న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు ఓటు లేని అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఓటరు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 15 చివరి గడువుగా నిర్ణయించింది. అర్హులు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు మరో మూడు రోజులే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి, కొత్తగా ఓటును పొందడానికి ఇదే చివరి అవకాశం.
అప్లయ్ చేసుకోండిలా..
ఈ నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నిండిన యువతీయువకులు(2006 మార్చి 31వ తేదీలోపు జన్మించిన వారు) ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఇందుకు ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరించేలా ఎస్సెస్సీ మార్కుల మెమో జత చేయాలని అధికారులు చెబుతున్నారు.
దరఖాస్తులను నేరుగా ఆయా బీఎల్వోలు (బూత్ లెవల్ అధికారులు) లేదా సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని సూచిస్తున్నారు. ఓటర్స్ హెల్ప్‌లైన్, ఎన్‌వీఎస్‌వీ పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అయితే ప్రజలు దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా నిర్ణీత ప్రూఫ్‌లు తప్పక జతచేయాల్సి ఉంటుంది
నిర్ణీత గడువులోపు అందిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం ఉంటే వారిని ఓటర్లుగా గుర్తిస్తారు. ఈ నెల 25వ తేదీన ప్రకటించే ఓటరు అనుబంధ జాబితాలో వారి పేర్లు చేర్చుతారు. ఈ జాబితాలో పేర్లు కలిగిన కొత్త ఓటర్లతో పాటు సాధారణ ఓటర్లు మే 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
చదవండి: ఓటులో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?
ఇప్పటికే ఓటరు జాబితాలో పేరుండి నివాసం వారి ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి మార్చుకోవడానికి, కుటుంబ సభ్యులందరివీ ఒకే పోలింగ్ కేంద్రంలో లేకపోతే మార్చు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి వారందరూ ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment