
జనవరి 6న తుది ఓటర్ల జాబితా విడుదల: సీఈఓ సుదర్శన్‌రెడ్డి
ఇప్పటివరకు 8,02,805 మంది కొత్త ఓటర్ల నమోదు
4,14,165 మంది అనర్హులైన ఓటర్ల తొలగింపు
వచ్చే ఏడాది 18 ఏళ్లు నిండబోయే వారూ దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2025లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, ముసాయిదా ఓటర్ల జాబి తాపై అభ్యంతరాలు, ఇతర మార్పులు, చేర్పుల ప్రక్రియ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. వీటికి సంబంధించి ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్ల డించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారంతా ఓటరు నమోదు కోసం దర ఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
దర ఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 6న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తా మని వెల్లడించారు. శనివారం సి.సుదర్శన్‌రెడ్డి బీఆర్‌కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండబోయే వారు కూడా ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చని.. వారికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఓటు హక్కు కల్పిస్తామని సీఈఓ తెలి పారు. ఓటర్ల సౌకర్యం కోసం వచ్చే శని, ఆది వారాల్లో (9, 10 తేదీల్లో) ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని చెప్పారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ (eci.gov.in), ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా సైతం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
8 లక్షలకుపైగా కొత్త ఓటర్లు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా గత నెల 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 3,34,26,323 మంది ఓటర్లుండగా.. అందులో 1,66,16,446 మంది పురుషులు, 1,68,07,100 మంది మహిళలు, 2,777 మంది మూడో జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. 15,948 మంది సర్వీస్ ఓటర్లు, 3,578 మంది ప్రవాసీ ఓటర్లు ఉన్నారని తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి అక్టోబర్ 20 మధ్యలో 8,02,805 మంది కొత్త ఓటర్లు నమోదుకాగా.. 4,14,165 మంది అనర్హులైన ఓటర్లను తొలగించామని, మరో 5,93,956 మంది ఓటర్ల వివరాలను సరిదిద్దామని వెల్లడించారు. రాష్ట్రంలో 18–19 ఏళ్ల యువ ఓటర్ల సంఖ్య 8.51 లక్షల నుంచి 10.03 లక్షలకు పెరిగిందని తెలిపారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 2,25,462 మంది, వికలాంగ ఓటర్లు 5,28,085 మంది ఉన్నారని వివరించారు.