voter registration process
-
Voter Registration: మిగిలింది 3 రోజులే.. ఇదే లాస్ట్ ఛాన్స్!
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు ఓటు లేని అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఓటరు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 15 చివరి గడువుగా నిర్ణయించింది. అర్హులు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు మరో మూడు రోజులే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి, కొత్తగా ఓటును పొందడానికి ఇదే చివరి అవకాశం. అప్లయ్ చేసుకోండిలా.. ఈ నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నిండిన యువతీయువకులు(2006 మార్చి 31వ తేదీలోపు జన్మించిన వారు) ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఇందుకు ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరించేలా ఎస్సెస్సీ మార్కుల మెమో జత చేయాలని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులను నేరుగా ఆయా బీఎల్వోలు (బూత్ లెవల్ అధికారులు) లేదా సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని సూచిస్తున్నారు. ఓటర్స్ హెల్ప్‌లైన్, ఎన్‌వీఎస్‌వీ పోర్టల్‌లో ఆన్లైన్ ద్వారా కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అయితే ప్రజలు దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా నిర్ణీత ప్రూఫ్‌లు తప్పక జతచేయాల్సి ఉంటుంది నిర్ణీత గడువులోపు అందిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం ఉంటే వారిని ఓటర్లుగా గుర్తిస్తారు. ఈ నెల 25వ తేదీన ప్రకటించే ఓటరు అనుబంధ జాబితాలో వారి పేర్లు చేర్చుతారు. ఈ జాబితాలో పేర్లు కలిగిన కొత్త ఓటర్లతో పాటు సాధారణ ఓటర్లు మే 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. చదవండి: ఓటులో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? ఇప్పటికే ఓటరు జాబితాలో పేరుండి నివాసం వారి ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి మార్చుకోవడానికి, కుటుంబ సభ్యులందరివీ ఒకే పోలింగ్ కేంద్రంలో లేకపోతే మార్చు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి వారందరూ ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
తగ్గిన పట్టభద్రులు
తాజాగా జాబితా విడుదల చేసిన యంత్రాంగం ⇒జిల్లాలో పట్టభద్రులైన ఓటర్లు : 87,208 ⇒పురుషులు : 54,494 ⇒మహిళలు : 32,714 ⇒గతంతో పోలిస్తే తగ్గిన ఓటర్లు : 8,450 సాక్షి, రంగారెడ్డి జిల్లా : జనాభా గణాంకాలు, ఓటర్ల సంఖ్యలో అగ్రగామిగా ఉన్న జిల్లా.. తాజాగా పట్టభద్రుల ఓటర్ల సంఖ్యలో మెట్టు దిగింది. గతంలో 95,658 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదై.. హైదరాబాద్ కంటే జిల్లా ముందువరుసలో ఉంది. ఇటీవల పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ నిర్వహించిన యంత్రాంగం.. తాజాగా ఓటర్ల గణాంకాలను విడుదల చేసింది. ఇందులో గతంలో కంటే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య భారీగా తగ్గి 87,208కి పడిపోయింది. తగ్గిన ఓటర్ల సంఖ్య 8,450 ఎన్నికల అధికారులు తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం జిల్లాలో 87,208 మంది పట్టభద్రులైన ఓటర్లున్నారు. ఇందులోపురుషులు 54,494 మంది ఉండగా, మహిళలు 32,714 ఉన్నారు. ఓటరు నమోదులో పట్టభద్రులు నిరాసక్తత చూపారో.. లేక నమోదుపై అధికారగణం సరైన ప్రచారం నిర్వహించలేదోగానీ.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 8,450 తగ్గింది. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం గతేడాది డిసెంబర్ చివరివారం వరకు ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో భాగంగా దరఖాస్తులు పరిశీలించిన అధికారులు.. తాజాగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. పట్టభధ్రుల నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాతోపాటు హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలున్నాయి. గతంలో ఓటర్ల సంఖ్యలో జిల్లా ముందువరుసలో ఉండగా ప్రస్తుతం రె ండో స్థానానికి పరిమితమైంది. హైదరాబాద్ జిల్లా 1,33,003 ఓటర్లతో ప్రథమస్థానంలో ఉంది. 66,100 ఓటర్లతో మూడోస్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా ఉంది. ‘ఆధార్’ అనుసంధానంతో.. ఓటరు జాబితాలో అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం ఓటరు వివరాలను ఆధార్ కార్డులతో అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ (అనుసంధానం) ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా పట్టభధ్రుల ఓటరు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. ముందుగా వారి ఓట్ల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఇలా చేయడంతో ఒకవ్యక్తి కేవలం ఒకే చోట ఓటు నమోదు చేసుకునే వీలుంటుంది. మహానగరానికి చుట్టూ జిల్లా విస్తరించి ఉన్న నేపథ్యంలో వలసల తాకిడి కూడా భారీగా ఉంటుం ది. దీంతో గతంలో పెద్దఎత్తున ఓటర్లుగా నమోదయ్యారు. తాజాగా ఆధార్ లింకును ఎన్నికల సంఘం తెరపైకి తేవడంతో ఓటరు నమోదులో పట్టభద్రులు సొంత ప్రాంతాల్లోనే దరఖాస్తు చేసుకునే ఆలోచనలో ఉండడంతో జిల్లాలో నమోదు తగ్గిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
ఓటర్ల నమోదు ప్రక్రియలోని ఉద్యోగుల బదిలీలు కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఏపీలో ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు బదిలీల ప్రక్రియను కొనసాగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఓటర్ల నమో దు ప్రక్రియతో సంబంధమున్న జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు అందరూ, మున్సిపల్ కమిషనర్ల బదిలీలపై ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 25వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల నమోదు ప్రక్రియతో సంబంధం ఉన్న ఏ ఉద్యోగి, అధికారి నైనా బదిలీ చేయాలంటే అందుకు తగిన కారణాలను వివరిస్తూ ముందస్తుగా కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు గత నెల 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ఆర్డీవోలు, మున్సిపాలిటీల మున్సిపల్ కమిషనర్లను బది లీలు చేయడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నిర్ణయించింది. ఓటర్ల జాబితా సవరణ, నమోదు ప్రక్రియకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులను బదిలీలు చేస్తే ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే మున్సిపాలిటీలకు చెందిన 40 మంది మున్సిపల్ కమిషనర్ల బది లీలకు సంబంధించిన ఫైలును సంబంధిత శాఖ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపించింది. 13వ తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్నందున బదిలీలపై నిషేధం ఉందని, అయినా మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు కారణం ఏమిటో తెలియజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మున్సిపల్ శాఖను కోరింది. మున్సిపల్ శాఖ నుంచి కారణాలు తెలియజేస్తూ సమాధానం వస్తే ఆ వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం పంపనుంది.