేంద్రాలు వెలవెలబోయాయి. కవాడిగూడా డివిజన్ పరిధిలో మొత్తం 29 పోలింగ్ బూత్‌లుండగా కేవలం ఒకేచోట నమోదు కార్యక్రమం జరగడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. సిబ్బంది లేమి కారణంగా వివిధ పోలింగ్ కేంద్రాలకు వచ్చిన పౌరులు నిరాశగా వెనుదిరిగారు. గత నెలలో ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు ప్రక్రియకు ఎలాంటి ప్రచారం లేకపోవడంతో నూతన ఓట్ల నమోదు కోసం ఏర్పాటుచేసిన బూత్‌లు వెలవెలబోయిన విషయం విదితమే. కాగా చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా తదితర నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో సందడి నెలకొనడం గుడ్డిలో మెల్ల. వివిధ ప్రాంతాల్లో నమోదు తీరిదీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని షేక్‌పేట మండల కార్యాలయం ఆవరణలో ఉన్న పోలింగ్ స్టేషన్లో కౌంటర్ ఏర్పాటు చేయకపోవడంతో పలువురు వెనుదిరిగారు. ఖైరతాబాద్ నియోజక వర్గం పరిధిలో 242 పోలింగ్ బూత్‌లు ఉండగా చాలా చోట్ల ఆదివారం కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. సందేహం ఉన్నవారికి సూచనలు జారీ చేయాల్సిన జీహెచ్ఎంసీ సిబ్బంది అందుబాటులో లేరు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక జనం నానా తంటాలు పడ్డారు. బర్కత్‌పుర డివిజన్లోని దీక్షా మోడల్ స్కూల్, కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, అవంతి డిగ్రీ కాలేజ్, సత్యానగర్ కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మొక్కుబడిగా ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది. కుత్బుల్లాపూర్‌లోని రంగారెడ్డినగర్, గాంధీనగర్, చింతల్, కుత్బుల్లాపూర్ పోలింగ్ స్టేషన్లలో ఉన్న బీఎల్ ఓలు ఉన్నతాధికారుల పర్యటన ముగియగానే కేంద్రాల నుంచి నిష్ర్కమించడంతో జనం ఇబ్బందులు పడ్డారు. కవాడిగూడా డివిజన్ పరిధిలో మొత్తం 29 పోలింగ్ బూత్‌లుండగా కేవలం ఒకేచోట నమోదు కార్యక్రమం జరగడంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. దరఖాస్తులేవీ? మా ఇంట్లో ఆరుగురు ఓటర్లం ఉన్నాం. కానీ ఓటర్ జాబితాలో మాత్రం కేవలం ఒకరి పేరే ఉంది. దీంతో మరోసారి మా పేర్లను దరఖాస్తు చేసుకునేందుకు వచ్చాము. ఇక్కడికి వచ్చాక దరఖాస్తు ఫారాలు అయిపోయాయంటున్నారు. నమోదు ప్రక్రియ గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించాలి. - నితిన్ శర్మ, హరిబౌలి ప్రచారమేదీ? అవగాహన లేకపోవడంతో ఇప్పటి వరకు ఓటర్‌గా పేరు నమోదు చేసుకోలేదు. ఓటరు నమోదు ప్రక్రియ ఏర్పాటు చేసినప్పుడు ఆటోల్లో, బస్తీల్లో ప్రచారం నిర్వహిస్తే బాగుంటుంది. దీంతో పాటు ఓటర్ లిస్ట్‌లలో కుటుంబ సభ్యులు పేర్లు ఉన్నాయో...? లేవో...? చూసుకోవాలనే విషయమై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - జి.నిఖిత, లాల్‌దర్వాజా -
ఆఖరి చాన్స్
=నేటితో ముగియనున్న ఓటరు నమోదు గడువు =ప్రత్యేక డ్రైవ్‌లో వేలాదిగా దరఖాస్తులు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఓటరు నమోదుకు గడువు సోమవారంతో ముగియనుంది. ఆదివారం నిర్వహించిన తుది ప్రత్యేక డ్రైవ్‌లో వేల మంది ఓటరు నమోదు, సవరణలు, తొలగింపుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అధిక శాతం ఆన్లైన్లో తమ వివరాలను పొందుపరిచారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో 2.5 లక్షల మంది కొత్త ఓటర్లు చేరే అవకాశముంది. గత నెల 18న ప్రచురించిన ఓటరు జాబితా ముసాయిదా ప్రకారం జిల్లాలో 30,76,374 మంది ఓటర్లు కాగా ఇందులో 15,33,783 మంది పురుషులు, 15,42,591 మహిళా ఓటర్లు ఉన్నారు. వరుసగా ఐదు ఆది వారాలు జిల్లాలో ఉన్న 3506 పోలింగ్ కేంద్రా ల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో 89,679 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 47 వేల డూప్లికేట్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత వారం వరకు మొత్తంగా 1.56 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఆదివారం నిర్వహించిన తుది డ్రైవ్‌లో కూడా వేల సంఖ్యల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్రాల పనితీరును పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ 50 మంది ప్రత్యేకాధికారులను నియమించారు. ఆన్లైన్ ద్వారా ఇప్పటి వరకు 90 వేల మంది వరకు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్నవారిలో అత్యధికులు యువతీ యువకులే. సో మవారంతో గడువు ముగుస్తుండడంతో మరో ఐదు వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశా లు ఉన్నాయని భావిస్తున్నారు. చివరి రోజున జీవీఎంసీ జోనల్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే త ప్పనిసరిగా సోమవారమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
అవే తప్పులు.. ఏవీ మార్పులు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదై ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విసృ్తతంగా ప్రచారం చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో అధికారులు ఓటర్లను గంపగుత్తగా తొలగించేస్తున్నారు అధికారులు. జాబితా పరిశీలనలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ అసలు ఓటర్లకు ఎసరు పెడుతున్నారు. ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో భారీగా ఓటర్లపేర్లు గల్లంతయ్యాయి. మరణించిన వారిని జాబి తాలో ఉంచేసిన అధికారులు.. బతికున్న వారి పేర్లను పెద్దఎత్తున తొలగించారు. ఎల్బీనగర్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రత్యేకాధికారులను నియమించారు. అయితే మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే తరహాలో వేలాది మంది పేర్లు తారుమారయ్యాయి. నేటితో ముగియనున్న గడువు ఓటరు జాబితాలో పేరు నమోదు, వివరాల మార్పు, చేర్పులకు సంబంధించి సోమవారంతో గడువు ముగియనుంది. ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగిస్తూ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో తుది జాబితా విడుదల చేయనుంది. ఈ జాబితా ఆధారంగానే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు హక్కును వినియోగించుకోనున్నారు. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఓటరు జాబితాపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ వేల సంఖ్యలో ఓటర్ల పేర్లు జాబితానుంచి గల్లంతు కాగా.. వాటిపై మొక్కుబడి చర్యలు తీసుకోవడం తప్పా పూర్తిస్థాయి కసరత్తును గాలికొదిలేశారు. కొన్ని రాజకీయ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ జాబితాను తారుమారు చేస్తున్నారు. నేటితో ఓటరు నమోదు గడువు ముగియనున్న నేపథ్యంలో యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తే తుది జాబితాలో లోటుపాట్లు లేకుండా రూపొందించే అవకాశం ఉంది. -
ఓటరు నమోదుకు నేడు ఆఖరిరోజు...
సాక్షి, గుంటూరు: ఓటరుగా నమోదుకు నేటితో గడువు ముగియనుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సోమవారం సాయంత్రం వరకూ కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. గడువు పొడిగించిన తరువాత ఎక్కువ మంది స్పందించి దరఖాస్తులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదు కేంద్రాల్లో శనివారం సాయంత్రం వరకు 2.17 లక్షల దరఖాస్తుల అందాయి. ఆదివారం కూడా పోలింగ్ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఫారం-6ను స్వీకరిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారందరూ కొత్తగా ఓటు కోసం ఫారం-6ను పూర్తి చేసి అందజేశారు. గుంటూరు నగర కార్పొరేషన్లో ఈ నెల 17వ తేదీ నాటికి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన 42 వేల మంది కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేయగా, గడువు పొడిగించాక ఆదివారం సాయంత్రానికి మరో మూడు వేల దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించి ఎంక్వైరీకి పంపే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.ఆన్లైన్లోనే ఎక్కువ.. ఈ సారి ఎక్కువ మంది యువకులు ఈ సారి ఆన్లైన్లోనే ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు నగరంలోని సుమారు 20 వేల మందికి పైగా యువత బీఎల్వో దగ్గరకు వెళ్లే పనిలేకుండా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ అధికారులు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. గుంటూరు నగరంలోని పలు శివారు కాలనీల్లో కొత్తగా ఇళ్లు నిర్మించుకుని నివశించే ప్రజలు ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకుంటే, వాటన్నింటి పైనా బీఎల్వోలు అభ్యంతరాలు చెబుతున్నారు. పొన్నూరు రోడ్డులోని హుసేన్నగర్లోని 70 మంది దరఖాస్తులు ఈ విధంగా తిరస్కరణకు గురై వెనక్కి వచ్చాయి. సరైన నివాస ధ్రువపత్రాలు జత చేయలేదంటూ సిబ్బంది ఫారం-6 దరఖాస్తుల్ని స్వీకరించడం లేద ని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళ్‌దాస్‌నగర్, కొండా వెంకటప్పయ్యకాలనీ, నందమూరినగర్, తుపాన్‌నగర్, ఎన్జీవో కాలనీ, రామిరెడ్డినగర్ ప్రాంతాలకు చెందిన దరఖాస్తుదారులు ఇబ్బందులు పడ్డారు. -
ఓటరు నమోదు గడువు పెంపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటరు నమోదు గడువును మరోమారు పొడిగించారు. మంగళవారంతో గడువు ముగియగా మరో ఆరు రోజులపాటు నమోదు గడువును పెంచుతున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పేరు నమోదు చేసుకోవడంతోపాటు అభ్యంతరాలు దాఖలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈఆర్ఓ లేదా బీఎల్ఓను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
7 రోజులే..
=23 వరకు ఓటరు నమోదు =ఫలించిన ప్రత్యేక డ్రైవ్.. 89,679 మంది నమోదు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఓటరు నమోదు ప్రక్రియ గడువు పొడిగించారు. ఈ నెల 23వ తేదీ వరకు కొత్త ఓటరు నమోదు, సవరణలకు అవకాశం కల్పించారు. 22వ తేదీన జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లలో తుది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. వాస్తవానికి మంగళవారంతో ఓటరు నమోదు గడువు ముగిసినప్పటికీ మరో వారం రోజుల పాటు నమోదుకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల నుంచి చేపట్టిన ఈ కార్యక్రమానికి మిశ్రమ స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వెరసి ఓటరు నమోదుకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. ప్రధానంగా యువ ఓటర్లపై దృష్టి సారించినా ఇంకా 70 శాతం వరకు యువత ఓటరుగా నమోదు కావాల్సి ఉంది. కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా యువత పెద్దగా ఆసక్తి చూపించలేదు. పర్యవేక్షణ లోపం : గత నెల 18వ తేదీన ప్రచురించిన ఓటరు జాబితా ముసాయిదా ప్రకారం జిల్లాలో 30,76,374 మంది ఓటర్లు కాగా, ఇందులో 15 లక్షల 33 వేల 783 మంది పురుషులు, 15 లక్షల 42 వేల 591 మహిళా ఓటర్లు ఉన్నారు. వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం నవంబర్ 18వ తేదీ నుంచి మరోసారి ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత నెల 24, ఈ నెల 1, 8, 15 తేదీల్లో వరుసగా నాలుగు ఆదివారాల పాటు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. తొలి మూడు వారాల డ్రైవ్‌లు నామమాత్రంగా జరిగాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చాలా పోలింగ్ కేంద్రాలు తెరుచుకోలేదు. అనేక కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచలేదు. బీఎల్ఓలు ఇష్టానుసారంగా వ్యవహరించి నమోదుకు వచ్చిన వారికి సక్రమమైన సమాచారం ఇవ్వలేదు. ఈ విషయాన్ని సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు. చివరి ఆదివారం 15వ తేదీన నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌పై శ్రద్ధ పెట్టారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ప్రత్యేకాధికారులను నియమించారు. దీంతో చివరి ఆదివారం ఒక్కరోజే అనూహ్యంగా 32,923 మంది ఓటరు నమోదు, సవరణలకు దరఖాస్తులు చేసుకున్నారు. అంతకు ముందు మూడు వారాలు నిర్వహించిన డ్రైవ్‌లలో 56,756 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 47 వేల డూప్లికేట్ కార్డులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వారు చెబుతున్నారు. యువత దూరం : కళాశాలల ప్రిన్సిపాళ్లతో అధికారులు సమావేశాలు నిర్వహించి నేరుగా విద్యార్థులకే నమోదు ఫారాలను అందజేశారు. కానీ యువత దూరంగానే ఉంది. 2011 జనాభా గణాంకాల ప్రకారం జిల్లాలో 1.71 లక్షలు యువతీ, యువకులు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 25 వేల మంది వరకు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. చివరి డ్రైవ్‌లో మరో 5 వేల మంది వరకు దరఖాస్తులు చేసుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇంకా 1.41 లక్షల మంది యువత నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆన్లైన్లో 76 వేలు : ప్రత్యేక డ్రైవ్‌లోనే కాకుండా ఈ దఫా ఆన్లైన్ ద్వారా వేల మంది ఓటరు నమోదుకు దరఖాస్తులు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు సుమారుగా 76 వేల మంది ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. నమోదుకు గడువు ముగిసిన తరువాత బీఎల్ఓలు ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పరిశీలించనున్నారు. ఇందులో 50 శాతం వరకు యువత ఉండే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. 22న మరోసారి ప్రత్యేక డ్రైవ్ : ఈ నెల 23వ తేదీ వరకు ఓటరు నమోదు, సవరణలకు గడువు పెంచుతూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22న మరోసారి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఆ తేదీన జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు, బీఎల్ఏలు అందుబాటులో ఉండనున్నారు. గడువును పెంచడంతో 2014, జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొనే వెసులుబాటు కలిగింది. జనవరి 16న తుది జాబితాను ప్రకటిస్తారు. కొత్తగా ఓటరు నమోదు చేసుకున్న వారికి పాత కార్డుల మాదిరిగా కాకుండా ఏటీఎం కార్డుల తరహాలో కొత్తగా ఓటరు కార్డులు రానున్నాయి. -
ఓటరు నమోదుకు మూడు రోజులే గడువు
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :ఒక్క వేటుతో చెట్టును పడగొట్టగలమో లేదో...కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో అవినీతి వక్షాన్ని కూల్చవచ్చు. ఆ ఒక్క ఆయుధం మన ఓటే కావచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకున్న విలువ అలాంటిది. సమసమాజ నిర్మాణం ప్రజల చేతుల్లోనే ఉంది. సచ్చీలురైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి రాజ్యాంగం ఇచ్చిన అద్భుతమైన కానుక ఓటుహక్కు. నవభారత నిర్మాణం కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందాల్సిందే. సమాజంలో ఓటుహక్కుకు ఉన్న ప్రాధాన్యతను యువత తెలుసుకోవాలి. డిసెంబర్ 17వ తేదీ వరకు... నూతన ఓటర్ల నమోదుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం కల్పించారు. బూత్‌లెవల్ ఏజెంట్లు నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరించనున్నారు. 2014 జనవరి 16వ తేదీన ఓటర్ల చివరి జాబితాను ప్రచురిస్తారు. బూత్‌స్థాయి అధికారులు, తమశీల్దార్లు, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందిస్తున్నారు. పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లు ఈ-సేవా, మీ-సేవా, ఏపీ ఆన్లైన్ సెంటర్లలో ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు ఫారం-6 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలి. ఓటరు(చనిపోయిన, నివా సం మారిన వారి)పేరును జాబితా నుంచి తొలగించుకోవడానికి ఫారం-7, జాబితాలో ఓటరు పేరు, ఫొటో, తండ్రి, భార్య, భర్త పేర్ల సవరణకు ఫారం-8, నియోజకవర్గ పరిధిలోని ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్‌స్టేషన్‌కు ఓటును మారుకునేందుకు ఫారం-8ఏ ఉపయోగించాలి. ఈ-రిజిస్ట్రేషన్ ఈజీ... ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియపై భారీ కసరత్తు చేస్తోంది. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థుల నుంచి నూతన ఓటరు దరఖాస్తులు తీసుకోవాలని జిల్లాలోని అన్ని కళాశాలల ప్రిన్సిపాల్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే మీ-సేవ, పోస్టాఫీసు, బ్యాంకుల్లో దరఖాస్తులను అందుబాటులో ఉంచింది. జిల్లాలో 87 వేల దరఖాస్తులు జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా ఓటరు నమోదుకు 87 వేల అప్లికేషన్లు అందినట్లు జిల్లా అధికారులు తెలిపా రు. ఆదివారం(నేడు) జిల్లాలోని ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటరు కార్డుతో ప్రయోజనాలు... ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవడానికి, నివాస ప్రాంతం, వయసు ధ్రువీకరణ పత్రంగా బ్యాంక్ ఖాతా తెరవడానికి, డ్రైవింగ్ లెసైన్స్, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, గ్యాస్ కనెక్షన్ పొందడానికి ఓటరుకార్డు ఉపయోగపడుతుంది. -
ఓటరు నమోదుపై దృష్టి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కలెక్టర్ కాంతిలా ల్ దండే ఎంపీడీఓలు, తహశీల్దార్లను ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి నూరు శాతం ఫోటోతో కూడిన ఓటరు జాబితా ప్రచురణకు కృషి చేయాలన్నారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డివిజన్ అధికారుల తో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ బీఎల్ఓలు అందుబాటులో లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బీఎల్ఓలు ఎక్కడ ఉంటారన్న సమాచారం లేదని... అటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకూ ప్రతీ రోజూ పోలింగ్ స్టేషన్ల ఆవరణలో బీఎల్ఓలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విచారణ జరపండి.. ఓట్ల తొలగింపు సమయంలో నివసించిన వారి ఓట్లు తొల గించినప్పుడు తప్పనిసరిగా సమాచారం అందించాలన్నా రు. ఎస్.కోటలో ఎటువంటి విచారణ లేకుండా 14 ఓట్లు తొలగించటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేయటంతో పాటూ విచారణ జరిపించాలని ఆర్డీఓ వెంకటరావును ఆదేశించారు. వివాహితుల ఓటర్ల చేర్పులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదే శించారు. ఓటరు కార్డులో సవరణలు కోసం దరఖాస్తులు చేస్తున్నప్పటికీ అవి నమోదు కావటం లేదని ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తాగునీటి పధకాలపై దృష్టి.. ప్రజల అవసరాల కోసం అమలు చేస్తున్న తాగునీటి పథకాలు త్వరితగతిన పూర్తి చేయటానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. మండలాల వారీ పథకాలు వాటి పరిస్థితిపై సమీక్షించారు. డివిజన్లో ప్రారంభం కాని 16 పనులను తక్షణమే ప్రారంభించాలని ఎస్ఇ మెహర్ప్రసాద్ను ఆదేశించారు. ఎక్కడైనా స్థలం లేక ప్రాజెక్టులు రద్దు చేస్తే తప్పనిసరిగా సంబంధిత మండల ఎంపీడీఓల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలన్నా రు. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీలకు తాగునీటి సదుపా యం ఉన్నది లేనిది పర్యవేక్షించాలన్నారు. -
ఓటరు నమోదుకు 17వరకు గడువు
ఏలూరు, న్యూస్‌లైన్:ఓటుహక్కు లేనివారంతా ఓటరుగా నమోదయ్యేందుకు భారత ఎన్నికల సంఘం ఈ నెల 17వరకు గడువు ఇచ్చిందని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. వచ్చే జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో శనివార ం విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 8, 15 తేదీలలో జిల్లాలోని 3,308 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బూత్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఓటుహక్కు పొందిన వారు జాబితాలో తమ పేర్లు ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవచ్చన్నారు. పేర్లు, చిరునామా, వయసు, ఇతర మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని సూచించారు. ఓటు నమోదు కోసం ఫారం-6, ఓటరు జాబితాలో అభ్యంతరాలు లేదా పేరు తొలగించడానికి ఫారం-7, పేర్లు, చిరునామా సవరణలకు ఫారం-8, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి లేదా ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి ఓటు మార్పు చేసుకోవడానికి ఫారం-8ఏలో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు విధిగా ఓటు హక్కు పొందేలా చూడాలని కోరుతూ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు మార్గదర్శకాలు ఇచ్చామని చెప్పారు. ఇంటి నంబర్లు లేని ఇళ్లకు వాటిని వేయాల్సిందిగా పంచాయతీ, మునిసిపల్ అధికారులకు ఆదేశాలిచ్చామని కలెక్టర్ తెలిపారు. ఓటరు కార్డులను పోగొట్టుకున్న వారు మీ సేవ కేంద్రంలో రూ.10 చెల్లించి డూప్లికేట్ కార్డులు పొందవచ్చన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు పాల్గొన్నారు. -
ఓటరు నమోదుకు మరో అవకాశం
=8, 15 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ =అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు దరఖాస్తుల స్వీకరణ =మొబైల్ రిజిస్ట్రేషన్ బృందం ఏర్పాటు =యువతపై ప్రత్యేక దృష్టి =కొత్త వారికి ఏటీఎం తరహా కార్డులు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలంటే నమోదుకు ఇదే చివరి అవకాశమని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరు నమోదు చేయించుకునే విధంగా ఈ నెల 8, 15 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరులతో జేసీ మాట్లాడుతూ గత నెల 18న ఓటరు జాబితా ముసాయిదాను ప్రచురించామన్నారు. రెండు వారాల్లో 26,851 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయా తేదీల్లో బూత్ లెవెల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని, ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరిస్తార న్నారు. ఈ నెల 8,15 తేదీల్లో జరిగే డ్రైవ్‌లో ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలు తెరవకపోయినా, నమోదు ఫారాలు లేకపోయినా సంబంధిత తహశీల్దార్‌కు లేదా డిప్యూటీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొత్తగా నమోదు ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 69 వేల దరఖాస్తులు రాగా అందులో 10 వేల మందికి సంబంధించి నమో దు ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. జిల్లాలో 47 వేల డూప్లికేట్ కార్డులు ఉన్నట్లు గుర్తించామని, వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. మొబైల్ రిజిస్ట్రేషన్ బృందం జిల్లా జనాభా గణాంకాల ప్రకారం ఇంకా 1.70 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేయించుకోవాల్సి ఉందని జేసీ తెలిపారు. నియోజకవర్గాలు, మండలాల్లో జనాభా ఆధారంగా నమోదు తక్కువున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో మొబైల్ రిజిస్ట్రేషన్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఇప్పటికే కళాశాలల్లో సమావేశాలు నిర్వహించి ఓటరుగా నమోదు కాని వారిని గుర్తించే బాధ్యతలను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు అప్పగించామని వెల్లడించారు. అవసరమైతే అధికంగా ఓటర్లు ఉన్నట్లు గుర్తించిన కళాశాలకు మొబైల్ బృందాన్ని పంపి నమోదు ప్రక్రియను చేపడతామన్నారు. ప్రధానంగా పాడేరు ఏజెన్సీలో ఓటరు నమోదు శాతం తక్కువగా ఉందని, అక్కడ నమోదు శాతం పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ పార్టీలు కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకొని ఓటరు నమోదుకు సహకరించాలని,ఎన్నికల సమయంలో ఓట్లు లేవని, గల్లంతయ్యాయని ఇబ్బందులు పడే కంటే ఇప్పుడే సరిచూసుకోవడం మంచిదన్నారు. డిసెంబర్ 17వ తేదీ వరకు ఓటరు నమోదు,సవరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కొత్తగా ఓటరు నమోదు చేసుకున్న వారికి పాత కార్డుల మాదిరిగా కాకుండా ఏటీఎం కార్డుల తరహాలో కొత్తగా ఓటరు కార్డులు వస్తాయని పేర్కొన్నారు. -
ఓటర్ల నమోదుకు కృషిచేయాలి
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా ఓటర్ల నమోదులో కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నూతన ఓటర్ల నమోదు, తొలగింపు ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని, కార్యకర్తలు దీనిని గుర్తించి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటు నమోదు చేసుకునేలా చైతన్య పర్చాలని అన్నారు. కార్యకర్తలు గడపగడపకు వెళ్లి ఓటర్ లిస్టు పరిశీలించి నమోదు, తొలగింపు వివరాలు అధికారులకు తెలియజేయాలని అన్నారు. అందులో భాగంగా ఓటర్ల లిస్టును జిల్లా కమిటీ అన్ని మండల కమిటీలకు పంపించిందన్నారు. 12వ తేదీలోగా పోలింగ్ బూత్ కమిటీలు సిద్ధం... ఈ నెల 12వ తేదీలోగా జిల్లాలో గ్రామ, పోలింగ్ బూత్ కమిటీలను నియమించాలని రాష్ట్ర కమిటీ ఆదేశించిందని, అందులో భాగంగా మండల పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలను ముందుగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కమిటీలను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సహకారంతో మండల కన్వీనర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులను సమన్వయ పర్చుకుంటూ నియమించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు పని చేయాలని అన్నారు. రైతులను ఆదుకోవడంలో విఫలం... భద్రాచలం, అశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడ్ మండలాల్లో గోదావరి వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అశ్వారావుపేట నియోజకవర్గ సమన్వయకర్త తాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ ఏడాది పలుమార్లు గోదావరికి వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ అధికారులు పంట నష్టం వేయలేదని అన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావ్, బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కడియం రామాచారి, సీనియర్ నాయకులు తాండ్ర వెంకటరమణ, ఘంటా కృష్ణ, మంత్రిప్రగడ నర్సింహారావు, కొర్సా చినబాబు దొర, హర్షవర్ధన్‌లు పాల్గొన్నారు. -
‘ఓటు’కు చేటు
=తూతూ మంత్రంగా ఓటరు నమోదు ప్రచారం =వేళకు రాని అధికారులు న్యూస్‌లైన్ నెట్వర్క్: గ్రేటర్లో ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం మొక్కుబడి తంతుగా ముగిసింది. సిబ్బంది ఉంటే దరఖాస్తులు లేని కేంద్రాలు కొన్ని.. సంబంధిత ఫారాలు ఉన్నప్పటికీ.. ఎలా భర్తీ చేయాలో వివరించే సిబ్బంది లేని కేంద్రాలు ఇంకొన్ని.. మూతపడిన పోలింగ్ కేంద్రాలు మరికొన్ని.. అవగాహన లేని అంగన్వాడీ టీచర్లతో ఫారాల భర్తీలో ప్రజలు అవస్థలు.. పలుచోట్ల ప్రచారం లేక వెలవెలబోయిన కేంద్రాలు.. వెరసి ఓట్ల నమోదుకు పక్కా ఏర్పాట్లు చేయడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారు. దీంతో ఓటు ప్రచారం కాస్త ప్రహసనంగా మారింది. పద్దెనిమిదేళ్లు నిండిన వారందరినీ ఓటర్ల జాబితాలో చే ర్చేందుకు ఏడాది పొడవునా పేర్ల నమోదుకు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా ఈ నెల 24, వచ్చేనెల 1, 8 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రజల సౌకర్యార్థం వరుసగా మూడు ఆదివారాలు ఈ కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తొలి ఆదివారంనాటి ప్రచార కార్యక్రమం ప్లాఫ్ అయింది. తగినంత ప్రచారం లేనందున చాలా తక్కువమంది మాత్రమే ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లినవారికి సైతం తగిన ప్రయోజనం కలగలేదు. కేంద్రాలను ఉదయం 10.30 గంటలకే తెరవాల్సి ఉన్నప్పటికీ చాలా కేంద్రాలు మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరచుకోలేదు. అంతేకాదు సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సిన కేంద్రాలు చాలా చోట్ల మధ్యాహ్నం 3 గంటలకే మూతపడ్డాయి. మొత్తానికి మమ అనిపించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ‘న్యూస్‌లైన్ విజిట్’ సందర్భంగా కనిపించిన దృశ్యాల్లో మచ్చుకు కొన్ని... ఛత్రినాకలోని శాంతినికేతన్ పాఠశాలలో ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ.. చిరునామా మార్పిడికి అవసరమైన ఫారం-8, ఫారం-8ఏలు లేవు. దీంతో ప్రజలు ఉసూరంటూ వెనుదిరిగారు. సత్యానగర్ కమ్యూనిటీ హాల్లోని పోలింగ్ కేంద్రానికి ఆశీర్వాదం అనే అంగన్వాడి టీచర్ 11.50 గంటల వరకు రాలేదు. కేంద్రం అడ్రస్ తెలియనందున ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. నల్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కేంద్రం తాళాలే తెరుచుకోలేదు. వి చారిస్తే నందిని అనే అంగన్వాడి టీచర్‌ను ఆ కేంద్రంలో నియమించగా, ఆమె జ్యోతిబాలమందిర్ స్కూల్లో విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రం లో ఎవరూ లేకపోవడంతో ప్రజలు వెనుదిరిగారు. రాంనగర్ డివిజన్ జెమినీకాలనీ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నిర్మల అనే అంగన్వాడీ టీచర్ కేంద్రాన్ని వదిలి పెట్టి కార్పొరేటర్‌ను కలవడానికి వెళ్లారు. దాంతో స్వచ్ఛందసంస్థలకు చెందినవారే అక్కడకు వచ్చిన వారికి దరఖాస్తులు, సూచనలు ఇవ్వడం కనిపించింది. గోల్కొండ చౌరస్తాలోని ఎంబీ హైస్కూల్లో నాలుగు పోలింగ్ బూత్‌ల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఒక్కటి కూడా తెరుచుకోలేదు. ఖిల్వత్ కమ్యూనిటీ హాల్లోని పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లాలనుకున్నవారికి నిరాశే ఎదురైంది. కమ్యూనిటీ హాల్ తాళాలు తీసేవారే కరువవడంతో అక్కడకు చేరుకున్న బీఎల్ఓలు.. తాము వెంట తెచ్చుకున్న ఫారాలతో బయటే ఉండిపోయారు. కందికల్‌గేట్ ద గ్గరి పాఠశాలలో ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు బీఎల్ఓలెవరూ కనిపించలేదు. ఓటరు నమోదు ఫారాలను మాత్రం పాఠశాలలో ఉంచి వెళ్లిపోయారు. ఓటరు నమోదు ఫారాల భర్తీ.. చిరునామా మార్పులు తదితర అవసరాల కోసం వచ్చిన వారు నిస్సహాయంగా వెనుదిరిగారు. కాచిగూడ డివిజన్ పరిధిలో ఫ్యూనీపాల్ స్కూల్ తాళం వేసి ఉండటంతో గేటు ముందర సిబ్బంది రెండు కుర్చీలు వేసుకుని ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. లాల్ బహదూర్ హైస్కూల్లో సెంటర్ తెరచుకోలేదు. బర్కత్‌పుర డివిజన్లో స త్యానగర్ కమ్యూనిటీహాల్ సెంటర్దీ అదే పరిస్థితి. మోండా ఇస్లామియా ప్రభుత్వ పాఠశాల నల్లగుట్ట ఓల్డ్ ప్రాథమిక పాఠశాలలో సాయంత్రం 4 గంటలకే అధికారులు కేంద్రాలను వదలి వెళ్లిపోయారు. మార్కెట్ స్కూల్, కళాసీగూడ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. టోలీచౌకీ, నానల్‌నగర్ డివిజన్లకు సంబంధించిన సుమారు 70 పోలింగ్ స్టేషన్లలో కేవలం 12 కేంద్రాలలో మాత్రమే సిబ్బంది విధులు నిర్వహించారు. వీరిలో చాలామంది మధ్యాహ్నం 2 నుంచి కేంద్రాలను మూసేసి వెళ్లిపోయారు. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని డివిజన్లలో ఓటింగ్ నమోదు కార్యక్రమం తూతూ మంత్రంగా నడిచింది. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మన్సూరాబాద్, రామక్రిష్ణాపురం, కొత్తపేట, సరూర్‌నగర్ డివిజన్ల లో ఓటింగ్ నమోదు కేంద్రాలలో బూత్‌లెవల్ అధికారులు లేక ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ప్రచార కార్యక్రమం తీరిదీ... రాంనగర్ డివిజన్ బాకారం గ్రంథాలయంలోని 133, 134 పోలింగ్ బూత్‌లకు సూర్యకుమారి, సీహెచ్ హరితలు బీఎల్ఓలుగా ఉన్నారు. ఉదయం 10.30 గంటలకే కేంద్రాలు తెరవాల్సి ఉన్నా.. 11 గంటల వరకు తెరవలేదు. దీంతో ముషీరాబాద్ ‘న్యూస్‌లైన్’ ప్రతినిధి అధికారులిచ్చిన సమాచారం ఆధారంగా వారి నంబర్లకు ఫోన్ చేశారు. ఫోన్ రిసీవ్ చేసుకున్న ఓ వ్యక్తి మేం నాగోల్‌లో ఉంటామని, హరిత ఓ సెల్‌ఫోన్ స్టోర్‌లో పని చేస్తుందని చెప్పారు. బాకారంలో ఎన్నికల డ్యూటీ ఏంటని, మీరు చెప్పేది వింతగా ఉందని చెప్పుకొచ్చారు. అలాగే సూర్యకుమారి నంబర్‌కు ఫోన్ చేయగా 9 నెలలుగా ఆమె నగరంలో లేరని, పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదీ ఓటర్ల నమోదు కోసం ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం తీరు. సమయపాలనేదీ? అడిక్‌మెట్ డివిజన్లో 181 నుంచి 212 వరకు 32 బూత్‌లకు గాను 32 మంది ఇన్‌చార్జ్‌లను నియమించారు. అందులో ఒక్కరూ సమయానికి రాలేదు. ఏడెనిమిది మందికి ఫోన్ చేస్తే అందరూ తమకు సమాచారం లేదని సెలవిచ్చారు. అధికారులకు ఫోన్‌చేస్తే వస్తున్నామని చెప్పారు. వచ్చినవారికి సైతం సరైన అవగాహన లేదు. - ఎంసీ మోహన్, బీజేపీ అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షుడు దరఖాస్తు చేసుకున్నా ఓటు రాలేదు 2010 నుంచి ఇప్పటివరకు మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా. అయినా ఇంతవరకు ఓటుహక్కు రాలేదు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళితే సరైన సమాధానం చెప్పేవారే లేరు. ఇక్కడేమైనా సమస్య పరిష్కారం అవుతుందేమోనని వచ్చాను. ఇక్కడ కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. - టి. చంద్రప్రకాశ్, దయానంద్‌నగర్ -
ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం
38 లక్షలమంది యువత లక్ష్యంగా కసరత్తు మొబైల్ ఫోన్ ద్వారా దరఖాస్తుకు అవకాశం ఓటర్ల నమోదుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్, లెట్స్ ఓట్ సంస్థల సహకారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన 38 లక్షల మంది యువతీ, యువకులకు ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా సోమవారం నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు అర్హులైన వారి నుంచి ఓటర్‌గా నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అలాగే ఓటర్ల జాబితాల్లో సవరణలు, అభ్యంతరాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆర్హులైన యువతీ, యువకులు 22 లక్షల మంది ఉండగా, వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే వారు 16 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ ఓటు హక్కు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రేషన్ షాపుల్లో కూడా ఓటర్ల జాబితాలను ఉంచుతారు. ప్రతీ ఒక్కరు జాబితాలో తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఒక వేళ ఎవరి పేర్లయినా లేకపోతే వెంటనే నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉంది కదా అని జాబితాలో పేరుంటుందనుకుంటే పొరపాటే. గుర్తింపు కార్డు ఉన్నవారు కూడా జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలి. గుర్తింపు కార్డు ఉన్నా జాబితాలో పేరు లేకపోతే ఓట్లు వేయడం సాధ్యం కాదు. మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఓటర్ల నమోదులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన లక్షమంది వలంటీర్లు, అలాగే లెట్స్ ఓట్ సంస్థ సహాయాన్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5.94 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఓటర్‌గా నమోదు కావాలనుకునే వారు మండల కార్యాలయాలకు వెళ్లి ఓటర్ నమోదు పత్రాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. అలాగే ఓటర్ జాబితాల్లో సవరణలు కావాలంటే మరో పత్రాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. వచ్చే నెల 10వ తేదీ వరకు మండల కార్యాలయాల పనిదినాల్లో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డిప్యుటీ మున్సిపల్ కమిషనర్ల కార్యాలయాల్లో ఓటర్‌గా నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అలాగే ప్రత్యేకించి పోలింగ్ కేంద్రాల వారీగా ఆదివారాలైన ఈ నెల 24వ తేదీ, వచ్చే నెల 1, 8వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్‌స్థాయి ఆఫీసర్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కలిసి సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశాల్లో కూడా ఓటర్‌గా నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తులను చేసుకోవచ్చు. రాజకీయ పార్టీల ఏజెంట్లనుంచిగానీ, ఇతరుల నుంచి గానీ రోజుకు పది కన్నా ఎక్కువ దరఖాస్తులను తీసుకోరు. ఈ నెల 21, 28 తేదీలైన గురువారాల్లో గ్రామసభలను నిర్వహించి ఓటర్ల జాబితాలోని పేర్లను బూత్ స్థాయి ఆఫీసర్లు చదివి వినిపిస్తారు. మార్పులు, చేర్పులు, అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ద్వారా ఈ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించిన ఓటర్ నమోదు దరఖాస్తులను ఆయా విద్యార్థుల కుటుంబ సభ్యులు సంబంధిత బూత్‌స్థాయి ఆఫీసర్లు లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిటర్నింగ్ ఆఫీసర్, ఎలక్టోరల్ ఆఫీసర్‌కు సమర్పించవచ్చు. ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ముసాయిదా జాబితా ప్రకటన 18-11-2013 దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరణ 18-11-2013 నుంచి 10-12-2013 వరకు గ్రామసభ, స్థానిక సంస్థల్లో జాబితాలో పేర్లు చదివి వినిపించడం 21-11-2013-28-11-2013 బూత్‌ల వారీగా బూత్‌స్థాయి ఆఫీసర్ల సమావేశం-రాజకీయ పార్టీ 24-11-2013, 01-12-2013, 8-12-2013ల ఏజెంట్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఓటర్ నమోదు, అభ్యంతరాల దరఖాస్తుల పరిష్కారం 26-12-2013 వివరాలు అప్డేట్, సప్లమెంటరీ జాబితా తయారు 10-01-2014 ఓటర్ల తుది జాబితా ప్రకటన 16-01-2014 -
జనవరి 1కి 18 ఏళ్లు నిండేవారంతా ఓటరుగా నమోదుకండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీకల్లా 18 సంవత్సరాలు వయస్సు నిండే యువతీ, యువకులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేకించి ఈనెల 15వ తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపడుతున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ నెల 15న పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని, దానిని పరిశీలించి పేర్లులేని అర్హులందరూ ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు ఓటర్ల నమోదుకోసం దరఖాస్తులను, అలాగే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులతోపాటు అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తులను కూడా స్వీకరించనున్నట్లు భన్వర్‌లాల్ వివరించారు. ఈ నెల 19, 26 తేదీల్లో ప్రత్యేకించి గ్రామసభల్లోను, పట్టణ స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేసే సమావేశాల్లో జాబితాలో పేర్లను చదివి వినిపిస్తారని, ఆ సందర్భంగా పేర్లలో పొరపాట్లుంటే సరిచేసుకోవాలని సూచించారు. అలాగే ఈ నెల 17, 24 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఆఫీసర్లు, రాజకీయపార్టీల ఏజెంట్లతో సమావేశాలు నిర్వహిస్తారని, ఆ సమావేశాల్లో ఓటరుగా నమోదుకు దరఖాస్తులను, అలాగే అభ్యంతరాలకు సంబంధించిన అంశాల్ని స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్లుగా నమోదుకోసం వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలకు సంబంధించిన అంశాలను వచ్చే నెల 16వ తేదీకల్లా పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీకల్లా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేస్తారని, జనవరి 16న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారని వివరించారు. ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ జాబితా ఆధారంగానే వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం, తరువాత వరదలు కారణంగా గత నెలలో జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికి వాయిదా పడింది.